Skip to main content
Internet Archive's 25th Anniversary Logo

Full text of "భాగవత వైజయంతిక (వ్యాస సముచ్చయము)"

See other formats
నా సగ. 

ప్రచు రణ 
ఆంధ్రప్రబేశ్‌ సాహిత్య అకాడమి 
కళాబనన్‌ _ససాబాదు, 
శ్రాదరాబాదు.* 


Bhagavata Vaijayanthika = A Collection of Essayé on 
Pothana’s Andhra Maha Bhagavathamu, Edited by 
Sri Jandhyala Papaiah Sastry (Karunasri). 


ఆంధ పదేళ్‌ సాహిత్య అకాడమి 
హైదరా బాదు- 500 004. 


Ace MO శర 


(వీబురణ 4 S818 ire 


(పథము మ [దణ : 1988 


(వ్రతిలు: 2,000 GN 
త % ఉప 

వెల రూ. 9-50 

(వతులకు : 


ఆంధ్రపదేశ్‌ సాహిత్య గా క్‌ 
కళాభవన్‌, నై ఫాబాద్‌, 
'హైదరాబాదు-500 004. 


తతః : 
టర్‌ ద్య్మావతీ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
హైదర్‌ గూడ, హెదరాబాదు- 500 001. 


తొలి పలుకు 


మెర పోతన [వాసిన శ్రీ మహాభాగవతం తెలుగు వారి దైనందిన 
పెనవేసుకొనిపోయిన కావ్యం, నిరీహుడై , నిస్సృంగుడై భ్‌ కిఖావ 
కోసం కావ్యరచన చేసిన ఆ Shs బదుపుకూటని ఆశించక 
నంతో రాచరికాన్ని ఎదిరించి సిరాడంబరుడై. జీవయా (తను సొగించినాడ్డు. 
మ్మినది అనగలిగిన ధైర్యశాలి అతడు. ఒకరి మెప్పుకోస సం కావ్యం 
డు కాడతడు. భగవంతుని నమ్మి ఆయన మహిమలను మధురనాదా. 
మణీయ అర్థాలతో, సుందరమైన భాషలో మహాకావ్యంగా మలచి మనకు 
నాడు. పోతన భాగవతంతో. పరిచయం అందమైన తెలుగు భాషతో 
అం | 
బమ్మెర పోతన పంచశతి జయంతి ఉత్సవ సందర్భంగా సాహిత్య అకా 
యన భాగవతాన్ని పరిశీలించి (వాసిన వ్యాసాలను కొన్నింటిని ఎంపిక 
సంకలనంగా (పచురించాలని సిశ్చయించింది. పలు దృశో్కో-ణాలతో 
సాహిత్యాన్ని ఈ వ్యాసాలలో _— ఒకలం చేసినారు. వీనిలో 
వ్యాసాలు ఇంతవరకు వివిధ ప, తికలలో, పుస్త సకాలలో - ప్రచురింప 
ఆయితే వాటిలో పోతన కావ్య పరిచయాన్ని నొమాన్యులకూ, పండి . 
కలిగించాలనే ఉద్దేశ. తో ఈ వ్యాసాల ఎంపిక జరిగింది. 
శ్రీ జంధ్యాల పాపయ్యికా స్రీ కం) గారి సంపాదకత్వంలో ఈ 
"దంబం వెలువడుతున్నది. శ్రీ కాన్రిగారు ఉత్తమ కవులు, సహృదయ 
ఏలు. వ్యాసాలను న. ఆయన తమ (పతిఖాపాండిత్యాలను 
వినియోగించుకొని ఈ సంపుటిని విద్వాంసులకూ, విమర్శకులకూ, 
హానులకూ పయోజనక రంగా తీక్పిదిద్దినారు. పోతనగారి. కవితా 
ఏ (పతీకలుగా ఉన్న చక్కని పద్యాలను కూడా ఈ సంకలనంలో అక్క 
-చేర్చి ఈ “పోతన వైజయంతిక'' ను వెలువరించినారు. 
ఈ సంపుటిలోని వ్యాసా ఆను రచించిన మనీషులకు మా కృతజ్ఞతలు, 
సాహిత్య అకాడమి కోరిక మేరకు ఈ వ్యాస సంకలనాన్ని ఏర్చి కూర్చి 
సహకరించిన శ్రీ జంధ్యాల పాపయ్యశా స్రీ గారికి నూ ధన్యవాదాలు, 


వనాలు. 

బాతు, | ఇరి ఎంటి కృషమూ ది 
| (క) pre.) 

1988. .... కార్యదర్శి 


ఆం (ట్రబల్‌ సాహిత్య అకాడమి 


రా 


10. 
il. 


12, 


అషయసూచిక 


రీ వానమామలై వరదాచాద్యూలణ 


పుట 
పోతన్నగారూ! ధన్యులండీ మీరు 1 
(లీ కొడుణ(ల్రీ 
పోతన జన్మస్థలము ల క్షే 
---() కొందుఖారి వీరేళట్రింగయు 
పోతన వంశము, కొలము, కృతులు 19 
—ర్రీ మల్లంపల్లి సోమళే ఖరళర్య 
.. ఆంధ భాగవత వె శిష్యము 80 
—ఆచా ర్భో బిడుదీబోలు వోంకకురాన్ర 
పోతన శయ్యా సౌభాగ్యము 48 
—(ర్రీ గడియారం వోంకోవు శేవూా(స్రీ 
బమ్మెర పోఠన్నగారు 4&8 
ఆ (క్రీ చెళ్ళు వళ్ళు వేంతటకొ్త్రీ 
పోతనామాత్యుని కవితాశిల్పం ర్‌' 
డాక్టర్‌ దాజరథి 
పోతరా జుగారి లోకజ్జత 70 
— అవ్నాంరి ను (బువ్యూణ్యకొ స్త్రీ 
బమ్మెరవారి భక్తీ సామాజ్య వెభవం 75 
--డాక్టుల్‌ జంధ్యాల జయక్ళా వావ్రూటజీ. 
బమ్మెరవారి కమ్మతెమ్మెరలు « 87 
జల బెలమచెర్లో ర0గాచాద్య్రూలు 
పోతన = లికగాన 91 
రఠభార్శోం వీంగలి అక్షి కాంతోము 
పోతన - శ్రీనాథుడు 


18. 


19. 
20, 


21. 


23. 
వ్య, 


25, 


పోతన కవితోన్మీలనము 

(౪, మధునానంతుల నళ్ళ్య నారాయణా (స్త్రీ 
నేను బమ్మెరవారి బాలకృష్ణుడను 

డాక్టర్‌ ధారా రామనాళలొత్ర్రీ 

యు 

పోతన కవిత్వ పటుత్వము 

— (8 తానీ ధర్యారాత్ర 
పోతన - శృంగార రసపోషణము 

లీ బోవ్రలవల్లి రామాగుపరొఫు 
హోత్రన వ్యాజస్తుతి ళ్‌ వ్యంగ్య వైభవము 

— ఆచార్య దివాకర్ల వోంక్‌టానోధాని 
పోతనామాత్యుని స్రీ పొ తలు 

-ాీ శ్రుబ్దవర్తి నారాయణాచాద్మురలు 
ఆంధమహాభాగవతను - రసానుభూతి 

-డార్టర్‌ వీ బి, ను(లవ్యావ్యాం 
కుచేలోపాఖ్యానము 

(ఖీ కి వలంకరన్వాంయి 
హోతన వ్యక్తిత్వము 

-- ఆచార్య ని నారాయణ రెడ్డి 
సహజ పొండితుులవారి సరదాలు 

(లీ అదు (దో 
పోతనారుని వె శిష్యము 

_- ఆచార్భో ఖండవల్లి అజ్మీర ంజినము 
(దౌపది మాతృహృదయము 

ఆచార్య యన్న జోగారావు 

ఆంధ మహాభాగవతము - అనువాద వైఖరి 
డాక్టర్‌ (వనసొదరాయ వలవతి 


08. 
106 
114 
120 
124 
185 
142 
150 
158. 


166 


174 


177 


188 


28. 
27. 
29. 
50. 
స. 
82. 
88. 
84. 
86, 


87. 


_ సత్యభామా స్వరూసము 


v1 


— డౌక్ట్‌ర్‌ రౌజోళంర 
పోతనార్యుని కథాకథన శిల్పము 
_ డార్టర్‌ ధూళిపాళ (శ్రీరామమూర్తి 


భాగవతము = సామాజిక భ ర్తి os 
-డార్టర్‌ లౌలిశోవలి 9క్టీనారాయజగా స్రి 


భాగవత భ_కి = _పహ్లాదుడు 
—(8 ఖండ బిల్లి నూర్యూ నారాయజకా (స్త్రీ 
పోతన = సూరదాను 
_ “ా(ీ అయాబితల వానుముచ్చా (స్త్రీ 
తపః ఫలము 
తలే. ES లీడ్‌స్నాంమి 
| ల 
పోతనామాత్యుని అఖేద దృష్టి - పాఠపరిశీలనము 
“(క్రీ బన్ని కంటే తడునాధ బల్భ్య 


భాగవతము - రసపోషణము 


వ (త్రీ సే సేవ్రూరి లకీ శర నయ్యం 
మహాకవి పోత్రన 
-ా(ీ కొలూడు వోంఠవీనారాయజరావ్రు 


| పోతన తా తిక చింతన 


— (8 బీ. వోంర్‌ స న. 
పోతన స్వప్నచర్చ 
ట్రీ ముద్దులవల్టి తెరీక ట్ల నువు జ్యూ కొని 


పోతన పద్యరత్నములు 


భం... 01 


౨10 


229 
288 


240 


201 


266 


వి | 


274 


vii 


88. అనుబంధము 1 
1. ““ళాలరసాలసాలి' పదార్థపర్యాలోకనము ఎం. 279 
—(é క్రాళీభొట్ల (జహ్యాయ్యకొ (స్త్రీ 
9, “పుట్టం బుట్టి" పద్యార్గము లు 281 
(శ్రీ కమారొదోన 
8. "'పుట్టం బుట్టి” పద్యార్హ పరామర్శము - వరికి 
(ఠీ శల్లాన్‌ చ్యకవ డల వరదాచాడ్యులు 
99," అనుబంధము. II roe 
పుషాంజలి 3 ఎ. 268 
40. - అనుబంధము 111 © 
కవితాంజలి త 290. 
41. అనుబంధము క 
మౌక్తి కమాల | cee 205, 
శ? 


| “అనుబంధము Vy SE ॥ లల ఇ పం 298 


సహృదయులకు న్వాగతం 


“గుడులు కట్టించె కంచర్ల గోపరాజు 
రాగములు కూర్చె కాకర్ణ త్యాగరాజు 
సుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు 
రాజు లీ మువ్పక్టరున్లు భక్తి క్తి రాజ్యమునకు. ప 
అన్నట్లు గోపన్న కొండల్లో బండల్లో రాముడికి గుళ్లు కట్టిస్తే - పోతన, 
తెలుగు గుండెల్లో కృష్ణుడికి గుళ్టు కట్టించాడు. 


త్యాగరాజు తన తంబురా తీగలమీద “రఘుకుల తిలకుజ్ణి” ఊరేగి స్తే 


పోతరాజు తన “బాల రసాలసొల మృదుపల్ల లవ 'కయ్యలమీద” యదుకుల తి€ 
కుద ఉయ్యాల లూగించాడు. 


రాజుకాని రాజు = జ్యంలేని రాజు = రాజభోగాలు అకింశీసీకకీరాజు = 
 ఆడంబరాలకూ, ఆహంకారాలకూ తోసిరాజు- మున: బమ్మెర పోతరాజు. 

భాగవతాన్ని భూమిలో పూడ్చి పెట్టినా “దాలరసాలిసాళమై” పైకిలేచింది. 
పోతన్న భాగవతం ఎప్పుడు చూచినా - “అప్పుడు తీసిన వెన్న.” అందుకే 
దాన్ని వదలిపోలేడు చిన్నికిష్ట న్న. 


బమ్మెరవారి పద్యాలు --- 

పాలుతాగిన లేగ దూడల్లాగా పరుగులు తీసాయి. 

వెన్నెల్లో ఆడుకునే క న్నెపిల్చల్లాగా గంతులు వేస్తాయి. 
లలితరసాల పల్పవాల్డాగా మెత్తమె త్రగా చిత్తానికి హత్తుకుంటాయి. 
నిర్మల మందాకినీ ఏచికలై ---జలజల [పవహిస్తాయి. 

మందార మకరందాలై - చవులూరిస్తాయి. 


“అమ్మా ! ఏదయినా పద్యం చెప్పమ్మా” అందే. “అమ్మలగన్నయమ్మ 
ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ... .* అంటూ మొదలుపెడుతుంది. 
బంగారుతల్లి. కసా ఈ 


ix 


“అన్నా! ఏదన్నా మంచి పద్యం చెప్పరా” అంటే- “సి రికింజెప్పడు 
శంఖ చ్యకయుగ మున్‌ జేవోయి సంధింపడు' _ అంటూ [పారంభిస్తాడు మహా 
పండితుడులాగా. 

“నాన్నగారూ! మీరేమయినా చదవండి” అంటేచాలు- “నల్లనివాడు పద్మ 
నయనం బులవాడు క కృపాఠసంబు పై పెజల్రైెడువాడు మౌళి పరిసర్పిత. పింఛమువాడు” 
= .4= +, అని సాగిసాడు ఆయనగారు. 

“తాతయ్యా ! నాకేదయినా పద్యం నేర్పవూ” అనటమే ఆలస్యం -*చేతు 
లారంగ శివుని పూజింపడేని, నోరునొవ్యంగ హరికీర్తి నుడువడేని”......అని 
చేతులు తిప్పుతాడు పాపం. 

“అక్కయ్యా ! నువ్వేదయినా ఒక చక్కని పద్యం పాడవే” అనగానే. 
“మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు” 
she పాటకచ్చేరీ [పారంభమౌతుంది, 

అమ్మమ్మ దగ్గరకెళ్ళి “నీకేమయినా పద్యాలు వచ్చునా” అంటే “రాళకేం 
నాయనా! విను” అని “ఓయమ్మ వీకృమారుడు మా యిండ్లను పాలు పెరుగు 
మనసీడ మ్మా” వటి అంటూ. కూనిరాగాలు సాగతీస్తుంది. 


“చెల్లీ! నీకు వచ్చిన ఒక చిన్ని పద్యం వినిపించమ్మా” అంటే- "పెద్దదే ' 
వచ్చు” అని _ “త్రీ ! నిన్ను దలంచి పుస్తకము చేతకా బూనితి౯ నీవు 
నా యుల్లంబందుననిల్సి ”' పసన అంటూ గుక్క_పడుతుంది. 

తం తమ్ముడూ ! ఏదీ ఒక కమ్మని పదకం... “అంటూండగానే 
వాడు గొంతెత్తి - “ళాలరసాలసాల నవప ల్లవ కోమల” ౨౨౨౨౨ అను గడగడ అప్ప 
జెబుతాడు తడబడకుండా, 

అయ్యవారిని కదిలి? స్తే_అలవై వైకుంఠపురంబులో నగరిలో. ..... 

పి ల్పవాణ్ణీ కదిలి స్తే....ఎవ్వనిచే. జనించు జగమెవ్యనిలోపలనుండు.. Sats 


ఏమిటి ఇం[దజాలం ! ఇన్టింతా. 'భాగవతమే! ఇంటింటా భాగోతమే! 
ఏమిటీ. విశేషం! ““ఇందుగల డందులేడని సందేహము వలదు'” అన్నట్టు సర్వ్మతా 
పోతన్నగారే- ఇళ్ళల్లో గుళ్ళల్లో = బిళ్లలో. అంతటా బమ్మెరవారి న 1 
ఏమిటో ఈ చితం - కలయో! వైష్టవమాయమో, +, 


వ 


 పోతన్నగారు మనలో ఎంతగా కలిసిపోయారు! మనసులో, మాటలో, 


పోటలో, పవ్యంలో, నుడికారాలలో, ' ఆచారాలలో, వెలుగులా - వెన్నెలలా: mm 


మలయమారుతంలా కలసిపోయారు. తెలుగువారి నిత్యజీవితాలలో, నిండు. 


జ శో 


గుండెలలో, ఉచ్చ్యాసనిశ్వాసాలలో ఆయన నిండి ఉన్నాడు. కూర్చుండి ఉన్నాడు. 


ఉదయభానుసి కిరణాలలో = _యదుకికారుని 'మృదుచరణాలలో, .. చల్ల - 


లమ్మే గొల్రిభామల్లో - విల్దుపట్టిన సత్యభామల్లో, కుచేలుని. అటుకుల్లో .= కనక 


కనీపిస్తాడు, వినిపిస్తాడు, “ఆహా! ' అనిపిస్తాడు. 


కదలే హలాలలో _ = కదం! తొక్కే. కలాలలో ఇ న. పల జ] 


(ప్రవహించే జలాలలో- పల్లెసీమలో- చందమామలో- పారిజాతం పుప్వుల్లో- 


పసిపాపల నవ్వుల్లో- నాగలి చాళ్లలో- విరహిణి కన్నీళ్లలో సహజ పాండిత్యుని. 


sw 


చేల్లుని కిటుకుల్లో, వల్చవాంగనల వలపుల్లో - పిల్హిన గోవి పిలుపులో ఆయన. 


మహనీయమూ గ కన్నుల విందా ఆయన కవిత్వ మహత్వం 


అంతటిది. ఆయన భాగవత (క అటువంటిది. ఆయన పురాక్య ఫతసుకృతం 
అంత గొప్పది. 


భాగవతం విప్పితే చాలు- పుటలు తిప్పితేచాలు- ---. ల 
“నీకున్‌ (మొక్కెద |తుంపవే భవలతల్‌ నిత్యానుకంపానిథి* అంటూనో - 


“రావే ఈశ్ళర ! కావవే వరద ! సంరక్షి ంచు భదాత్మకా |” -అంటూనో_ 


HE సూర్యుండు గమనము స్తజీవులకు తా తాణు వక్ర, wee తోచు పోలిక” అంటూనో_ . 


“కమలాకునర్చించుకరవ ములు కరములు గశ్రీనాథువర్ణించు జిహ్వజిహ్వూ” అంటూ నో- 


“తృ ప్తింబొందని మనుజుడు స ప్తద్వీపములనై న చక్కంబడునే!” అంటూనో- ' 
““ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ! శాంతుడై. చిక్కెనో” అఆనుకుంటూనో._ 


““కారేరాజులు. రాజ్యముల్‌ గలుగవే గరో న్న తిన్‌ బొందరే వారెరి?''అంటూ నో. 
“ఫీరెవ్యరు ' శ్రీ కృష్ణులుగారా ! ఎన్నడును వెన్నగానరటగదా” అంటూనో- 
“ని పాదకమలగే బవయు నీ ; పాదార్చకులతోడి నెయ్యమును నితాం 


తాపారభూతదయయును తాపసమందార'! నాకు దయే సేయగదే!”' అః | 
'అన్నములేదు కొని న [తావుమన్న! రమ్మన్న!'అంటూనో= 


“వనితా! ఏమితపంబు చేసె రతా ఈ ధంశంబు వంశ ంబులోన్స్‌. హ్‌ అంటూనో 


Xi. 


కుంతీదేవిగా, గజేల్యదుడుగా, ఆచార్య భీమ్మడుగా, ([పహాదుడుగా, 
వామనమూర్తిగా, రుక్మిణీకన్యగా, బలిచ్మకవర్తిగా, యశోదమ్మగా, మాలా 
కారుడు సుదాముడుగా, రంతిదేవుడుగా, వేపల్లె.గోపికగా వేషాలు మార్చి, 
గొంతులు మార్చి పోతన్నగారు మనకు దర్శశమిస్తూనే ఉంటారు. భాగవత 
పా[తలతో ఆయన తాదాత్మ్య మటువంటిది. 


. సహజ పౌండిత్యులవారి సహజసుందర' శయ్యా సౌభాగ్యంతో ఉయ్యాల 
లూగే ఈ తియ్యని పద్యాల ఒయ్యారం గమనించండి. 
పాంచాలీ కబరీ వికర్షణ sn 
జంచద్దర్వుల ధార్తరాష్టు త ననిం జంపించి గోవిందు డి 
ప్పించెన్‌ రాజ్యము రర్శపుతునకు(, గల్పించెన్‌ మహాఖ్యాతి(, జే 
యించెన్‌ మూడు తురంగమేధములు దేవేం[ద|పభావంబునన్‌. 


రాజంట ధర్మజుండు! సురరాజ సుతుండ(ట ధన్వి! శా|తవో 
ద్వేజకమైన గాండివము విల్రంట! సారథి సర్వభ్యవ సం 
యోజకు(డైన చకియట! యుగగధాధరుండై నభీముం డ 
య్యాజికి( వడ్లు వచ్చునట! యాపద గల్లు టిదెమి చోద్యమో! 


ల. [తిజగన్మోహన వీలకాంతీ తను వుద్దీపింప(, (వాభాత స్‌ 
“రజ బంధు[పభమైన చేలము పయిన్‌ రంజి ల్ల, సీలాలక 
(వజసంయ్స క్త ముఖారవింద మతి సేవ్యంబై. విజృంభింప, మా. 
విజయుం జేరెడు వన్నెలాండు మది నావేశించు నెల్లప్పుడున్‌. 


మృదుమధుర పదబంధాలతో ముద్దులు మూటగడుతూ దిద్దితీర్చినట్టున్న 
ఈ అందాల కందాలను సందర్శించండి - (శ్రుశుకుడు పరీక్షిత్తుతో అంటాడు- 

చి తంబులు తై 9లోక్య ప 

వితంబులు భవలతాలవితంబులు స. 

న్మిితంబులు మునిజన వన 

చై[తంబులు విష్ణుదేవు -చార్మితంబుల్‌ 


xii 


శానకాదిమహర్షులు సూతమహర్షితో అంటారు = 
వనములు దురిత లతా 

లావనములు న సం 
జీవనములు లక్షీ సం 


జావనములు వాసుదేవ పదసేవనముల్‌ . 


(3 

కన్నతండి హిరణ్యకళిపుడు చిన్నికొడుకు [పవ్హాదునిక 
అనుదిన సంతోషణములు 

జనిత| శ్రమ తాపదుఃఖ నంశోవణముల్‌ 

తనయుల సంభావణములు 

జనకులకును కర్ణయుగళ సద్ఫూవషణముల్‌. 


బమ్మెర వారి కవిత్వం ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకోటానికి. సహజ సుకు 
సారమైన ఆయన సంథాషణాత్మక శైలి కారణం. విదురుడు పాండవుల. పంచలో 
)డివున్న ధృ తరాష్ట్రినితో ఆంటున్నాడు - 


పుట్టంధుండవు! పెద్దవాడవు! మహాభోగంబులా లేవు; నీ 
పవ్షైర్రిం జెడిపోయ దుస్సహ జరాభారంబు పె గప్పె; నీ 
చుట్టా లెల్చను బోయి; రాలు, మగతున్‌, కోకంబునన్‌. మగ్నులై. 
కట్టా! క్‌ పంచనుండ(దగ వే! కౌరవక్ణమంకా[గణీ! 
“బిడ్డలకు బుద్ధి సెప్పని 
[గడ్డికి బిండంబు వండికొనిపొండిదె: పై 
బడ్రాలొడని ఖీముం డొర 
గొడైము లాడంగ( గూడు గుడిచెద వఢిపా! 


xiii 


హిరణ్యకశిపుడు కొడుకును లాలిస్తూ: అడుగుతున్నాడు టు 
నిన్నున్‌. మెచ్చరు నీతి పాఠమహిమన్‌ నీ తోడి దైత్యార్భకుల్‌ 
_ గన్నారన్నియు జెప్పనేర్తురుగదా (గంథార్థముల్‌ దక్షులై; 
యన్నా! యెన్న డు నీవు నీతివిదు. డౌదంచున్‌ మహావాంఛతో 
నున్నాడన్‌ నను గన్నతం్మడి! భవదియోత్కర్షమున్‌ జూపవె! 
చోద్యం బయ్యెడి నింతకాలమరిగెన్‌; శోధించి యేమేమి సం 
వేద్యాంశంబులు చెప్పిరో గురువు; లేవెంటం బరఠింపించిరో; 
విద్యాసార మెళుంగ (గో రెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో 
బద్యుమ్మొక్కాటి చెప్పి. సార్ధముగ 6 దాత్పర్యంబు భాషింపుమా ! 
దౌపది పు[తఘాతి యెన అశ్వత్థామతో అంటున్నది- 
_ ఖభూసురుండతవు 1 బుద్ధిదయా 
కాసురు(డవు ! శుద్ధ వీరథట సందోహా 
[గేసరుండవు ! శిశు మారణ 
మాసురకృత్యంబు ధర్మమగునే.తం డీ ! 


ఉ|దేకంబున రారు! శస్త్రధరుల్లై యుద్ధావనిన్‌ లేరు! కిం 
చిద్దోంహంబును నీకుంటేయరు ! బలోత్సెకంబుతో. బీ(కటికా 
భ|దాకారుల( బిన్నపాపల రణ|పౌఢ |క్రియాహీనులన్‌ 

| ని దాసక్తుల సంహరింపనకటా ! నీచేతు లెట్టాడెనో ! 


“అనురేందుండు పద్మతయం బడుగ నీయల్పంబు నీ నేర్చునే!” అన్న 
ంలితో వామనుడు- 

గొడుగో ! జన్నిదమో ! కమండలువాొ ! నాకుకా ముంజియో ! దండమో ! 

వడు గెనెక్క_డ | భూములెక్కడ ! కరుల్‌ వామాక్షు లశ్వంబు లె 

క్కడ ! నితోచితకర్మ మెక్కుడ! మదాకాంక్షామితంబై న మూ, 

డడుగుల్‌ మేరయ [తోవ కిచ్చుటది |బహ్మోండంబు నా పాలికిన్‌ . 


జీ 


తన సందేళాన్ని నందనందగునికి అందించి ఆయనను కొనివచ్చిన ఆగ్ని 
ర 


ద్యోతనునితో రుక్మిణి తన కృతజ్ఞత (పకటిస్తూ పలుకుతుంది 


నకా . 


ఎ 


కి 


; నియంత పుణ్యాత్మకుల్‌ 


౩ గావింపగానేర, నం 
భాగవతంకోసమే పోతన్న 


పూర్వకవులెవ్వరూ ముట్టు కొనకుండా 


వ! సదృంధుచింతామణేీ | 
భాగవతం మృత్యుంజయం. తెలుగువాదు 
చిపోయినా బమ్మెరవారి భాగవత జాలరసాల 


న్‌ 


ప? 


లో 


డ 
కసుగందలేదు. 


ఆయన 


ప ష్‌ 
సె దల ఈగు తా ౦ గ 


గవతం [పా ప్తించటం తన. పురాకృత సుకృత 


gy 


(ప్రముఖులు . 


ఒక సంపుటంగా ఏర్చికూర్చే సదవకాశాన్ని ఆంధ 


రిసూ 


అహా 


గారు; మనకు పోతన్నగారి భాగవతం లభించటం మన 


నః 


గారి భాగవతాన్ని (పశం 


లా 


ఏ ఆఆ 
నె 


త 
ర్యదర్శి శ్రీ ఇదివెంట్‌ కృష్ణమూర్తిగారు నాకు కలి 


పయత్నించి ఈ విధంగా ఈ సారస్వత సంపుటాన్ని. 


1 


64 


దః 


7 

tN 
iw | 
లం 


వాణి, తెలుగు విద్యార్థి ఇత్యాది ష్మతికలనూ అందించి నాకు. నహ 


r 


తనికేతనం అధినేతలకూ నా సాధువాదాలు. 


దుకు రాజమం; డి 


0 


ంపు 


అన్ను 


( 


అకాడమీ అధ్యక్షులు 
రోవుగారికి, కార్యదర్శి 


ఈ సారస్వత సంపుటానికి 


ంచిపెట్టిన వ్యాసరచయితలందరికీ నా అభివాదాలు. 


ణా 


“గౌతమ గంథాలయ జ అధినేతలకూ, స వేటపాలెం 
స్త 


ంతాలయిన తమ వ్యాసాల 


ఇ 
వ! 


నాద 


వ 


ళ్ళ 
౧ శా 
en pa 


ee | 


ఈ సారస్వత వ్యాస సంపుటికి “భాగవత వై జయంతికి" అని పేరు 


పెట్టటం జరిగింది. విజయపతాకను “వై జయంతి” అంటారు. విషుమూరర్తి 
| (aa) ద 
మెడలోని విరిదండనూ “వైజయంతి” అనే అంటారు. |తిలోకాధినాధుడై న 


దేవేందుని సౌధాన్నికూడా “వై జయంతి” అని పిలుసారు. 
పోతనకవీందుని కవితా సా[మాశ్యానికి ఎత్తిన జయపతాక కనుక ఇది 
“భాగవత వై జయంతిక .” . 
భక్తిసుగంధాలు విరజిమ్మే సూక్తి సుమనస్సులతో కూర్చిన మాల కనుక 
ఇది “భాగవతవై జయంతికి. 
ఎందరెందరో కవి పండితుల సహకారంతో స్వరూపం ధరించిన సహజ 
పొండిత్యుని స కవీం| దుని యశసౌాధం కనుక ఇది “భాగవత వై జయం 
తిక,”” 
రండి! దయచేయండి! మా న్‌ ఆల అందుకోండి! ఈ భాగవత 
వై జయంతికలో పవేశించండి. ఎందరో కవులు, పండితులు, కళా పపూర్ణులు, 
విమర్శకులు ఏక క సమావేశమై సాహి: త గోష్టి జరుపుతున్నారు. 


కొందరు పోతన్నగారి జన్మస్థలాన్నీ కాళ్తా. కృతులనూ సమీక్షిస్తుంటే 
కొందరు ఆయనగారి భాగవత వై వైశిష్ట్యాన్ని ఉగ్యడిస్తున్నారు. 


కొందరు సహజ పాండితురల శయ్యాసౌ భాగ్యాన్ని వెల్పడిస్తుంటె కొందరు 
ఆయన అనల్న క వితాశిల్పాన్ని గొంతెత్తి చాటుతున్నారు. 


కొందరు పోతన వ్యక్తిత్వాన్ని వ్య కీకరిస్తుంటే కొందరు ఆయనగారి 
భ_క్రిసామాజ్య వైభవాన్ని (పస్తుతిస్తునా రు. 


కొంచరు హోత రాజుగారి లోకజ్ఞతకు అద్దంపడుతుంటె కొందరు బమ్మెర 
వారి కమ్మతెమ్మెర లకు గవాతాలు తరుస్తున్నారు. 


కొందరు ఇతర మహాకవులతో పోతన్న గారిని పోల్సి చూస్తుంటె కొందరు 
ఆయన నజివ పాత చితణాన్ని కొనియాడుతున్నారు. 


పే ఇఒ అమ తో ప్‌ 
జ్రువొం బాలకృష్ణ షె ఆకు న నాయుడు ౫ ల కొంది రు ఆయన 


య 
£3 
6౬ 
ట్‌ 
E 
న్‌ 
లై 
ర్‌ 
రని 


రామురి; స్తున్నారు. 9 
t pan. 


xvi 


కొందరు పోతనగారి కవితోన్మీలనాన్ని అభినందిస్తుంటే కొందరు ఆయన 
శృంగార రసపోషణాన్ని విశ్రషిస్తున్నారు. 

కొందరు పోతరాజుగారి వ్యాజస్తుతినీ వ్యంగ్యవై భవాస్నీ వివరిస్తుంటే 
కొందరు ఆయన శ్రీ పాతలను చితీకరిస్తున్నారు. 

కౌందరు ఆంధ మహాభాగవతంలోని రసానుభూతిని . (పన్తరిస్తుంపే 

ందరు సహజ పాండిత్యులవారి సరదాలను |పకటిస్తున్నారు. 

కొందరు ఆం[ధ మహాభాగవతక ర్త అనువాద వైఖరిని విశదీకరిస్తుంటే 

కొందరు ఆ మహాకవి కథాకథనశిల్పాన్ని (ప్రశంసిస్తున్నారు. 


కొందరు పోతనామాత్యుని అఖభేదదృష్టిని అభివర్ణించి పాఠపరిశీలనానికి 
ఉపక్రమి స్తే కొందరు పోతనగారి తా_క్తకచింతను పేర్కొన్నారు. 


6౬. 


కొందరు పోతన కవీం[దుని సామాజిక భక్తిని నిరూపించితే కొందరు 
మహాకవి పోతనను మన కనులముందు సాక్షాత్కరింప జేశారు. 

కొందరు పోతన స్వప్నచర్చను చ కొందరు. పోతన నలం 
పర్యాలోకనం చేశారు. 


ఎందరో మహానుభావులు ఈ విధంగా పుష్పాంజలులూ కవితాంజలులూ 
మౌ క్తికమాలలూ సహజ పాండిత్యులకు సమర్పించుతున్నారు. ఈ వైజయంతి కను 
విజయవంతం చెయ్యటానికి సహృదయులందరికీ హృదయపూర్వక స్వాగతం. 


నంపావకుడు. 


మోతన్న గారూ 1 ధన్యులండి మీరు 1 
శ్రీ కరుణ(క్ర్‌ 


ఎవరూ ? పరమభ క్షాగణ్యులై న బమ్మెర పోతన్న గారా! నమస్కార 
మండీ ! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు కన్నుల విందుగా కనిపించాను ! ఎప్పటినుంచో ' 
మిమ్మల్ని సందర్శించాలనీ, పరమపవ్శితమైన మీ పాద పద్మాలు భక్తితో 
సంస్పృశించాలనీ, ఆప్యాయంగా బుజ్జగించి కవితాసరస్యతి కన్నీళ్ళు తుడిచిన 
మీ చేతివేళ్ళు ముద్న పెట్టుకోవాలనీ, కమ్మని పద్యాలను | గుమ్మరించిన మీ 
గంటాన్ని కన్నుల కద్దుకోవాలనీ ఎంతగానో ఉవ్విచ్ళూరాను. ఎన్నెన్నో కలలు 
గన్నాను, ఇన్నాళ్ళకు నా కోరిక తీరింది, నా తపస్సు ఫలించింది. సహజ 
పాండిత్యులవారు సా వాత్కరించారు , 


“మధుమయ ఫణితీనాం మార్గదర్శీ మహర్షిః” అన్న సుకవి సూకికి 
ఉజ్వలమైన ఉదాహరణం మీరు. “క విత్య''మనే పాలల్లో “భక అనే పంచ 
దార కలిపి భాగవత రసాయనాన్ని పాఠం చేసి లోకాస్‌కి హు అకన అమృత 
హస్తం మీది. “బాల రసాల సాల సవపల్రవ కోమలి ఆయిన మీ కావ్యక న్యక 
తెలుగు గుండెల్లో “మందార మకరందా”లను చిందించింది. తెలుగు జాతిని 
“నిర్మల మందాకినీ వీచిక ల్లో ఓలలాడించింది, 


'““బాలరసాలసాల”” అంటే గుర్తుకొచ్చింది. అన్నట్టు పోతన్న గారూ! మీ 
ఇంటి ముందు నవపల్లవాలతో నవనవలాడే జహా. ఉంది కదండీ! ఆ 


గున్నమామిడి (కంద. తిన్నాం. కూర్చుండేగా మీకు భాగవతం | వాన్‌ందె. 
అవ్ఫనంటాదా * 


పోతరాజు గారూ ! మరొక్క చిన్న సందేహం. ఇదిగో ఇలా చూడండి. 
మీ ఆరచేతులు ఆలా కాయలు కాబాయే? హలం పట్టి పొలం సేద్యం చేయడం 
మూలానా ? గంటం పట్టి పద్యం [వాయడం మూలానా? ఆసలు మీరు కవులా 


భాగవత వె జయంతిక 


కులా ? లేకపోతే కవి కర్షక్కలా ? కాకపోతే కర్షక కవులా ? ఇంతకూ మీకు 
కలమ: టే “a గ్‌ వాలమంటే యిష్టమా గ కోంచెం సెలవీయండి, ఇదేమిటి 
వీడు ఇలా అడుగుతున్నాడు అనుకోకండి. మీ అవిరళకృషి ఆంధ సారస్వత 
క్షే తాల ను 'పదనకేన కవితావీజాలు చల్లి బంగారు పంటలు పండించింది 
గదండీ ! 
చూశారా మరి! మీరు ఊర్థ్వపుం డాలు ధరించి ఉంటారనుకున్నాను 
గాని మీ ఫాలాన విభూతిరేఖలూ, కంఠాన తులసీ పేరులూ ఉంటాయనుకోలేదండీ! 
ఆవునములె౩డి. హరివారాడై ఇత దృష్టి కదా మీది. 
అయ్యా ! మీ తండి కెసన మంతి తిగారు శ్‌ వాచార సంపన్నులు. మీ 
తల్లి లక్క్నమాంబ గారు సదా 1వపారయగార్స్‌నావమూల, మీ అన్న 


ళో 


కవ్‌ఛా ఏవి తత్త” అని స్వయంగా చెప్పుకొన్నారు. అటువంటి శై వకుటుంబలలో 
జస్ఫించిన మీరు శ్రీరా మభ కుల కాగవతం _పాయడం చి తంగా లేదండీ ! 


“అభంకవ సముత్తుంగ తరంగ” అయిన గంగలో స్నానము చేసి 
మహనీయ మంజుల పులినతల మధ్యంలో మహేశ్వరధ్యాన తత్పరులై మీరు 
కూడో ఎడమేమిటి $ సీతాసమెతుడై న _్రరాపి. చం దుడు మ్‌ కన్నులముందు 
సాషాత్కరెంచి “మ మన్నామాంకితంబుగా భాగవతంబు తెనుగు సేయు'మని మీకు 
ఆనతీయట మేమిటి ? ఎంత చితంగా ఉందండీ ! శీరాముడు తనకు అంకితం 
చేయమన్న భాగవతాన్ని మీరు “హారికి నందగోకుల విహారికి గోపనితంబినీ 
మనోవారకి” ఆని షష్ట్యంతాలు [వాసి (శీకృష్ణు “కి అంకితం చేయడం ఆంత 
కంపే విచిత్రంగా లేడుటండీ ! ఇదంతా శివుడికి. శీరాముడికీ; ఠాముడికీ -కృష్ణు 
డికీ నన ర్ట. ధ్యనింపచేయటానికి కాకపోతే మరేమిటంటారు గ్గ. ఈ పర 
మార్ధాన్నే భాగవత మహా గంథాన్ని (ప్రారంభిస్తూ మీరు a ur 
చేతులారంగ శివుని పూజింప(డేని 
నోరు నొవ్వంగ హరికీ ర్తి నుడువండేని 
దయయు సత్యంబు లోనుగా ౬ దలంపండేని 
కలుగ నేటికి తల్పుల కడుప్పచేటు. 


ఆన) చిన్న. గీతపద్యంలో ఎంత చక కాగా నిరూపించారు !- 


పోతన్నగారూ! ధన్యులండీ మీరు! లి 


(వేపల్లైలో నందులవారి గుమ్మం ముందు దుమ్ములో ఆడుకొంటున్న 
బాలకృష్ణుని వర్శీస్తూ న్‌ 


తనువున నంటిన ధరణీపరాగంబు 
పూసిన నెజిభూతి పూత గాగ 
ముందర వెలుగొందు ము కాలలామంబు 
తొగల సంగడికాని తునుక గాగ 
ఫాలభాగంబుపై పరగు కావిరి బొట్టు 
కాముని గెలిచిన కన్ను గాగ 
కంఠమాలికలోని ఘనసీల రత్నంబు 
కమనీయమగు మెడకప్పు గాగ 
హార వల్లు లురగ హార వల్డులు గాగ 
బాలలీల | పొఢబాలకుండు 
శివుని భంగి నొప్పె శివునకు దనకును. 
వేలులేమి తెల్ప సస 


అన్నారు. ఆ బాలకృష్ణుడికి ఆ భావం ఉందో లేదో. కాని శివుడికీ, కృష్ణుడికీ 


వేయిలేదని తెల్పాలనే భావం మీకు ఉన్నదనడంలో సందేహం లేదండీ ! కావా 
లసి వరించిన ఈ సిసపద్యం మీ అదె పత భావానికి మచ్చలేని మచ్చుతునుక స్ట 
ఎని, లు క్‌ 


పోతన్న గారూ! మీరెంత ముందు చూపు గలవారండీ! |గంథారంభంలో 
వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు మొదలైన సంస్కృత కవులకు నమస్క_ 
రించారు. బాగుంది. నన్నయ్య గారినీ, తిక్కన గారిసీ, ఎట్జన గారినీ కైవారం 
చేకారు. ఇలకొ బాగుంది, మిగిలిన పూర్యక వు అందరినీ సముచితంగా 
సంభావించాకు. చాలా బాగుంది. చివరకు వర్తమాన కవులకు |పియం పలి 
కారు. మరీ బాగుంది. ఆంతటితో ఊరుకున్నాలా ! ఎప్పుడో ముందు రాబోయే 
భావికవులను కూడా భానించి బహూకరించి శుభం పలికిన మీ వికాల హృద 
యానికి ఈ ఆయిదువందల ఏండ్రలో జన్మించిన కవులంతా చ చేతులె తి నమన 
రించక తప్పదు. ఏమంటారు ? 


4 భాగవత వై జయంతిక 


కవిగారూ! మీరు మీ భాగవతానికి (శ్రీకారం చుడుతూనే “శ్రీ కై వల్య 
పదంబు చేరుటకునై చింతించెదన్‌”” అని లోళరక్షైకారంభకుడూ, భ క్రపాలన 
కళా సంరంభకుడూ, దానవో దేక స్తంభక డూ, కెళీలోల విలసద్దృగ్దాల సంభూత 
నానాఠకంజాతభవాండకుంభకుడూ ఆయిన మహానండాంగనా డింభకుల్ణి సంస్మ 
రిస్తూ వాసిన మొదటి పద్యంలోనే భాగవత, మహా[గంథంలోని |పధాన కథా 
ఘట్టాలన్నీ స్ఫురించేటట్లు చేశారు. ఆత్యంత సుందరమై అంత్య పాస విలాస 
విన్యాసాలను వెదజల్లే ఈ పద్యం అనవద్యం. హృద్యం, సహృదయ హృదయెక 
వేద్యం. భ్‌ 


మహాకవీ ! లలితస్కంధమూ, కృష్ణమూలమూ, జకాలాసాభిరామమూ, 
మంజులతాకోభితమూ, సువర్ణసుమనస్సుజ్జేయమూ, సుంద రోజ్ఞ్యల వృతమూ, 
మహాఫలమూ అయిన భాగవత కల్పవృతాన్ని తెలుగువారి సొంతం చేసిన మీ 
(ప్రతిభ అ పతిమానం. 


“విద్యావతాం భాగవతే పరీశ్షా” అని కొమ్ములు తిరిగిన పండితులకు 

_ కూడా “కొరకరాని కొయ్య” ఆయిన (శ్రీమద్భాగవతం మీ అమృతహస్త 
స్పర్శతో “వాలరసాలంగా”” పరిణమించి పల్పవించి పుష్పించి ఫలించి ఆబాల 
గోపాలానికీ రసానందాన్ని అండించీంది, 


చూడండి పోతన్నగారూ! పురాణ (గంథాలను ఆం|ధంలోకి అనువదిస్తూ 
నన్నయ తిక్కనలు భారత రామాయ ణాలను మా(తమే [గహించి భాగవతాన్ని 
నిజంగా మీ కోసమే ఆట్టి పెట్టారండీ! అది కేవలం మీ పురాకృత సుకృత 
విశేషం మా|తమే కాదు, ఆం|ధులందరి అపూర్వ పూర్వ పుణ్య విశేషం, 
శ్రీమద్భాగవతాన్ని తెనిగించడం మూలాన మీకు మాత్రమే కాదు - ఆ భాగవ 
శానికీ కూడా పునర్శన్మ అన్నది లేకుండా పోయింది. 


భాగవతము తెలిసి పలుకుట చిితంబు, 
_. శూలికైన తమ్మిచూలికైన 
య విబుధవరుల వలన విన్నంత కన్నంత. 
=. తెలియవచ్చినంత తేటపరుతు.. 


పోతన్నగారూ! ధన్యులండీ మీరు! . ర్‌ 


అన్న మీ వినయ విన మతకు వేయి నమస్కారాలు. ఎంత చక్కగా పలి 
కారండీ - 


పలికెడిది భాగవతమట; 

పలికించు విభుండు రామభ్యదుండట; నే 
'పలికిన భవహర మగునట; 
పలికెద వేజొండు గాథ పలుకగ నేలా! 


అవును. మీ పలుకు పలుకులో రామభ్యదుడు పలుకుతూనే ఉన్నాడు, 
మీ దృఢ సంకల్పం, వీ ఆత్మవిళ్వాసం అనన్య సామాన్యాలండీ ! పాఠకుల్ని 
ఉద్దేశించి మీ రిలా అన్నారు = 


కొందబకు తెలుగు గుణమగు; 

కొందబకును సంస్కృతంబు గుణమగు, రెండున్‌ 
గొందజకు గుణములగు; నే 

నందజ మెప్పింతు గృతుల నయ్యె యెడలన్‌, 


ఆవునులెండి, “ఉభయ కావ్యకరణ దకులు గదా మీరు. మీకు సాధ్యం 
కాని దేముంటుంది ? అక్షరాలా అన్నంత పనీ చేళారు,. . 


భ కకవీ ! మహాభక్తులైన మీరు పొంగి పులకించిన హృదయంతో 
గజేంద్ర మోక్షంలో, వామన చర్మితంలో, (ప్రహ్లాద వృత్తాంతంలో, రుక్మిణీ 
కల్యాణంలో, నరకాసురవధలో, కృష్ణలీలల్లో, గోపికాగీతల్లో, కుచేలోపాఖ్యా 
నంలో | పతిభాపాండిత్యాలను (పదర్శించి మూలాన్ని పెంచి “సర సుంద 
రంగా ఆ ఘట్టాలను దిద్ది తీర్చారు. కొన్నిచోట్ల మూలంలోని మూడు శ్లోకాలను 
ముప్పై మను పద్యాలుగా |పపంచీకరించారు, 


చూడండీ ! గజేందమోక్షంలో ఒక చమత్కారం జరిగింది. ““అల 
వై కుంఠపురంబులో _ ఆ మూల సొధంబు దాపలి” మందారవనంలోని ఆమృత 
సరోవరం (పక్కన ఉన్న చం దకాంత శిలావేదిక పై కలువపూల పాను మీద 
కూర్చుండి ఉన్న ఆపన్న పపన్నుడు గజేందుడి మొర ఆలకించాడు. చెంత 
నున్న (శ్రీదేవికి చెప్పకుండానే, శంఖ టక్‌ ధరించకుండానే ఆయన క్లరిన్ని 


6. భాగవత వైజయంతిక 


కాపాడటానికి పరుగెత్తుకొంటూ వచ్చాడు. అవ్మకమైన చక్రంతో నకం 
కంఠాన్ని ఖండీంది కరిరాజును కాపాడాడు. అంతా స|కమంగానే జరిగిపోయింది, 
ఆయనకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది లక్ష్మీ దేవి పైట చెరగు తన చేతిలో ఉన్న 
దని. [శీ హరి “*దరహసిత ముఖకమల” అయిన కమలతో ఇలా అన్నాడు - 


“బాలా ! నా వెనువెంటను 
హేలన్‌ వినువీథి నుండి యేకెంచుచు నీ 


చేలాంచలంబు పటుట 


కాలో నే మంటి నన్ను నంభోజ ముఖీ ! 


ఆనగానే ““ఆరవిందమందిరయైన యయ్యిందిరాదేవి మందస్మిత వదనారవింద” 
యె ముకుందునితో ఇలా పలికింది = “స్వామీ | ఏం చేసేది. మీ పాదాలు 
ఢివించటమే నా కర్తవ్యం. మీరు ముందు పరుగెత్తుతుంచే మీ వెంట నేనూ 
వస్తున్నాను.” ఇలా పలికించి ఊరుక్టున్నారా మీరు. ఆ లక్ష్మీ దేవిచేత దేవదేవుడికి 
ఒక. యోగ్యతా పతం ఇప్పించారు. 


దీనుల కృయ్యాలింపను 

దీనుల రక్షింప మేలు దీవన పొందన్‌ 
డినావన ! నీ కొప్పును 

దీనపరాధీన ! దేవదేవ ! మహేశా ! 


శ విధంగా దేవాదిదేవుడై న వాసుదేవుణ్ణి ఆపద్బాంధవుడుగా భ కరక్షణ 
__ పరతంతుడుగా చెప్పించారు. బాగానే ఉంది - కాని ఇక్కడ ఒక్క అను. 


మానం ఉందండీ. “అల వైకుంఠపురంబులో” ఆగి యెత్తుకున్నారు మత్తేభవృ 


త్రంలో. ఆ తరువాత [శ్రీమహావిష్ణువు పరుగెత్తుకు రావడంతో “సిరికిం జెప్పడు 
శంఖచ్యకయుగముం జేదోయి సంధింపడు'' అని మ_ల్రేభవృతాన్నే అనుసంధిం 
చారు. ఆ తరువాత అప్పటి పరిస్థితిని అభివర్షిస్తూ “తన వెంటన్‌ సిరి లచ్చివెంట 
నవరోధవాతమున్‌'' ఆంటూ మళ్ళీ మ క్రేభాన్నే సర్వవె త్రించారు. అనంతరం 
“తన వేంచేయు పథంబు పేర్కొన డనాథ స్రీ జనాలాపంబుల్‌ వినెనో” ఆంటూ 

మ తేభంలోనే మీ భావాన్ని వెలిబ్దుచ్చారు, ఆపైన “వినువీథిం జనుదేర గాంచి ప 
రమరుల్‌'' అన్న పద్యం కూడా మత్తేభ వికిగితమే. ఆటు పిమ్మట “చను 


ఖ్‌ 
పోతన్నగాళూ! ధన్యులండీ మీరు! (| 
దెంచెన్‌ ఘను డల్చవాడె హరిపజ్జన్‌ గంటిరే లక్ష్మీ” అంటూ మళ్ళీ మ త్రేభా న్నే 
నడిపించారు. చివరకు “కరు ణాసింధ్రుడు కౌరి వారిచరమున్‌ ఖండింపగా బంపె” 
అన్న పద్యంలో కూడా మ త్రేభాన్నే పెకెత్తారు. ఈ విధంగా వరుసగా ఈ మట్టి 
మంతా మ తేభమయంగా నడిచిందే, ఇందులో ఏమైనా రహస్యం ఉండా? అని 
సందేహం. అవునులెండి! మీరెందుకు చెబుతారు. మధురమధురంగా మందహాసం 
చేస్తున్నారు. పోనీలెండి. నేనిలా ఊహిస్తున్నాను= న 


మొదట్లో “మ తేభయూధంబు మడుగు సొచ్చె” అన్నారు కదూ! ఆ 
మ శకాన్ని మకరి పట్టుకుంది కదూ! అప్పుడు మత్తేభం “రావే యీశ్వర' 
కావవే వరద! సంరక్షించు భదాత్మకా;'” ఆని భగవంతుణ్ణి పార్థించింది. అప్పుడు 
"మ తేభరక్షణాయ త్రచితుడై ” అడావుడిగా పరుగెత్తుకుంటూ వచ్చిన భగవంతుడి 
హృదయంలో అడుగడుగునా ను త్రేభవృత్రాంతమే మెదులుతున్నది. ఆయన 
మనస్సు “మ త్రేభమయ*”” మయింది. అటువంటి దేవుణ్ణి మీరు మనస్సులో 
భావించారు. మీకూ (శీహరికి సాధారణీకరణం ఏర్పడింది. అందు వర్ణ. ప్రీ 
గంటంలో అడుగడుగునా ఒకదానివెంట ఒకటిగా మ త్తేభవృత్తాలే దొరలి దొరలి 
వచ్చాయి. “పలికించెడు వాడ్డ రామభ| దుడే”” కదండీ: ఏమంటారు? లేకపోతే 
అనుకోకృండా ఆన్ని మ తేభాలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? 


పోతన్న గారూ! మీరు సవాజపాండిత్యులు. మీకు గోపాలుడంటే ఎంత 
ఆదరమో గోవులన్నా అంత అనురాగం. గోపాలకృష్ణుని చేత ఒకొక. ఆవుకు 
కొక). అందమెన పేరుపెట్టి ఆప్యాయంగా. పిలిపించడమంటే మీ కెంత 
సంతోషమో మాకు బాగా తేజును. 
“రా పూర్ణ చం దికా! రా గాతమీగంగ! 
_ రమ్ము భగీరఠరాతనయ! 
రా సుధాజలశాశ! రా మేఘమాతిక! 
రమ్ము చింతామణి! రము2ై సురభి! 
రా మనోహోరిణి; రా సర్వమంగళ! 
రా భారతీదేవి! రా ధడితి! 
రా (శ్రీమహాలక్ష్మి! రామందమూదుతి! 
| రమ్ము మందాకిని! రా జదఖాంగి!”” 


& 


క్ర భాగవత వె జయంతిక 


అబ్స' ఎంత చక్కనిపేర్తు పెబ్లించారు. ఎంత చక్కగా పిలిపించారు. ఆ ఆవు 

స్ట ల గోపాలని “చతుర 
లకు కూడా ముదుల గోపాలని మురళీగానమం టే ఎంత ఆనందమో! “చ 

టు 

నటమూ 8" అయిన ఆ “గోపాల చ్యకవ ర్త వేణువును మధురాధరం మీద 
చేర్చి “ బహ్మగాంధర్వ గీతాన్ని” ఆలపించగా బృందావనం పులకించింది. 
కాళింది వొంగి పొరలిండి. | పకృతి పరవశించింది, లేళ్ల మెమరచాయి. మోళ్లు 
వించాయి. రాళ్లు డవించాయి. ఆవులన్నీ మేతలు మాని ““మమతన్‌ 
ములు మీవవెతుకుని రోమంధంబు చాలించి"'' ఆనందబాష్పాలు కారుస్తూ 
నిశ్చలంగా నిలబడి ఆలకించాయి కదూ! ఇక గోవత్సాలంటారా! “తల్లుల చన్ను 
బాలు” తాగడం మానేసి కదలకుండా తదేకధ్యానంతో అదే పనిగా ఆ మురళీ 


ధరుడి ముర్దులమోము వంకే చూస్తున్నాయి కదూ! 


అన్నా! హొతన్నా!' ఆ మాధవుడి మధురమధుర వేణుగానంలో మెనుర 
కించి పాప మా అమాయికలై న గోపికలను ఎన్ని తిప్పలు పెట్టిచావయ్యా! 
చూస్తూ చూస్తూండగానే అదృశ్యమైపోయిన ఆ వంశీధరుడి కోసం. 


“పున్నాగ శానవే పున్నాగవందితు 
తిలకంబ కానవే తిలకనిటలు* అనీ 

“మ్రూన్సిన్సీ మన్మథు మాధవ గానరే 
సలలితోదార వత్సకములార!"” ఆనీ 

“ఆరె నందనందనుం డంతర్షి తుండయ్యె 
పాటలీతరులార ! పట్టరమ్మ !”” ఆనీ 


“ఓ మల్లియలార ! మీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరే! అనీ” 
ఇృందావనంలోని చెట్టు చెట్టుకూ గుట్ట గుట్టకూ తిరిగి తిరిగి విసిగిపోయారే ఆ 
కునముమకోమలులు! rE 

.. పోతన్నగారూ' మీ భాగవతంలోని పాత్రలు మా వృదయాలలో చెరగని 

వ నీకున్‌ (మొక్కెద (తుంపవే భవలతల్‌ 'నిత్యాను 

ee re 
వ్నాకుండు నాకంటె నీ భూత్కశేజికి రాజు లేడాక్ర”” అని ప్రన్రాదుజి 


పోతన్నగారూ! ధన్యులండీ మీరు! 9 


గద్దించే హిరణ్యకశిపుడూ, “తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా దీవర్య! 
చేయేటికిన్‌” అని పలికే దానవీరుడు బలిచకవర్తి రీ, “అమ్మా! మన్ను దినంగ 
నే శిపవునో ఆకొంటినో వెలినో” అని తల్రి దగ్గర ముద్దులు గురిసే బాలగోపా 
లుడూ, “ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర యిమ్ము'” ఆంటూ బలి 
చక్రవర్తిని చేజాచి యాచించే చిట్టిపొట్టి వామనుడూ, “కలడు కలం డనెడివాడు 
కలడో లేడో!” అని న, కానికి చిక్కి ఆ(కోశించే గజేందుడూ, “చదువులలో 
మర్మమెల్ల చదివితి తం డీ!” ఆం కన్నతం డికి సమాధానం చెప్పే (పహ్హాదుడూ, 
““నవసీతంబుల ముద్ద కొదు వినరా నా మున్షి గోపార్భకా!”” అని బారలు చాచే 
చాణూరమల్లుడూ, semis భుజనటద్ధమ్మి ల్రబంధంబుతో'' పతి 
వెంట పరువెత్తుకు వస్తున్న శ్రీదేవీ, “నా దయితు కట్టనేబికి శ్రీ దయితా చిత్త 
చోర! [శితమందారా!” అని శ్రీహరిని కన్నీళ్ళతో పశ్నిస్తున్న ఐలిచకవర్తి 
భార్య వింధ్యావళీ, “వెచ్చేయుము తల్రికడుపు వెడలి ముకుందా! అంటూ దేవకీ 
గర్భస్టుడెన దేవదేవుజ్జి చేతులు మోడ్చి (పార్టిస్తున్న ముక్కోటి దేవతలూ, 
“ గుజ్జము గ్‌ ముద్దుల కుజ్జిడ!”” అని సగర పొతుడైన అంపమంతుజ్ణి 
పాతకం అభినందిస్తున్న సక మహర్షీ , '““ఆన్నము లేదు కొన్ని మధురాం 
బువు ఈన్నవి [తావు మన్న" అంటూ తన పాణాన్ని కూడా లెక్మించకుండా 
తన దగ్గఠ ఉన్న కాసిని సళ్లూ అతిథికి ధార పోస్తున్న రంతిదేవుడూ, “*వీడపే, 
రక్కసి విగతజీవగ చన్నుబాలు (తాగిన మేటి బాలకుండు*' ఆని మేడల మీద 
నుంచి కుతూహలంతో కృష్ణుణి చూస్తున్న మధురానగర నారీమణులూ, “ముని 
నీరు సొచ్చి వెడలడు చనియెడు ద్యాదశియు” అని ద్వాదశీవ)తభంగానికి ఆందో 
శనచెందే ఆంబరీషడూ, “మన సారథి మన సచివుడు... మనలను విడనాడి 
చనియె మనుజాధీశా!'” అని కన్నీష్ట తుడుచుకుంటూ అన్నగారికి కృష్ణనిర్యాణం 
విన్నవిస్తున్న ఆర్జునుడూ, “వీ రెవ్వరు ్రీకృష్ణులు కారా! ఎన్నడును వెన్న గాన 
రటగదా!'' ఆంటూ వెన్నదొంగను వెన్నాడి పట్టుకొని కట్టనుంకించే యకోదమ్మా, 
““ఆసురకృత్యంబు ధర్మమగునె? తండీ!”” అని పుత్రఘాతి అయిన ఆశ్యర్థా 
నును |పశ్నిస్తున్న షాంచారి రాజపుతీ, “నీ పాదకమల సేవయు నీ పాదార్చ 
_కులతోడి నెయ్యమును నితాంతాపారభూతదయయును _ తాప పసమందార!. నాకు 
దయగే నీయగదే'” అని గోపాలదెవుణ్జి పార్థించే సుదాముడూ, “ఘను డా 


భూసురు డేగెనో నడుమ మార్గ|క్రాంతుడై చిక్కెనో” ఆని Et కృష్ణుడి. రాక 


10. భాగవత వై జయంతిక 


కోసం వేయి కన్నులతో సిరీక్షించే రుక్మిణీకన్యా, “అన్న! శమింపుమన్న! తగ 
దల్లుడు గాడిది మేనకోడలో'' ఆని కంసుణ్జి బతిమాలే దేవకీదేవీ, _ “వనితా! 
ఏమి తపంబు చేసెనొకొ ఈ వంళంబు వంశంబులోన్‌*”” అని మురళిని చూచి 
(గుక్కిప్ట [మింగుతున్న బృందావన గోపికా మా కన్నులముందు కలకాలం 
కదలాడుతూనే ఉంటారు. 


పోతన్నగారూ! ధనులండీ మీరు! 


భీష్మనిపెకి కుప్పించి అంఘించు గో 
పాలకృష్ణుని కుండలాలకాంతి 
కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరి వేల్పు 
ముడివీడి మూపుమై బడిన జుట్టు 
సమరంబుగావించు సత్య కన్నులనుండి 
వెడలు _పేమ।క్రోధ వీక్షణములు 
కొసరి చల్చులు మెక్కు. గొల్రిపిల్ర (వేళ్ల 
సందు మాగాయ పచ్చడి పసందు 
ఎప్పుడు కనుగొంటివయ్య? నీ కెవరు చెప్పి 
రయ్య! జ రాతి కలగంటివయ్య! రంగు 
కుంచెతో దిద్ది తీర్చి చి తించి నావు 
సహజ పాండితీ కిది నిదర్శన మటయ్య! 


పీ [కాంత దర్శిత్వానికి కై మోడ్పులండీ! 


అన్నగారూ! మీరన్నా మీ భాగవతమన్నా మాకెందుకండీ యింత యిష్టం! 
నిజంగా ఇచి మా జన్మజన్మాల అదృష్టం! మీ కవిత చిరంజీవిని, లోకపావని. 
ఆ 'జగన్మోహిని' కి ఆ “పుల్ణాబ్దాక్షి' కి ఆ “సరస్వతికి ఆ *భగవతికి 
ఆ “పూర్ణెందుబింబానన'కు ఇవే మా శతసహస్ర [పణామాలు. 


_ (్రఆ౭(భద్యోతి, 14-8-1982 ) 


పోతన జన్మస్థలము 


తీ కందుకూరి వీరేశలింగము 


శ్రీమద్భాగవతము నాం|ధీకరించిన బమ్మెర పోత రోజు ఒంటిమిట్ట 
వా(డని కొందును, ఓరుగంటి వా(డని కొందలును కొంతకాలము నుండి పర 
స్పర విజయార్థులె పట్టుదలతో పోరాడుచున్నారు. నే నాం|ధకవుల చరి తమును 
(వాసినప్పుడు తెలుంగు భాగవతమును ము[దించినవారు తమ పీఠికలో (వాసిన 
దానిని నమ్మి పోతన యొంటిమిట్టవాండనియే చెప్పితిని గాని యిటీవల బైలు 
వెడలిన వాదానువాదములను బట్టి నా తొంటి యభిిపాయమును మార్చుకొసి 
యోరుగంటినాండని నేనీ నడుమ సంస్కరించి (పకటించిన కూర్పులో 
(బచురించిన వా(డనై తీసి, అట్టు చేసినందులకై |బహ్మశ్రీ వావిలికొలను సుబ్బా 
రావుగారు నన్ను బహువిధముల దూషించి పరిషత్పతికలో నొక వ్యానమును 
వాసి (పకటించిరి. దూషణము లెప్పుడును వాద దౌర్బ్భల్యమునకు సూచనలగుట 
విచారించి వారి దూవణవచనముల నాశీర్యాదములుగా స్వీకరించి సత్య గవాణ 
పరాయణులగువారి యుపయోగార్భముగా నా పూర్యాభి పాయమును మార్చుకొను 
టకు( గల యాధారములను సంషేపించి [వాయుచున్నాను. 


పోతనార్యుని భాగవతములో నొంటిమిట్ట యనిగాని, యోరుగల్లని గాని 
లేదు. దానిలో “ఓక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకం గని 
సజ్జనానుమత ంబున న్యభంకషకుభ సము తుంగభంగ యగు గంగకుం జని 
[కుంకులిడి వెడలి... మరలి కొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జను 
దెంచి” అని యేకశిలానగర మని మ్మాతము చెప్పంబడినది. దీనినిబట్టి యిందు 
బేర్కాన(బడిన యేకశిలానగర మేది యని నిర్ణయింపవలసియున్నది. శిలా 
త్మామశాసనములయందును, పూర్యగంథముల యందును ఓరుగంటికే యేక 
శిలానగరనామము వ్యవహరింప(బడియుండుట నిర్వివాదాంశము. ఏక ళిలానగర 
నామ మొంటిమిట్ట కే శాసనమునందును ఏ (గలథమునందును వాడ(బడలేదు, 
నూజుసంవత్సరముల పంల వ (గామస్థుల వలన కే కై ఫేయతులు 


యన భాగవత వై జయంతిక 


మొదలై నవానిని సంగహించి కూర్చిచేర్చిన స్థానికచరి త్ర ముల (Local 
Records) లోని యొంటేమిట్ట ల వీయతులలోను "త ఒంటిమిట్ట 
కౌంటిమిట్ట యన్న పేరేకాని ' 'యేకశిలానగర మన్న సేరెక్కడను జ, 
ఆంతేకాక యొంటిమిట్ట యను పేరాగామమున కొంట(డు, మిట్టండు నను 
బోయల వలన వచ్చినదని కూడ చెప్ప(బడినది, రీరుగంటి పతాపర్నుదుని 
కాలములో ననగా మన పోతన్నకు నూజు సంవత్సరములు ముం డోరుగంటి 
యందే వాసము చేయుచుండిన విద్యానాథక వి తన [పతాపర్ముద్రీయములో “రా 
న్నేకశిలానగరాధీళ యని యనేకస్థలములలో నోరుగంటి ము. 
మని వాడియున్నాడు. ఒంటిమిట్టలో నున్న కవులలో నొక్కరును ఒంటిమిట్ట 
నేకశిలానగరమని చెప్పలేదు. ఒంటిమిట్ట కవులలో మొదటివా(డగు తిప్పనా 
మాత్యుండు తన శతకములో నొంటిమిట్ట రఘువీరు( డనియే చెప్పెనుగాని యేక 
శిలానగరనామ ముచ్చరించలేదు. ఒంటిమిట్ట రఘువీర శతకములో రెండు పద్య 
ములనిం దుదాహరించుచున్నాను. 


కారుణ్యోదయ! యొ౭టిమిట్టపురి నాథా! నీకు నే బద్యముల్‌ 
నూజుం జెప్పిన నూరు(బేరు వెలయున్‌ నూత్నంబుగా; నంతనా 
నోరుం బావనమౌను; నీ కరుణ. గాంతున్‌ భ క్రి నన్నంద యిన్‌ 
రా రమ్మందురు గారవించి రఘువీరా! జానకీనాయకా! 


అళుల | పౌఢిమ మీజు రాయకవి యయ లాజు సత్పుతు( డం 
చితభక్తిం (దిప్తురాంతకుండు రచియించెన్‌ దెన్గు పద్యంబులన్‌ 
శతకం బొక్కటి;- దీని సీవు విని యాచం దార్మమై నిల్చు ప 
రకత క యందెముట్టి రఘువరా! జానకి నాయకా! 


ఈ కవికాలములో నొంటిమిట్ట యందున్న దేవుండు కోదండరామస్వామియే 
యై యుండిన యెడల కతకమకుటమునందు “గుణధామా! మహదొంటిమిట్టనగరీ 
కోదండరామా! (ప్రభూ! అని వేసియండును. 


శెండవ కవియైన యేయ్మరరాజ రామభధకవి. తన en 
క్యాపాంత గద్యమున నందు సంస్కృత సమాసమున సహితము “థ్రీ మదొంటివిటీ 


పోతన జన్మస్థలము 18 
రఘుపీర శతక నిర్మాణకర్మఠ, జగ దేకథ్యాతి ధుర్యాయ్యలరా జు తిప్పయ మనీషి 
పర్యతాభిధాన పౌత్ర యసియే కసా యేక ిలానగర మని కప్పలను. 


ఏకశిలానగర శబ్రార్భమును బట్టి విచారించినను స్ట రాయి” యని. 
యర న్స మిచ్చు నోరుగంటి కది చెల్బను గాని “యొక్క కొండి” యని యర్థమిచ్చు 
నొంటిమిట్టకు జెల్లదు, గిల హన శైల మనియు శైల మనంగా శిల. యనియు 
నర్థము చె ప్పెడు బుద్ధిమంతుల యర్థ మెంత యు క్రియ క్రమెనదో మతిమతు 
లూహించి తెలీసికో(గలరు. అట్టివారి మతమును బట్టి (శీశై లమునకు [శీపర్వ 
తము [శీనగరము గాక శీశిల యని చెప్పవచ్చును కాబోలును! ఆట్లనవచ్చినచో 
దన్మతానుసారిగా రుబ్బురాతిని రుబ్బుకొండ యనియు, రుబ్బుకైల మనియు 
గూడ చెప్పవచ్చును. ఒంటిమిట్ట 'కేకశిలానగరనామము సమర్థించుట క్రై [గామ 
దేవాలయసమీపమున నొక మెట్ట యుండుటచేతు నాపేరు వచ్చినదని యొక 
చోటను: దేవాలయములోని సీతారామలక్ష్మణ విగహములు మూడును నొక్క 
రాతితో: జేయంబడి యుండుటచే నాపేరు కలిగినదని వేజొకచోటను చెప్పి 
యున్నారు, దేవాలయములోని వి గహములన్నియు, నతుకులు లేక యేక శిలతో నే 
చేయంబడియుుడును గాన [గామములస్నేయు . వ కావచ్చును. 
ఇది యిట్టుండ గా స్థలజరి, త మాపి దొంటండు, మీట్ట(డు న ను వోయల పేరును 
బట్టి కలిగినదని చెప్పచుండుటచేత 1 సి రెండు వ స. గూడ పొసగక 
పోవుటయేకాక యేకశిలానగరనామ మొంటిమిట్టి కసలే పనికిరాని దగును. 


పేరులకై. సపెన(గులాడెడి ss పప విడిచి షెట్టి 
యిక బమ్మెరపోత రాజకృత _గంథ ములవలన సీ విషయమేమైన తేలునేమో 
చూతము. పోతన చేసిన [గంథములు నాలుగు. వీరభదవిజయము, భోగినీ 
దండకము, నారాయణ శతకము, భాగవతము ఈ. నాలిగింటిలో ముందుగా 
నేకశిలాన గరనామమును జెప్పిన MO గూర్చి బిచారింతము. ఓరుగ 
ల్రేకశిలానగర మగుట భాగవతరచనకు పూర్వమ సుపసిద్ధము కావున భాగ 
వతమునందు బేర్కొనంఐడిన యేకశిలానగర మోరుగల్లి యని విశేషవిచార 
మక్క-అలేకయె స్ట స్లూ లబుద్ధికి సహితము గోచరమగును. యట్టుండగా కాగ 
వతమును బట్ట కక లా నగరము గంగకు కొన్నిదినముల 'పయాణములో 
న న్నట్టు కనబడుచున్నది. గంగ యను శేరు గౌతమికిని ల గూడ 


14 భాగవత వై జయంతిక 


నాంధ దేశము న సామాన్యముగా వ్య ్యవహారమందున్నది. రాజమహేం[దవర ప్ర పాంత 
మున గౌతమీనద సాధారణముగా గోదావరి యను నామముతో వ్యవహారింప (బడు 
చున్నను ఓరుగల్లు [ప్రాంతమున సామాన్యముగా గంగ యను పేఠితోనే వ్యవహ 
రింప(ుడుచున్నది. అందుచేత నేకశిలానగర మే యోరుగ ల్రయ్యెడు పక్షమున 
నక్కడకు( గొన్నిదినముల. ప్రయాణములో నున్న గంగ భాగీరధికాక గౌతమియే 
యగును. ఈ గంగకు కొన్ని దినముల [పయాణములో నున్నదగుటచే నేక శిలా 
నగరనామ మోరుగల్లునకే చెల్లునుగాని యొంటిమిట్టకు గాని - తన్నామమును 
ధరించిన యే యితరపురమునకు(గాని చెల్లదు. 


ఒంటిమిట్టకు సమీపమున గొన్నిదినములలో? జేర(దగిన నది యేదియు 
లెదు, వ్యవహారములో లేకపోయినను నేడో స్థలమాహాత్మ్యములో గంగ యన( 
బడిన పినాకి సనడి యొంటిమిట్టకు సమీపములో నున్నను ఆ పెన్న యొంటిమిట్టకు 
భాగదతమ బలో. తెప్ప అడిన్లు కొన్ని దినముల [ప్రయాణములో లేక కొన్ని 
గంటల పయాణములోనే యున్నందున నందు. బేర్కొన(బడిన గంగ పెన్న 
గాదనుట నిశ్చయము. సామాన్యముగా జలసామాన్యమును 'గంగి'యని జనులు 
వ్యవవారింతురు గాన నందుదాహారెంప(ఐడిన గంగ కొన్నిదినముల [పయా 
ణములో నున ఎ యే చెజువుసీరో యే యేటినీకో యను విద్వాంసులకు సమా 
ధానము చెపుట నావంటి మితజ్ఞు నకు సాధ్యము కాదు, కొన్ని దినము. అనగా 
నెన్నిమాసములై. నను కావచ్చునను పండితులను నమాధానపజచుటయు నసా 
ధ్యమే. పినాకిని యన పెరు రెండునచుల కున్నప్పు డుత్తరపినాకిని దశీఆ 
పినాకీసియని పిలు చుచున్నట్టుగానే గంగ యనుపేరు రెండు నదులకు సామాన్యమై 
యుండుట చేత ను త్తరమున నున్న భాగీరథి నుత్తరగంగ యనియు దక్షిణమున 
నున్న గోదావరిని దక్షిణగంగ యనియు పిలుచుట వాడుకయై యున్నది. ఆయి 


నను గోదావరిని దక్షిణ es లేక కేవలము గంగయని పిలుచు టయు 
వాడకలో( గలదు. 


 పోతనతోడి సమకాలీకు(డై న re మహాకవి రాజను షేం్యదవరమును 
వర్షించుచు. “ పవహించు నేవీటి పశ్చిమ పాకార, మొరసి గంగమ్మ సాగరము 
కొమ్మ ” అను సీసపాదమున We గంగ యని చెప్పియన్నాండు, గోదా 


పోతన జన్మ స్థలము 15 
వరీ నామముతో గౌతమిని సాధారణముగా వ్యవహరించు రాజమ హేం[దవర 
ములో నున్న గ్రీనాథుడే దష్షిణశబ్దవిరహితముగా వాడినప్పుడు, గంగ యనెడి 
యేకనామముతోనే వ్యవహరించు దేశమునం దుండిన పోతనామాత్యు(డు దశిణ 
గంగ కనక “య(భ్రంకవశు భస ముత్తుంగభంగ యను గంగ” కని [పయో 
గించుటలో వింత యేమున్నది? దక్షెణపదాను పూర్వకముగా |ప్రయోగించినను 
(పయోగింపవచ్చును, దక్షిణపదమును విడిచి [పయోగించినను [పయోగింప 
వచ్చును. ““దక్షిణగంగ నాం దద్దయు నొప్పిన గోడావరియ” నని నన్నయ 
భట్టారకుడు దక్న్షిణశబ్బ పూర్యక ముగా (పయోగించెను. 


భాగవత భాగములను రచించిన బమ్మెరపోతన్న యొక్కయు, వెలిగందల 
నారాయణకవి యొక్కయు, ఏర్చూరి సింగన్న యొక్కయు గృవహనామములు' 
గల యూ క్ళోరుగంటికి సమీపములో నుండుటచేత భాగవతోదాహృతమైన యేక 
శిలానగర మోరుగల్లే యని సిద్ధాంత మగుచున్నది. ఓరుగల్లు కాదని యొంటిమిట్టనే 
సిద్ధాంతము చేయు తలంపుతో ఈ నామములకు పతిగా ఏర్చూరున కేల్చూరును, . 
వెలిగందలకు వెలిగండ్డయు మేనమామ పోలికగల రెండు [గామముల నొంటే 
మిట్టకు చేరుపనుండు వాని నొంటిమిట్ట వారు కష్టపడి కనిపెట్టంగలిగిరి గాని 
(పథాన, గామమైన బమ్మెరతోడీ న మానాక్షర సంబంధము గల _గామకల్పమును 
దేనిని తత్సమీపమున. గని పెట్టంజాలక. బొమ్మ శరమును బమ్మెర యందుమనిరి, 
బొమ్మెర బమ్మెర కాదని వాడించెడి యీ ఘనులకు తక్కిన యక్షరముల మాట 
యటుంచినను ' బొమ్మెరలో మొదటనున్న బొకారముతో నారంభమయ్యెడు 
'బొమ్మవరము నెట్టు చెప్ప సావాసము గలిగెనో! ఈపే రొంటిమిట్టవాడులకే సరి 
పడక దానిని గప్పిపుచ్చుటకై బమ్మెర యూరిపేరే కాదనియు, పోతన పూర్వు 
లూరూరు తిరుగువా రగుటచే భమణః బ్రభవమైన బమ్మెర వారియింటిపే రయ్యె 
ననియు ఆ పూర్వపొండిత్య | పభావులై న యొంటిమిట్టవాదులు తమ పాండిత్య 
విశేషముచేత విశేషార్దకల్పనము చేసి. బమ్మెర గ్రామమగునో కాదో పూర్వ 
కవి యైన పట్టమట్ట నరస్వతీ సోమయాజి కృతమైన “పృథుచరి తము” లోని 
యీ కింది పద్యమును జదివి వారు |గహింతుడ గాక! 


పరుల కసాధ్యమై పరంగు భాగవతంబు రహస్య మంతయున్‌ = 
హరి కృపచే నెటింగి మృుదులాం[ధవచోరచనాచమ్మత్కియా . 


16 భాగవత వైజయంతిక 
కరణమహో[ పబంధమునుగా రచియించిన భానుజేజు ఐ 
మ్మెరపుర పోతరాజు నసమీకృతభోజు నుతింతు నెంతయున్‌. 


గామనామము బొమ్మెర యని వాడుకలో నుండుటచే నది బమ్మెరకాదని 
వాదించుచునారు గదా, ఉఓరుగంటివెపు వారు బమ్మెరపోతరాజు నిప్పటికిని 
న యు కలా 
బొమ్మెర పోత రాజనియే చెప్పుచున్నారు. తొంబది సంవత్సరముల [కిందట 
ననగా 1829 వ సంవత్సరమునం జింగ్లీమన దక్షిణపిందూస్థాన కవుల చరి 
[తమును | పకటించిన కావలి వేంక కటరామస్వామిగారు పోతరాజు గృహనామము 
"మ్మెరవారశి | వాసియండుట మీరు చూచియుండలేదా? ఇంతకును మీ రేక శిలా 
నగర మనెడిది వంటిమిట్టా? ఒంటిమిట్టా? _“వంటిమిట్టలోను వసతిగాను” అని 
సలపుకాణజ మలో వకారాడిగా నున ఏ ప్పుడు బమ్మెర బొమ్మెర కాదని వాదించెడు 
మీర మ యొంటిమిట్ట యని యెట్టు చెప్పుదురు? గ్రామము వంటి 
మిటయ యెన పక్షమున దాని కేకశిలార్థ మే రాక మీ వాదము ౬ సుముర్లలను (ఏకు 
డా మ 


భాగవతకములో కవి | కాసిన రెండు ముక్కలను బట్టియే యేక శిలానగర 
మోరుగల్హనుఓయె సంభావ్యముగా నున్నది. ద్వాదళ స్మంధములలో దేనిలోను 
కృతిపతియగు రామ ని సంబోధించుటలో నొక్కచోటనై నను నొంటిమిట్ట కోదండ 
రామా! యని కాని తుదకు కోదండరామా! యని కాని లేకపోవృటచేతనే పోత 


నార్యుని యిష్టదై వతము సొత్షా; దామమూ ర్రియె కాని యొంటిమిట్టలో (గాని. మటే 
యే (గ్రామములో? గాని యుండిన యర్బావి| గహము కాదని స్పష్టపడుచున్నది. 
పోతరాజు తనకు సత్యక్షమైనట్లు ట్టు చెప్పిన రాజముఖ్యుని వర్ణనను బట్టియైనను 
స. '“వల్రీయత తమాలవసుమతీజము భంగి, బలువిల్లు 
మూ(పుక బరంగవాండుి! us దానిని బట్టి కోదండరాము (డని తాహతు 
కంచె (సథమ చరణములోని. * 'మెజుగు చెంగట నున్న మేఘంబు తై వడి, 
నువిడ చెంగట నుండ నొప్పువాని” ఆను దానిని బట్టి సీతారాముండని యూహిం 
చుట యెధికవిశ్వాపయోగ కము కాదా! వ. విరచిత నారాయణ శతకములోని 


యా [కిండి వ పడః కము వలన గూడ భాగవత న వ ఇక లాన ర 
మోరుగక్ల్‌ యని యూ రాహింప(బడ (దగి ప డర. ba 


పోతన జన్మస్థలము g 17 


అపరాధ ంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతమున్‌ 
పిపరీతంబుగ( జేసినాండ నిశ నీవే దిక్కు. నాలోనికిన్‌ 

గపటం బింతయు లేక దండధరుకుం గట్టిక రకింపు 

కృపకుం బాతు(డనయ్య ధర్మపురి లక్షీ నాథ! తారా 


ఇందలి ధర్మపురి నైజాము రాజ్యములో మంథెన నమీపమున గోదావరి 
తీరమునం దున్నది. పోతన వాగవతమున( జెప్ప( బడినట్టు చంద[గవాణ 
పుణ్యకాలమున గంగాస్నానార్థము పోయిన దీ పట్టణమునకే యైయుండును. 
మ హేశ్వురధ్యానంబు చేసి కించి దుస్మీలితలోచనుండై యుండినప్పుడు . రామ 
భ|దు(డు కవికి. గన్ను(గవ 'కదుట( గానంబడుట యిచ్చటనే యైయుండును, 
అందుచేత నావజకు శివభ కుండై యుండిన పోతనార్యు డాకస్క్మికముగా విష్ణు 
భ క్తుండుగా. మాటి యాయూరి నారాయణుని పై నక్క_డనే నారాయణ శతకమును 
జెప్పియుండును. అక్క డనుండి మకలి కొన్ని దినములలో నేకశిలానగ రమునకు 
వచ్చి ఫ్రీకృష్ణస్తుతితో. భాగవతపురాణాం ధీకరణము నారంభించియుండును . 
ధర్మప్పరీశ్వరుని. బేర్కానుటచే బమ్మెర పోతరాజు స్నానమునకు. బోయినది 
యా పురముక డనున్న గౌతమీగంగకే యనియు, గోదావరి నుండి కొన్నిదినము 
లలో న. యేకశిలానగర మోరుగల్లే యనియు సులభముగా. దెలిసిక్షోవచ్చును. 
ఈ పు సకద్యయమున కు ముందుగా రచియింప(బడిన భోగినీ దండకమున( 
మ. సింగ మనాయ(డు గోలుకొండ రాజ్యములోని రాచకొండ, మెతుకు 
సంస్థానాధీశ్యరు(డగుట కూడ బమ్మెర పోతరా జొంటిమిట్ట నివాసి కాండనియు, 
నోరుగల్లనఐర.గిన యెకశిలానగర వాసియే యనియు మోషించుదున్నది. 


పోతనార్యు(డు పష్యపథమమున రచించిన శై వ్యగంథమగు వీరభ్యద 
విజయను గూడ కొంతవజ కాత. డోరుగల్లు పుర వాసియని స్ట్థాపించుచున్నది. 
ఈ [గంథము కవి మిక్కి లి చిన్నవాడై శై వమత పక్షపాత మధికముగా కలిగి 
యుండిన కాలములో కర క మతగురువై న యివ్వటూరి సోమనారాధ్యుండు 
కవి నుద్దేశించి చెప్పినట్టున్న వీరభ్మదవిజయములోని యీ. [కింది పద్యము 
[గంథరచనారంభకాలము నా(టికి కశత ప స్పష్టపజచు 
చున్నది. 


ష్‌ 


18 


భాగవత వై జయంతిక 


పిన్నంవాడ ననియు. బెక్కు సత్క్మ్బృతులను 
విననివాండ ననియు వెజపు మాను 
మత్పఏసాదదివ్యమహిమచే నెంత్రైనం. 
గవిత చెప్ప లావు గలుగు నీకు. 


పోతన కులగురువై న సోమనారాధ్యుని యింటిపేరు ఇవ్యటూరి వారు. 


ఇది గామనామ మగుటకు సందేహము లేదు. ఇవ్యటూ రోరుగల్లు పట్టణమునకు 
ముస్పదిమెళ దూరములో నున్నది, అందుచేత... 


'“అనఘు( డివ్వటూరి యారా ధ్యచం[దుండు 
సోమనాథసముడు సోమవిభుండు”' 


అని కవి వరించిన సోమనారాధ్యగురుండును, ఆ గురువుచే వీరభ్యవ విజయ 


విరచనమునక నియమింప(బడిన తచ్చిష్యుండగు పోతన యును ఓరుగల్లు 
[ప్రాంతమువారని యేర్పడునుగాన భాగవతము నందు( జెప్ప(బడిన యేకశిలా 
నగర మోరుగలేయని నిశ్చయమగుచున్నది, 


(అం(ధోవ తిక నంఖత్తారాది సంబిక్‌, 13919) 
ఖ్‌ 


(భ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించెదకా లోకర , 
మకారంభకు థ్‌ కపాలన కళానంరంభరున్‌ దానవో 


. (కేక స్త స్తంభకు( గేశిలోలవిలసద్భృగ్దాల. సంభూత నా. 


నాక ంజాతభవాండ కుంభకు మహానందాంగనాడింథకున్‌, 


" జోణితఅంబు నెన్నుదురు నొక (మొక్కి నురింతు సైకత 
(శోణికి( జంచరీకచయసుందర వేణికి రక్షీతామర 


(జిక దోయజాతభవ చి త్తవశీకర తైక వాణీకిన్‌ 
వాణికి నమ్‌దామ శుక వారిజ ప సక రమ్యపాణికిన్‌. 


పోతన వంశవు కాలము కృతులు 


శ్రీ మల్లంపల్లి సోమ శేఖరశర్మ 


వి 


పోతన జన్మస్థానము, చరిత, సమకాలికులు అన్నది నేటి ఉపన్యాస 
విషయము. చరిత రసహీనమైన పేలపిండి వంటిది. ఇతరాంధ కవుల విషయ 
మున వలెనే పోతనగారి విషయమునను మనకు తెలిసినది స్వల్పము. తెలిసినదెల్ల 
పోతనగారు | శీమదార్యధ మహాభాగవతములో తన వంశమును గురించి, తన 
' తాత, ముత్తాతలను గురించి ఖభక్తిగారవ పురస్సరముగ సంస్మరించుకొన్న 
విషయమే. ఏది తెలిసినను, ఏది తెలియకపోయినను పోతనగారు జన్మించిన 
తోడనే తెలుగుదేశంలో భక్రికల్పలతిక మొగ్గతొడిగి పూవులు పూచినదను 
విషయము మాతము బాగుగా తెలియును. ఆయన రచించిన మహాభాగవతము 
తెలుగులోని కవతరించుటతో తెలుగువారి హృదయసీమల భ క్రిరసధునులు పొంగు 
లెత్తినవను విషయము తెలియును. శ్రీరామచం[ద కరుణాకటాక్షమును పొంది 
భాగవతము నాధారముగాగొని తెఆగువారి మనఃశేదారములలో ఖకి వీజములు . 
వెదవెట్టిన హాలికుడు పోతన్నగారు. 


మధుర భక్తి పధానములై న శతకములు తెలుగులోనికి వచ్చినది పోతన 
గాది ఆంధ మహాభాగ వతావతగణమునకు తరువాతనే. కటకము గజపతి 
వంశజుల పరిపాలన కాలమున బంగాళ దేశమునుండి చైతన్యస్వామి తెలుగు 
దేశమునకు వచ్చుటతో తెలుగు శతక కవిళలో సీ మధుథ భావమునకు 
(పాచుర్యము హెచ్చినది.. 


పోతనామాత్యుడు మహాభాగవత రచనమునకు పూనుకొను నాటికి తెలంగా 
ణములో వైష్టవవ మతము ముమ్మరముగ వ్యాపించినది. ఇట్టనుటచేత తెలంగాణ 
ములో వైష్ణవ మడివరకు లేనేలేదని నా యభిప్రాయము కాదు. వైష్టవము 
వాతాపి "బాషక్కుల కాలము నుండియు నున్నది. ఇందుకు వాతాపి, రాలే 
చాళుక్యుల శాసనములును, వారి కాలమున మలతబడీన విష్ట్వ్యవతార _పకిమలు 


20 భాగవత వైజయంతిక 
న, కేశవాలయములు తెలంగాణమున ఎక్కువగా నుండెను. 
అఆమినను కాకతీయుల ఆలే ఇ వమెట్లు రాజమ తమై జనాదర పాాతమయ్యెనో 
యడే విధముగా వైష్ణవము రాజనుతమై గొప్పవ్యా పిని పొందినది. వైష్ణవము 
విజయన గరా దీళ రుల కాలనులో వలె తెలంగాణమున అమితవ్యా పినందినది 
రాచకొండ, దేవరకొండ రాజ్యాధిపతులైన రేచెర్ల వంశజుల కాలములోనే 
వి శ్రీపొదులకు సమకాలికులైన + వేదాంత దేశికులవారి కునూరుడు 
శీనె గారారూలవారు సింగయ మాధవేంథదుని యాస్థానమ.నకు వచ్చి పిమత 
లి యా రాజేందునికీ వైష్టవమత మిచ్చినట్లు వైష్షవ [గంథములు 
నుడువుచున్న వి, రాజు వై వవమతావేలంది యెనప్పుడు సామంతనృపులును 
తద్దర్యము నవలంబించిరి. పోతనగారి భాగవత రచనకీ వైష్ణవ మతవ్యాప్తి 


లార్కాణములు, జై 


+ 
a 
గ్‌ స్ట 


పోతన్న గారి జన్య స్థలము విషయమునను, కాలము విషయమునను, సమ 
కాలికు- విషయమునను అన్నియు సమస్యలే యైనవి. ఆయన వంశగ్నోతాదిక 
ము_ను గూ తాను రచించిన ఆంధ మహా భాగవతములో పోతన్నగారే 
వుకొగ్నందువలన వివాదము లేకుండపోయినది. సోతనగారు కౌండిన్య 
గో తుడు, ఆస స్తవబ వ. కేసయ అక; గ్రాసానుల కుమారుడు. తిప్పన 
అనుజుడు. ఎల్లైన, సోమన టి! "పితామహ (పపితామహులు. 
అన్నయ, నమక లాయన ముతాత తండి తొౌతలు, శకేసనమం్మతియు, లక్క. 
సానియు శివారాధన తత్పరులు, సానియను పదమిప్పుడు నీచార్థటో ధళమైనది. 
పూర్వమది గొరవవాచక మే. పోతనగారు తన తం డిని గురించి WE శై వకాస్త్ర 
మతము గనియో ననియు, తన తల్లిని, గూర్చి నదా కివపాదయుగార్చనాను 
కింవానయవాగ్య వాని" యనియు, తన య, (గజుని గూర్చి రం. గువాకాము” 
డనియు చెప్పియండుటచే. పోతన తలిదం[డఃలు ఈశ్వర సేవాసంస కృచిత్తు 
అనుటకు సందయము లేడు. తండివలెను, న. పోతనగారును. శివ . 
ధ్యానతత్సరులే.. ఆట్లని కేళవుని మీధ భు క్తి లేసివారు క కాదు. | 


శ్రీమదాంధ్ర re వతావతరణమును. గురించి సోతనగాతే తమ 


గంథమున తెలిపి: వు ఆయన శ్రీమన్నారాయణ కథా [పపంచవనిరచనా 
కుతూసాలుడై ఒకనాటి సి సోమోపంాగ కాలమున గంగకు జని | [(కుంకులిడి తన్నదీ 


పోతన వంశము కాలము కృతులు 21 


పులినతలంబున మ హేశ్వరధ్యానాయ త్ర చిత్తుడై వ. లోచనుడై. 
యున్న సమయమున గ్రీరామచం[దమూ ర్రి రి కన్గవకు గానబడి పేరు చెప్పి తన 
పెర. భాగవతంబు తెళుగునేయుమని యానతిచ్చి యంత క్రితుడయ్యెనట. ఆటు : 
తరువాత “శమవాభాగవత ప పురాణ, పారిజాత పాదప పసమా|శయంబునను, హరి 
కరుణా విశెషంబునను కృతార్థత్వంబు సిద్ధించె' నని తలచి మరల కొన్ని దిన 
ముఐకు ఏకశిలా నగరమునకు జనుదెంచి అ “గురుకృద్ధ బుధ బింధుజనాను 
క్టాతుడై "ఖత కవీం్యదుడు భాగవత రచనమునకు పూనుకొనెను. “బమ్మెర 
యని ఇంటి పేరుండుట వలన పోతన పూర్వుల నివాస స్థలము బమ్మెర గామమై 
యుండకలెను. బమ్మెర యనునది ఓరుగల్లు చెంత నున్న “దనియు, ఆ [గామము 
నందు కౌండిన్యసగోతులగు నియోగుల కుటుంబ మొక్క టి కలదనియు, ఆ 
కుటుంబమువారు పోతనామాత్యుడు తమ వంశమువాడని చెప్పుకొను చున్నా 
రసియు, ఈ బమ్మెరలో పోతరాజు గద్దెయని నాలుగురాక్టు పాతిన స్థలమొకలే 
కలదనియు శతావధానులు శ్రీ శేషా ది po కవులు. [వాసియన్నారు. కాని 
ఏకశిలా నగర మోరుగల్చనియు, గంగ గోదావరి యనియు నిరూపితమైన గాని 
బమ్మెర యదియే యని “స్టిరపడదు. ఏకశిలానగర మేది, గంగ యేది ఆను 
విషయమున కొంతకాలమునకు పూర్వము కొమ్ములు తిరిగిన పండితులలో 
(పచండ వాదోపవాదములు చెలరేగినవి. ఏకశిలానగర మన్నది కడప జిల్లా 
లోని ఒంటిమిట్ట యని కొందరును, తెలంగాణములోని ఓరుగల్లని మరి కొంద 
రును, గంగ గోడావరియే యని కొందరును, కాదని వేరొక కొందరును ఆవేశ 
ములు పెంచుకొని వాదులాడిరి. పోతన రాయలసీమ వాడని కొందరు పోరాడగా 
తెలంగాణమువాడే యని మరి కొందరు వాదించిరి. పచండ రుంరూమారుతము 
వలె రేగిన ఆ వాదము చాల కాలము వరకు నుపళమింపలేదు. ఆ వాద పతి 
వాదను లిట నుటంకించుట [గంథ వి స్తరము, ననవసరమును గూడ, “విజ్ఞాన 
చం|దికా [గంథమండలి”” ని స్థాపించి 'ఆంధదేశ సాంస్కృతిక , వెజ్ఞానికోద్య 
మములకు | శీకారము చుట్టిన మహామేధావి, పరమ పూజ్యులు అయిన కొమక్షాజు 
లక్ష్మణరావు పంతులుగారు ఈ వాద పతీవాదముల నన్నిటిని సాకల్యముగ 
విమర్శించి తుదకు న్యాయాధిపతివలె తీర్పు చెప్పియున్నారు. ఈ విషయమును 
గురించి ఎవరేమి చెప్పినను వారి ననువదింప వలసినవారే, అంతటి న్యాయ 
సమ్మతమైన దా తీర్పు. అయినను ఏకశిలా నగరమును గురించియు, - గంగను 
గురించియు ఒకటి రెండు మాటలు చెపె ప్పెదను, 


22 కో భాగవత వై జయంలిక 


ఏకశిలా నగరమన్నది కాకతీయుల రాజధానియైన యోరుగంటికే రూఢి 
యైన చేరని కొరవి గోప పరాజకృతమైన గ సింహాసన హ్‌. ఈ [కిండి 
పద్యముల వలన స్పష్టమగుచున్నది- 


_ఆకడ నీతికాస్త్రవిదుండై గురు వీడ్కొని యేగె వేడ్కతోం 
గాకితమూలళ క్రి గనిగా నొనరించిన పైడిచట్టు నా 
నేకశిలాభిధానమున నెన్నిక కెక్కి ధరి తిలోన నే 
హోకలఅ( టోనియట్టి సిరి పుట్టిన యింటికి నోరుగంటికిన్‌ , 


చందనగంధులున్‌ విటులు జాణలు దానవినోదులుం [దభా 
సుందరమూర్తులుం గవులు శూరులు బెద్దలు నుల్లసిల్ల సం 
[కందన వై భవాఢ్యుండగు కాకతిభూపతి రాజ్యలక్ష్మి బెం 
పొందెడు నప్పురంబున మహోత్సవలీలల నుండె నేర్చనన్‌, 


ఈ పద్యముల వలన ఏకశిలానగరము కాకతి భూపతుల రాజధానియెన 
ఓరుగల్లే కాని కడప మండలములోని ఒంటిమిట్ట కాదని తేలుచున్నది. ఇక గంగ 
యన్నది గోదావరి నదియే యని నిరూపితమైన గాని కె పి నిర్ణయము సీరపడదు. 
ఈ యంశము కూడ కొరవి గోపరాజ కృత సింహాసన ద్యా|తింశికలోని ఈ 
(కింది పద్యము వలన నిరూఢమగుచున్నది-= 


ఆత(డు [త్యంబక ?ఖరో 
దూతను విఖ్యాత. బరమపూత. దిలోకి 
మాత మహాపాతకసం . 
ఘాత విఘాతానుయాత. గనియెన్‌ గంగన్‌. 


ఈ పద్యమున గంగ 'త్యంబకోఖరోద్నూత యనుట వలన అది నాసికా 
[త్యంబకమున నుదయించిన గోదావరీ నడి యనుటకు సంశయింప బనిలేదు, 
పోతనగారి జన్మస్థలమైనను కాకపోయినను వారి పూర్వులది బమ్మెర. ఇది తెలం 
గాణములోనిది. తరువాత కొంత కాలమాయన ఓరుగంటిలో నుండెను. అక్కడ 
నుండగనే ఆయన మహాభాగవత రచనమునకు పూనుకొని పూ రిచేసెను 


పోతన వంశము కాలము కృతులు 28 


ఆంధ మహాభాగవతము గాక వీరభ్యద విజయ, భోగినీ దండకములును 
పోతనామాత్య |పణీతములను (పసిద్ధి కలదు. వీనిలో నాలుగాశ్వాసములతో 
గూడిన వీరభ|ద విజయము నందలి కృతిక రృ వంశాభివర్గ నము ననుసరించియు, 
నాళ్వాసాంత గద్యము ననుసరించియు నది హోతనామాత్య కృతమని యున్నను, 
దానినతడు రచింపలేదనువారు నున్నారు. వీరభ[ద విజయములోని కవిత్వము 
నకును, ఆంధ మహాభాగవత ములోని కవిత్యమునకును వ్యత్యాస మున్నదన్న 
మాట నిజమే. వీరభద విజయ కవిత్వము భాగవత క విత్యమంత |పౌఢమె 
నదియు కాదు; తప్పులును చాల గలవు. అందువలన పోతన్నగారు రచించిన 
[గంథములలో ఇది మొదటి దనవచ్చును. కాని ఈ కృతి ఆయన రచియింపనే 
లేదనుటకు సాహసింపలేను, జ్యాగ త్తగా పరిశీలించినచో భాగవత ములోని పద్యము 
లకును వీరభ(ద విజయములోని పద్యములకును ఫోలికలు కలవు. ఏ పోలిక 
లున్నను ఈ (కిండి= 


భాగవత (పబంధ మతిభాసురతన్‌ రచియించి దక్షదు 
ర్యాగ కథా [పసంగమున నల్పవచస్కు(డనైతి; తన్నిమి 
+ త్తాగతవక్త్ర్రదోవ పరిహారముకై యజనైకశై వశా 
- స్తాిగమవీరభ| దవిజయంబు రచించెద వేడ్క నా మదిన్‌. 


అను పద్యము పోతన కృతము కాదనియు, [పక్షి ప్త్రమనియ నా విశ్వా 
సము. ఇదియే కాదు ఆంధ మహాభాగవత ములోని= 


ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌, 
సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము, వాసి కాలుచే 
సమ్మెట [వేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె సీ 
బమ్మెర పోతరాజొక(డు భాగవతంబు జగద్ధితంబుగన్‌ . 


అను పద్యమును పక్షి ప్రమనియే నా నమ్మకము. పోతనామాత్యుడు 
మహాభక్పుడు, పరిణత హృదయుడు. ఆయన మన స్తత్వమే వేరు. భాగవత 
రచనా కాలమున ఆ పద్యము నాయన [వాసెననుట ఆయన కపణారము 
కావించుటయే. ఆయన యటువంటి పద్యము [వాసియుండుడు; (వాయలేడు. 
ఆయన నిగర్వ చూడామణి. ఆయనది నిండై న మనస్సు. మనస్ఫెంత నిండై నో 


ర్య భాగవత వై జయంతిక 
ఆయన వాక్కును అంత నిండై నడే. భాగవతమే ఇందుకు |సమాణము* కృతి 
కర్త తెలియ, రచనయు నతడెట్టివాడో తెలుపు దర్పణములు, వానిలో న్‌. 
మూ రిని, ఆతని హృదయమును కనుగొనగలము. భాగవతమును రచింపుమని 
పోతనగారి కన్నుల యెదుట సాక్షాత్కరించిన శ్రీరామచం[దమూ ర్తి ఆదేశించిన 
వెంటనే ఆయన భక్యావేళ పరవశుడై నాడు- 


పలికెడిది భాగవతమట; 

పలికించు విభుండు రామభ్య దుండట; నేం 
బలికిన భవహరమగునట; 

పలికద వేరొండుగాథ పలుకగనేలా! 


ఏడీ ఈ విధముగా భ క్తిఖభావ తన్మయుడై పలికిన మరొక యాం[ధకవి ? 
నన్నయ తిక్కనాది కవులు పురాణములు తెనుగుజేయుచు నంతకు మున్ను 
భాగవతమును శౌనుగుజేయకపోవుట తన “పురాకృతకుఖాధిక్య'” మని మురిసి 
పోవచున్నాడు పోతనామాత్యుడు. పునర్జన్మము లేకుండ జన్మ సఫలము చేసి. 
కొందునని ఆంధ మహాభాగవత రచనమే ఓక తపస్సుగా ఖావించిన పరమ 
పుణ్యకాలి ఆయన. ఆయన గంట మెప్పటికిని పూర్వోదాహృతమలై న “భాగవత 
[పబఐంధ మతిభాసుకతన్‌ +, “ఇమ్మను జేశ్యరాధములకిచ్చి”” ఆను పద్యములను 
[వ్రాయలకు. ఆట్టి పద్యములను రచించుట పోతనగారి కశక్యమని కాదు; 
ఆయన మనస్తత్వ మట్టిది కాదనియే నా భావము. ' య. 


భోగినీదండక కర్తృత్వ విషయమునందు కూడ. వివాదము కలదు. 
ఏతద్గెంథాంతమున గల- Men వ. 


“పండిత కీ ర్రనీయ(డగు బమ్మెరపోతన యా సుధాంక మా 
రాండకులాచలాంబు నిధి తారక మై విలసిల్లు భోగినీ 

దండకమున్‌ రోచియించె బహుదాన విహ రకు రావుసింగ భూ 
మండలభ ర్తకున్‌ విమత. మానవనాథ మదాపహరకున్‌.” 


అను పద్యము వలన ఈ భోగినీదండక కృతికర్త పోతనామాత్యుడనియే 
స్పష్టపడుచున్నను ఈ కృతి నాయన రచింపలేదని, ఆ పద్య మాయనది . కాదని 


పోతన వంశము కాలము కృతులు. ల 25 


వాదించువారు కలరు. చాలమంది కవుల విషయమున వారి జన్మస్థానమును 
గురించి, వారి కాలమును గురించి, తుదకు వారు రచించిన కృతులను గురించి 
కూడ నిట్టి సందేహము లుండుట ఆం|ధుల దౌర్భాగ్యము. [గంథము స్వయం 
భువు; సం కాని కవియే లేడను స్థితికింకను మనము రాకపోవుట మన 
యదృష్టము. భోగినీదండకము పోతన కృతమనియే నా విశ్వసము. దానిని 
ఫోతన రచియించె నన్నఠత మాతమున ఆయన క్యూతికి కళంకము రాదు. 

ఆయనకు వాసి తగ్గదు. పోతనగారు భక్షాగేసరు లన్నంత మాత్రమున బాల్యము 
నుండియు నే యుండెనని భావింప నక్కురలేదు. ఆయనయు మానవుడే, 

ఆయన కూడ మొదట లావు సింగభూపాలుని కొ శయుడఊగా నుండియుండ 
వచ్చును. ఆయనను సంతోవపరచుటకు భోగినీదండకమును (వాసియు నుండ 
వచ్చును. శమక మముగ లోకానుభవము ముదిరి మనస్సు పరిపక్వ 
మైన కొలది అభిరుచులు మారవచ్చును. ఆశయాదర్శములు మారవచ్చును. 

ఆనుమ్మికచింత బలపడవచ్చును: వయసు పెరిగిన కొలది పోతనగారిలో అదియే 
జరిగినదని నా నమ్మకము. భాగవత నం కడపటి న. దీనికి పూర్వ 
పుది ఆయన భోగిసీదండకము. ' 


ఇక పోతనామాత్యుని కాలము. దీనిని నిర్ణయించుటకు నికరమైనవి లేక 
పోయినను మూడాధారము లున్నవి. కొండవీటి పెదకోమటి వేమారెడ్డి 
యాస్థానమునందు విదాధికారిగా నుండిన శ్రీనాథ క విసార్వభౌ ముడు పోతన్న 
గారికి సమకాలికుడును, బావమరదియు నని చెప్పుగాథ లుండుటవలన భ్రీనాథుని 
కాలము ననుసరించి పోతనగారి కాలమును నిర్ణయించుట యొక పద్ధతి. రావు 
సింగభూపాలుని కొలమును బట్టి పోతనగారి తస నిశ్చయించుట మరొక 
పద్ధతి, బమ్మెర పోతనగారి (పహొ(తులై న కేనకవి మల్పకవులు రచియించిన 
seas పరిణయము ననుసరించి కాలనిర్ణయము చేయుట వేరొక పద్ధతి. 


వీనిలో మొదటిది అనగా శ్రీనాథు ననుసరించి పోతన కాలమును నిర్ణ 
యింపబూనుకొనుట [పమాదభూయిష్టమైనది. ఏలన, పరంపరగ వచ్చు న 
(ప్రమాణముగా విశ్వసింపలే ము. నన్నయ భట్టారక, తిక్కన. సోమయాజులకు 
మధ్య రెండువందల సంవత్సరముల యెడమున్నను వారుభయులు నేక కాలము 
వారని చెప్పు గాథలు కూడ నున్నవి. ఆందువలన శ్రీతాతుతు పోతనకు సమకా 


26 భాగవత వై జయంతిక 


లీకుడగునో కాదో, వారభయులకును బంధుత్యమున్న దో లేదో నిర్గీతమైనగాని 
థ్రీనాథు ననుసరించి పోతన కాల నిర్ణయము చేయ గుదురదు. 


ఇక దాక్షాయణీ పరిణయకృతి ననుసరించి పోతన కాలనిర్ణయము చేయ 
. విషయమును సరించి యాలోచింతము. పోతనామాత్యుని (పపొశులై న కేసకవి 
మల్జకవులు తమ దాశాయణీ పరిణయ కృతిని గురిజాల చినమల్లన సోమయాజి 
కంకిత మిచ్చిరి, ఈ చినమల్తన సోమయాజి (వపాతుడైన పార్యతీశ్వరుని 
కుమారుడు పేరమం (తికి పోడూరి 'పెదరామామాత్యుడు ధాత సంవత్సర ఆశ్వ 
యుజ' బహుళ దశమీ సోమవారము నాడు దాజాయణీ పరిణయమునకు (పతి 
(వాసి యిచ్చెను. దీనికి సరియైన ఇంగ్లీషు తేదీ 1766 అక్టోబరు 18 వ తేదీ 
సోమవారమైనది. దీని ననుసరించి తరమునకు 265 లేక 80 సంవత్సరముల 
చొప్పున పేరమం్యతి నుండి చినమల్దన సోమయాజి వరకు లెక్కించినచో ఆతనికి 
దాక్షాయణీ పరిణయమును కృతి యిచ్చిన కేసకవి మల్లక వుల కాలము తెలియ 
గలదు. వీరి కాలము తెలిసిన పిదప తరమున కాపద్ధతినే లెక్కక ట్టి వారీ (పపి 
తామహుడై న పోతనగారి కాలమును నిర్ణయింపవ అసి యుండును, ఈ పద్దతిని 
చూచినచో పోతనగారు కీ. ర పదునై దవ శతాబ్ది యు త్తరార్థములోని వాడగును. 
ఇక రావుసింగభూపాలుని అనుసరించి కాలనిర్భయము చేయబూనినను ఇంచు 
మించుగ పోతన ఆ కాలమునకే వచ్చును. 


రావు సింగభూపాలుడు రేచెర్ల వంశజుడు. ఈతడు రాజాచల దుర్గాధిపతి. 
భోగినీదండకమున ఈతడు కుమారాన్న పోతవనీనాథ సూనుడనియు, రావు 
సింగక్షమానాథపొ తు డనియు, పోచమాంబాలసద్గర్భసంజాతు డనియు, వసం 
తావనీనాధ సోదరు డనియు చెప్పబడినాడు. ఇన్ని యానవాళ్ళీయబడుట వలన 
ఇతనిని గు _రించుట సులభమే. రాచకొండ రాజ్యమును పరిపాలించిన రెచెర్చ 
వంళజులలో ముగ్గుకు రావుసింగ నామధేయులు కలరు. ఆనవోత హననం 
తం|డి మొదటి సింగమ నాయకుడు తనవోతానాయని కుమారుడు కుమార సింగ 
భూపాలుడు. ఇతడే “రసార్హవసుధాకర” మను ఆలంకార (గంథమఃను రచిం 
చెను. ఈతడు |క్రీసు శకము పదునాలుగవ శతాబ్ది ఉ త్రరార్థమలో నుండిన 
వాడు. కుమార సింగభూపతి పౌతుడును, కుమారాన్నవోత హన పుతు 
డును అగు రావు Mrs మూడవ వాడు. ఈతని యనుజుడుు ననంథా 


పోతన వంశము కాలము కృతులు 27 


వనీనాథుడు. ఈ రావుసింగభూపాతుని ముమ్మడి సింగభూపాలు డనియు వ్యవ 
వారింతురు. ఈతడు |క్రీస్తు శకము 1480 మొదలు 1475 వరకు పాలించునట్లు 
ఆతని శాసనములు మొదలైన వాని వన చెప్పవచ్చును. ఈతనికి సర్వజ్ఞ 
బీరుదము కలదు. ఈ సింగభూపాలుని కోరికపైనే పోతనామాత్యుడు భోగినీ 
దండకమును రచించెను. ఈ విధమున జూచినను పోతనామాత్యకవి పదునైదవ 
శతాబ్ది యుత్తరార్థమున నుండినట్టు స్పష్టమగుచున్నది. 


ఎటుల మెప్పించెదో నన్ను నింక మీద 

రావు సింగ మహీపాలు ధీవికాలు 

నిండు కొలువున నెలకొని యుండి సేవ్ఫ 

సకల సద్గుణ నికురంబ ! శారదాంబ ! 
అని శ్రీనాథ కవిసార్వభౌముడు శారదను |పార్థించినది ఈ సర్వజ్ఞ సింగభూ 
పాలుని ఆస్థాన మునకు వెళ్ళినప్పుడే. అందువలన (శీనాథుడు కూడా పోతనా 
మాత్య కవీం|దునికి సమకాలికుడే. అయితే కొంచె మతనికంటె 'పెద్దవాడే మో 
కాని ఆతడు పోతన్న గారి బావమరది యని చెప్పుట కాధారము లేవియు లేవు. 
రాకపోకల కానుకూల్యములు విశేషముగా నేర్పడిన ఈనాడే మధ్యాంధదేశీయులు 
తెలంగాణా వారితో వియ్యమందుట ఆరుదుగా కనబడుచున్నప్పుడు ఆ కాలములో 
మధ్యాంధదేశీయుడై న శ్రీనాథుడు వై వాహిక సంబంధము వలన పోతరాజునకు 
బావమరిది యయ్యెనన్న విషయము విశ్వాసపాతమైనదిగా తోచుటలేదు. వారు 
యాలును బావమరదులని చెప్పు గాథలన్నియు వట్టి పుక్కిటి పురాణనులే యని 
నా నమ్మకము. 


Cl 


పోతనామాత్యుడు మహాభాగవతము పం|డెండు స్కంధములను పూర్తిగా 
రచించెననియు, నందు కొన్ని భాగ ములుత్సన్నము లగుటచేత వెలిగందల 
నారయాదులు వానిని పూరించిరనియు చెప్పుదురు. (పకృతము మన కుప౭బ్ది 
మగు నాం[ధ మహాభారతములో ఏకాదళ ద్యాదశథ స్కంధములు వెలిగందల 
నారయ కృతములు. షష్టస్కంధము ఏర్చ్బూరి సింగన విరచితము. ఇక పంచమ 
స్కంధము నందలి (పథ మాశ్యాస, ద్వితీయా క్యాసములు గంగన కృతులు 
ఈ విధముగా ఆం|ధ మహాభాగవత ముత్సన్నమగుటకు చెప్పబడు ఒక గాథ 
మన దేశమున చిరకాలానుగతముగ వచ్చుచున్నది. రాచకొండ రాజ్యాధిపతియెన 


లం భాగవత వె జయంతిక 
రావు సర్వజ్ఞ సింగభూపాలుడు భాగవతమును దన కంకిత మీయవలసినదని 
పోతనామాత్యు నభ్యర్థింపగా నాతడందులకు నీరాకరించెననియు, అందు మీదట 
నా రాజేర్యదుడు కుపితుడై బలాత్కారమున నా [గంథమును గైకొని దానిని 
భూమిలో పాతి పెట్టించెననియు, కౌంతకాలమైన వెనుక దానిని బయటికి 
తీయగా అప్పటికే యా [గ్రంథము నందలి తాళప[త్రములు కొన్ని చిపికి శిథిలమై 
పోయిన వనియ, ఈ కారణముననే భాగవతము నందలి కొన్ని భాగములుత్సన్న 
మగుట సంభవించెననియు చెప్పుదురు. కాన్‌ యిది విశ్వసింపదగిన విషయముగా 
గన్పట్టదు. ఒక వేళ రావుసింగభూపాలు డా[గంథమును నశింపజేయ సంకల్పించు 
కొన్నచో దానిని నులువుగా తగులబెట్టి యుండవచ్చును. అట్టు చేయక దానినేల 
పాతి పెట్టించెనో తెలియదు. మొత్తము మీద ఇది తలతోకలు లేని గాథ. 

భాగవతమును రచించుచుండగనే పోతనామాత్యుడు లోకాంతరగతు డై 
యుండునని నాయూహ. వీకాదళ, ద్వ్యాదశథస్క,ంధముల నాయన రచియింపనే 
లేదనియు, ఆందువలననే భాగవత సంపూర్ణార్భము పోతనామాత్య [పియశిష్యుడై న 
వెలిగండల నాశయ తన గురువుగారి మీదగల భ క్రి గౌరవముల వలన వానిని 
రచించియుండునని యు ననుకొనుచున్నాను. మిగిలిన యాంధ మహా భాగవత 
మును పోతనామాత్యుడే రచించి యుండవలెను. దీనిలో పంచమ, షష్టస్కంధము 
లుత్సన్నము లగుటకు [పాయికముగా ఆనాటి రాజకీయ పరిస్థితులే కారణమై 
యుడవచ్చునని నేనూహించుచున్నాను. 

ముమ్మడి సింగమ నాయకుని కాలమున కించుక పూర్వము నుండియే 
బీకరు రాజధానిగ పరిపాలించుచుండిన బహ్మనీ సులానులకును, రాచకొండ 
దుర్గాధిపతులకును వైరానలము (పజ్వరిల్రినది. అహ్మదుషా రాజ్యకాలము చివర 
తెలంగాణము పై మహమ్మజీయులు దండె త్తి రాచకొండ రాజ్యాధిపతుల కోటలను 
గొన్నిటిని బట్టుకొనిర. అవ్ముదుషా ఆనంతరము బహ్మనీ సులానులకును, రాచ 
కొండ రాజాధిపతులకును జరిగిన యుద్ధము అనేకములు. వానితో తెలంగాణము 
నిప్పులపుంత యెనది. రాచకొండ దుర్గాధిపతులు కటకము గజపతుల సాయముతో 
మరల ఓరుగల్లు, భువనగిరి మొదలైన దుర్గమలను _ గెలుచుకొనిరి. 
కాశ్వతముగ ఈ దుర్గములు రేచెర్ల (పభువుల అథికోరము [కింద నుండలేదు. 
తుదకు క్రీ.శ, 1474-75 నాటికి తెలంగాణమున రాచకొండ, దేవరకొండ 


(ప్రభువుల రాజ్యమంతరించినది. అది పూ కిగా రెండవ నువమ్మ దుషా రాజ్య 


పోతన వంశము కాలము కృతులు 29 


కాలమున ఆతని యధికారము [కిందికి వచ్చినది. ఈ బహ్మనీ, రేచెర్ద వంక 
ముల యుద్ధమున తెఎంగాణమున శాంలిభ దత అంతరించినవి. [గామదహనము 
errs te భాగనతమున కొని న్ని భాగము లుశ్చన్న మగుట కప్పటి రాజకీయ 
సంషోభమే కారణము కావచ్చును. ఇది యూహ మ్మాతమే, పోతనామాత్య. 
విరచితమైన భాగమే భాగవతమున అధికముగ . నిలిచియుండుట ఆం(ధుల 
యదృష్టమని చెప్పవచ్చును, 


పోతనామాత్యుని క వితము అతిమృదుమధుర పదసంఘటిత మై, శ బ్రార్థా 
అలంకార పరిళశొభితమె, పనులకు విందొనర్చుచు అమందానందము కలిగించు 
చుండును. పోతన గారే చెప్పుకొన్నారు. 


కొందబకు( దెనుయ గుణమగు(, 

గొందటకు సంస్కృతంబు గుజణమగు, రండుం 

గొందజకు గుణములగు, నే 

నందజ మెప్పింతు6 గృతుల న నయ్యైయెడలన్‌. 
అని అయన యెంత ధైర్యముతో, !,త్మవిశ్వాసముతో చెప్పిన మాటలో ఇవి. 
ఆందువలసనే రసానుగుణముగ తెనుూ.ను, సంస్కృతమును సరిసమానముగ. 
సార్థక ముగ పొడగలిగిన | పతిభాకాలి ఉయన. 

తెలుగుదేశములో ఆం ధమహిభారతమును జదువని వారుండిన నుండ 
వచ్చును. కాని ఆంధ మహాభాగవతమును జదువసీవారు చదువనేర్చిన వారిలో 
అరుదు. భాగవతమునందలి గజేం ౧ మోక్షము, రుక్మి ణీ కల్యాణము, కుచేలో 
పాఖ్యానము మొదలై న కథలను నేటికిని కంఠస్థము కావించుకొని |ప్రతిడినము 
చదువువారున్నారు. పల్లెటూళ్ళలో సౌ మాన్యమైన దా భాగవతము. పోతనగారే 
దానిని కబ్బతరువుతో పోల్చినారు. ఈ క్రింది పద్యమును చి త్తగింపుడు- 

బలిత స్కంధము కష్టమూ లన ' శుకాలాపాఖిరామంబు మం 

జులతా కోభితమున్‌ సువర్ణసు ఏనస్సుకజ్లైయము న్‌ సుందరో 

జర్రలవృ త్ర తంబు మహాఫల లబు ఎమలవ్యాసాలవాలంబునైై 

వెబయున్‌ భాగ పడాఖ్యా కల్పతమ వుర్విన్‌ సద్ద్యిజ| శేయమై. 


(ఆంధ మహోఖాగ వన్యానములు, 19857) 


ఆంధ భాగవత వైశిష్ట్యము 


ఆచార్య నిడుదవోలు వేంకటరావు 


జ 
ఖో 
రిం 
ఆకే 
ల్‌ 
0 
[ఈ 
గల్‌ 
[Es 
cA 
i 
చ 
aA 
Gr 
& 
ర్చ 
(ay 
ఠా 
ర 
క 
ల్‌ 


అషాడళ క 0 నొకటియె, శ భగవద్భ క్రి ea se 
సిద్ధాతమున కాలంబమై, |ప్రామాణికమైనది [శీ మహో 
కాతమున [శ వేదవ్యాస మహార్షి (పణీతమై ఆ మవార్షి 
తనయడగు శుకమహర్షిచే పఠితమైన యా భాగవతమును తెనుగు భాషలో 
రచించిన మహాకవి బమ్మెర పోతన. పోతన రచిత భాగవత మాం వాజ్మయ 
[పపంచమున నవతరించి నేటి రైదు శ తాబ్దులు-ఆనగా నైదు వందల సంవత్స 
వ. నదె. నాటినుండి నేటివరకు [పసిద్ధిగన్న (గ్రంథములలో -నాం[ధ (ప్రజా 
నీక్రమున ల గోపొలమును ఆత్యధిక ముగ నాకర్షించినది పోతన భాగవతమే. 
పండితులు. క బాలురు _ వృద్ధులు. గ్రీలు= షర వారు వీరు అననేల 
సమరాంద వ మవోజన వృదయములను జూరగొనినది ఖాగవతమే. పభ్రిలలో 
మ్‌ పట్టణము ములలో నేమి భాగనవతమునందలి పద్యములు (ప్రజలకు కంఠ స్థములు. 
పడ్య్జములే కాదు, _పహ్లాద చరిత, గజేం్యద మోక్షము, రుక్మిణీ కల్యాణము 
మొదలగు ఘట్టములన్నియ కం ఠస్థములే, ఈ యిరువదియవ క తాద్దిని గూడ 
తెల్టవారు జామున గజేంద్ర. మ పద్యములను నిత్యము “పకించువా 
గన్నా రు. భాగవతమున ఫ్‌వ్మ న స్తవము, ఆ(కూర దండకము, గోపికా గీతలు, 
[భమర గీతలు నేటికిని పారాయణము చేయబడుచున్న వి. 
ఈనాడేకాదు, కై9 స్తవ శకము పదునారవ శతాద్దిని sas 
జ్యాధకులైన న కర్ణాట రాజు తెలుగు భాగవత ఘట్టములిను పకించువారని 
నడకను వెలుప్ప 'రాయవాచకము' ఆను " (గంథమునుండి తెలియు 


సా మాజా 


[స్తీ 
A ఓల 
శే ( 


ఆంధ భాగవత వె శిష్ట్యము | లి! 


విద్యా నగరమందు వీరనృసింవా రాయలవారు [బ్రాహ్మీ ముహూరాన 
లేచి ఆరా ధ్యుల నామావళులున్నూ , అధ్యాత్మ సంకీ ర్తనలున్నూ, పాండవ 
గీతలు, [భమరగీతలు, గజేంద్రమోక్షం, భారత సావి కి, గంగావతరణమున్నూ 


భారతం, భాగవతం, ముచికుంద స్తుతి, ఆ(కూర స్తుతియున్నూ ... పఠించి 
విస్త! 


చున యుదాహరించిన వన్నియును సంస్కృతములు కావు. ఆరాధ్యుల 
నామావళు లనగా సహవాస గణమాలిక.. ఇది కన్నడమున తెనుగునగాని 
సంస్కృతమున లేదు. అధ్యాత్మ సంకీర్తన, లనగా తాళ్ళపాక అన్నమయ్యగారి 
సంకీ రనలు. ఇవి తెలుగుననే యున్నవి. కాబట్టి |భమర “గీతలు, గజేం్యద _ 
మోక్షము మొదల,ఎనవి పోతన భాగవతము నుండియే యని మనకు స్పష్టమగు 
చున్నది. 


ఇట్టు సార్వజనీనత్వము, సార్వకాలికత్వము, సార్వదేశకత్వము 
సంపూర్ణణముగ మూర్తీభవించిన తెలగు కృతి పోతన భాగవతము. 


తెబుగు భాషలో భాగవతమునంంత యధికవ్యా ప్రి కలుగుటకు పోతన 
య్య్మపతిమాన భక్తి విశేషమును, అనితర సాధ్య కవితా, మహ తమును 
కారణమ.లు. భక్తిలో బుట్టి భక్తిలో బెరిగి భ క్రిరససిద్దుడెన మహనీయుడు 
కావుననే పోతన ఖక్తి వివశులగు భాగవత 'పాతలతో తాదాత్మ్యమును 
పొందినాడు. భక్త్యనుభూతిని హృదమముల యందు మ్నుదించినాడు. ఇట్టి 
భ_క్రిరసానుభవావిష్క్టరణ మునకు నవృతరస మాధభురీధురీణంబ గు నాం, ధభావ 
పోతనకు వశ్ణమైనది, చదువుటకు మొదలిడిన తోడనే శ్రవణ మనోహళములై 
సను విభ కృములై న యనుషప్రాన పదవి ర్యాసములును, కోమలశయ్యా సొభాగ్య 
మును, భ,క్తి మాధుర్య (పసారిత భా సంపదయు పతి పాఠకుని హృదయ 
మును పారనళ్య్ళు జెందించును. ఒక గంథమున కథా సూతమున నిమిడి 
యుండియు, (పతి పద్యమును నొక ౫ క్రమువలె |ఫత్మేక [పత్యేకముగ పఠ 
సీయముణగ న ండునట్లు రచింపనుల ల తిలోకోత్తర కవికాశ క్రి పోతనకున్నట్లు 
మరియే తలుగు కగికి లేదు. ఇట్టి పక్మేకత జేతనే పోతన భాగనత పద్యము 
లతో నొకటియైన (పతి యాం|ధుని శాలుకపై నాట్యమాడుచునే యుండును. 


భాగవత వై జయంతిక 


ఓ న లవడని జానవదుడు గూడ భాగవత పద్యము 
స వహజముప నప" షోచ్రారణతోనె న జదువుచు నానందించు నన్నచో 
” న ళు క్త ఇ... 

పోతన భాగవతమునకు నాంధ (పజాహృదయసీమ నెట్టి శాశ్వత స్థానమున్నదో 


గ్‌ 
లన్‌ 
గే 
ఫ్ర 
ర్ట 


భారవత రచనా పౌరంభ కాలము నుండియే పోతన భ క్రి మావోత్మ్య 
నుంచ పించినవి. వానిని [పజా సామాన్యములో కర్ణాకగిగా 
జెప-నౌశ ముకి. అవి కొంతకాలమునకు (గ్రంథస్థములై నవి. ఐపా కేబ్చా 
పఖతయును, పోతన సంసారము చేయుచు “సర్వం విష్టుమయం జగత్‌” 
డె పరమేశ్వర భక్తి భావనతో జీవితము 
డక దావసలో నున్నను, ధారుణీపతులను తృణీకరించి ధనాళా 

పాళ ము నామూకముగా విదారించినాడు. సిరమును, శవమును నగు భక్తి 


థి 
గ ఇ" wae య శో ఇ ఆరో శు లో జ్ఞ 
తేలిక చెత జవిచకాలములో భగవత్సాకాత్కారమును బొందిన పోతనను 
దనకు గా. _పజలావాధించిరి.. ఆతని భాగవతము భగవదతమెన మహో 
“ క మ్‌ యాడ్‌ కా 
నాద న్వు రావిచివి 


తెనుగు భాగవకము యొక్క మహిమ యడ్వితీయమైనది. పాషాణ 


LT wr Men టు. క “వాం 
హృడయమునై ౫ నందలి పద్యములు |దవి౭పజేంయను, పచ్చి కసాయివానినై న 
wow Wry Tum (| 
వకమ ఓకా ససరువిగా నొనరిచును బాలనైన మహా పండితునిగా. దిది 

| (on) 
శీరగలునను, ఇక ద / | టః 

శ ఇ కక ధకాగగణ్యునికది పారాయణమై నిలసిల్త్లుననుట లో 


న రా వతి పశస్తి నున యాఇ్యధము దాటి మహారాష్ట్ర దేశమున 


గో అ wa ము ; లీ ఆరు అదర ము . 4 
మన్నన సః శివాజ మవ రాజునకు గురువుల స్‌. సమర కామదాస సా మి 
వారు వ “దొనబోబే్‌ Ma అ 
Pw a wpa. లు త న భ్‌ క్రై [పప తిని | పకంపి చి 
యునా వ | న 
న 


అఖిల నంశీత 'పపంచమువకు వం 
నీ 


నర్నా స్వరూపుడై నాదబవ్మాయె 

కాజు పోతన భాగవతమును [పతిదినమును 

వారాయజను చేస్పెకివాడ్యు, 'వత న చెకు 
దగగేవాడు, ఆ భాగవత _పతి నెటికిన్స చెక్కుచెదఠకుండ తాళ 


ఆంధ భాగవత వై శిష్ట్యము ot లం 


పత్రరూపమున తిరవయ్యూరిలో త్యాగరాజస్వామి గృహమున .భ(ద్రపరుపబడి 
యున్నది. ఈ విషయ నా తెలుగు భాగవత న తేటి 
పరచును... 


తమిళ నవయుగ [పవక్త సుబహ్మణ్య భారతి “సెల కవియరళర్‌” 
(కొందరు కవిరాజులు) అను వ్యాసమున పోతన మహాకవిని [పశంసింబెను. 


హరికథా పితామహుడై. సంగీత సాహిత్య నిధియై చతుర్భాషా పండితుడై 
ఆటపాట మాటల మేటియెన ఆజ్జాడాదిభట్ట నారాయణ దాసునకు నై దవయేట 
భాగవతముతోతనే యక్షరాభ్యాసమైనది. భాగవత భ క్రి రసాస్వాదనచేత నాతని 
రచనలు హరికథా రూపమున నాంఢధ సాహితిని "రంజింపజేసినవి. ఆం|ధ 
భాగవతావతరణ కాలము నుండియు కవులు పోతనను స్మరించుచునే యున్నారు. 


ఆధ్యాత్మిక భక్తి భావనతో గాకున్నను అంథ భాషా సారస్వత చారి|తక 
పరిణాను దృష్టితో నైన నేడు. సాహితీ విమర్శకులు, చారి తకులు, కవులు, 
గాయకులు, సవహృదయులును పోతనకు భ క్యంజలులు సమర్వించుచునే యున్నాస.,.. 


మంత |దష్టలగు సుహర్షలవలె మహాకవులు దేశ కాలజాత్యాదులచే విభా 
జ్యాలు కారు. అమృతములు, నఖిలలోక కల్యాణాత్మక ములు, నగు వారి రచనలు 
నట్టివే. ఆం్మధథ పాజ్మయమున పోతన ఇట్టి మహాబిషి, మహాకవి, ఆతని 
భాగవత పురాణమును అట్టి యజరామర కృతి. 


[పణపమునందలి మూడు మ్మాత్రలవల నందుండి యావిర్శవించిన 
యాంధ వాజ్మయ జగత్తునకు రామాయణ భారత భాగవతములు మూడును 
మూల స్తంథభాయమానములు, మన పొచీన సంస్కృత సంపదాయము ననుస 
రించి తాహాయణము కావ్యము. భారత్‌ ము ఇతీహాసము, భాగవతము పురాణము. 
కాని తెలుగున సీ మూడిండికి "పురాణములు" అనియే వాడుక గలదు, 


"తల! ఘల ఖ్‌ ర్రిమయ జీపిత రంగమున పోతన యవతరించునాటికి 
భారయ ఛామాయబములు రెండును తెనుగులోనికి ననూడదితము లై నవి, భారతము 


ప్‌ 


క్క భాగవత వై వ జయంతిక 


శ ఎఅనల చేతను, రామాయణము భాస్క్మరాదుల చేతను 


మ లో న్‌ 
రచితముకె నవి. వీనిలో నాద్యమగు భారత మభిలాంధ్ర వాజ్మయ సౌధమునకు 
అ 
పునాడియు కవితా గొరవముచేత, [పామాణికత్వము చేత సకలాం|ధ కవులకు 
మ 
నుపజేవ్యమె విరాజిల్లినది. భారతము రచించిన కవులలో నన్నయ శబ్బశాననుడు, 


ఎజ్జున [ప్రబంధ పరమేశ్వరుడు, మువ్వురు యివ్మ్‌ 
ఎంపన్నుబు. కావుననే తెనుగున రామాయణ రచనతో కవితా 
గామణీయకమున్నను భారతమే కవి తా పపంచమున న్మగస్టాన మధిష్షంచి నది. 
పురాణ రచనమునకు కేవలము (ప పతిభా సంపదయే కాక ఆత్మశుద్ధి, తపస్సిద్ధియ 


ti క 

ల్‌ 

f 

Cr 

ts 

ల గ 
లో లే 
క్ర 

[1 

క 

ల 

CA 


# ap? an నా 
(స ంథవ గా “వామాణికముగా గై కొందురు. 
= జ నా 


భగివ త్రత్యమును భ క్రి త త్యముతో సమ్మేళనము చేసి వ్యాసమహర్షి 
పజెత పకచూన వేకత మవాభాగవతము నాం ధ Sr ము [పసా 
డించుటకు నాంధుల బహుజన్మకృత పుణ్య పరివాక్ర బమ్మర పోతన 


ల వ్‌ 


కరణను కస్త? శకము పదునె దవ శతాబ్ది వరకు వేచియన్నట్టుగా కాగవరా 
వతారిక నుండి యా డింది పద్యమువలన er 


“షస్టుత తిక్కనాది కవులియ్యుర్విం బురాఖావళుల్‌ 

ఎం జఇసియు యు మత్పురాకృతవభాధిక్యంబు దానెట్టిదో 
తెనునుంజేయడు మున్ను భాగవతమున్‌ , దీనిం దెలింగించి నే 
మంకు సఫలం Go జ సేద పునర్జన్మ అంబు లేకండగన్‌ , 


బ్‌ 


అ తగి వారత నామా a 
న న్‌ మాయణములకు పురాణవ.లుగనే పరిగణించినను 


Res ప ఇ అ SIs లీ ని ర 2 ష్‌ జే క we 
ra జ. పజ wa చల ఇ : అ శ గ Fa శ అ కట ఇగో జో Me » po 
వ న [ భామకు వ్‌ ములు పచ అనం కయుగునని 


ఆంధ భాగవత వై శిష్ట్యము లీక్‌ 
పై పద్యమున స్పష్టపరచినాడు. దీనికి గారణము 'నానా రసాభ్యుడయోలాసి” 
మైన భారతము కన్నను, రసోల్లసితమైన రామాయణము కన్నను భ క్రిరసము 
[ప్రధానముగా నందు |పపంచితమగుటయే యని పోతన యాశయము. 


కర్మ జ్ఞాన భక్తి మార్గములలో భ_క్తిమార్శ మందర కందుబాటులో నుండు 
రాజమార్గ ము. అది సర్వజన సుగమము కర్మజ్ఞానములు మనుజునకు 
సహజములు గావు, కొన్ని పట్టుల సాధ్యములును గావు. కాని భక్తి మార్గ 
మట్టిదిగాదు. ఆది సహజము. స్వరతస్సిద్ధము. [బవ్మాజ్ఞానము చేత పదునాల్లు 
జన్మములకై న పొందరాని కైవల్యమును ఫలాపేక్షలేని నిశ్చల భక్రిచే నొక్క 
జన్మ చేతనే సులభముగ పొందవచ్చును. అట్టి భక్తి పతిపాదకమగు భాగవత 
[గంథమును తెనుగు జేసినందువలన జన్మరాహిత్యము పోతన కేకొదు, సర్వ్యాం|ధ 
జనులకు కలిగినది. ఈ పద్యమున నింకొక విశేషము గలదు. పునర్ణన్మ ము 
లేకుండుట తనశకేకాదు, తాను రచించిన భాగవతాం[ధీకరణమునకు గూడ నని 
యర్థము. ఆం[ధీకరణమునకు పునర్దన్మ యనగా వేరొక కవి భాగవతాను 
వాదమును పోతన కన్న రసవత్రరముగా వెలయించుట. పోతన కాలము 
నాటినుండి నేటివరకు భాగవతమున పోతన ఠచింపక - వదలిపెట్టిన భాగవతాం ధీ 
కరణములే యున్నవి కాని పోతన కృతమని చెప్పదగిన భాగములకు పోటియై 
నిలిచి వేరుగానున్న భాషాంతరఠ ములు లేవు. ఇకముందు నుండవేమో! పోతన 


రచనలతో తులతూగు రచనను చేయగల మహాకవి తెలుగున “నభూతో 
నభవిష్యతి.” 


విష్టుభ డ్రి మార్గమును తొలుత నాం|ధ వాజ్మయ |పపంచమున భాగవత 
మూలమున పోతన స్నుపతిష్టితము గావించెను. .కాని యది సామాన్య కార్యము 
గాదు. అతిలోకో తర కృషి. భాగవత మాహాత్మ్యమును దెలుపుచు పోతనయే 
యిట్టు (వాసియున్నాడు- 


. భాగవతము దెలిసి పలుకుట చి[తంబు 
కూలికై న తమ్మిచూలికై న 
విబుధజనుల వలన విన్నంత కన్నంత 
తెలియవచ్చినంత తేటపజతు. 


భాగవత వై జయంతిక 


వినయముతో *తేటపజతు” నని లేబలుకు మొలకలతో తెలియ 
వినయము 

ioe ara చి 
శ అ ల అ 
చ ళు వ ల క హో న్‌ ని 
జేపిము నా వెనుకనే భాగకతమొక మహా వృక్షముగా నెటు పదిణమింవ 
మ క ఎలు Hem ra వ య 
> ఖై F అ నో వ్‌ 
వహిదా కింద వితమునా వః కసపరచి యనా? డుం 
నాల య ఆ ని. "అ నోటుగా న a ల ల. వని oa 


"ఇవ తంబు మహాఫలంబు విమలవా?సాలవాలంబునె 

న cr జ! మూల 

న్‌ ca ల్‌ ఫే ig న్‌ జ న్‌ "బీ కధే 

వెలయునే కాశవతాభి కల్పతరు గన్‌ సద్దిజ[శశమై, 

వ్వ క 4 7 : (= 

వారనుంతి దృష నన్నయ బాల్మికీ, తిక్కన వ్యాసుశు, పోతన 
a డు 2 హొ { 


సి ఆ నా! ల is తాన్యా pw న ఖల rm +. ఇ న జే జో తి లశ ఛ్‌ గ్‌ శన 
ఫిదా. ఈ తలుగు పకయోగి యాం)థధభావ యందె కాక భారతియ థభా& 
a 


గ్య 
| wn క్‌ ఇ టి ట్ట రసా సవారి యము 
అగి ఎది ముందుకు తాగిడతములకన మిన్నగా ఠరతించెనో లేద వద 


[అ] 
॥ ఇ వు జరా 
ha aw a 
5 4 1 లో 
॥| | sr , శో roms a జ? ల జ టే బల్‌ జే ॥ 
న. న క ల వాం ఆ య. ళ్‌ జ అఫళ ws లే ay బై, ల వం Se po ను 
Meu sr గ స జ ప స మ యా రూ Phe me Te WY BETES చం! ON cats (గీ 
ల్‌! 
«am % 
శల స్ట ళ్ళ హలీ * బల PE ap yd గ జ Pgh ow ed న ఇం" fs ఖ్‌ స న నే [ గ 
మః స ఉత్స వారల అ జ అలు ను న్య న నా న్య అప వశ టు న re గ (ఇ | సి భా (| క Ney న్‌ శ సగ 
భం ey a: ప షక నస న ar § ర OO ఆ పెటీ లు చలల చయల రీ WIL) ia th 
Or స్ట 
లు - wand a Ea 
WO శ త. నా! [| మ 
ఇ. వ బా తాం, న్‌ 
తంల సం ల లి ఫో వ. క ౮. CR హా 
న్న 


జ! 
న a Ee i శా కష టే i గే 
* జరిధి ర్మావ్రైవల భాషా వాజ్న్మయముత 
టా 
a 


స అ షా భకస కలో న | శ 4 శ్‌ న లో rf స్‌ అంటి au! పం జ ॥ ' 4 
| a pe వా ఇట ఇ సవ. EO wm & i SE TR" NY fry ఊ yA 
ww hee ఆ EC టో (oar జ అ Ve చ "క రు ది వ్‌ జ | nag శ్‌ షు fy థి సఖీ leit ఉగ aA Kk, ణ్‌! 
ఇ. ఇ ME ఖ్‌ య్‌ 
A 


a లీ డ్రా, | న! wh) ff 
mmr a EME" a నాల ఆ (4 
ఇత సూ ఆస సీసా అ మా Ee: బూ లే యుల: ల్‌ో ల! RTE సం ho oA గిల్లీ 


బజ్‌ Uy 
wo ఇ ad బ్‌ లాగ్‌ లో wan య 
bara il Ws Maes BHO wT? NTT వ tn “eh Mi 
అజా ము. చొర మలల అపజుదు మనషు పంల యి క. ష్‌ ౪ప్ర; ( క్‌ 
ళ్స “ea 
యాజాంక్తీక 


| శ్ర వాసర చయ అక్క / pe a Q 
= ఈక విషయ గాం] ఢ వాజ్బు రప చరి జాతో సుప రాతర సు ae /' వే £. tn 1 వ్ర 
wa i PED గు అనల లు. a 
వరత టి ఉక మున భాగవతానువాదము 
పము 
న Gr స్ప 4 ha” ల 
న ie ge న. భాం టోని | 
య సం క. ర. 3 Ages Er te జ మ్మ ఇ శీ neg pe pit af 
Fas le TD ie వపు టు షు ణం ఐం స ల ఇ. ము Epa ps em] గా ౧1: 
| 5 i అ అదర బుద దరౌణి ఇధి లగా 
Morr ae "న్నా a) a © 
మఘ ae క స షు సు న లా Fe న్యూ కా pa - శక్తీ న iE 
ఇకా ౯ ar pe ఖీ ళా భల 1 ళ్‌ కా [1 స భ్‌ 
ను స్‌ ఎ నా ఎం పటుకానువాదపషుు. గావించిరి 
| 
మ్‌. 
శ x 
Mama ఇ 4 న్‌ వ న డో y ళీ న క 
ష్‌ న అనక మమ పము గ్‌ా Ie Sy he జ bt ¥ TF శ ॥ 
గ ఆ సే io బ్బ త. గి tt | bs 
క య ॥ వ / స్ట + 3 | సలు 
న. ih ter పు పో గని గు . వ Te Be RR wi Ely కీ : 
Pa జ మె షల me ae Ta aes, Dae, ME ఇ న్‌ా శ్‌ శో 

ee mw వైప pr an స్‌ | హీ నై ల గ్రాం తములను 

జ జ్‌ వ అ గ్‌ We అ as, న శ చ ఇల క్ష 3 2 
జ న = మ WO క గ్‌ వ గా షే న్న్న 
ఫ్‌ ఎ a wg నతు - చు jen 
క we ఎలప శతాబి 

ఆంధ భాగవత వై శిష్ట్యము రి 
కలంగుడి నటేశ కాస్త్రియ తమిళమున ననువదించెను. తమిళ సారస్వతమున 
కంబ మహాకవి విరచిత రామాయణమునకు గల వ్యాపి, ఆదరణ భారత 
భాగవతముల కెంత మాగత మును లేవు, 


కన్నడము : 

కన్నడ భాషలో చాటు విఠలనాథుడను కవి భాగవతమును ; కీ.శ. 1580 
(పాంతమున భామినీ షట్పదీ వృత్రములతో రచించెను. ఆ ప 
కవియే తాను భాగవతార్థ మును సంగహించితినని [వాసి యుండుటచే నిది 
భాగ నత మునకు సంపూర్ణానువాదము కాదు, కన్నడ భాషలో జై న, శైవ 
వాజ్మయములు (పథాన స్థాన మాకమిందినవి. భారత mise కంత 
(ప్రచారము లేదు, విఠలనాథునిది విశిష్టాద్వైత సం్రపడాయము ననుసరించినది. 
కుమార వాసుని క్రారతమున కున్నంత వ్యాపియు దీవికి లేదు. 


మలయాళము : 


మలయాళ భాషలో ఎజుతచ్చన్‌ "పేర భాషా భాగవతము గలదు. ఆందు 
మొదటినుండి తొమ్మిడి స్కంధము లొకరి రచనముగను, తక్కినవి పుర 
యన్నూర్‌ నంబ్బూగిపాదుని చేతను, (పన్న సేరినంబి యను వానిచేతను 
భాషాంతరీకరింపబడినవి. ఈ ఎజుతచ్చన్‌ భాగవత రచనను గూర్చి 'భేదాభి 
(పాయములు గణవు. అతడు దానిని వృద్ధాహ్యమున రచించెననియ, తిరిగి 
దానిని సంస్కరించుట కాతని కవకాశము కలుగలేదనియు నందుచే నాతని' 
శిష్యులలో నొకరు దానిని సంస్కరించి ఆయా భాగములను ఎజుతచ్చన్‌ బని 
రచించిరగయు నిమర్శకాభి। ౩ 'పాయము, కాని ఎజుతచ్చున్‌ అధ్యాత్మ రామాయణ 
మునకు వచ్చిన వ్యా ప్రికో కొంతయెన నాతని భాగవత మునకు రాలేదు, ఆంధ 
భాగవత విమర్శకులలో బహంకాషావిశారదులును, (పసిద్ధ విమర్శకులను నగు 
“సరస్వతీపు త” పుట్టపర్తి నారాయణాచార్యుల వారొక్కరు మాాతమే ఎజు 
తచ్చన్‌ దశమస్కంధరచనను గూర్చి తెలిపిరి. పోతన రచనను ఎజుతచ్చన్‌ 
రచనను పరిశీలించి రెండుపట్టుల నెట్టు ఎజుతచ్చన్‌ భాగవతరచనలో కొన్నిమెరు 
గులు చూపినడియు వివరించియున్నారు. “ఎజుతచ్చన్‌ (వాసిన భాగవత మునకు 
వర్ణనానై పుణ్యమును కథానువాదవిధాన మునను పోతనతో పోటీలేదు” అని వారి. 
యభి ప్రాయ: సను దెలిపియున్నారు. 


83 భాగవత వై జయ 
మరాటి; 
మహారాష్ట్ర భాషయందు మహాభ కృడగు ఏకనాథుడు భాగవత 
(క్రీ.శ. 15580 [ప్రాంతమున తచించెను. ఇతనిది పద్యకృతి. ఇది మహో! 
దేశమున |ప్రసిద్ధినందినది. పండరిపురమున విఠోబా మందిరమున దీని : 
కొన్ని భాగ ములను సంకీ రనలుగా పాడుదురట, కాని యిది సంస్కృత భాగవ 
నకు పూర్ణానువాదము గాదు. “ఏకనాథుడు తన భాగవతము నందు (ఐవి 
ముగ పెంచి (వాసినది కృష్ణోద్ధవ సంవాదమునే. తక్కిన కథాభాగ మునంతే 
చాల టూకీగా వెళ్ళగొట్టినాడు” అని విమర్శకాభి పాయము. మహారాష్ట్ర 
వతమున భాగవతధర్మము ““ఆనందవన భువనము” అని నిర్వచింపబడినది. 


గుజరాతీ: 


ఈ భాషలో భాగవత సంపూర్ణానువాదము వెలువడనే లేడు. భలణ 
(1484-1514) అను నాతడును, (పేమానందుడు (1686-1784) ను నం స 
భాగవతమున దశమస్కంధము మాతమే గుజరాతీ భాషలోని కనువడింి 
సకరుడు (1500-1575), వీష్టుదాసు (15661682) అనువారు భాగవత 
నందలి యపాఖ్యానములను గుజరాతీలోని కనువదించిరి. రత్నేశ్యరుడు (165 
1720) ఆను కవి భాగవతము ననువదించెను గాని యది చాల సం గవారచ; 


ఒరియా : 

ఒరియా ఖావలో జగన్నాథ దాసు అనునతడు సంస్కృత భాగవతవ 
పం డెండుస్కంధములను అనువదించియున్నాడు. ఇది యో[ఢదేశమున |పచు, 
(ద్రబారము గలది. జగన్నాథదాసు భక్తుడు, కవి, సంస్కృత ఖాషావే త్ర 
అతడు పోతన్నకన్న కొంచెము వెనుకవాడు. జగన్నాథదాసు రచన సమ[గవే 
మైనను నది భ క్తిరసవి స్తరణ యందు తెలుగుఖాగవతముతో సరిరాదు. మరియ 
నందు వంగవైష్టవ సం[పదాయములు కాననగుచున్నవి, 


బెంగాలీ 
. మాలాధరదాసు అను 'విద్యాంసుడు భాగవతమును బెంగాలీ భావలోనికి 


_ పచునారవ శతాబ్దిలో ననువదించియున్నాడు. కాని చైతన్య మతమునకు జన్మ 
స్థానమైన యా దేశమున సీ యనువాదమునకు [ప్రాముఖ్యము లేదు. 


ఆంధ భాగవత వై శిష్టము 89 


అస్సామీ : 

శంకర దేవుడను మహాకవి భాగవతమును అస్సామీ భాషలో పద్యకృతిగా 
రచించెను. ఈతని జీవితకాలము (1449-1568) 119 సంవత్సరములు. 
ఈతడు గాక మరి. తొమ్మండుగురు భాగవతములోని వివిధ క 
wr కనువదించిరి. 


పంజావీ : : 
ఈ భాషయందు 1600. 1800 [పొంతముల మధ్య భాగవతము అనువ 
దింపబడినదని తెలియుచున్నది. దీని |పశంసయే గాని వివరములా వాజ్మయ 
చరి తలయందు లేకుండుటచే నా భాషయందు భాగవతమునకు _పసిద్ధిలేద ని 
_గహింపవచ్చును. 


హిందీ : 
ఈ భాషమయందు భాగవతమునకు సముచితస్థానము గలదు. హిందీ 
సాహిత్యమున రామభక్తి సాహిత్యము, కృష్ణభక్తి క్రి సాహిత్యము అని రెండు విభా 
గములు గలవు. మొదటిదానికి పథాన (గంథము లోకో తరమగు తులసీదాస 
మహాశయుని “రామచరిత మానసము" ”. రెండవదానికి [ప్రధానమైనది సూరదాస 
రచితమైన “సూర్‌ సాగర్‌” ఆను కృతి. 


సూర్‌ సాగర్‌ లజాపాతికవేల పదములు గల మహాగంథము. కాని 
_యిప్పుడందు లభించు పదముల సంఖ్య పదివేలకు మించి యుండదు. సంస్కృత 
భాగవతము వలె నిందును ద్వాదశస్కంధములు గలవు. కావున నిడి యా భాగ 
వతమునకు ననువాదమని కొందరు (భమపడవచ్చును. కాని యిది సరికాదు. 
సూర్‌ సాగర్‌లోని విషయ విభాగమిట్టున్నది- [పథమస్కంధమున ఇష్టదేవతాస్తుతి, 
ద్వితీియస్క-_ంధము నుండి ఆష్టమ స్కంధము వరకు విష్ణువుయొక్క అవతార 
ములు ఇతర పౌరాణికగాథలు, నవమస్కంధమున (శీరామావతారకథ, దశమ 
స్కంధమున శ్రీకృష్ణుని వార రలు మధురానగర గమనము తరువాత 
సంఘటనలు. 


సూక్‌ సాగర్‌ నందు పై విధముగా విషయ: విభాగమున్నను స్రష్ట 
దశమ సృంధమునకే (పాధాన్య్మము. సూరదాసు వల్ణభ సం|పదాయమునక్సు 


40 భాగవత వై జయంతిక' 
చెండినవాడు. ఆ సం్యపదాయమున ముథ్యాంశమగు కష్ణ లీలా గానము 
చేయుటయే యాతని లక్ష్యము. ఈ లక్ష్యసిద్ధికై సూరదాసు తనకు కావలసిన 
ఘట్టములను (ముఖ్యముగా శ్రీకృష్ణ కథాసందర్భమున్య విస్తరించి రచియించి 
తక్కిన వానిని సంవ్షేపముగ చెప్నియున్నాడు. కాబట్టి మూల భాగవతము 
నందలి భావముల నాతడు యథాతధమగా పాఠక లోకమున కందింపవలసిన 
 యావశ్యకత లేదు. ఆది యాతని యాశయమును కాదు. ఇక దశమ 
స్కంధమున శ్రీకృష్ణుని బాల్యలీలలను వర్ణించుట యందేమి, యశోదానందుల 
వాత్సల్యమును చి తించుటయందేమి సూరదాసునకు సూటిగా నిల్వదగిన కవి 
లేడని కంఠో క్రిగ చెప్పవచ్చును. ఇక సూర్‌సాగర్‌ నందలి (భమర గీతలకు 
పోతన భాగవతము నందలి [భమరగీతలకు పోలికయే లేదు, తెలుగు భాగవతము 
లోనీ గోపికలవలె సూరదాసు గోపికలు ఉద్ధవుని మాటలకు తృ పిపడక ఆతనిని 
వ్యంగ్యో కులతో నెతిపొడుచుచు తమ విరవావేదనా త్మీవతను [పకటింతురు, 
ఉద్ధవుడు | పతిపాచించిన నిర్గుణ భక్రివాదమును ఖండించి సగుణభ కిని అందును 
కృవ్ణథ కిని సమర్థింతురు. దీనినిబట్టి సూర్‌ సాగర్‌ భాగవత కథతో సంబం 
ధించినదే యయ్యు నది వేరొక మార్గమున నడచినదనుట స్పష్టము. పోతన 
_ సూరదానుక దృక్పథములు వేరు. . స్ట 


పోతన మూలానుగుణముగ వ్యాఖ్యానముల ననుసరించి [కమ బద్ధముగ 
భాగవతమును రచించినాడు. కావున నందు కథలన్నింటికి సమాన [ప్రాధాన్యము .. 
కలదు. కాని సూరదాను లక్ష్యము వల్లభాచార్య సంప్రదాయము ననుసరించి 
దశమస్మ్కంధమున గల [శీకృష్ణ లీలా వైభవమును పెంపొందించుటయే. కావున 
నందు దళమస్కంధమునకే (ప్రాధాన్యము గలిగి తక్కినవానికి లేకపోయినదడి. 


ఖ_క్షిలావన యందు నిరువురి పద్ధతులు వేరు. నూరదాసునిది మధుర 
భక్తి-పుష్టిమార్లము. పోతనది రామకృష్ణ భేదము గాని శివకేశవ. భేదము గాని 
లేని యద్ర్వైత భక్తి. ఇక రచనా విధానమును పరిశీలించిన సూరదాసునిది పద ' 
కవిత్వము. పోతనది పద్య కవిత్వము. భావనా పద్దతులయందు తులసీదాసు 
నకు పోతనకు సామ్యము మెం ద, 
= తనకు నామ్యము మెండు. ఇరువురి భక్తి పద్ధతులు నమానము, ఇవ 
దైవము సమానము స్త re / న 
దైవము నము. కాని వస్తు సామ్యము లేదు. ఒకరిది. రామాయణము _ 
వేరొకరిడి భాగవతము, = వ. 


ఆంధ భాగవత వె శిష్ట్యము 4l 


డీ. శ. 18 వ శతాబ్దిని సదాసుఖపాల్‌ ఆను నతడు భాగవతము నామూ 
లాగ ముగ హిందీలో గద్యానువాదము. గావించెను. అతని సమకాలికుడు లుల్లూజీ 
లాల్‌ దశమస్క_ంథ మొక్క_టియే గద్యముగా రచించెను. కృష్ణలీలలను 
(గహించి (వాసిన కృతులు హిందీలో చాల గలవు. 


భక్తి సిద్ధాంతమునకు మూలమగు భాగవతమును వ్యాసమహర్షి రచనను 
తుచ తస్పక యనుసరించి వ్యాథ్యాతృ భావము 'నవగతము చేసికొని భాగవతా 
ర్భమును భ క్రి తత్త్యము ను దేశభాషలో సమ; (గముగను సంపూర్ణ ముగను 
భారతీయుల కందజేసిన పరమ గౌరవము బమ్మెర పోతనది, తెలుగువారిది, 
కేవలము భాగవతాంధీకరణము మూలముననే గాక భాగవత |పతిపాదిత మైన 
శ్రీకృష్ణ భ_క్తిని భారత వర్షమున చిరస్థాయిగ నొనర్చిన కీర్తి పోతనదే. 


శ్రీకృష్ణ భక్తి పధానమైన మతము వంగదేశమున నుత్తర హిందూ 
స్థానమున పోతన భాగవత రచనకు తరువాతనే పారంభమైనది. ఆవి రెండు 
నం|పదాయ ములు. రెండును మధుకభ క్రి సంబంధులే. ఒకటి వంగదేశమున 
చైతన్యుడు పవర్తి ర్రిలజేసిన రాధావల్పభ మతము, రెండవది వల్లభాచార్యులు 


[సచారమునకు తెచ్చిన శుద్ధాద్వెతము బ్రేక్ష పుష్టి మార్గమతము. ఈ మతృపవక్త ప్రల 


లిర్వురకు శృంగార రసాధినేత యగు శ్రీకృష్ణ పరమాత్మయే యారాధ్యుడు. 
భాగ పతమున లేకున్నను ఠాధా త _త్యమును, రాధాదేవిని (బ్రవ్మాకై. వర్త 
పురాణాదులందుండి సంగహించి యా మతపవక్త లిర్వురును నీ సంపదాయ' 
ములు నెలకొల్పిరి. కాని శీకృష్ణ. చరిత, గీకృష్ణని. లీలా విలాసములు, 
సమ్మగముగా గల [(గంథ మొక్క భాగవతమునందు దళమ స్కంధ మే కావున 
నది వారీ క త్య rel 1గంథమైనది. 


సంస్కృృతమూలమున 90 అధ్యాయమలలో 1600 (గ్రంథపరిమితి గ గల 
దశమస్క_ంధమును తెనుగున పోతన హూర్వో త్రరభాగములతో 8100 గద్య 
పద్యముఇతో రచించెను. అనగా తెలుగుభాగవతమున దశమస్కంధము మూడవ 
పాలన్నమాట. పె యిర్వురితో. చైతన్యుడు 1485 నుండి 1588 వరకును, వల్పభా 
చార్యులు 1479నుండి 1581 వరకును జీవించియుండుట చేత వారిర్వును పోతనకు భి 
శరువాతి వారు: వారిలో చైతన్యుడు వంగ దేశీయుడై నను న పర్య 


ణీ 


49 భాగవత వై జయంతిక 
టించినవాడు. (మంగళగిరి శ్నేతమున పానకాల నృసింహస్వామి యాలయమున 
చైఠన్యస్వామి పాదము లిప్పటికి గలవు.) ఆతడు పోతన ప. నెరిగిన 
వాడు. ఇక నల్పభాచార్యులు తెలుగు | బాహ్మణుడే, వర్ణ భాదార్యులు పుష్టి మార్గ 
మును స్థాపించిన వెనుక తెలుగువారు గుజరాత్‌ రాజస్థాన్‌ |పాంతములలో 
* తెలాంగులు” అనుపేర నెలకొన్నారు. వారు పోతన భాగవతమే నేటికిని చదువు 
దురటి. ఉ త్రరహి౭దూస్థానమున వల్దభమతము గోకుల బృందావనము స్థానముగా 
నభివృద్ధి చెందిన పిమ్మట హిందీ సాహిత్య మంతయు శ్రీకృషఖ క్రి సాహిత్య 
మైనది. కావున భారతీ య నాహిత్యమునకు శ్రీకృష్ణభ కిని, మధురభ క్రి సాహిత్య 
మును [పసాదించినది పోతనయే. ఇది భారతీయ సాహిత్యచరి తలో బహుధా 
[పశంసింపదగిన విషయము. ఆంధకవుల యుత్క్మృష్షతకొక మహోజ్వల 
మగు నుదాహరణము. దీనినిబట్టి యాయా భాషలలో భాగవతానువాదమునకు 
పోతన వంటి సమతర్థడగు మహాకవి జన్మింపలేదని చెప్పవలసి యున్నది. 


(Hes, 1 962 ) 
Sa 


హోరికి నందగోకుల విహారికి( జ కసమీరదై త్యసం 
వోరికి భ కదుఃఖపరివోరికి గోపనితంబినీ మనో 
వారికి దుష్టనంపదవహారికి ఘోషకుటీపయోఘృతా 
వారికి బాలక[గవా మహాసుర దుర్యనితా [పహోరికిన్‌, 


న్యాయికి భూసురేందమృతనందనదాయికీ రుక్మి ణీమన 
స్థాయికి భూతసమ్మదవిధాయికి సాధుజనానురాగ సం 

ధాయికీ( బీతవ స్త పరి ధాయికి( బద్మభవాండభాండ ని 
ర్మాయికీ గోపికా నివహ మందిరయాయికి శేవశాయికీన్‌, 


నము(డై యెవళ(డు ము కోకర్మ చయు(డై నన్యాసియై యెంట్‌ంటో 

వ మహాభీతి “నాహో కుమార !” యనుచున్‌ వ్యాసుండు సీరంగ వృ 
శములుందన్మయతం (దితిధ్యనులు సక్క_ంజేసె మున్నట్టి భూ 
తమయున్‌ [మొక్కెద బాదరాయణిీ( ద పోధన్యాగ ణిన్‌ ధీమణిన్‌్‌, 


పోతన శయ్యాసౌభాగ్యము 
స్మ గడియారం వేంకటేష శా స్రీ 


పోతనభాగవతమున కింతటి పజాదరము అందలి భ కి క్రీ ప్రభావమువలననే 
గాదు, మందగంభీకగ మనము గల యాతని ఇ లివలనను వచ్చినది. ఆది సహజ 
ధారా విలసిశము. ఓజఃపసాద గుణో జలము. బిగువై న యాపదబంధమున 
సంస్కృతములు, తెలుగులు చెరిసగముగా (గుచ్చిన మల్లెలు జాజుల. పరిమశించు 
చుండును. నన్నయ ధారాశుద్ధి, తిక్కన రసస్పురితబంధము, 'ఎజ్జన సూక్తి 
వైచ్చితి, సోముని సాహితీ విదగ్గత, శ్రీనాథుని క్రొత్త యెత్తుగడలు- ఆన్నియు 
నొక మూసలో గరగినచో పోతనశైలి పాంచభౌతిక శరీరమగును. దానికి 
పోతన యాత్మవర్చస్సు జీవనాడియై యా |పసన్నమూ ర్తి సత్వగంభీరముగా 
[ప్రబంధము నిండ పదవిన్యాసము చేయచుండును. దీని కేకాండముగా భాగవత 
మంతయు నుదాహరణమైనప్పు , “డిడి పోతనశైలి” యని యే పద్యము నెత్తి 
చూపగలము? ఆందులో కొన్ని సొగసులు మ్మాతము తొంగిచూడగ లము. 


గంగ్మాపవావహము వంటి పోతన పద్యధారలో నంత్యాను పాసాదులు 
తీవెపొడవున విచ్చిన తామరప్పువ్వులై మొగములు విచ్చుకొని మొదట గనపడును. 
అందలి ఘల్పి లారవములు భారతీపద మంజీర శింజితములై భావధ్వనులకు సుతి 
వేయచుండును. అది ఈయన శైలి కొక ప్రత్యేకాలంకారమ. చూడుడు. 


Baas నుదురు సోశ (గ (మొక్కి. నుతింతు సైకత. 

(శోణీికిం జంచరీకచయసుందరవేణికి రశీతామర 

శశికి దోయజాత భవచి తవశీకరణ క వాణికిన్‌ 

వాణికి నక్షదామశుకవారిజపు స్తకరమ్య పాణికిన్‌, 
పద్యమంతయు వాణికి జోహారులు పెట్టుచున్నది. ఈ యను పాసలొకప్పుడు 
నడుమనే తునిగి “జలధరదేహు నాజాను చతుర్చాహు సరసీరుహాక్షు విశాలవ తు’ 
అనియు, 'ఓతిసుతనిరాకరిష్లున్‌ (శ్రితవద నాలంకరిష్టు జిష్ణున్‌ విష్ణున్‌'ఆనియు, “ఆలి 


కక భాగవత వైజయంతిక 
మజులె నిజగణా? మజచె” అనియు వింతనడకలు నడచును. (ప్రాసల కూర్పు 
నందే పోతన యెన్నో విన్నాణములు చూపును. లభ్యంబై నం ఆజ్ఞుల్‌ గొంది = 
జ భఖ్యాలిని. అక్షీణోగ. ఇవి దుష్కర్మపాసలు. ఆరాటము- భం... 
ఉన్నారము- విన్నారము, అడచితివో- కుడిచితివో- ఇవి ద్వ్మిపాస తి 
(పాసాదులు. 


తడవాడీరి ఐలకృష్ణులు 
తడవాడీరి వారి( జూచి రంథభాదుల్‌ 
తడవాడి రరులు భయమున. . 
దడవాడిరి మంతనముల( దపనులు వేడ్కన్‌. 
శః (పాస యన్నింటికంటె నర్ధచమత్కారముతో వాడీనది, 


మామా వలువలు ముట్టకు 
మామా! కొనిపోకు పోకు, మన్నింపు తగన్‌; 
మా మానమేల కొనియెదు... 


లేమా! దనుజుల గెలువంగ 
లేమా; నీవేల కడంగి లేచితి; విటురా; 
లే; మాను; మానవేనిన్‌ 
లే, మా విలందికొనుము.., 
ఈ |పాసలు ఆక్షరములను, స్వరములను ఇటునటు ఊపి లాగి ఊడి నాట్యము 


చేయను. ఈ యమకములు, ఛేకములు స్వరలఘువులతో నెట్టు కునిసి నడచు 
చున్నవో చూడుడు- | 


“అడిగెదనని కడువడింజను . = = 
నడిగిన దను మగుడ నడుగ(డని నడ యడుగున్‌ ” 
“హరిహరి! సిరియరమున గల = 
హరి హరివాయ కొకు దనుజు నడుగం జనియెన్‌.” 
ఫోతన వద్యము వె_క్రికొనుట యందే యొక [కొత కనబడును, 


పోతన శయ్యాసౌభాగ్యము శీర్‌ 
“రాశకేందుబింబమై రవిబింబమై యొప్పు 


సీరజాలేక్షణ నిమ్మొగంబు.” 


““వనజాకే,! నే గన్మ వై జయంతికనై న 
గదిసి (వేలుదు గదా కంఠమందు.” 


ఇత్యాదిగా సీసములు, ఇత(డే దానవచక్రవ ర్తి. స్వస్తి జగ త్రయీ భువన 
శాసనక రకు - తాటంకాచలన ంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో- వి పాయ 
[పకట్యవతాయ భవతే- ఇత్యాదిగా వృత్తములు గుత్తమైన యెత్తుగడలతో బిత్ర 
రించుచుండును. ఒకప్పుడు “ఘుమఘుమారావ ఘోరబీమూతపటల సంఛన్నాభళ 
భాగ మగుచు' అని సంస్కృతబంధవమును, “గలవారి (బదుకు గొజ(తనవచ్చునే 
గొల్తరీశి బాలకుప్ప( దచ్చి' యని తెలుగుతీయమును జూపించును. ఇంకొకప్పుడు 
'ఆకూపార వేలాతటకటజకుసుమగుచ్చ పిచ్చిల. స్వచ్చమకరంద సుగంధి 
_ గంధవహంబులన్‌ (గొంజెమట నీట పెనువజఅదగము లొడళ్ల నిగురి నని 
సంస్క్బృతసమాసము పై తెలుగు నుడికారము మాకందళాఖపై పూవు గుత్తివలె 
విరయజేయును. “ఏమి నోముఖలమొ యింత పొద్దొక వార్త “నెల మసలన్‌ ్‌ తీర 
చి క్కె_నెలతకు” ఇత్యాది పలుకుబళ్టు, “ఎండ కన్నెయింగని ఏ యిం|దుని యిల్లాలు” . 

'చల్చడము [కింద దూరని మల్దురు”. ఇత్యాది జాతీయములు, “చుంచుదువ్వు' 
చెక్కిలి ముద్దుగొను' సీళ్లాడు' “పి! సుట్టు' ఇత్యాది నుడికారములు జాజితో ట 
'పూచినట్లు భాగవతము నిండ పరిమశించును. 


శాద్దికమైన యా వాహ్యనొందర్యమ. కంటె నార్థిక మైన భావోపస్కా రము 
భాగవతమున మిన్నగా గోచరించును తన భావమును సాకారముగా చి త్రింప ల 
'దలచినపుడు పోతన చక్కని కల న చేయును. వామనుడు విశ్యరూపుడె 
పెరుగునపుడు “రవిలింబం బుపమిం ప( “వ్యాతమగు ఛతంబై శిరోరత్నమై' 
(కమముగా నొకొక క్క 'యవయవః ఎన కొకొ-క గా స్రొమ్మె కడకు పాదపీఠ మ 
_మైనదట! గోపికలు శ్రీకృషుని పాద ఇద లబిట్టి యాతనీ జాడ లరయునప్పుడు 
“రొమ్ముకు బువ్వ్వుల( గోసినా( డికగ్టాల ఒక యెలనాంగ చేయూ(దినో( డిక్కడ' వ 
నని యా యా గుర్తులను బిట్ట చేసి. పరిశీలన మంతయు రెండు సీ సీసపద్యము 


“48 భాగవత వై జయంతిక 


లతో వర్ణింపబడినది. ఎంత సమర్హుడైన _రహస్యపరిశోధకోద్యోగి కూడ నింత 


నిపుణముగా పసిపట్టజాలడు. 

ఇర గజేం[ద రక్షణమునకై '“సిరికిన్‌ జెప్పక' కడకు '్రీకుచోపరిచే 
లాంచలమైన వీడక* హరి పరువెత్తునపుడు “తన వెంటన్‌ సీరి, లచ్చివెంట నవ 
రోధ్యవాతము” ఇట్టు వరుసగా వాహనాయధ పరివారములు బారులు దీరి వచ్చు 
నప్పటి యా దృశ్యమును, సత్యభామ నరకునితో యుద్ధము చేయ నా ఘట్టమునూ 
పోతన ఆద్భుత భావనాకల్పనలతో కన్నులగట్టినట్టు చి|త్రించినాడు. గజేందుని 
సరోవిహారము, సము!దమధనము, నృసింహావతారము, బాల్య|కీడలు, రాస 
(క్రీడలు మున్నగువాని వర్ణనములు ఆనల్పకవితాశిల్పసందీ ప్రము లై నవి. ఆయా 
సన్ని వేళములలో పోతన కూర్చు నలంకారములు మిక్కిలి హృద్యములు. 
'మెల(త మొగిలుపిటింది మెణుగుదీవయుం బోలె జలదవర్డు వెనుక( జనియె'- 
ఇది యుపమ.. వామనుడు (తివి! కము డై నప్పుడు “ఒక చ. [కిందనున్న 
భూమి పద్య మున కంటిన పంకమా” యన్నట్టు “మరియొక పాదము వైనున్న 
యాకసము తమ్మి పె పె తుమ్మెదా యన్న టున్న వట! ఇది యు ల్చేక్ష. సత్యభామ 
నరకునితో యుద్ధము చేయునపుడు 'సరోజాతండు మేఘంబుగా( దా విడ్యుల్లత 
భంగి'యె ఆ యద్ధరంగమును | (పావృట్కాలముగా జేసినదట! ఇది రూపకము. 
ఇటే శేషలు, అరుదు. స్వభఖావోక్తులు మున్నగు నలరికారము 
లన్నియు పోతన కవితాభారతీ దివ్యాభరణములై యొప్పుచున్న వి. 


పోతన స్ఫురింపజేయు థావార్థధ్వని వివేషము లిట్టుండును. బలిచక్రవర్తి రి 
వామనుని “వడుగా! ఎవ్యరివాయడ వెవళడవు? సంవాసస్థలంబెయ్యది' యని యడు 
గగా, “ఇది నాకు నెంవని యేరీతిం బఅుకుదు నొకచోటనక యెందు నుండనేర్తు 
ఒరులుగారు ' నాకు నొరులకు నేనాదు, నొంటివా(డ చుట్ట. మొక(శ్తు చ. 
_సిరియు. దొల్లిగలదు; చె ప్పెదనాటెంకీ; సుజనులందు దజచు చొద్చియులదు' 
ఆనెనట. ఇచట నితడు విష్ణుడని యెట్లు తోపించుచున్నాడో కనుడు! యకోద 
బాలకృష్ణుని గట్టేవై చుచు. ఏక్కడ సై నౌెనను దిరిగద, వొక్కయెడన్‌ గుణము 
కలిగి యండవు, నియమం బెక్కడీది వ స్పీక్ర,. మఅచినం జక్క (గ బోయెదవు 
పెక్కు జాడల( బుతా!' అని దండించుచున్నది. ఇందులో ఆర్భాంత తరస్ఫురణ 
లెన్నియన్నవో! 'తోయము లివి యని తొల(గక న. తలంచెదు కన 
పోతన శయ్యాసౌభాగ్యము 47 


దరలనె తి. ఈ సీసము నిండుగ నున్న చిన్నతనపు దుడుకు చేష్టలలో దకావ 
తార స్పురణలు మిక్కిలి హృదయంగ మములు. ఇవన్నియు నా మహాకవి 
. తీర్చిన కావ్యజీవితములు. 


శర్లే సందర్భ పాతౌచిత్యము, శ్చృంగారాది రసపోషణము, భగవద్భక్తి క 
_పభావ వర్తనము, ధర్మనీతి [పబోధము మున్నగు కావ్యగుణములు కావ్య [పయో 
జన పరమార్థ ములు భాగవతము నిండుగ శారదజ్యోత్స్నవలె వెల్లివిరిసినవి, 
ఆం, ధమహాభాగవతము పోతన మహాకవియె మహాభకుడై. (పజాహితమున శె 
సురభావ నుండి తెలుగునేలకు దించుకొని వచ్చిన పారిజాతము. 


తెలుగు బిత్దానో నలంనంము- 4జీ, 1961 
( ర్వన్వ్వ లీ 


శారద నీరదేందు మనసాఠపటీర మరాళ మల్లికా 
. హారతుషారఫేన రజతాచలకాళ ఫణీశకుంద మం 
. దారసుధాపయోధిసిత తామర సామరవాహినీ శు శ లే 
కొరత నొప్పు మది(గానంగ నెన్నండు గల్లు భారతీ ! 


తిజగన్మోహన సీలకాంతి తను వుద్దీపింప(, [బాభాత సీ 

రజ బంధు పభమైన చేలము పయిన్‌ రంజిల్ల, నీలాలక 

(పజ సంయుక్త ముకారవింద మతి సేవ్యంటై నిజ్బంభింప మా 
విజయుంజేరెడు వన్నెలాడు వది సావేశించు నెల్హ్లప్పుడున్‌ . 


ఒక సూగ్యుండు సమ స్తజీవృలకు( దానొక్కొక్కై తోచు పో 
లిక నెదేవు(డు సర్వకాలము సుహాలిలన్‌ నిజోత్పన్న. జ 

_ న్యక వ౭బంబులి హృత్సరోరుహలన్‌ నానావిధానూన రూ 
పకుండై పప్పల సంతు నట్టిహరినె (బార్థింతు కుద్ధుండనై . 


బమ్మెర పోతన్న గారు 


ee? శీ చెళ్లపిళ్ల వేంకట కాత్ర్రి 


“బమ్మెర పోతరాజు( గవిపట్టపురాజు( దలంచి _మొక్కెదన్‌'' యని 
షష్టస్తా :ధారంభంలో సింగయక వీల్యదుడు (మొక్కిన (మొక్కుపవ్యం బాలా 
రసవంతమైన ధోరణిలో ఉండటంచేత అందులో నాల్లో చరణాన్నే నేనిక్కడ 
వుదాహరించి పోతరాజుకు నమస్కరిస్తున్నాను, పోతరాజు గారీ జీవితసారాంళా 


న్నంతటినీ సింగయ' యీ పద్యంలో యిమిడి వున్నాడు. అందుచేత తక్కిన 


భాగాన్ని కూడా ఉదాహరించిన పిమ్మ చే కథా భాగంలోకి వస్తాను 


“ఎమ్మెలు సెప్పనేల? జగమెన్న (గ( బన్న గరాజశాయికీన్‌ 
సౌమ్ములు గాంగ వాక్యములు సూకలుసేసినవాని భ కిలో 
నమ్మినవాని భాగవతనై ష్టికు(డై. తగవాని. బేర్మితో 

బమ్మెర పోతరాజు! గ విపట్టపురాజు( దలంచి | మొక్కెదన్‌.”' 


రః పద్యం (వాసీన సింగయ కవీం్యదుడు మన పోతరాజుగారికి కొంచె 
మించుమిఃచుగా సమకాలీనుడే ఆమివుంటాడు... 


హాతరాజుగారంటే కవులలో ఆందరికీ అపారమైన గౌరవం. ఆ గౌరవం. 


అంతా యింకా ఆని చెప్పడానికి అలవికాదు. భాగవత పతిపాద్యుడై న లీక 
భగవానుణ్ణి | పేమించే వారికంటే కూడా పోతరాజుగారిని (పేమించేవారే లోకంతో 


విస్తారంగా వుంటారు. ఈయన విషయంలో నిన్న మొన్న కొందరు కొన్ని... 


పత్రికలలో ఏదో (వాస్తూ “బాలరసాల సాల” అనే పద్యం పోతరాజుగారిది 
కొనేకాదనీ ఆది మరౌొకరిదై వుంటుందనీ (వాశారు. మరొకరు ఆ పద్యం పోత 
య. ఉదా రమా కూడా అ యీయన రచించిన భోగినీ దండ 
కానికి సంబధించినచనీ, యో సందర్భానికి ఆ పద్యం లోనేవున్న “అప్పడుపు ఓ 


గూడు” ' ఆనే మాట | నర ఈ... 
సాధక మౌతుందసి కొంత (ద్రాసివున్నారు. కన [వాతలు 


నా 
న 7 71 


బమ్మెర పోతన్నగారు = శ0 


నాకు బౌతిగా రుచించలేదు. పద్యం ముమ్మాటికీ పోతరాజుగారిడే అనీ 
పద్యంలో ఉన్న తాత్పర్యం జనరల్‌గా రాజుల కందరికీ సంబంధించేదే అనీ 
సహృదయులు విశ్వసిసారని నా ఊహ, అందుకు... 


““ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురమ్ములు వాహనమ్ములున్‌ 
సొమ్ములు గొన్ని పుచ్చికొని సొక్కి_ శరీరము వాసి కాలుచే. 
సమ్మెటపోటులం బడక సమ్మతి (శ్రీవారి కిచ్చి చెప్పె నీ 
బమ్మెర పోతరా జొక (డు భాగవతంబు జగద్ధితంబుగన్‌ '' 


అనే భాగవత పీఠికలో ఉన్న పద్యం పూర్తిగా తోడ్పడుతుందని మనవి చేస్తు 
న్నాను. ఈ మధ్య ప తిక లలో (వాసిన వ్యతిరేకవాదులు ఈ పద్యం వుందని 
లేశ మున్నూ గు ర్రించిన ఖై నాకు తోచలేదు. ఆ కాలంలో చాలామంది రాజులు 
వున్నా పోతన్నగారి హృదయంలో ఉన్నవారు వేంకటగిరివారే. ఆ సంస్థానం 
వారికి “కర్ణాటక దేశాధీశ్వరులు'” ఆనే బిరుదనామం వున్నట్లు వారి వంశచరిత 
వల్ల తేలుతుంది. బహుళః గోపీనాథం వేంకటకవి తన రామాయణపీరికలో ఈ 
నిరదాన్ని _ వాడివున్నాడనీ, దాన్నిబట్టే మేము ఆ సంస్థానానికి వెళ్ళినప్పుడు 
చెప్పిన పద్యాలలో “ “కర్ణాటధారుణీం్యద!! (శీరాజగోపాలకృష్ట యాచభూపబహాదర్‌ 
మహారాజ!” ఆని వాడివుంటామనీ జ్ఞాపకం, ఇక్కడ దీన్నెందుకు [వాళానంటే, 
పోతరాజుగారు ''కాటుక కంటినీరు చనుగట్టు పయింబడ నేల యేడ్చెదో హాటక 
గర్భురాణి! నిను” అని సరస్వతిని ఓదార్చే పద్యంలో వాడిన “ఆశ టికోసము 
తాళలేక కర్ణాటకిరాటకీచకుల కమ్మ నిజమ్ముగ నమ్ము భారతీ!” అని కర్ణాట 
రాజులనే అగ్గమిచ్చే “కర్జాటకిరా టకీచకులు”' ఆనే పదం గతిక హొ తపాల 
అనే పద్యం సర్వజ్ఞ సింగ భూపాలునికి సంబంధించేదే అని తెల్పుతుందని తెల్ప 
డానికే, పోతరాజుగారికి రాజులను స్తుతించి తద్ద్వారా కుటుంబపోవషణ చేసుకోవ 
డంతో బొ త్రిగా ఇష్టంలేదన్నది సర్వజనులున్నూ విశ్వసించే అంశం. ఆయీ 
సందర్భం వామనచరి తలోని- 


వ్యాప్రిం జెందక వగవక, 
(పా ప్రంబగు లేశ మైన పదివేలనుచున్‌ 


య 


" భాగవత వై జయంతిక 


ర్‌౮ 
ద+ వింజందగి మనుజుడు 
ta 
వా ॥ జ 3 
స పది=పములనె నం జక్కంబడునే? 
మొచల న కొన్ని పద్యాలవల స-షంగా గోచరిసుంది 
డ్‌ రా కు 
పోతకాజుగాప కవ్షలలో & ఆగస్థానం వహించడమే కాకుండా భక్తులలో 


కూడా ఆ స్తానాన్ని వహిసారు. a యూ మహాకవిని నన్నయాదులతో 
పాటు పయోగ విషయంలో కవిలోకం అనాదిగా గౌరవించినట్టు నా 
ధారాశుద్ధి, న్‌ షత, మాధుర్యము వగిరా గుణాలను బట్టి చూసే యీ మహో 

సర్వదా నన్నయ్యకు మించుతాడు గాని తగ్గడు. ఆయన గురుకు శూషా న 
కంగా కాస్రాాభ్యాసం చేసి ““ అమ్షభాషావాగనుకాసన”” బిరుదాన్ని సంపాదించి 
తన కవిత్వ 1లో ఆ పాండే త్యానుభవాన్ని యథాయోగ్యంగా (ప్రదర్శించాడు. 
మన పోతన గారో? “సహజ పాండిత్య” బిరుదాంచతుడు, కేవల వర|ససాది, 
అందటేయే కౌంచెమో కావ్యపరి చయం మాతం సంస్కృృతాం ధాలలో గురు 
ముఖతః జల: స్థంలో కలిగించు కోకుండా యింతటివాడు కొజాలాడు గానీ వ్యాక ర 
దాది శాస. బటీ పేల వల్చించి తద్ద్వారా పాండిత్యం సంపాదించిసవాడు 


bea సంక. ౫ 
ఈలాబి సంస్కృతధారతో ఎన్నో $ పద్యాలు భాగవతంలో ఉలటోయి 
కదా! ఇందుకు నా 
వ దుకు నామ్మగి యీయనకి ఎక్కడ నుండి ఏచ్చిందొని సందేహం కలగ 
రల ఆశ లం లేదు 
క శరం లదు. దానికి హేతువు స సంస త్‌ భాగ నతాన్ని అసక్ళదా 
బె గ్‌ నాయన ఆ ' 
గా పనిగా చ*వి గరం. సర్వసాధారణంగా అందరికి 
ఆలిని సహాధానం ముకోట్స్‌ = [ప పేదిరే పా కనబ క్‌ 
sens టొ నజన్మ విద్యాః” అనేదే, పూర్వా 
my ie DN ce దిటూ 2 
Bi రః ఊహకు ఖై “తిమా యెన్ని సంస్కృత భాగవత రసు 
ఇ ఆఆఅ కూప జొ తరు క a క | 
వ చ్నషూట్టు క. లోపాఠంగా నల్టించినా ఆ మాచిరి 
కు 


క్ర 
5? న్‌ చ మరా క. 2 గ్‌ 
అనుభవజ్ఞులైన ఆ స్పి'సల ంధరూ ఒప్పకు: టారు, 


బమ్మెర పోతన్నగారు gl 


నా స్రికుచ విషయంళో మనం గాదు గదా [బహ్మ కూడా సమాధానపరచలేడు-. 
“'బహ్మాపి నరం న రంజయతి.” చదివితేనేమి? దానంతట అదే వసేనే యేమి? 
పోతన్న సంస్కృతధారలో తిక్కన్న, యెజ్జన్నగార్హక కు మించుతాడు, నన్న య్య తో 
సరిగా తులతూగుతాడు. నన్నయ్యకు అ పయత్నంగా వచ్చిపడే Meese 
యితనికి అంతగా పడదని నేననుకుంటాను. ఈయన పస్తే ఆంత్యనియమం కొంచెం 
[పయత్నించి పట్దెదే అని చెప్పక తప్పదు, 


“గొడుగో? జన్నిదమో? కమండలువొ? నాకున్‌ ముంజయో? డండమో? 

వడుగే నెక్కడ? భూములెక్క_డ? కరుల్‌ వామాకు లశ్వమ్ము లె = 

కుడ? నిత్యోచిత కర్మమెక్కడ? మదాకాంశా మితంబైన మూ 

డడుగుల్‌ మేరయె తోయ కిచ్చుటది [బహ్మాండమ్ము నాపాొలికీన్‌ .*” 

ఈ మాదిరిగా విడివిడి పదాలలో యతిిప్రాసలకు - ఒగి, వెస, తగ, 

, ఓలి మొదలైన పదాల సహాయాన్ని ఆపేశీంచకుండా రచన సాగించ. 
మ. యే భారత కవులున్నూ పోతన్న గారికి “దాసోఒహం” అనవలసి 
వస్తుందేమో! అని నేననుకుంటాను. - అన్నిటికీ ముఖ్యం రసం కదా! ఆ రసం. 
యితడు పద్యం యెత్తుకొ నేటప్పటిక ల్లా వచ్చి, పువ్వులకు పరిమళం అలుము 

కున్న ట్టుగా ఆలుముకుంటుంది. తెలుగుభాష పుట్టిన తరువాత యింత 

రసబంధురంగా కవిత్వం చెసే మ్‌ వ్యక్తులు చాలా మృగ్యంగానే పుట్టివుంటారనీ, య. 
ఆందులో ఇతడు ““కనిస్టకాధిష్టితు'' డనీ పలువురు విశ్వసిస్తారు. క విత్వమా 7 న్నే 
నిర్దవ్షమాయె, రసమా? కుత్తుకబంటాయ్‌, యిట్టి కవిత్వాన్ని యేదేనా ప్రయోగ 
| విషయంలో లక్షంగా చూపిస్తే అదేం కర్మమో?. హే? త 
ఆంటూ యీసడించడం ఆలవాదై పోయింది: న. 


మన స స్థితి కూడా ఆలాగే పందిన. పోనీ యితర కవి 
త్వాలు కూడా భాగవతంలో చేరివుండడం చేత యీ కళంకం. వచ్చిందను 
కుందామా? ఓ కవిత్వ భాగాలేవో యేర్చాటుగానే వున్నాయి. ఆ భాగాఆలోనుంచి 
యేదేనా పయోగం చూ చూపితే పోనీ ఆలా యీసడించినా కొంత సహించవచ్చు. 
భాగవత |పయోగ మనేటస్పటికల్దా యిక చెప్పేదేమిటి ? “సహేం[ద తక్షకాయ 
స్వాహా”. అమో! అమో ! ఇది యెంత అన్యాయం ! అన్యాయమనాలో రి. 
దీన్ని మూర్చ తనాలో ? ఇంక యేమనాలో ? నాకు ౯కమ్లా, వ లేదు. 


ధ్ర. భాగవత వె జయంతీక 


“లోకము మూయను మూకుడున్న దే 2 పాపం! అక్కడికీ కూచిమంచి తిమ్మ 
కవి సార్వభౌముడు సాహసించి తన యావచ్చ క్రినీ ధారపోసి “లక్షణం బెందు( 
దప్పునా ? దక్షహ*ణ!'” అని వాళ్ల వాళ్ల అపోహలను తొలగించడానికి కొంత 
యత్నించి “సర్వలక్షణ సారసం[గహ 1 మనే తన లక్షణ[గంథంలో భాగవతా 
న్నుంచి లక్షా లెత్తిచూపి భారతాజి మహాకవులతో పాటు గౌరవించాడు. అయితే 
మాతం సామాన్య కవిలోకానికి విశ్వాసం కలిగిందా ? ఎలా కలుగుతుంది ? 
“గతానుగతికో లోకో న లోకః పారమార్థికః.”” 


అశ్వినీ దేవతలు వైద్యులు గనక వీరికి యజ్ఞంలో హవిర్భాగం పుచ్చుకొనే 
అధికారం లేదని యెప్పుడో ఒక తీర్మానం దేవలోకంవారు ప్యాసు చేశారు. ఆ 
తీర్మానాన్ని చ్యవనమహాముని కాబోలును = తన కాయశ కులా పాటుబడి రద్దు 
పరిచి తన మామగారి యజ్ఞంలో హవిర్భాగం దొరికేటట్టు. చేశాడు. ఆ చ్యవన 
స్థానాన్ని తిమ్మకవి గార తే “అ[కమించి చాలా (వయత్ని ంచారు గాని యో పని 
జరిగి సుమారు నూరు సం వత్సరాల కంటే కొంత యెక్కువ కాలమే అయినా 
యిప్పటి కింకా లక్ష్య విషయంలో పోతరాజు గారంటే కవిబోకానీకి పామాణ్య 
బుద్ధి కలిగినవే లేదు. బాగా ఆలోచిస్తే యో సుహాపాతకానిక ల్లా ముఖ్యకారకుడు 
కాకునూరి కవి. “సహజ పాండిత్యుని సంస్కరించి” ఆంటూ భార తాడి మహాకవు 
లతో పాటు గౌరవించి కూడా భాగవతాన్నుంచి యే విషయానికీ ఒక్క అత్యం 
కూడా చూపించక పోవడం చేశ లోకానికి మరింత అలు సైపోయింది. అస్పక్‌ వి 
సామాన్యమైన శతకాలనుంచీ, చాటు ధారల నుంచీ, ఒక దేమిటి? నానా చెత్తని 
అంగీకరించి, భార తకవులనూ తదితరులనూ కూడా అతి కమి స్తే ఆతి [క్ర మిస్తా 
Fe ఆమాంతంగా అని, చెప్పుకోదగ్గ పోతన్నగా రి థాగవతాన్ను ంచి ఆఖరికి 
వర్ష యతి కనేనా ఒక లక్ష్యం చూపించక పోవడమనేది మవాపరాధంగా తిమ్మకవి = 
గారికీ తోచింది. ఆయన కొక్కరికే కాదు, పరిశీలన గల (ప్రతి కవికీ యీ 
సంశయం కలుగుతుంది, 


పోతకాజు గారేమి, ఆ కాలపు మహాకవులు యితరులేమి |శవణ సుఖం 
యెరిగి కవిత్వం చెప్పడం చేతనే వారి కవిత్వాలు ఆకాశం మీద నక్షతాలలాగా 
శాశ్వతంగా. వెలుగుతున్నాయి. “లోకుల రసనలె, యాకులుగా సుండునట్టి 
యవివో కవితల్‌ .” పై అనుసరించడం యేలాటిదో చూప్పతాను- 


బమ్మెర హోతన్నగారు | 'ర5లి 


క రెవ్యరు ? శ్రీకృష్ణులు 

గారా ! యెన్నడును వెన్న గానరంట కదా | 
చోరత్వం బించుకయును 

నేరర(ట ! ధరిత్రి నిట్టి నియతులు కలరే ? 


ఈ పద్యం రచించిన పోతరాజు గారికి ఉన్న లోక జ్ఞత్వం యెట్టిదో శుష్క 
తార్కికవాదులకు బోధించదు. 


““కల్తారెః పరికల్పి తేవ లలితా మాలా కవే ర్భావతీ 
శుష్కాణాం పరిపీడనం నసహతే కా స్త్రేషు భిన్నాత్మనామ్‌.”' 


“బహువచనం యెందుకు? కృష్ణుడు ఒక్కడే కదా? అదిన్నీ కాక గౌర 
వార్థకమంచే? కొడుకును తల్లి గౌరవించడం యెందుకు?'' అంటూ తమలో తామే 
తుమ్మి “దీర్ణాయుమ్య' మనుకొనే మాదిరిని పూర్వోత్త తర పమాలు చేసుకొనేవారికి 
లోకంలోనే పుట్టి లోకంలోనే సంచరిస్తున్నప్పటికీ లోకజ్జత్యం కలుగ నేలేదను కోక 

తప్పదు. లోకజ్జత్వం ఆంత తేలికగా ఆలవడేదే ఆయితే నన్నయగారు ““లోకజ్జు'' 
అంటూ [పశ్యేకించి ఒక విశేషణాన్ని తనకు వేసుకొని వుండరు. ఒక మహాకవి 
“ఆరసికాయ కవిత్యనివేదనం శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ” అని (బహ్మను 
(పార్థించాడు. రసజ్ఞత్వం యెంత వుండాలో ఆంతావున్న పోతరాజుగారి కవిత్వాన్ని 
విమర్శించవలసివస్తే అస్మదాదుల లోకజ్ఞత్వం చాలదు. అయినా యిహ పఠ 
సాధకం గదా. అనీ [పాయోపవేశావస్థలో “దీనికి పూనుకున్న నన్ను రసజ్ఞలోకం 
క్షమించాలి. పై పద్యానికి మార్గదర్శకుడు నన్నణ్యుఖభచే. “వీ శెవ్టరయ్య 
[దుపదమహారాజులె” ఆనే పద్యాన్ని యెరగని వారుండరు, ఆయన యొత్రిన 
దొళ రసంలో; పోతన్నగా రె త్తినది మరొక రసంలో. ఇంతే భేదం. ఇప్పటికి 
యీ మాదిరి పద్యాలు నాకు గనపడ్డ పి యీ రెండు మాత మే. “త తధాసామ్‌.”” 


పోతన్నగారిని అప్పకవి ఉదాహరించక పోవడానికి ఆయన కవిత్వంలో 
ఇతడు కని పెట్టిన దోషాలేమిచో కొంత పరిశీలించి చూద్దాం, అందుటో ఒకటి. 
'ఆఖండయతి అనుకుందామా? దీన్ని భారత కవిత్యం అంగీకరించినట్టు “చెప్ప 
వయ్య పుణ్యసతీ [పభావంబు నాకు" లోనైన (పయోగాలవల్ర స్పష్టపడుతురది, | 
కాని జ (పయోగాలన్నీ యిటీవల యే చరణానికి ' ఆ ఛరణమే "వుండేటట్లు 


కక భాగవత వై జయంతిక 


ముదించిన చిన్నసైజు పుస్తకాలలో అన్యథా డిద్దివేశారు. నేను చూచిన 
[ప్రయోగం యిప్పటి [పతులలో “చెప్పదలయు( బుణ్యసతీ [పభావంబు” అసి 
వుంటుంది. మావిరికి ఒకటి చూపాను. వెనకటి పు స్తకాలకీ యిస్పటి పు స్తకాలకీ 
చాలా స్థలాలు మారిపోయినామి.. సంస్కృతంలో "వండే భావాన్ని అనుసరించి 
తిక) గాన్నగారు జ నమ్మమి మృత్యువు?” అనే పద్యంలో ““నమ్మీనమ్మక” అని 
. [ప్రయోగిస్తే దాన్ని కూడా తోచినట్టు దిద్ది మూలాభి పాయాన్ని ఆన్యధాకరించ 
టానికి సైతం సంస్క రలు కఫము క కారు. భారతా న్ననుసరించి నాచన 
సోముడు లోనై నవారు తాదృశ్మపయోగాలు తమ తమ గంథాలలో చేసుకొని 
మ. వారి గతి అధోగతి. కావలసివచ్చింది. ఆ యీ సందర్భం సుమారు 

ముప్రైయేళ్లనాడు “దిద్దక్ష్షడయ్య భారతము” ఆనే పద్యం ద్యారా యేదో 
1 వ్యాసంలో నేను మొర పెట్టుకొన్న ప్రే జ్ఞాపకం. 


_ పోతన్నగారి కంటి గర్భదరి దుడు (లోఠదృష్ట్యానే సుమండీ! ఆయన 
ద ఆయితే ఆయన మవాభాగ్యవంతుడే), మరొకడు లేడు గదా! అట్టి గర్భ 
దర్శిదుని కవిత్వంలో యెక్కడ యెత్తుకున్నా రసం (బంగారం అని క అను 
కోండి) కుప్పతెప్పలుగా దొరుకు తుందే! నీళ్ళతో గేదెను పెట్టి బేరాలెందుకు? 
ఏదో ఉదాహారించి మాట్టాడుదాం- 


“చేతులారంగ శివుని బూజింపంకేని 
నోరు నొవ్వంగ వారికీ ర్రి నుడువ(డేని 
దయయు స సత్యంబు లోనుగాం దలంపడేని 

కలుగనేటికిం దల్దుల కడుపుచేటు.' వ 


ల. . బంగారం. వంటి యా పద్యంలో ns వీకట raises శంకలు 
ఉండకసోన సుమండీ. వారికీ ర్తి నుడివేటప్పుడ నోరు నొచ్చే యెడల వాడు 
- భక్తుడేలా అవుతాడంటూ శంకిసే స్త శంకించవచ్చును. కాని ఆ పదం ఆక్కడ 
అం ఆందం. ఆ అందం మవోనుభావుడు. పోతన్నగారికే తెలుసును, 
(నహ్యస్మాదృళ శుష్క హృదయాణాం). 'దానికింతే సమాధానం, ఏదో నోటికి 
వచ్చిందని ఎదుట వున వాడు. పెళ్ళికొడుకు అన్నట్టుదాహరించాను గాని యీ 
పద్యం ఆయన కవిత్వంలో శే స్ప వభ్యాతి గౌంచిందనే తాత్పర్యంతో ఉదాహ 
. రించిందనుకోవద్దు. “Es జూచినం De యుక్ళులు" అంటూ శాక .. 


బమ్మెర పోతన్నగారు కరి 


రస సందర్భంలో ధూర్జటి కప కాబోలును ఒక పద్యం (వాసీ ఉన్నాడు. ఆదే 
విధంగా మన పోతరాజుగారి కపత్వం పతి పద్య రసాస్పదం. అందుచేత 
వెదకి ఉదాహరింప నక్కరలేదు. అయినప్పటికీ పతి కవిత్వంలోనూ 
“త తాపిచ చతుర్భొఒంక స్తత కోర చతుష్టయా'*లు ఉంటూనే ఉంటాయి. 
కనుక వామన చర్మితలో ఉన్న - 

“కారే రాజులు? రాజ్యముల్‌ కలుగ వే? గర్వోన్నతిన్‌ బొంద రే? 

వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై. 

బేరైనం గలదే? శివి , పముఖులున్‌ _పేమన్‌ యశ:ఃకాములై 

యీరే కోర్కెలు ? వారఐన్‌ మజవిరే యిక్కాలమున్‌ భార్గవా 

(ఇంకా. యెన్నో పద్యాలున్నాయి. వ్యంగ్య మర్యాదచేత ఆ కవి జీవిత 
రహస్యాలు కూడా తెలిపే వున్నాయి. వి సర ధీతిచే ఉదాహరించలేదు. 
చూచుకోండి భాగవతంలో.) ) 


పోతరాజుగారి అంత్య నియమం మరికొందరు అనుసరించి కృతార్థులు 
కాగలిగినా ఆయన రచనకన్న చాలా న్యర్థపదాలతో నిండి ఉండవలసి వస్తుందనీ, 
ఆయన దానిలో కూడా వ్యర్థపదాలు పడవలసీ పడినప్పటికీ అంతగా ఆ రచన 
నీరస మనిపించుకోదనేది వ క్రవ్యాంశం, ఒక పద్యం ఉదాహరిసాను- 


“కరు ణాసింధు(డు శౌరి వారిచరమున్‌ అందిం బం పె స 

: త్వరి తాకంపిత భూమి చక్రము మహోద్యద్విస్పులింగచ్చటా 
జ ' పరిభూతాంబర శుక్రమున్‌, బహువిధ (బవ్మోండ భాండచ్చటాం 

తరనిర్వ| కము, బాలితాభిల సుధాంధశ్చ|కమున్‌, జ|కమున్‌, అ 
ఈ పద్యం యెంతో సంస్కాత పదజాలంతో నిండివున్నా రఘువంశం 
కూడా చదువుకోని కేవలం. తెలుగువాడికి కూడా సుళువుగా తాత్పర్యాన్ని 
కలిగిసుంది. ముఖ్యంగా. తెలుసుకో దగ్గది యా పద్యంలో (శీ విష్ణమూలరి రి వారు 
- మొసలిని చంపే నిమి త్తం చక్రాన్ని (పయోగించారన్నదే కదా! చక్రః 
కీ దృశః” అంటూ ఉత్తితాకాం ఇావశంచేత గాని ఉత్తాపితా కాంజావశం చేత గాని 
బయలుదేరే శంకలకు సమాధానం రాకపోతే చెడేదేమిటి? ఈ అంత్య నియమాలు 
_ ఉన్న పద్యాలలో యెక్కడైనా పోతరాజుగారు దొరుకుతారేమో అని నేను అనేక. 
విధాల నాకున్న అనుభవంతో పరిశీలించాను. కాని యేదోవిధంగా. సమర్థించే 
(ప్రయోగమే కాని మరొకటి ఆయన చేయనేలేదు. ఆయనది సహజ పాండిత్యమే 
అగునా? లేక్ష గురువూషా పూర్వకమైన పాండిత్యమే అయివృండునా* 


56 భాగవత వై జయంతిక 
అనిపిసుందె నాకు. ఆది పూర్వజన్మ వాసన అనుకోవలసిందే కాని యావద్యి 
వయమున్నూ గురు ముఖతః అభ్యసించవలసివ స్తే యెంతకాలమైనా బ్రాల తుధ్రకా! 

ఊరికినే అన్నారా “క్రోవేత్రి కవితాత త్యమ్‌ అని అధియు కులు ! ఏదో 
[వాసుకుపోతున్నానే గాని యూ మవోనుభావుని ధారను గూర్చి చర్చించినక్టే 
లేదు. భారత భాగవత రామాయణాలంటూ లోకంలో అందరూ వాడుతుంటారు, 
శాస్త్ర పకారం భారతానికి పూర్వనిపాత వస్తే రానివ్యండిగాని ఆ చిక్కు లేక పోఖే 
భాగవత శబానికే పూర్వనిపాత వస్తుందంటాను నేను. గజేం్యద మోకమో, 
నీవ్మ సవమె, గోపికా గీతలో - యేవో నిత్యమూ తెల్టవారగట్ల పారాయణ 
చేయని ఆంధులు లేశేలేకని (అకరాస్యులలో) నా చిన్ననాడెరుగుదును, 
కమం | కమంగా భ క్రి నానాటికీ తగ్గి కృశిస్తూ ఉన్న యీ రోజులలో కూడా 
యీ పారాయణ పూర్తిగా తగ్గలేదు. ఈ భాగవతానికి తప్ప యీ మహాభాగ్యం 
మరి యింక యే మవోకవి క విత్వానీకీ లేదు. భక్తి అని వచ్చే టప్పటికి పోతన్న 
గారికి నడిచినట్టుగా యే కవికిన్నీ కవిత్వం నడవదు. నడవనే నడవదు. దానికి 
పోతన్నకు పోతన్నే సాటి. ““రామరావణయోర్యుద్ధం రామరావణ యోరివ””. 
ఆనన్వయాలంకార?. శై లికంటూ యీయన కవిత్వం ఉదాహరదించవలసి వస్తే 
యావతు భాగవతమున్నూ ఉదాహరించవలసి వస్తుందేమో | 


పోతరాజుగారి వంటి కవులు లోగడ బయలుదేరలేదు. నేడు లేరు. 
ముందేమో చెప్పలేము. ఆయన పద్యాలెన్నో లోకో కుల కింద వాడుకుంటారు - 
1, ఊరకరారు మహాత్ములు 2, నాటి కొక్కదైవము లేడే శి. చాలు పదివేలు 
వచ్చె. లోకంలో ఉన్నవే, పోతరాజుగారు స్వీకరించారేమో! కానివ్వండి. దీనికీ 
కూడా వివాదమెందుకు? నాకు ఆలా తోచలేదు. “భాగవతము తెలిసి పలుకంగ 
శక్యమే శూలికై నం దమ్మిచూలికై న?”” 

“పట్టి నేర్చికొనెనా? పుట్టక నేర్చెనో? 

చిట్టి బుద్ధులిబ్దే పొట్టివడుగు 

పొట్టనున్న వెల్త బూమెలు నని నవ్వి 

యెమి ధరణి దాన మిచ్చెనపుడు” 

అన్న పద్యార్థానికి మొదటి ఉదావారణం పోతన గారనీ, రెండవ ఉదాహరణం 
వామనమూ ర అని నిర్వచిస్తే కాదనేవా రెక్క.డైనా ఉంటారా? ఈ పద?౦టో 
అంతర్జినమై పోతనగారి కవితా [పా ప్రిరీతి ఉందని నా ఆశయం. 


(కోలలు. గాథలు, కృ తీయఖాగమయు) 


పోతనామాత్యుని కవితాశిల్పం 
డాక్టర్‌ దాశరథి 


“భక్స్యా భాగవతం వ్టేయం 

న వ్యుత్చత్త్వా న టీకయా'. 

భాగవతాన్ని ఆర్థం చేసుకోవాలంటే భ క్రి కావాలి. పాండిత్యము, టీకా 
కాత్సర్యములు భాగవతాత్మను ఆర్థం చేసుకోడానికి చాలవృ. ఆటువంటి మహో 
గాగవత పురాణాన్ని తెలుగుచేసి ఆబాలగోపాలాన్ని, పండిత పామరులను అల 
రించిన పోతన see అనల్పమైనది. 


శిలలను చెక్కి. రూపకల్పన, చేయువాడు శిల్పి. కాని శబ్దములతో సజీవ 
రూపములను nos నిల పు వాడు క వితాశిల్సి. పోతన్న అట్టివాడు. 


“విద్యావతాం భాగవతే పరీక్షా. 

విప త్తికాలే గృహిణీ పరీక్ష 

రణాంగణే శస్త్రభృతాం పరీక్షా 

ధనంజయే హాటక సంపరీషా.' 

విద్వాంసులకు భాగవతం పరీక్ష; కష్టకాలంలో స్రీలకు పరీక్ష యుద్ధ 
రంగంలో వీరునికి పరీక్ష; అగ్నిలో బంగారానికి పరీక్ష ఆన్నారు పెద్దలు, ఆటు 
వంటి భాగవతాన్ని పోతన్న గారు తెలుగు చేయడం తెలుగువారి అదృష్టం, 


పోతన్నగారి కవితాశిల్పం భాగవతంలో పరాకాష్ట పొందినా ఆయన 
[పత్యేకత భోగినీ దండకంలోనూ కనిపిస్తుంది. భాగవత వ బీజ పాయ 
మైన ఆ దండకంలోని కొన్ని పంక్తులు పీకు జ్ఞాపకం చేస్తా ను. పోతన్న గారి 
కవితాశిల్పం ఎట్లా మొగ్గ తొడిగింది వాచవిగా క న మనకు గోచ 
రిసుంది- ట్‌ టంత వాచాక టుత్యంబు బాలేందుకో భాలికా ! బాలికా! బాలిక 
" ల్రేయు యత్నంబులే సీ వ! లంభోజనాకాంతరాళ స్ఫుర త్రంతు 


| భాగవత వైజయంతిక 


కనే గంధనాగంబు? కఎపించునే మక్షికాపక్షవి కషేపవాతావాతిం 
గాంచ నాగబు” ఇడి స senate రితి. ఇక తెలుగు తీరు. “ఈ రీతి నేనాతిచే' 
పీ వంటి దీ వెంటలం దంటయె గెంటి పోజూచునే తమ్మి కంటి 
కావో! కనుంగొంటి నీ గొంటు చెదంబు దైవంబు కీగ ఐటి 
శేసెంత oe జంట నింటింటికిన్‌ వెంట వెంటంబడన్‌ .” 


హోత్రక్న గారె కవితలో స్పష్టంగా గోచరించే కొన్ని లక్షణాలను ఈ 
విధంగా. వింోడింపవచ్చు = !. అన్ముపాస నియమము, 2. ధారాశుద్ధి, 8 


Oe 


చితణ, క, రసవేశము, వీనిలో మొదటి రెండు బాహ్య రూపమునకు. సంణం 


న్‌! 


ఢించినవి, తరువాతవి రెండు కవితాత్మకు సంబంధించినవి. 


అనుపాన నియమము ; 
భూవ ణములు వాణికి నమ 
పేషణములు మ్బ తుచిత ఛీవణములు హృ 
తోకణములు క కల్యాణవి 
వణములు హరిగుణోపచిత భావణముల్‌. 


సంస్కృతంలో అనుష్టుప్‌ ఛ౭దంలో (వాసి మెప్పించటం ఎంత కష్టమో 
లుగులో కందపద్య రచన చక కష్టం. కందాన్ని అందంగా తీర్చిన కొని మంద్ని 
ఏహాకవులలో పోతన ౬కడు. చూడండి. ౧ 


కలడందురు దీనుల యెడ 

కలడందురు పరమయోగి గణముల పాలన్‌ 
కలడందు రన్ని దిశలను, 

కలడు కలం డనెడివాడు కలడో లేడో | 


విరపులతో మెరుపులు సంతరించి కందంలో లం చిందించే మరొక 
ష్టం క కృష్ణుడు నత్యభామతో అంటున్నాడు. 


లేమా ! దనుజుల గలువగ 
లేమా! నీవేల గడగి లేచితి విప్రా 


పోతనామాత్యుని క వితాశిల్బం 59 


లే! నూను మానవేనిన్‌ 


జ్‌ a 
త mage విల్ణందుతొాను య. రీ్జం గన్‌ జ 


యుద్ధ సన్నివేళ “ంలోని పద్యమే అయినా ఇందులో రోష వీషణతలు లేవు. 
కారణం కృష్ణుడు సతభామితో చేసిన సరస సల్వాపమే. ఇందులో కృష్ణుని 
(1 har: అ 
మాటలే ఉన్నాయి గాగ సత్యభామ సమాధాగం లేదు. అయినా సత్యభామ హావ 
భావవిలాసాలు ఇందుటో ధ్యనింపబడ్డాయి. పై పంక్షుల్లోని “ల” అనే అతరం 
లేతదనాస్నీ, “వమా” అనే అక్షరం సాధక (పసకిస్తున్నాయి. 


వృత్తాఐలో అగు పాసను సకుర్థంగా [పయోగించిన సందర్భాలు భాగవ 
తంలో కోకొల్తలు. రుక్మిణీ కల్యాణ ఘట్టంలో కృష్ణుడు పాంచజన్యాన్ని పూరిం 
చిన తీరును శార్టూలవి(కీడితంలో పోతన్న ఆనన్య సామాన్యంగా చెప్పినారు. 


పూరించెన్‌ హరి పాంచజన్యము కృపాంభోరాశి సౌజన్యమున్‌ 
భూరిధ్యాన చలాచలీ కృత మహాభూత (పదై తన్యమున్‌ 
సారోదార సిత _పభాచకిత పర్గన్యాది రాజన్యమున్‌ 
దూరీభూత విసన్నదై న్యమును నిర్జూతద్యిన కై ని. 


 శంథభానికీ పూరించబడటం సార్థకత. కనుక *పూరించెన్‌"* అనే [కియా 
పదంతో పద్యాన్ని ప్రారంభించి ' 'భుంభుం” ఆనే శంఖనాదాన్ని. (పతిబింబించే 
_భకారయుక్త శబ్ద పంచకాన్ని (పాంచజన్యం కనుక క) పయోగించి వృత్తాన్ని 
పీరళ స తరంగితం చేశారు. పాంచజన్య శంఖ ధ్వన్యనుకరణాన్ని సౌజన్య 
చైతన్యరైన్య చెను శబ్దాల ద్వారా నారంకు 


మరీమరీ చడవాలనిపించే రీతిలో దీ (తి చతుష్రైసంతో. అ 
పోతన్నగారికి వెన్నతో "పెట్టిన స. 


శర్మద, యమదండక్షత. 

వర్మద. నతి కఠనము క్రి వనితాచేతో 

మర్మ ద, నంబుసివారిత 

దుర్మద, నర్మద తరించె ps వటుడున్‌. 


60 


శ్రీవంబులు, ఖండిత సం 

తాపంబులు, కల్మషాంధతమన మవోద్య 
డ్రైపంబులు, పాషండ దు 

రావంబుళలు, విష్ణువందనాలాపంబుల్‌ . 


వనములు, దురితలతా 
లావనములు, దివ్యమంగళ (పాభవ సం 
జీవనములు, లక్ష్మీ సం 
భావనములు, వాసుదేవ పద సేవనముల్‌. 


ఇటీ పదా?౭నో?* ఉదావారింప వచ్చును. 
బి లి 06 


ధారాళుద్ది : 


లోకంలో పోతనగారి పద్యాలు పండిత పామర జనుల రసనాగాలపె పెన 


నివాన మేర్పురచుకొనటమే కాక కంఠస్థమై పోవటానికి గంగా (పవాహ నదృశ 
మైన ధారాశుస్టి కారణం. ఇది రెండు రకాలు _ 1. ముత్యాల మూటలవంటి 
మాటలతో మనస స్సుకు హత్తుకునేటట్లు రచించటం, ౨. నమాసబంధురంగా 
పద్యాన్ని చకచకా పరుగె త్రించటం. మొదటి పద్ధతికి ఉ దాహరణ = 


ఓయమ్మ! నీ కుమారుడు 

మా యిండ్లను పాలు పెరుగు మననీడమ్మా ! 
పోయెద మెక్కి కై నను 

మాయన్నల సురభులాన మంజులవాణిీ! 


రెండవ, పద్ధతికి కార్కాాణము- 


[(తిజగ న్మోవాననీలకాంతితను వుద్దీపింప (పాభాత న 
రేజ బందు [పభమైన చేలము పయిన్‌ రంజిల్ర సీలాలక 
[వజ సంయు కముథారవింద మతిసే గవ్యంబై [పకాశింప నూ 
వి 

జయుం జేరెడు వన్నెలాడు మది తొతశరదు నెర్ణప్పుడున్‌, 


పోతనామాత్యుని కవితాశీల్పం “el 


చి తజ వ 


కోపంతో తనవైకి లంమీంచే శ్రీకృష్ణ పరమాత్మను... భీష్ముడు 
చూచినాడు, భీష్ముడు చూచింది పోతన్న చూచి మనకు చూపించాడు. తాను 
చూడటానికి శ క్రి కావాలి. ఇతరులకు ఆ దివ్యమంగళ విగహాన్ని బొమ్మ కట్టి 
చూపటానికి మహాళ క్తి కావాలి. ఆ రూపచ్మితణశ క్రి పోతనలో తరచు 
దో్యోతకమవ్వతూ ఉంటుంది. 


కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి ' 
గగనభాగంబెల్ల గప్పికొనగ 

ఉటీకిన నోఠ్యక ఉదరంబులో నున్న 
జగముల |వేగున జగతి గదల 

చ్మకంబు చేపట్టి చనుదెంచు రయమున 
పెనున్న పచ్చని పటము జాణ 

“నమ్మితి నా లావు నగుబాటు సేయక 
నన్నింపు మని క్రీడ మరల దిగున 


కరికి లంఘించు సింహంబు కరణి మెరసి, 
“నేడు భీమ్ముని జంపుడు నిన్ను గాతు,. 
_ విడువు మర్జున 1" యనుచు మద్విశిఖవృష్టి 
దెరలి చనుదెంచు దేవుండు 'డీక్కు. నాకు. 


ఈ సీసపద్యాన్ని భీమ్మని నోట పలికించారు షోతన్నగారు. ఇందులో. 
కృష్ణుడు కోపంతో విజృంభించటం అద్భుతంగా బొమ్మ కట్టించారు పోతన్నగారు. 
“నన్ను నగుబాటు చేయకు మన్నింపు” అంటున్న అర్జునుడి దీనవదనం ఉంది. 
“నేర్చు భీమ్ముని ఇంపుదు నిన్ను గాతు విడువు మర్దున!' అని విడిపించుకొని 
బయట పడుతున్న కృష్ణుని విచితరూపం ఎట్టాగూ ఉంది, ఖీష్మని బాణాల 
వర్షంలో నుంచి తెరలి వస్తున్నాడు కృష్ణుడు. బాణ వృష్టి కురిపిస్తూనే ఉన్నాడు. 
భీష్ముడు. జ బాజ వృష్టిలో నుంచి తెరి లివచ్చే దేవుడే తనక దిక్కు అంటున్నాడు. 
చి తకారుడు గీచే నొమ్మలొ సంపూర్ణ రూపంలో కృష్ణుడు, వారిస్తున్న అర్జునుడి 
అర్భరూపం, దూరాన భీమ్మడి చిన్న రూపం కన్పిస్తుంటా మి, 


ఖాగవత వై జయంతిక 


62 

వఇటువంటే రూపచితణ మర్గొకటి నరకాసురుని పెకీ దూకుతున్న 
సత్యభామ- 

వేజి= జొల్లెముపెట్టి స సంఘటిత నీవీబంధయె భూషణ 

“శేజిం దాల్సి. ముఖేందుమండలి మరీవీజాలిముల్‌ పర్యగా 

పాణిం బయ్యెద జక ్య్థాగా డుతిమి కుంభద్వీర సంరంభయె 

తేజణీలోచన లేచినిల్బె సై | పాజేశాగభాగంబునన్‌ =. 

కడుం బిగించి పోరాటానికి సప నవయువతి సాఇజాత్కంరిస్తుంది ఈ 
వదా:ంలటో. 

ఇట్లాగే గజేం ముని రక్షించటానికి వెళుతున్న (శ్రీ మహావిష్ణువు. చలనం 

జేసి బొమ్మలు కాక కారర్జమగ్నమె మెడ చి: వాలను | శబ్దాల దారా చూసటం పోతన్న 
గారికి బాగా బచ్చు ను, 


సిరికిం జెపుతు; శంఖిచ కయుగ ముం జేదోయి సంధింప; డే 

పరినారమ్యును జీర; డ తగపతిన్‌ బి బిన్నింప; డాకర్తికాం 

సరధ మ్యుల్సము చక్కనొ త్తడు; వివాద, పోద్ద తే (శ్రీ pee 

పరీచేలాంచలమై న వీడడు; గజ: వొణావనోతా క్యాహియై, 

ఆ తొందర, ఆ పరుగు గజేం: దని | సాణాలకు క్క కాపాడటానికి, కలు 
రూపచి కాలు భాగ. తంలో చాలా చోట ట్ర్‌ కనిపిస్తాయి. 


ల 


ఎ 


శక భావ చితణ. 'పపహి స, 
న భావ చితణ. (పప డని స|త్సవరనను చి తించే సీస పద్యం 


తనయందు నభిలభూతములందు నొక భంగి 
సమహితత్వంబున జరుగువాడు 


పెద్దల బొడగన్న భృత్యుని కైవడి 


జే సమనస్క్బృతుల్‌ సేయువాడు 


పోతనామాత్యుని క వితాశిల్పం డ్రి 


రన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన 
మాతృభావన చేసి మరలువాడు. 
త ల్లిదం్యడుల భంగి ధర్మవత్సలతను 
దీనుల గావ బింతించువాడు 
సములయెడ సోదర స్థితీ జరుపువాడు 
దై వతములంచు గురువుల దలచువాడు 
రీఆలందును బొంకులు లేనివాడు 
లలితమర్శాదుడై న పహాదు డధిప! 


ప్రహ్లాదుని పేరుతో భారతీయ యువకుడు ఉండవలసిన తీరును పోతన 
గారు చెప్పారు. సమహితత్వము, సోదరస్థితి, లలిత మర్యాద-ఈ సద్గుణాలు 
(పతి భారతీయునిలో ఉండి ఆతడు |పహ్హాదునివలె భాసించాలని పోతన్నగారి 
కోరిక. సృృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన తరువాత బాల పహ్హాదుడు 
పెరిగి పెద్దవాడై వివాహితుడై రాజ పాలన చేసి తనలో పోతన్నగారు చూచిన 
వన్నీ ఆచరించి చూపించాడు. భవిష్య నృష్టి గల పోతన మహాకవి గదా! 


ప్రహ్లాదుడు తోటివారికి తన భావాలను నూరిపోసే పద్ధతి ఈనాడు ఒకా 
నొక రాజకీయ సిద్ధాంతాన్ని సాటి విద్యార్థులకు. (పటోధించే. “విద్యార్థి నాయకుడి 
ధోరణికి దగ్గరగా ఉంటుంది. “బాలకులార! రండు! మన [ప్రాయము బాలురు 
కొందరుర్విలో గూలుట కంటిరే” అని మృత్యువును చూపి తన సిద్ధాంతాన్ని. 
ఒప్సిస్తున్నాడు (పపహ్హాదుడు. “గురువు [కూరు డనర్థచయంబు నందు దుశ్శీలత 
నర్ధరల్పనము జేసెడి; (గావ్యాము గాడు శాస్రమున్‌ ; “మేలెరిగించెదన్‌ నినిన మీకు 
నిరంతర ల గ్‌ “రాజు, ఇష్టం (ప్రకారం చడువు చెబుతున్నాడు 
గురవు. అతని చెప్పే (ప్రకారం కాస్త్రం ge కాదు, మేలు నేమ ఎరిగిస్తాను- 
ఆన్నాడు (పహ్లాదుడు, 


పూ చి చిన్నతనంలో స్కూళ్లలో మవాఘనత వహించిన నిజాం (పభువును 
స్తుతిస్తూ | పోర్టనేలు చేయవలసి వచ్చే... స్ట రోజూ బడి. మొదలయ్యే సమయంలో. 
మే? స అది కోరని “వండే మాతరం" నాడే శాళ్ళం. అట్లా చేసిన విద్యార్థలను 
చింత బరితెలతో కొట్టి న. ఇచి గెంటి. ంటే క. అట్టాగే స కొలం 


రికీ భాగవత వైజయంతీక 
లోనూ పారణ; శివుని గుణగణ వర్ణ నం, సార్వభౌమత్వం, జగన్నా థతఇం 
“హైదవలలో ఉండేవి కాబోలు, హరణక శిపు డంటాడు-= “జగన్నాథుండ! నూ 


కంక క భూత శేజికి రాజు లేదొకడు.ో తననే జగన్నాథుడుగా భావించాడు. 


ఆంటూ తన సవోధ్యాయులై న బాలురకు అర్థమయ్యే తీరులో జనన 
మళ జాలకు అతీతమైన, పునరావృత్తి రహితమైన పర్మబహ్మావాపి పథాన్ని 
వెతకటం డౌడ్డబుద్ధి ఆని |పబోధించాడు [పహ్రాదుడు. ““పహ్హాదుండు రహస్యం. 
మన నయ్యూవెళల రాక్షస కుమారులకు నపవర్శ మార్గంబు నెరిగించిన వారును 
గురు శిశితంజులై న చదువులు సాలించి”” అతనినే అనుసరించారు. తం|డి 
దుర్మార్లుడె"పు.డ్తు సన్మార్గగతుడై న తనయుడు ఆతని నెద్‌రించవలనసిందే, 
కనుకనే గెకసింహుడనె శస్త్ర చికిత్సకుడు హారణ్యకశిపుడనే దుష్టాంగాన్ని ఖండించి 
(తననఖ శస్తారేంతో | వీశ్యశరిరానికి ఆరోగ్యాన్ని అంజించాడు, 


రపా చేశము ; 


కాగ వతం కాగవతో తముల గాథ, ప్రహ్లాద, నారదాంబరీషాడి భకృల 
చేరి త, ఈ షరాణ3లో భగవంతుని వన్న భక్తుడే ఉన్నత స్థానం త? 
అల చెక్క :కపురకంలో ఉన్న హరెనో ఇలకు రప్పించి “నా వంటి బాధితలు 
సదరో ఉన్నా రయ్యా! రావయ్యా!” అన్నట్టు గజేం్యదుడు వ్యవహరించాడు, 
అంబరీషుడు దుకా;సులి దుర్వార గర్వభంగానికి సుదర్శనాన్నే దర్శింపదేశాడు, 
(వష్షోదుడు దువ్ట?ిక్షణకు నారసింహ రూపంలో స్తంభంలో శ్రీ మహా విమ్రవును 
అనూ కి జపే లర్లు, గౌప్పవారితో మంచి పనులు చేయించేవారు మరి గొప్పవారు. 
భ'వంతుడికీ భక్తుకెకీ ఆదే తేడా. 


పోతనామాత్యుని కవితాశల్పం = Er 6క 
“సంసార జీమూత స:ఘంబు విచ్చునే 
చ కిదాస్య | పభంజనము లేక!” 
మహావేదాం తులు చెప్పిన జటిల భావాలను మహాకవి మనోహరంగా చెప్పి 
(శోతను ఒప్పిస్తాడు. పరమ భాగవతోత్తముడై న (్రవ్లాదునిలోని ఆవేశాన్ని 
రసావేశంతో రంగరించి రచించాడు పోతన్న. 


“శంజాయ నకు గాని కాయంబు కాయమే 
పవనగుంధిత చర్మభన్రి గాక”, 


ఒక కాయం నిజమైన కాయం కాదు. అది నిష్ప్రయోజనమైనది, రెండవ 
కాయి (కంజాషు నకు అయిన కాయం) సార్ధక మైనది, అట్టాగె- 


““ఠకమలామ్ష నర్చించు కరములు కరములు 
శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వ”. 


ఆనే పద్యంలో రెండుసార్లు కరములు అన్నాడు కవి. జిహ్వను కూడ 
రెండు సార్ద వాడాడు. ఈ ఆ| మేడితంలో గొప్ప ఆర్థం ఉందీ. నిజమైన నాల్క. 
యేదో స్త రసా వేశ ol హస 


 “అంధేందూదయముల్‌ మహా౭ధిర కంథారావముల్‌”. మొదలైన పద్యా 
అస రసావేళశభాసి తాలు. (పహ్తాదునిచేత పోతన్నగారు తొమ్మిది రకాల భ క్రిని | 
హిరణ్యశ శిపునికీ చెప్పించారు. భాగవతంలో భక్తి అంగిరసం. శృంగార 'వీర 


కరుణాదులు అంగరసాలు. వివిధ రసాలను సమపాళ్లలో రంగరించి అందించ 


గల దిట్ట పోతన్న. సత్యభామను శృంగార వీర రసాధి దేవతగా చితించిన 
ఘట్టంలో రసావెళం అనుభవైక వేదం. రాకేందు బింబమై- రవి బింబమై- 
కందర్చశేతువై = ఘనధూ ౫కేతువై, భావజు పరిఫియై | (పళయార్కు పరిథియె, 

అమృత '! 'సవాహ మై= + అనలసందోహమై, హరదాయియై - మహారోషదాయియె 
వారికీ అరి: (త్రీ క్భమ్ల నికీ నరకు నిక కనిపిస్తున్న సర్యావర్ణనంలో Ss 
ఏకత్యం క గాంచాడు పోత జ క ఏం, దుడు. 


5) 


86 భాగవత వై జయంతిక 
శృంగార హాస్యాల కలగలుపును చి తగించండి= 

ఈ గ రాకకు 

శ్రీహరి యొకింత వడకి చింతింపంగా 

“రోహా వెరవకు” మనితా 

మాహరికిని శ్రీ కుచంబు లభయం బిచ్చెన్‌. 
భరి శృంగారాల మేళవింపును వరికించండి. 

(పియురాలి వలని వార్తలు 

'పియ జనులకు నెల్ల పొద్దు పియమగు భంగిన్‌ 

[పియుడగు హరి చరితంబుల్‌ 

_పియభక్తుల కెల్ల యడల [పియములు గావె. 

వి పలంభ శృంగారాన్ని పోతన్న పోషించినట్లు అన్యులు పోనించ 
లేరేమో అని నిపిస్తుంది. విరహారలైన గోపికలు చెట్టను చేమలను కృష్ణుని జాడ 
చెప్పమని న. “కామారా హి పకృతి కృపణాః చేతనా చేతనేమి' అన్న 
కాళిదాసు శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తుంది. 


ని మల్రియలార | మీ పొదల మాటున లేడుగ దమ్మ చెప్ప జో “పున్నాగ! 
కొనవె ప పున్నాగవందిళు, తీలకంబ ! కానవే తిలక నిటలు!” “మానినీ మన్మథు 
మాధవు a సలలితో దారవతృమ్ములార !”' “అదె నందనందను డంతర్హి తుం 
డయ్యు పాటలీతరులార ! పట్టరమ్మ ! 11” అని తన్మయశ్వంతో గోవనుందరులు 
బృందావనంలోని తరులతాదులను అడుగుతూ కొన్ని కాలిగుర్తులను చూశారు. ఆవి 
కృష్ణుని పాదాలే ! సందేహం లేదు- 
కొమ్మకు పువ్వులు కోసినా డిక్కుడ 
మొనసి పాదా[గంబు మోపినాడు, 
: సతి నెత్తుకొని వేడ్క. జరిగినా డిక్కడ 
'తృణములో లేదిదే తెరవ జాడ, . 
| పీయేకు ధమ్మి ల్రంబు వెట్టీనా డిక్కడ ౨ 
కూర్చున్న చొప్పిదె కొమరు మిగులు, 
ఇంతికి కెమ్మోవి ఇచ్చినా డిక్కాడ 
వెలది నిక్కిన గతి విశదమయ్యె, 


పోతనామాత్యుని కవితాశిల్పం 87 


సుదతి తోడ నీరు చొచ్చినా డిక్కడ 
జొచ్చి తా వెడలిన చోటు లమరె, 
తరుణి కాముకేళి దనిపినా డిక్కడ 
ననగి పెనగియున్న యందమొప్పె., 
గ కాలిగుర్తులను బట్టి శ్రీకృష్ణుని శృంగారక్థీచేష్టలను జ్ఞాపకం చేసుకొంటున్నారు 
పికలు. 


ఒక యెలనాగ చే యూదినా డిక్కడ 
సరస నున్నవి 'నాల్లు చరణములును 
ఒక నీలవేణితో నొదిగినా డిక్కడ 
మగజాడలో నిదె మగువజుడ 
ఒక లేమ (మొక్కిన నొడిసినా డిక్కడ 
రమణి (మొక్కిన చొప్పు రమ్యమయ్యె 
ఓక యింతి కెదురుగా నొలసినా డీక్కడ 
అన్యోన్య ముఖములై అం|ఘులొ ప్పె 
నొకతె వెంట దగుల నుండక యేగినా 
డడుగు మీద తరుణి యడుగు లమరె, 
అబల లిరుకెలంకు లందు రా తిరిగినా. 
డారు పదము లున్న వమ్మ! యిచట. 


_ సరసన నాల్గు చరణములు, మగజాడలో మగువజాడ, రమణి (మొక్కిన 
చొప్పు, అన్యోన్య మఖములై న ఆం|ఘులు, అడుగుమీద ఆడుగు, ఆరు 
పదముల ఆసద్భశ శృంగార చేష్టలను స్ఫురింపజేస్తున్నాయి. (శ్రీకృష్ణ పద 
చిహ్నాలను శృంగార రసంతో తడిపిన పోతన్న ఆంతలోనే--- 


“ఈ చరణంబులే ఇందునిభానన! 
సనకాడి మునియోగ సరణి నొప్పు, 

సీ పాదతలములే యెలనాగ! |వతివధూ 
సీమంత పీధుల చెన్నుమిగులు, 


కర య అ భాగవత వె జయంతిక్‌ 


a పదాబ్దంబులే యిభకులోతమయాన ! 
పాలేటి రాచూలి పట్టుకొమ్మ, 
లీ సుందరాం[ఘులే యిందీవరెక్షణ ! 
ము క్రికాంతా మనో మోహనంబు. 
లీ యడుగుల రజమె యింతి ! (బహ్మేశాడి. 


_ దివిజవరులు మౌళి దిశల క్‌, రంటూ భ క్తి రసావేశంలోకి వెళ్చి 
సే పోతారు. 


వీర రసం అనేక విధాలు. దాన ధర్మ దయా పాండిత్యాదులు, poe 
గారు చి, తించిన బలిచ|క్రవ రి రి దానవీర మూ దిగా. సాకాత్కరిస్తాడు. 


ఆదిన్‌ శ్రీసతి కొప్పుపె తనువుపె పె అంసో తరీయంబుపె. 
పాదాబ్దంబుల పై ) కపోలతటి పె పె పాలిండ్త పె నూత్నమ 
ర్యాదం జెందు కరంబు [కింద గుట మీదె నా కరంబుంట మే 
లాడే! రాజ్యము గీజ్యమున్‌ సతతమే ! ౩ కాయంబు నాపాయమే ! 
““రాజ్యము hs " అసిపీంచారు. జలిచ। కన ర్తి రితో పోతన్న . దీదీ a 
ss కాదు. ws 
“ఈ అజాండమ్ము నందు నశించు నని, Ee 


చ 


గాలితో దీప మట్టుండె గాదె. రపియు” 


అని నేను అనువదించాను గాలిబ్‌ పంక్తులను. కోట్ట సంవత్సరాల నుంచీ స 
. ఉంటున్న. సూర్యుడు కూడా ఒకనాటికి చల్లారిహోక తస్పదు. ఇక రాజ్యాలు 
. he ఎంతకాలం ఉంటాయి?! 1 


పోతన్నగారు ఉహ తంగా పోషించిన కాచత్త రషాన్నీ, ఆందులో ఆయన లై 
(పకర్షనిక రసావేశాన్నీ ఉ ఉదాహరించి నా వ్యాసాస్న్‌ ముగిస్తాను, 


. అశ్వద్ధామ. నిర్ణయుడై. ఊప పాండవులను వధించిన ుట్టమెది. పాకి 


సోతున మ అశ్వర్థామను. పట్టి బంధించి. కృష్ణని ఆజ్ఞ మెరకు క చంపకుండా 
ఖే ప. వద్దకు తీసుకున స్తాడు అర్జునుడు, 


నక సురరాజసుతుడు స సూ పెను. 


దరవరిసుకశోకయతకు. వర్ద ని సుతకున్‌ 


పోతనామాత్యుని క వితాశిల్పం ణీ 69. 


బరిచలితాంగ ్రణిం 

బరుషమహాపాశబద్ధపాణిన్‌ (దౌణిన్‌. 

ఇట్టద్దనుండు తెచ్చి చూపిన బాలవధజనీత పజ్తుపరాహ్మఖుండై న గురుని. 
కొడుకుం జూచి (మొక్కి సుస్వభావయగు (దౌపది. యిట్లనియె. 


అయిదుగురు ' కొడుకులు నిదిస్తుండగా చంపిన వానికి దౌపది 
_మొకీ_౦ది, మొక్కి ఇట్టా పలికీంది=. 


'“పరగన్‌ మా మగవార పశ టిటు మున్‌ దాణ|పయోగోవసం 

హరణాద్యాయుధ విద్యలన్ని యును. (దోణాచార్యుచే నభ్యసిం 

చీరి; పు[తాక్ళతి నున్న దోణుడవు; నీ చి తంబునన్‌ లేశమున్‌ 

గరుణాసంగము లేక శివ్యసుతులన్‌ ఖండింపగా బాడియే!” 

““పుతాకృతిలో ఉన్న [దోణుడవు”' అన్నది |దౌపది. “శిశు మారణము 
ఆసురకృత్యంబు ధర్మమగునే తండీ! $ అని కూడా అన్నది. అక్షరాలు 
చంపిన ఉప పాండవులు ఎటువంటివారు వ 


“ఉ దేకంబున రారు, శస్త్రధరులై యుద్దావనిన్‌ rE కిం 

చిద్దో9హంబును సీకు చేయరు; బలోత్సేకంబుతో బీకటిన్‌ 
3 భ|దాకారుల విన్నపాపల రణ[పౌఢ| కియా హీనులన్‌ 
నిదాసక్తుల సంహరింప నకటా! నీచేతు లెట్లాడెనో!'' 


ఆ తల్టి తన కోకాన్ని తనలోనే దాచుకొని నమస్కరించి. శతం డీ" 
అని సంబోధించి ఈ మాట లన్నది. కాంతరసాధి దేవత |దౌపది, పోతన్న గారు 
దౌపది ద్యారా తమలోని శాంతర సావేళాన్ని (పదర్శించారు. . “నేను నా కొడు 
కుల కోసం ఏకుస్తున్నట్టుగా అశ్వత్థామ కోసం అతని తల్రి శోకీస్తూ ఉంటుంది, 
గురుసుతుని చంపకండి, వదలి వేయండి”అని [దౌపది భరలను కోరుకుంటుంది. 

రసావేశపరుడై న పోతనామాత్యుడు ఆంధ భాషను, ఆం|ధ దేశాన్ని 
రసప్టావితం చేశాడు, తన ఆంధ మహాభాగవత మవి పురాణ రచనతో, 

“భాగవత పురాణ ఫలరసాస్వాదన 

పదవి గనుడు రసిశభావవిదులు”* 


జ. ® 


ఫోతరాజుగారి లోకజ్ఞత 
శ్రీ అవ్వారి సుబహ్మాణ్య కొని 


(పహ్హాదుని చరితమును వ్యాసులవారు ఉపనిషత్సిద్దాంత మును వెల్లడించు 
టకు సాధనముగా దీసికొని భ కనాన వె రాగ్యములకు తార్కాణ చేసెను. పోత 
రాజుగారు |పహ్హోదుని వ్యాసుని మాటలతోనే కాక స్యతం|తించి సైతము కొంత 
వర్ణించి యొక rs వ్య క్రియొక్క (పతికృతిని చితించి చూపెను 


ఇది మన వాజ్మయ మందెల్లెడల గల యంశమే. ఏ గంథక ర సత్య 
గుణమున కగస్థాన మిచ్చియండలేదు? ఏ కవి సాత్వికులైన మహి పురుషులకే 
పర్యవసానమున జయమును సమర్థించి యుండలేదు? ఏ ప్ర స్తకమున - సొత్వికుల 
నిష్టా విశేషమును జూప్తటకే రాజస తామసుల చరితము ల పధానముగ (పతి 
నాయకవృత్ర త్రములలో శేర్చియో, (పానంగిక కథలుగ జు ర | 


లేదు? 


పోతరాజు గారు [పహాదుని మహిమ కొరపిడి రాయిగ దీసికొనఐడిన 
దైనను హిరణ్యకశిపు పాత్రము యొక్క. స్వభావ విశేషముల నచ్చొ త్రి చూపుచు 
రాజస తామస్మపకృతుల సురూపకథనమునకు చాల (పాధాన్యము నిచ్చి కవి 
కుండవలసిన లోక జ్ఞతను వెల్లడించియన్నాడు.. రాజసులలో మొదటి స్థానము 
oe నధిష్టించియుండెడి “హిరణ్యకశిపుని వంటి ఐలకాలికి, సమర్ధనకు, లౌకిపనకు 
'వరమవిర క్తుడైన కొడుకు దాపురమైశప్పు డాతని చేత మే తీరున నుండునో, 
ఎట్టి విచార మాతని కుద్భవించునో, అతడు ఏమి యాలోచించునో, ఏమి సంఖా 


_ షెించునో, ఏమి చేయునో ళు పూన్యగచ్చివట్ట పోతన వు 
చూడుడు... . 


లభ్యంబై న సురాధిరాజపదన మున్‌ లకింప( mee 
మ నున్నవా( డబలు(డ్రె. ల వీడు వి, 


ఫోతరాజుగారి లోకజ్ఞత 71 


ద్యాభ్యాసంబున6 గాని తీ వమతి గాం డంచున్‌ విచారించి దై 
త్యేభ్యుం డొక్క దినంబునన్‌ |బియసుతున్‌ వీక్షించి సోత్కంఠుండై 
ee 


తాను సమర్గుడె స్వార్ధపరుడై కార్యహరుడై కావలసినంత ఆస్తి సంపా 
దించినాడు. కవత నాకు లే డనిపించుకొనినాడు. ఒకరికి లొంగక పవర్తి రించి 
నాడు. కొడుకు కూడ తనంతవాడు కావలెనని ఆక, ఉపన్యాస వేదికల పె 
కెక్కినపు డేదియు కాశ్వుతము కాదని యుపన్యాసము లిచ్చుచునే యున్నాడు. 
కాని తన కొడుకు హరినామస్మరణము చేసికొనుచు | పయోజకు డనిపించుకొన 
నప్పుడు, బైరాగి వేషమున నున్నపుడు, బలపర్నాకమాదులు గలిగి నిగహాను 
(గహసమర్డుడె లోకమును గడగడలాడింపనపుడు ఆతని సభ్యత్వము సాధు 
త్వము మొదలై నవి తండి కాత్మలో రుచించునా ? కొన్ని వేలు సంపాదించుకొని 
వృత్తి సన్నాాసము చేసియున్న పెద్ద మనుష్యులకు (మనీషులకు) మాత్రము తమ 
కొడుకు బి. ఎల్‌, పరీక్షలో ను శ్తీ్తుడె వెంటనే పాపఖీతిచే న్యాయవాది పదము 
నంగీకరింపకున్న సాధారణముగ సమ్మతమగునా 2 


(పహ్హాదుని సభ్యత్వము జ్ఞానము వలన గలిగినది కాని దౌర్భ్చల్యముచే 
గలిగినది కాదు. కాని తంగడి కది యిష్టము కాదు కావున దుర్చలతచే. గలిగిన 
దని నెపము వెట్టి గర్హించుచున్నాడు. జ్ఞానముచే [ప్రపంచము ననిత్యముగ 
దెలిసికొని “విశ్వామండు( గన్న విన్న యర్భములందు వస్తుదృష్షి( జేసి వాంఛ 
యిడ(డు' అని తాను స్యయముగ దెలిసికొనియ నద్దానిని గర్హింపకున్న తాను 
బహిరంగ సభలలో ధర్మ పన్నాలు ఏకరువు వేయుటకు 'సేలుండదు కదా! 


ఆంధప కీయ నున్న వా(డు; పలుకం డస్మ|త్పతాప| కియా 
గంధం దించుకలేదు; మీరు' గురువుల్‌ కారుణ్యచిత్తుల్‌ మనో 
ఐంధుల్‌ మాన్యులు మాకు( బెద్దలు మముం బాటించి యీ బాలకున్‌ 
[గంథంబుల్‌ చదివించి సీలికశలుంగాం జేసి రశ్నీంపరే ! (7 182) 


తన ప్రతాపము దావానలమై సకల భువనముల మాడి వేసినది, సమర్ధు 
డైన తన దౌర్గన్యముచేత దేవేందు నంతవాడు తన _మోల నొదల నెత్తలేకు 
న్నాడు. తన్ను మించిన వాడు తన కొడుకు కావలెనని యువ్విభారుచున్నాడు. 


72 భాగవత వై జయంతిక 


“సర్వ త జయ మన్విచ్చేత్‌ పుతాడిచ్చె తృరాజమయమ్‌ !' కొడుకు దాం వేరై నది. 
"ఆ గ! తాను చదివిన తేద శాస్ర్రామలలో నెల్చవోట్ల కె వారము సేయ 
బిడునదియైనను, తాను పరులకు ధర్మోపన్యాసములు చేప్పునపుడు మాటిమాటికి 
నోట వచ్చుచుండునడియెనను ఆత్మకు నచ్చినది కాదు, 


అంతఃకరణము లన్నియు నొక్కరీతి ను౭డవు. సాత్వీకాంతఃకరణమునకు జ 
న మార్గము రుచించును, ర సమానస,ంధులలో గొప్ప కావలసి - 
నడి. “సమానానా ము తమకోకో=సు ఆని (శతి రాజసవాంఛ ననువదించు 
చున్నది. తొమసులకు నిద, సోమరితనము. మున్నగునవి నచ్చియుండును. కాని 
పుస్తకములు చదివినవారు పుస్తకముల మాటల కలవాటుపడి ' అందరును బహి. 
రంగ [పస సంగములలో వాసికొడకు ధర్మకమెన సాధుమార్గమునే ర్ధాఘించు _ 
చుందురు. అంతఃకరణములోని మాలిన్యము కార్యకాలమున వెల్లడియగును. 
హిరణ్యకశిపుడు తా ననుకొనుచున్న |పహ్హోదుని జాడ్యము కటట. _గంథములు 
చదువుటకే పోవునని యెంచెను, అవును, ఆ | గంథములలో POS & 
నిగహాను గహములు పురుషార్థముగ చెప్పబడును, ఆ సంస్కారము మనమున 
కంటుకొని బాలుని శీలము మారుట రాక్షస రాజుద్దేశించినది , 


పాఠశాల చదువు నారదమవార్షి 'యనుగహించిన ప పరవిద్యాపరిపాకమున 
కృతార్గుడై యుండిన (పహ్హోదుని మార్చగలిగినది కాదు. అంతకంతకు నారవోప 


డేరము తలకెక్కిపోయినది.. శతిమించి రాగాన బడినది. విష్టుచింతలో సుతుడు _ 


మునిగి తేలుచుండుట తం; డికి (పత్యక్షమైనది. ఆశ్చర్యము గల్లినది. వాత్స 
క 


నాకుం జూడగ జోద్యమయ్యెడి గదా నా ా తండి! యౌ బుద్ధి దా 
FF సీకున్‌ లోపల దోణెనో పరులు దుర్నీ తుల్‌ పఠింపించిరో 
a యేకాంతంబున భార్త వుల్‌ వలికిరో; యౌ దానన శ్రేజికిన్‌ 

'వైకుంరుండు గృతాపరాధుం డతనిన్‌ వ వర్ణింప. నీకెటికీన్‌, (7. 1) 


నుచున్నాడు. నా తండి” అను పదము. కోకరురముతో . కలసి ఘూర్డిల్లు 
త్స ్రవాహమను న వ _్రకింధముకే 


పోతరాజుగారి లోకజ్ఞత 78 


కొడుకు ననగలేక పరుల మీదికి పోవుచున్నాడు. కర్కడ నసాధువగు ఈక 
సాధువణి కొడుకుతో నేకీభవింప | మేరణ సేయు పుత్ర స్నేహము నాగికొనలేక 
ఆయ్యనిష్టమునకు తనకు తన చుట్టుగల శ్యతుమండలమే కారణమేమో! అని 
యనుమానపడుట సహజముగ నుక్నది, అత్యంత విశ్వా సార్హలై న కులగుర వుల 
మీద గూడ సంశయము గల్లినది, అహా! దారేషణా పు; శేషణా. ఢధనేవణజలెంతకు 
లేవు? చివరకు వాత్సల్య వివ వశుడై ఉరికి కొనుత న్నాడు? దానవ, శేజికి 
వెకుంఠుడు కవన తర అతన 


- దేహాభిమానము. గలవారికి జాతి పె నభిమానము. డును. ప్రహ్లాదుడు 
దేహ; తయాతీతుడై. యున్నాడు. ఆతనికి దానవజాతికి విరోధి యనినంత మ్మాత 
మున 'విష్షువుపై భక్తి పోలేదు. | 


_సురలం దోలుటయో సురాధిపతులన్‌ (సుక్కించుటో సిద్ధులం 
బరి వేధించుటయో ముని పవరులన్‌ బాధించుటో యక్షకి 
న్నర గంధర్వ విహంగనాగ పతులన్‌ నాశంబు నొందించుటో 
హరి యంచున్‌ గిరియంచు నేల చెడ మోహాంధుండవై కం (7.146) 


ఇట్టి దౌర్దన్యము నెట్టుప పదేశించెనా యని మన క చ్చెరువు గల్లుభున్నది. 
కాని యీ పకృతియే లోకమున విశేషముగ (ప్రచారము కలది. జాతీయ కళా 
శాలలు మున్నగువానిశి స్థాపించి పెక్కురు విద్యార్థులకు అన్న పానము లొసగియు 
పండిత సత్కారము లొనర్పుచుండియు పూర్వవిద్యోల నెల్ల పునఃపతిష్ట చేయ 
వలయునని భగీరథ [పయత్నము లొనర్చు. దేశోద్ధరణబద్దక ంకణులగు స సంప 
న్నులు తమ సుతుల నింగ్రీషు కాలేజీల నుండి యేల సీసికానిరారు? బాల కొలము 
న్యాయవాద వృ శ్ర తిలో మెలగి కొంచెముగనో గొప్పగనో అనృతో క్రి సంబంధము 
_లేక యావృత్తి నడవధని (తికరణళుద్ధిగా నెరింగిన ముదుసలి న్యాయవాదులు 
బిఏ, ప్యాసై os తమ ప్వుతులను లా కాలేజీల కే కేల పంపుచున్నారు? 


_ఎల్పరకును, పాపభీతి. కన్న పదుగురిలో. గొప్పగ భామను, తమ 
వాండును కాల క్నేసము చేయవలెనను కోరిక మెండు. ఈ పామరత్వము జాన 
బలము: వలనగాని రూపుమాయదు, అది రాజస పకృతి కలభ్యము. కొని 


74 భాగవత వై జయంతిక 


యెంతటి రాజసుడై నను- బహిరంగముగ నిట్టిమాటలను నోటరానీయడు. వాసి 
పోవునని భయము. హృద్గుహలోపల నిగూఢములై యిట్టి యాశథయము లుండీ 
యేకాంత [పసంగములలో వెలువడుచుండును. వీనిని పోతన కసిపెటినాడు. 


అ 


“రవి కాననిచో కవి కానకుండునే' యనుట యిదియే. ఇదియే కవిదృన్షి. ఈ 


రీతిగా పార ణ్యకశిపు నింకను బలు కల్పనలతో [పదర్శించిన వాడు పోతరాజు 
గారు; వ్యాసులవారు కాదు. కొవున సహజ పాండిత్య విలాసమైన యిట్టి లోక జ్ఞత 


క. పలుచోట్ల పోతన కవితలో కన్పట్టుచున్నది. 


(భారత, నవంబర్‌ 1929) 


రాజ(ట ధర్మజుండు | సురరాజసుతుండట ధన్వి | కాశవో 

ద్వేజక మైన గాండివము విల్రంట ! సారథి సర్వభ[ద సం 
యోజకు (డైన చకియ(ట! యు[గగ దాధరు(డై న థీము( డ 

య్యాజికి( దోడు వచ్చునంట ! యాపద గల్లు టిదేమి చోద్యమో ! 


యాదవులందు. బాండవులయందు నధీశ్వర ! నాకు మోహ వి. 

చ్చేదము సేయమయ్య. ! మఘనసింధువుంటే రెడి గంగభంగి నీ 
పాదసరోజు చింతనముపై ననిశంబు మదీయ బుద్ధి న 
హరన 3 ఖే గదియ నట్టుగః ౬ కేయగదయ్య హన. | 


శ్రీకృష్ణా | యదుభూషణా ! నరసథా ! శృంగార రత్నాకరా ! ప 
అ లోక దోపి నరేందవంశదహనా. | లో కేశ్వరా ! దేవతా 
సిక బ్రాహ్మణ గోగణా రిహరణా ! నిర్వాణసంధాయకా ts 

= సీకున్‌ యొక్కెద( దుంపవే భవలతల్‌ నిత్యానుకంపానిధి ! - 


/ సతతం మందులను. ఏరా! 
టప మాన aa: న టట ల 


బమ్మెరవారి జ క్రిసామాజ్య వై ఎ భవం 


అ డాక్టర్‌ జంధ్యాల జయకృష్ణ me 


రాజు కాని రాజు బమ్మెర పోతరాజు, నువిశాలమైన సురుచిరమైన భ క్తి 
సా మాజ్యాసికి ఆయన మకుటంలేని మహారాజు. (పతి మానవునికి పరమావధి 
మోక్షాన్ని అందుకోవటం. పునరావృ తి రహితమైన మోక్షాన్ని పొందటానికి 
పెద్దలు నాల్గు మార్గాలు తెలిపారు. ఆప కర్మ జ్ఞానయోగ భ క్రిమార్గాలు. వీనిలో 
అందరికి అందుబావైనదీ, ఆచరణ యోగ్యమైనదీ, సులభసాధ్యమైనదీ భ కి 
మార్గం, ఇది తొమ్మిది విధాలుగా ఉంటుంది భగవంతుని గూర్చిన [శవణం, 
కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ 
నివేదనం అని, 


గ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం. 
ఆర్బనం వందనం దాస్యం. సఖ్య మాత్మనివేదనమ్‌. 
ఆని శ్రీమద్భాగవతం చెప్పిన శ్లోకం పోతన్నగారి భాగవతంలో... 
తనుహృద్భాషల సఖ్యమున్‌ ఆ్రోవణమున్‌ దాసత్వమున్‌ వందనా 
ర్ననముల్‌ సేవయు నాత్మలో నెలుకయున్‌ సంకీ రనల్‌ చింతనం 
బను నీ తొమ్మిది భక్రిమార్గముల సర్వాత్మున్‌ వారిన్‌ నమ్మి స 
జ్ఞనుడై యుండుట భ[గమంచు( దల(తున్‌ సత్యంబు దైత్యో త్తమా! 
అన్న ఐదేండ్ల బాల్మపహ్హాదుని పద్యంగా రూపం సంతరించుకున్నది. ఈ నవవిధ 
భ కులకు |పతీకలుగా నిలిచి తరించిన మహనీయులను గూర్చి వెల్లడించే స్నుప 
సిద్ధమైన శ్లోకం చిత్తగించండి. 


 థ్రీవిహ్రోః శవణే పరీక్షి దభవ దై్యయాసకిః కీర్తనే 
న పహ్హాదః స్మరణే తదం[ఘిభజనే ఇతః సృథుః పూజనే. 
... అ్య్కకూర స్వభివందనే కపిపతి రాసే చ. సభే్య=_ర్జునః 
సర్వస్వాత్మసమర్శణే బలి రభూత్‌ కృష్ణాప్టి రేవంవిధా, 


“76 భాగవత వై జయంతిక 
(శ్రీమహాపిష్టువు యొక్క [శవణము నందు పరీక్షిత్తు, కీ ర్రనమందు 
శుకుడు, స్మరణమందు (పహ్హాదుడు, పాదే సవయందు లక్ష్మీదేవి, అర్చన మందు 
పృథుచ[కవ ర్తి, ఆభివందనమందు అక్రూరుడు, దాస్యమునందు హనుమంతుడు, 


_ సఖ్యమందు అర్జునుడు, ఆత్మనివేదన మందు ఐళియు కృతార్ధురైనారు. కృష్ణథ వ్‌ 
ఈ విధమైనట్టిది.) 


(పస్తుత వ్యాసంలో పోతనామాత్యుని భాగవతంలో ఈ నవవిధభక్ర్తుల 
స్వరూపనిరూపణాన్ని సంగహాంగా. సమీకేద్దాం.. 


శ్రవణం On 


భగవంతుని నామ గుణ చరి తాదులను (శద్దతో. ఆలకించటమే (శవణ 
భక్తి కి. హరి గుణోపలిత భామణాలుు వాణికి భూషణాలనీ, అమపే షణాలనీ, 
_ మృత్యుచిత్త భీషణాలనీ, హృ ,తోవణాలనీ, కల్యాణ విశేషణాలనీ శౌనకాది 
మహామునులు సూతువితో చెప్పి మాట మాటలోనూ మూలుర్యోన్ని చిందే కృష్ణుని 
కథను వినాలనే కోరికను కలాలు. (లీ 46, 48). 


(శ్రవజభ కి క్రికి ఉదాహరింపదగినవాడు పరీక్షిన్మహారాజు. వేటకోసం ఆర 
జ్యానికి వెళ్ళి అలసిసౌలసి శమీకమహాముని ఆశ్రమానికి వెళ్ళి డగ్గుక్తికతో 
మంచినీటిని అడగటం, ఆయన. ధ్యాన నమాధిలో ఉండటంవల్ల బదులుపలుకక . 
పోవటం, పరీక్షిత్తు ఆగహంతో మృత సర్పాన్ని ఆ ముని మెడలో చేసి వెళ్లటం, 
ముని కుమారుడై న శృంగి వచ్చి. తండి. మెడలోని సర్పాన్ని చూచి పట్టరాని | 
ఆవేదనతో ఆవేశంతో ఆ ఘాతుకానికి. పూనుకొన్న వ్యక్తి ఏడు దినాలలో 
తక్షక విషాగ్ని కీలలకు గురియై. మరణిస్తాడని శపించటం, శమీక మహాముని 
పంపిన శిమ్యని ద్యారా ఈ వా - ర్రవిన్న పరీక్షిత్తు. విరక్తుడై వ్యాస ససుతుడై న థ్రీ 
కుకుని వలన - మోక్షకారక మైన భాగవతాన్ని వీడుదినాలలో ఆలకించి. శృంగి. 
కాపానుసారం దేహాన్ని. త్యణ్లిం చి. కై వల్యాన్ని అందుకోవటం. జరుగుతులది. 


వాగవత మహ(గంథంలోని పండ్రెండు స్కంధాలల్లోనూ. పరీక్కిత్తు విష్ణుభక్తుల త 


కథలనూ, విష్ణువు చివ్యావతార విశేషాలనూ వింటూ కన్పిస్తాడు. దళము. సంధం 
వివరలో శ కృష్ట వినిపిస్తూ థః కకుడ మరో పలికిన- స 


మ్మారవారి భ క్రిసా[మాజ్య వైభవం 7 


మనుజేం దో త్తమ! యేను నీకు (తిజగన్మాంగల్యమై 'యొప్పం జి 
ప్పిన యీ కృష్ణకథాసుధార సము సం పీతాత్ములై భక్తి( మ్య 
లిన పుణ్యాత్ములు గాంతు రిందు సుఖముల్‌ నిరూత సర్వాఘులై 
యనయంబుం దుది( గాంతు రచ్యుతపదంబై నట్టి కె కై వల్భమున్‌, 


అనే యీ పద్యం శ్రవణ, పాధాన్యాన్ని [పస్పుటం చేస్తున్నది. 


కీర్తనం : 
భగవంతుని గుణలీలాదులను వర్ధించటం కీర్తనభ క్తి. కౌరవ పాండవ 
యుద్ధం ముగిసిన తరువాత కుంతీదేవి. 


శ్రీ కృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా! 
లోకదోహి నరేం దవంశదహనా! లో కేశ్యరా! దెవతా 

నీక (బాస్మణ గో గణార్తి హరణా ! నిర్వాణ సంధాయకా! 
సీకున్‌ (మొ క్కెద( (దుంపవే భవల తల్‌ నిత్యాన ఏకంపానిథి ! 


అనీ (శీకృష్ణుణి మనసారా కీర్తిస్తుంచి (1.200). యాదవుల యందు పాండవుల 
యందు తనకు గల మోవోన్సి, తొలగి: ది సను; దాన్ని చేరే గంగలాగా సీ పాద 
పద్మ చింతనంలో నా బుద్ధి మగ్నమై ఊండేట పట్టు చేయమని ఆమె ఆకాంశ్నీ స్తుంది 
(1.199). 


ణప ఉద్దీపించిన [తిజగన్మోహన సీలకాంతి తనువుతో,. పైన రంజిల్లు 

న్న (పాభాత సీళజ బంధు పభ మైన చేలంతో, పవి|తమై శోలించే సీలాఐక 
(| సంయు కైన ముథారవిందంతో విజయుఖ్జి సమీపించే వన్నె లాణ్ణీ మన 
కన్నులముందు కదలించిన భీష్మప (1.218) కూడా కీ ర్రనభ క్తి 
సంయు క్తుడే. 


స్మరణం : క 
౨ భగవంతుని విస్కరింపక ఏరలతరం . ధ్యానించటం స్మరణళ క్తి, 


ఇందు ఫ్‌ నిదర్శ సంగా భాగవతం ద! చప గ త్త. కన్ని ఇదే. ఇటాల్లంగ 
ప్రభువు. ఏ పేక్కానవచ్చు. వకమార్షి సరికత్తుతో ' ష్‌ హరినాష ము సంస్మరణ 


18. . భాగవత వై జయంతిక 


మొక్క ముహూర్త మ్మాతము చాలు ముక్తిద మౌ నృపా!” అంటూ 
ఖట్వాంగుని వృతాంతం చెబుతాడు. చ; [కవ రి అయి న ఖట్వాంగుడు దేవదానవ 
యుద్ధంలో దేవతలకు సహాయంగా వళ రాక్షసులను సంహరించి జయం' 
చేకూరు స్తాడు, దేవతలు సంతోషించి వరం కోరుకోమంటారు. తన జీవిత 
[ప్రమాణం ఇంకా ఎంత ఉన్నదో చెప్పమంటాడు ఖట్వాంగుడు. ముహూ ర్ర 
మా|తం ఉన్నదంటారు దేవతలు. వెంటనే ఖట్వాంగుడు గగన మార్గంలో తన 
రాజభవనానికి చేరుకొని చతురంగ బలాలను, శుద్దాంత కాంతలను, హితులను, 
పండిత (శన్టులను అందరినీ వర్ణించి గాఢ వైరాగ్యంతో... 


గోవింద నామకీ రన 

గావించి భయంబు. దకీ్మ. ఖట్వాంగ ధరి 

తీవిభుడు సూజగొనియెను సే 

గై వల్యము. దొల్లి రెండు గడియల లోనన్‌, (2.11)... 


భగవన్నామ స్మరణ మేవం విధమైనది. ఇదే విధంగా అజామిళుడనే 
|దాహ్మణుడు దుర్వ్యసన పసరాయణుడై సర్వ విధాల |భమ్ష్షడె చివరకు మృత్యు 
ముఖంలో ఉన్నప్పుడు అతనికి ఆతిభయంకరాకారులై యమదూతలు కన్పిస్తారు. 
వారిని చూచిన అజామిళుడు వికలేం ది యుడు, వికంపిత (పాణుడు, వికృత 
లోచనుడు, విహ్వలాత్మ కుడు అవుతాడు, అవ్పుడు దూరంగా ఆడుకుంటున్న 
_ తన కుమారుణ్ణి చూచి “నారాయణా” అని సెరుపెట్టి ముమ్మార్లు పిలుసాడఈ.. 
తెలిసినా తెలియక పోయినా నారాయణ నామస్మరణ చేయటం వల్ల విష్ణు దూతలు 
వచ్చి యమదూతలనుండి అజామిళుజ్జి విడదల చేస్తారు, అనంతరం ఆజామిళుడు 
. విష్ణ భ కుడై యోగమార్షంలో దేహాన్ని త్యజించి మోక్షాన్ని | అందుకుంటాడు. 


పాద సేవనం : 


భగవంతుని పొదాలను, భక్తుల. పాదాలను, గురువుల ' పొదాలను, 
ర పాదాలను సేవించట మే పాదే సేవన భ శి. అందువల్లనే శౌనకాదులు 
తునితో ఇట్టా అంటారు 


బమ్మెరవారి భ క్రిస్మామాజ్య వైభవం .. 


పావనములు దురితలతా . 

లావనములు నిత్యమంగళ |పాభవ సం 

జీవనములు లక్ష్మీ సం 

భావనములు వాసుదేవ పద సేవనముల్‌. 

నిజమే. శ్రీకృష్ణుని పాదసేవనములు పవితమైనవి, పాపలతలకు 
కౌడవళ్ల వంటివి, నిరంతర శుభాకరమైనవి, శ్రీదేవీ . గౌరవాస్పదమైనవి. 
- ఇందుకు తార్కా-ణం సుదాముని చరిత, మధురానగరంతో మాలాకారుడై న 
సుదాముడు కంసుని ధనుర్యాగం చూడడానికి వచ్చిన బలరామ కృష్ణులను 
ఆహ్వానించి అర్బ్యపాదాలు, తాంబూల కుసుమగంధథధాలు, సురభిళ పుషృదామాలు 
అర్పించి (శీకృష్ణుణి ఈ విధంగా వేడుకొంటాడు- 


సీ పాదకమల సేవయు, 
సీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాం 
తాపార భూతదయయును 
'దాపస మందార! నాకు దయసేయంగదే. 
ఆతనికి “బలాయుః కాంతి కీర్తి సంపప లను గపిస్తాడు కృష్ణుడు, 


అర్చనం | 

తులసీ పుష్పమాలాదులతో భగవంతుని పూజించటం అర్చన భక్తి, 
ఇందుకు మధురానగరంలో కంసుని పరిచారిక ఆయిన కుబ్దను ఉదావారింప 
వచ్చు. రకరకాల చక్కని చిక్కని లేపనాలు తయారు చేయటం ఆమె పని, 
“పి శ్పేర్రేమిటి? లేపనాలు ఎవరికోసం తీసుకుపోతున్నావు ?'" ఆని | పళశ్నిలచిన 
కృష్ణుడితో 


చక్కనివాండ వౌదు; సరసంబుల నొంపకు; మెల్లవారికిం 
జక్కా(దనంబు లెక డివి" చారుశరీర! త్రీవ!క యండు; నే 
నిక్కము కంసుదాసిని; వ్‌ని6 సలలేపన విద్యదాన; నన్‌ 
మిక్కిలి రాజు మెచ్చు; దగ మీరు విలేపనముల్‌ ధరింపరే. 


80 : భాగవత వై జయంతిక .. 
తత | పేమతో తనవద్ద ఉన్న లేపనాలను అందిస్తుంది, ఆ లేపనాలను ఒంటికి 

అలదుకొని కృష్ణు తు తే పాదాలే పై తన పరం మూవి చుబుకొన్ని స్సృశించ 
గానే విరూపగా ఉన్న కుబ్ద్బ స సురూపగా మారిపోతుంది, “చక్కనైన చి త్తజన్ము 
బాణము (కీయ కోమరు మిగిలిన ఆ సుందరీ మణిని బుజ్జగించి అన్నతో కలిసి 


ముందుకు వెళతాడు. భగవదర్చనా భలితం ఇటువంటిది. 


వందనం : | 
భ క్షిశద్ధంతో భగనంతునికి నమస్కరించటం వందన భ క్తి, 


ఆకాశాత్పతితం తోయం యథా గచ్చతి సాగరం 
సర్వదేవ నమస్కారః కేశవం Eons 


' ఆకాశం నుండి పడుతున్న జలం సమ్ముదంలో కలిసినట్టుగొ ఏ దేవతకు 
నషస్కం రించినా ఆది శ్రీ కృష్ణునికే చెందుతుంది. ఇందుకు: అ(క్రూరుడు మనకు. ' 
నిదర్శనంగా దర్శనమిస్తాడు. బలరామకృష్ణులను రథం మీద మధురకు తీసుకొని 


రావాలని వస్తాడు అకూరుడు.. పగ గోవిందుజ్జి, బబరాముణ్ణి సమీ 


పించి. 


| కని వాళల కము 
విశయంలబున (మొక్కె భభ క్రివివశుం డగుచుం 
_ రగనువునం బులకాంకురములు వ 


న్‌ మొనయంగ ర జడీ గురియన్‌, (10. | 1208) 


భ్‌ క్రిశన్మయుడై -రోమాంచంతో అనందబావ్చవర్ష ధారలతో బలరామ... 
కృష్ణులకు " వినయంతో కావించిన అ; కూరుడి వండనం - అత్యంత ఆభినంద . 
సీయం. తరువాత వారికవ్యరిసీ మధురకు కీసుకువెళతూ దారిలో యమునానది 
ముందు. రథాన్ని నిలు పుతాడు. ఆక్రూరుడు. “పరిమజ్ఞ మణిగణ సముజ్జ్వంము" 
/ లై. న కాళిందీ జలాలను లాగి బలరామకృష్ణులు. తిరిగి రథంలో కూర్చుంటారు. . 
న అప్పుడు అ్యకూరుడు. యమునలో సా సనంచేసి. నదీజలాలలో మధుర మందస్మితు 
లైన _ బలరామకృష్ణులను దర్శిస్తాడు. ఆగ ర్యంలో. వ మళ్ళీ ఒడ్డువెపు చూస్తై 
న ఆక క్కడ రథాహాఢులై. యథావిథిగా. బాశ్మేక న్పిస్తాడు. తిరిగి. నదిలోకి చూడగానే 


ఐమ్మెరవారి భ క్రిసా[మాజ్య వైభవం య, 81 


“సహ్మసమ స్ప సక విభాసితు”డై న ఆది శేషువు పె “శ్రీవత్స కౌస్తుభ వనమాలికా 
విరాజిత విశాల వకుండును "బుండరీకా[ుండును శంఖచ్మకగదా పద్మహస్తుం . 
డును సత్వగుణ _ప్రశస్తుం డును [బహ్మసూ త కటిసూూత వోరకేయూర కటక 
కంకణకుండల కిరిటాది విభూషణుండును భకజన పోషణుండును.. సుందర 
క పోలఫాలనాసాధరవదన కర్టుండును నీలనీరదవర్షుండును గంబుకంధరుండును 
గరుణాగుణబంధురుండును'' ఆయిన (శ్రీమన్నారాయణుడు శ్రీదేవీ సహితుడె డె 
సాక్షాత,రిసాడు. వెంటనే అకూరుడు “అప్పరమేశ్వరునకు (మొక్కి- భకి క్తి 
సం|భమంబు అగ్గలంబులుగ గద్గదకంఠుండై దిగ్గనం గరంబులు ముకుళించి”” ' 
“క్రీ మానినీ మానస చోరా! సభాకార! వీరో! జగద్దేతు హేతు ప్రకారా!.....*. 
నిన్నెన్న న నెవ్య(డన్‌ నన్ను మాయావిపన్నున్‌ విషజ్దుం అపన్నుం [బసన్నుం 
డవై ఖిన్నతంబాపి మన్ని ంపవే పన్నగాధీశతల్పా! కృషపాకల్ప! వందారుకల్పా! 
నమస్తే నమస్తే నమస్తే నమః” “నాకు నీ విలసత్చాదయుగంబు చూపి కరుణన్‌ 
 వీక్షింపు లమ్మీపతీ!” అని అనేక విధాలుగా ప్రార్థిస్తాడు. ఆతని వందనభ క్తికి 
ఇంతకంటే తార్కాణం ఏం కావాలి? 


ను. 

భగవంతుని తన | పభువుగా. భావించి సర్వకర్మలను ఆయనకే అంకితం 
చేయటం దాస్యభ క్రి. భాగవత నవమస్కంధంలో స స ప్రద్విపవిళాల భూభారాన్ని 
వహించి వై వె ప్పవార్చనలతో కాలం గడిపే సద్గుణగరిమ్షుడైన అంబరీష se ది. 
దాస్యభ క్తి క్తికి లక్ష్య పాయుడు., చిత్తగించండి 


చిత్తంబు మధురిపు (క్రీ పాదముల యంద; 
పలుకులు హరిగుణ పఠన మంద; 
కరములు విష్ణుమందిర మార్షనము అంద; ' 
చెవులు మాధివకథాక్రవణ మంద; 
_ చూపులు గోవిందరూపవీక్ష్షణ మంద; 
వీరము గేశవ నమస్కతులయంద; 
పదము లీశ్వర గేహ పరిసర్పణములంద; i 
కామంబు చి కై 0కర్యమంద; క్‌ 
9 


ర్రిక్తీ భాగవత వైేజయంతీక 
సంగ మచ్యుతజనతను సంగ మంద, 

ఈూణ మసురారి భ కాం[ఘికమలమంద, 

కసన తులసీదళములంద, రతులు పుణ్య 

సంగతుల యంద యా రాజచం[దమునకు, (9. 82) 


ఓకసారి ఆమన ద్యాదశీ వతం కావించాడు. (వతాంతంలో కార్తిక 
మానంలో మూడు ర్యాతులు ఉపవాసం చేసి సుస్నాతుడై విష్ణువు నభి షేకించి 
గ ంఫావతలు సమర్పించి పుష్పాలతో హూజించి పారణ చేయటానికి సిద్ధపడతాడు. 
ఇంతలో ఆక స్వీకంగా ఆక్కడకు వచ్చిన డుర్వాసమునీం దుణ్ణి తడల క్‌ ర్య 
పాద్యాలి? భోజనానికి ఆవ్మోనిసాడు ఆంబరీమడు. దుర్వాసుడు టు. 
కాళిందీనదికీ వెళ్ళివస్తానని వెళతాడు. ఎంత సేపటికీ తిరిగిరాని మునికోనం కొంత 
సేపు ఎదురుచూచి ద్వాదశి గడియలోనే పారణ చేయాలి కనుక విద్యజ్ఞనుల 
అభి సాయాన్ని అనుసరించి నీతేనే పారణం చేసాడు అంబరీషుడు. అనంత రం 
దుర్వాసుడు వచ్చి జరిగింది తెలుసుకొని ఆగహోద సడై పండు పటపటకొరి కీ 
హంంక రించి తన జటిన్సు పెరిక్తి కృత్యను సృష్టించి అంబరీషుని మీదకు [ప్రయో 
గిస్తాడు. ఈ విషయం. అంతా విశ్వరూపుడైన విష్ణువు గమనించి సుదర్శన 
చకాన్ని పంపిసాడు. అది క కృతళ్ణిను దహించి దుర్వాసుడీ వెంటపడుతుంది. 
కయ భాంతుడ్తె దుర్వాసుడు (దహ్మదేవుజ్జి, పరమశివుణ్ణి శరణుకోరి వివల్నుడె డె. 
విష్ణువువన్దకే వచ్చి కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు విష్ణువు పలికిన పలు 
కులు భక్తుడికి భగవంతుడు ఏ విధంగా తోడి ఉంటాడో, వారిరువురికి గల. 
బంధం ఎటువంటిదో నరకాలు 


“చల న బుద్ధిమంతులగు ప్న నౌ హృదయంబు, లీల దొం 
గిలి కొనిపోవుచుండుదు, రకిల్సివ ఖ్‌ _కీలతాచయంబులన్‌ 
నిలువ(౫ బిట్టీ కట్టుదురు నేరపుతో మదకుంభి కై వడిన్‌ 
వలలకు? జిక్కి భ్‌ కీజనవత్సలతం జనుచుందు( దాపసా. 
నాకు మేలు గోర నా భ కులక కాని 
భ కజనుల కేన పరమగతియు 


ఖ్‌ క్స్‌ కె జనిన( బజికెంత్తు వెనువెంట 
గోవు వెంట. దగులు కోడెభంగి, 


టమ్మేరవారీ భ క్రీసా మాజ్య వెభవళి రికీ 


సాధుల హృదయము నాయది, 

సాధుల హృదయంబు నేను; జగముల నెల్లన్‌ 

సాధుల నేన యెజుంగుదు 

సాధు లెజుంగుదురు నాదు చరితము విప్రా! (9. 118, 119; 128) 


చిట్టచివరకు ఆంబరీషుడే చక్రాన్ని ప్రార్థించి దాని బారినుండి దుర్వాసుణ్ణి 


రక్షిస్తాడు. భగవంతుడి కంటె ఒక్కొక్కసారి భక్తుడే శక్రిమంతు డనటానికి 
ఈ వృతాంతం చాలు, 


నఖ్యం : 

భగవంతుజ్ఞి స్నేహితుడుగా భావించి ఆయనలోని గుణాలను అలవరచు 
కోవటమే సఖ్యభ క్రి. ఈ భ క్రి ఆర్జునుడిలో అధికంగా కన్పిస్తుంది. శ్రీకృష్ణుని 
నిర్యాణవార్తను ధర్మరాజుకు అర్జునుడు చెప్పిన తీరు చూడండి. 


మనసారథి మన 'సచివుండు 
మన వియ్యము మన సఖుండు మన భాంధవుయన్‌ 
మన విభుండు గురుండు దేవర 
మనలను డిగనాడి చనియె మనుజాధీశా ! (1. 858) 


శ్రీ కృష్టార్దునుల ఉమువరపం ఆనిర్యచనీయం, ఆద్వితీయం ఆయినట్టిది. 
కృష్ణుడు అర్జునుణ్ణి చెలికాడా రమ్మని పిలిచేవాడు; మరదిగా మన్నించేవాడు; 
బంధుఖావంతో ఆవతతేవాషు కొదార్యమూ రి; రియ బహుధనాలు బహూకరించే 
వాడు; మంతియె హితోపదేశం చేసేవాడు; గురువై కర్తవ్యాన్ని బోధిఎచేవాడు; 
సారథియై చనువు చూపేవాడు; హాస్యమాడేవాడు; ఆటలు వట్టించేవాడు; ఒకే 
శయ్యమీద కూర్చో పెట్టుకొని కన ప్న తం|డిలాగా తప్పులు దిద్దేవాడు ; చేతులు 
పట్టుకొని తన పొత్తున ఆరగింపజేసేవాడు. ఇటువంటి కృష్ణుడిలోని ఆ ర[తాణ 
వం తతత ధర్మపాలనం, దుష్టశిక్షణం మొదలైన గుణాలను అర్జునుడు 
కూడా అలవరచుకొన్నాడు. 


ఇక కుచేలుడు కూడా సఖ్యభ క్రి క్రిక్రి (పతీక బయినవాడే. కుచేలుడు 
కృష్ణుడితో కలిసి బాల్యంలో సాందీపని వద్ద విద్యాభ్యాసం చేశాడు. అంతే. ఆ 


sy ౨... భాగవత వైజయంతిక 


తరవాత మళ్ళీ ఎప్పటికో గంపెడు పిల్లల్ని కని దుర్భర దార్శిద్యానికి తాళలేక 
భార్య కావించిన' సూచన ననుసరించి సహాయం కోసం మధురానగరానికి వచ్చి. 
రాజపాసాదంలో కృష్ణుణ్ణి చూచాడు కుచేలుడు. ఇంతలో మన్మథ మన్మథుడు, 
ఇందీవర శ్యామడు, వందిత స్కుతాముడు, భూరి గుణసౌందుడు, యదు 
కులాంభోధిచం! దుడు అయిన కృష్ణుడు 'అ| కాంతే దరి|ద పీడితుడు, కృశీ 
భూతాంగుడు, టీర్ణాంబరుడు, ఘనతృష్టాతుర చిత్తుడు, ఖండో త్ర తరీయుడు 
ఆయిన కుచేలుజ్లి తిలకించి సం భమంతో తల్పం. దిగి (పేమతో ఎదురువెళ్ళి 
కౌగిలించుకొని వెంటబెట్టుకొని వచ్చి సాదరంగా తన తల్పంమీద ఆసీనుణ్ణి 
చేశాడు. కాళ్టు కడిగి ఆ జలం తలశైన చల్చుకొన్నాడు; మంచిగంధం అలదాడు; 
వీవనతో. విసరాడు; మశిదీపాలతో 'నివాళించాడు; సువాసనల సుమమాలికలతో 
అలంకరించాడు; కర్పూరతా౭బూలం' ఆందించి పంక వేశాడు. కధంతా 
చూచిన పద్ధాంతకాంతలు ఆశ్చర్యంతో. ae | 


ఏమితపంబు చేసెనొకొ యీ ధరణీదివిజో తముండు త్రౌల్‌- 

జామున, యోగివిస్ఫుర దుపాస్యకుండై. తనరారు నీజగ 

త్స్యామి రమాధినాథు నిజతల్పమునన్‌ వసియించి యున్నవా( 
స ఎ మహనీయమూ ర్తి కెనయే ముని 'పుంగవు _లెంతవారలున్‌ ! 
అని (10.2985) తమలో తాము అనుకొన్నారు. కుచేలుడూ తానూ. షో 
పని ఆ|శ మంలో గడపిన రోజులు, విశేషాలు ముచ్చటిస్తున్న కృష్ణుడు కుచేలుని 


జీర్ణవస్ర్రంలో మూటగట్టి ఉన్న. అటుకులను గుప్పెడు తిని ఆతనికి ఐశ్వర్యాన్ని 
అమ్మతహురాడ్యు. వ. 


 దళమైనం బువ్చమైనను 

ఆ భలమైనను సలిలమైన బాయని భు క్రీం 
 గొలిచిన జను లర్పించిన వ. 
 నెలమిన్‌ రుచిరాన మగనె యేను 'భుజింతున్‌: (10- 91010). " 
. ఆన్న కృష్ణుని అపారదయశు ప్మాతుడై న కుచ్చేలుడో * “పత్నీ సమేతుండై నిఖిల 
భోగంబుల యందు నాస క్రిం బొరయక రాగాది విరహితుండును 'నిర్వికారుండు 
- నునె. 'యలిజి; [కియలందు. నన నంతుని యన ంత ధ్యాన నసుధా రసంబునం జొక్కుచు 

ం. విగతబంధనుండై ప పి నొందె.! Cor I. 


పమ నల కః వెభవం రర 


ఆత్మ నివేదనం = 


మనోవాక్కాయకర్మలతో భగవంతుడికి శరణాగతి చేయటం ఆత్మ 
నివేదన భ Er దీనినే (పప త్తి త్తి. న్యాసం, ఆత్మ నిక్షేపం ఆని కూడా అంటారు. 


సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం [వజ 
అహం త్వా సర్వపాపేభ్యో మోత్నయిష్యామి షూ శుచః, 


అన్న భగవానుడి గీతోపదేశం కూడా ఇదే. ఆత్మ నివేదనకు గజేం[దుడు 
నిదర్శనంగా. నిబుసాడు. ఆనేక కరేణువులతో కూడి (త్రికూట పర్వత [పాంతా 
రణ్యంలో విచ్చలవిడిగా విహరిస్తున్న గజెందుడు ఒక మహాకాసారంలో కాలు 
పెట్టాడు. కొంత సేపు విశ్చంఖల జల కీడ సలిపాడు. ఇంతలో ఆ మడుగులో 
మనుగడ సాగిస్తున్న మకరేందుడు గజేర్శాదుడి కాలు పట్టుకున్నాడు. కరి మక 
రుల మధ్య భీకరసం|గామం చెలరేగింది. ఎంతో కాలం. గతించింది. స్థానబలం 
వల్ల మకరి విజృంభణం ఎక్కువయింది. గజే౩దుడికి తన వక కిపె నమ్మకం 
సన్న గిల్లింది. దేవుణ్ణి పార్థించటం (పారంభించాడు. తన భారం "అంతటినీ ఆ 
భగవంతునిపై వేసి = “తన మనంబున. Es డీశ్వర 
Mud 


చ్‌ ఈ వొక్కింతయు లేదు థె ధైర్యము వీలోలంబయ్యెం బ్రాణంబులున్‌ 

వ. = లోవుల్‌ దప్పెను మూర్భవచ్చె( దనువున్‌ డసె సెన్‌ [శమం బయ్యెడిన్‌ 
నీవే తప్ప, నితఃపఠం వెలుంగ మన్నింపందగున్‌ దీనునిన్‌' 
రావే రర కావవే వరద ! సంరక్షింపు ళ్‌ రారో 1 


ఓ కమలాక్ష! యో వరద ! యో (పతిపశ్షవిపక్షదూర | కు 
య్యో ! కవియోగివంద్య సుగుణో త్రమ ! యో శరణాగతామరా 
నోకహ! యో మునీశ్వర మనోహర ! యో విమల్మపథావ! రా 

వే! కరుణింపవే ! తల(పవే 2 శరణార్థిని సన్నం గ్రానవే l (8. 90 0.82) శో 


గజేం|దుడి మొర విన్నాడు శ్రీవారి: పరుగు పరుగున విచ్చేశాడు. 
చక్రాన్ని (పయోగించి న్మకాన్న్ని సంవారించి గజేందుబ్జ సంరక్షించాడు. పాం చ 
జన్యాన్ని పూరించాడు, చేత్రో గజేందుడి వీపు నిమిరి మడుగునుండి బయటకు 


86 భాగవత వై జయంతిక 


తేచ్చి, మదజల రేఖల్ని తుడుసూ మెల్లగా బుజ్జగించి దుఃఖాన్ని పోగొట్టాడు. 
మహావిష్ణువు కరసర్శతో దేహబాధ నశించిన 'గజేందుడు కరేణువులతో కలసి 
సంతోషంతో మోహనఘీంకారశబ్దా లతో కోధించాడు. అనంతరం విష్ణురూపాన్ని 
ధరించి సారూప్యమోక్షం అందుకున్నాడు గజేందుడు. 


ఈ నవవిధ భ కులే కాక నెలల పీల్ణవాడుగా ఎన్నషకే శకటాన్ని 
కాలితో ఆకాశంలోకి తన్ని విరుగగొట్టి శకటాసుర సంహారం చేసిన బాలకృష్టుజ్జి- 


*“'అలసితివి గదన్న ! యాయకొంటివి గదన్న ! 
మంచియన్న | యేడ్పు మాను మన్న! 
చన్ను గుడువుమన్న ! సంతనపడుమన్న !”' 

అంటూ బుజ్జగించి పాలు కుడుపు తున్న యకోదలో వాత్సల్య భ కీ, 


““ఒనరన్‌ (వేతల కించు కేనియును లేకుండంగ గోపాలక్స. 

మ్హని కెమ్మోవి సుధారసంబు గొనుచుం జోద్యంబుగా (మోయుచుం 

దన పర్వంబులు నే తపర్యములుగా దర్శించె, బూర్యంబు కేన్‌ 

వనితా"! యెట్టి తపంబు సేసెనొక యీ వంశంబు వంశంబులోన్‌” 
అంటూ మురశీకృష్ణుని మురళి భాగ్యాన్ని మెచ్చుకొ'నే గోపికలలో మధురభక్తి, 


“డింభక 1 సర్వస్థలముల 
 నంభోరువానేతు( డుండుననుచు మిగుల సం 
రంభంబున( బలికెద వీ. 

స్తంభంబున6 జూపంగలవె చశకిన్‌ గి క్రిన్‌” 


' అంటూ ఖడ్గాన్ని జశిపిస్తూ తనకు తెలియకుండానే వారినామం రెండుసార్లు 


_ఉచ్చరించిన హరణ్యకశిపుడిలో వై వైరభక్తీ భాగవతంలో మనకు పత్యక్షమై 


అమందానందాన్ని అందిస్తాయి. మహాభ క్రుడూ, మవాకవీ ఆయిన బమ్మెర 


ఫోతరాజుగారి భ్‌ కి కి సామాజ్య వై వ భవం = జీయమైనది; బృవా[దమణియ 
మైనది, 


'మ్మారవారి కవ్యు తెమ్మెరలు 


శ్రీ చెలమచెర్ల రంగాచార్యులు 


ss 1 మార్గదర్శీ మవార్షిః' అని పలుకుం గమ్మదన 
మునకు వాసిగాంచిన వాల్మీకి కవిచం[దుని మధుర వాగ్గుంఫములను తన సొత్తు 
చేసికొన్నాడు పోతనామాత్యుడు. కావుననే 'విద్యావతాం భాగవతే పరీక్షా" అని 
కొమ్ములు దిరిగిన కోవిదులకే పరీక్షా స్థానముగా పథ వహించిన ్రీమద్భాగవ 
తము ఆ సిద్ధహస్తుని చేతిలో ' హారన్‌ అహి నవపల్రవ కోమలమై” ఎసలారినది. 
తతత ఆస్వాద్యమైనది. అ మారంభమైన యే 
నూరేండ్లకు గాని “భాగవత దివ్యవల రసాస్వాదయోగము” తెలుగుజాతికి కలుగ 
లేదు. ఆంధులకీ యమృతభాండము నందించి అజలామరకీ రి నందిన అమల 
చరితుడు బమ్మెరపోతన మహోదయుతు. 


....... శాంతరస [పధానమైన భాగవతము అతి (ప్రసన్నమైన వాతావరణములో 

అవతరించినది. ఈ సన్నివేశమునకును, సంస్కృత భాగవతావతరణ సన్నివేళ 
'మునకును చక్కని పోలిక కన్పట్టుచున్నది. ఆచట పావనమైన సరస్వతీ నదీ 
తీరము. వేదములు విభాగించి భారత సంహీత చెప్పి యెన్నెన్ని విధములుగానో 
ధర్మములు |పపంచించియ. హృదయములో ఏదో ఒక కొరతతో, ఏదో ఒక 
తపనతో వ్యాకులపడుచు విజ్ఞాని కావున వెంటనే (గహాంచి. 


“వారికి యోగివరుల కభిలషితంబై న 
భాగవత విధంబు. ఐలుకనైతి 
మోసమయ్యె( దెలివి మొనయదు మజచితి”” 


అనుకొనుచు నిలచిన వ్యాసమహర్షి; 


ఇచట పవ్నితమైన గోదావరీ పులినతలము. వీరభ్మద విజయము, భోగినీ 
దండకము రచించి ఎ సిన్నకై తగాడుగానో పేరొందెనేమో గాని అది తృప్తి 


88 భాగవత వై జయంతిక 


నొసగక కొంతకాలము కింక ర్రవ్యతామూఢుడై యుండి కాలము చెల్రిపోవుచున్నదే 
యని డెంద మొకవంక దందడింప కుంది కుంది యింతలో పుణ్యవళమున 
. బోధావిర్భావము నొంది (శ్రీమన్నాతాయణ కథా పపంచ విరచనాలోచనా పరు 
డగుచున్న పోతన కవి; అచట దేవర్షి నారదుడు దివి నుండి దిగివచ్చి “నీవు 
నిభఖిలబంధ. మోచనంబు కొరకు వాసుదేవుని లీలా విశేషంబులు థ్‌ క్రితోడ 
వర్ణింపుము'' ఆని భాగవత రచనకు (పేరేపించుట; ఇచ్చట శ్రీరామచం|దుడే 

[పత్యశ్షమై ““మన్నామాంకితముగా శ్రీమహాభాగవశంబు( దెనుగు సేయుము. 
నీకు భవబంధములు దెగు” నని ఆనతీచ్చుట; ఉభయ్యత భాగవత (గంథా 
. వతారము, వ. 


పోతన్న (పతిభాసంపన్నుడైన మవికవి. కావ్యవస్తువును ఏరుకొనుట. 
లోనే కవీ [పతిభ తెలియవచ్చును. పిష్టే పెషణముగా ఒకరు చేసిన పనినే తాను 
చేయట (ప్రతిభ గలవాని పని కాదు. తన కాలము వరకును తెలుగులోనికి రాని 
_మూల[గంథము కొరకు వెదకినాడు. .ఏ అల్పపురాణమో, కావ్యమో చేపట్టి 
చేతులు కడిగికొని యుండవచ్చును. ఆ విశేష 1పతిభావంతుని దృష్టి పం డెండు 
స్కంధముల మహా గంథము భాగవతము మీదనే పడినది. ఒక్క పూనికతో 
ఇవాపరములను సాధించినాడు. , పురాణించుట ఆనాటి (పజ్ఞావంతులకు చిన్నె. 
పురాణింప దొరకొన్నాడు, [(పతిభాహినుడు సాహసము చేసినను మాట చెల్తించు 
_కొనలేడు. ఈతడో చెల్లించుకొన్నాడు. నన్నయ తిక్కనాది మహాకవుల |శేణిలో 
నిలువగలిగినాడు. సమానులలో ఉతమ శ్లోకుడగుటకు ' మించిన యిహ ' 
మేమున్నది? అటు కావ్యకళను. దివ్యకళగా దిద్ది నక్వేశ్వరారారనములో పూజా 
"es చేసీ మ క్షి నందుకొన్నాడు. 


క ఇగంథము నందలి అంశములను పెంచుటలో, తుంచుటలో, 
మార్చుటలో, తీర్చుటలో ఆతని (పతిభ వేయిరూపుల వెలుగొందినది. రస 
పోషణము, ప్యాతోన్మీలనము, జౌచిత్య పాలనము . వంటివి కవికి కేవలము 
వ్యుత్స త్యభాసముల వలన ee కావు. వంక న లి 


సంచి మొదలులేని. సెట్టి బేహారము వంటిది చదువు కండలేని కూర్పరి. 
జతనము, eG లోకనము, వం వలసినంతగా ఫోతనార్యునకు 


బమ్మెరవారి కమ్మతెమ్మెరలు 88 


కలవు. విద్వాంసులకే వరీఇా స్థానముగా (పథ వహించిన భాగవతమును మూల 
కారుని హృదయము ఆందివచ్చునట్టు తెలిగింపగ ల్లిన ఈతనిది నిండైన పాండిత్య 
మని పేరుగా చెప్పనక్కర లెదు. కొన్ని కొన్ని ఘట్టములలో శ్రీధరీయ చండకాది 
వ్యాఖ్యాతల భావములను కూడ (క్రోడీకరించి చూపగలిగినాడనగా అది అంతం 
తన పొనగు పనియా ? అందందు నిక్నేపించిన యజ్ఞుగంతాది పదరత్నాలు, 
[పొఢ_ ప్రయోగాలు, సమస్త వాక్యాలు, ఛందోలంకార శిల్పాలు, ధ్వని 
విన్యాసాలు- ఆతని వివిధ శాస్త్ర సరిజ్ఞానమునకు తార్కాణము, నైమిశారణ్య 
వర్ణనము మొదలైన కొన్ని తావులలో మూలములో లేని శ్రేషసౌభాగ్యాలు కాద ంబరీ 
సుధారసాస్వాద సిద్ధుడు కానివాడు కూర్పగలవియేనా ! ఆతడు తెలుగులోను 
అట్టి గట్టిదిట్టయే యనుటకు భాగవతము నందలి నూర్తకొలది అచ్చ తెలుగు పద్దె 
ములే సాక్ష్యమిచ్చును. సంస్కృతాం్యధములు రెండింటను కవ్వడి యైనవాడు 
కావృననే. 

కొందజకు తెలుంగు గుణమగు; 

కొౌందఅకును సంస్కృతంబు గుణమగు, రెండున్‌ 

కొందజకు గుణములగు; నే 

నందఆ మెప్పింతు. గృతుల నయ యెడలన్‌ 
అని చెప్పి, చెప్పినట్టు చేసి మెప్పుగొన్నాడు. 


పోతన కవితాభ్యాసము దొడ్డడి. పద్యవిద్యలో ఆరితేరిన కొద్దిమంది కవు 
లలో ఈతడొకడు: ఈతని ధారాపద్ధి అనల్పము-- ““పురాణింపం దొరంకొంటి 
బి. దెపేవెంట( జరింతు. దత్సరణి నా కీవమ్మ!' ఆని _బాహ్మీదేవిని షార్రిం 

వ్‌ ,. ! 5 
చిన యీ వశ్యవాక్కు కాన్య రచనా శిల్పములోని పట్టులు గుట్టుల తెలిసికొని 
[ప్రయోగ రంగములో [పదర్శించి, మేల్‌ భళీ! అనిపించుకొన్నాడనిన ఆది ఆతని 
యసకృదఖ్యాసశిజాఫల మే, Cg 


అనుగుణమైన శై లిని పొందుపరచి పోతన రసపోషణము చేయుటల్లోను 
మేటి యని వాసి గాంచినాడు. మోహిన్యవతార వర్దనమునను, గో పీకృష్ణుల లీలల 
లోను శృంగార రసమును చక్కగా పోషించెను. ఒక్కొాక్క-చో శృంగారమును 
భ క్రికి అంగముగా తీర్చి దానికి పావనత్యమును సంపాదించును. ఒకచో శ్చాంగార 
ఫీరములకు సంసృష్టి ప్రదర్శించెను. _ శ్రీకృష్ణ నరకాసురుల యుద్ధఘట్టములో 


00... భాగవత వై జయంతిక 


ఇడి కన్పట్టును. కంసవధము, శ్రీనృసింహావతారాదుల |ప్రస్తావనములలో వీర 
ర్మౌదాద్భుతర సములు ఫోషించబడిన రీతి అసాధారణము. రుక్మిని (ఏకృృష్ణుడు 
పరాభవించిన పట్టున హాస్యము, వీభత్సము తొ ణికిసలాడీనవి. పుణ్యాాశమాదుల 
వర్ణన కాంతమును వెలయించును. భక్తిని రసముగా అంగీకరించినచో ఆ భ క్రి 
ఠసమే ఇందు ఆమూలా[గము వి స్పరిల్ది రాజ్యమేలుచున్న దనవచ్చును. [శవ 
ణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, ఆర్బనము ,వందనము, దాస్యము: 
సఖ్యము, ఆత్మనివేదనము- ఆను నవవిధభ క్రియ ఆయా కథాసూ తములలో 
నిబద్ధమె నవ్య నవ్య రూపములతో ఇందు ాసిల్రినది. 
“ఏకస్స్వాదు న భుంజీత” అన్నట్లు అభించిన భాగవత సుధారసమును 
సోదరుల కెల్పరికిని పంచి పెట్టినాడు పోతన కవివదాన్యుడు. గజేందమోక్షము, 
వామనావతారము, ప్రహాద చరితము, రుక్మిణీ కల్యాణము మొదలై న మధుర 
మధుర ఘట్టాలు ఆం| ధుల జిహ్వా గాలను అలంకరించినవి. ఇప్పటికిని ఆంధ 
జన సందోహములో పావన భాగవత కథా శ్రవణాస క్రి మిక్కి-లిగానే గోచరించు 
చున్నది. లోక కల్యాణాకొంక్షతో_ 
_ _ నిగమ కల్పతరో ర్లశితం ఫలం 
వకముఖాదమృత |దవసంయుతం 
పిబజత భాగవతం రసమాలయం 
ముహు రహో! రసికా భువి భావుకాః! 
అను వేదవ్యాసమహర్షి దివ్యవాణితో తి కలిపి... 


వేదక ల్పవృక్ష విగళితమై శుక 
ముఖసుధ్యాదవమున మొనసియున్న 
భాగవత ప్కరాణ ఛలరసాస్వాదన 
పదవి గనుండు రసికభావవిదులు. se 
అని ఆదరముతో ఆహ్వానించుచున్నాడు మహాకవి పోతనార్యడు. “జయంతి తే 
సుకృతినో రససిద్ధాః క కంగా 


గాగ్రా ఏజ్జాతలోము.ర్‌, 1969) 


పోతన = తిక్కన 
ఆచార్య పింగళి లక్మీకాంతము 


(శ్రీనాథుని సమకాలికులలో |పథముడును ఆం(ధకవి [ప్రవక్తలలో ద్వితీయు 
డును ఆయిన పోతనామాత్యుని భాగవతము ఏల ఉత్పన్నమై ఐహుక ర్భకతకు 
పాల్పడినదో చెప్పలేము. ఈ భక్రియోగి చె తన్యస్వామి కంటె నలుబది యేబది 
సంవత్సరములు పూర్వుడు. ఆ భ కకిలామణి వంగదేశమున రాధా పణయాత్మక 
మైన కృష్ణతత్వమును [పటోధింపక పూర్ణమే ఈ భ కశిభామణి ఆంధదేశమున 
నవరసమూ ర్తి యగు ్రీకృష్ణతత్వమును గానముచేసి ఆం[ధుల మనోలోకమున 
నొక పరివరనము గలిగించెను. 


తెనుగున గల పురాణేతిహాసములబో భాగవతమువఠె సర్వజన సమ్మత 
మైన (గంథమింకొకటి లేదు. శిల్పమున భారతము దీనికంచె మిన్నయినను దీని 
వలె సార్వజనీనమైన ఆనురంజకత్యమును పొందలేకపోయెను. ఇందుకు రెండు 
మూడు కారణములు కలవు. 


భారతమునందలి పరమాళ్థము (సంసారతరజోపాయముగా అది నిరే 
శించిన నిష్కామ కర్మయోగము) జ్ఞాన ధనులైన పరిపూర్దులకు తప్ప ఆందర 
'కును అవలంబనీయము కాదు. అది ఎంత యు త్తమ మార్గమైనను లోకము దాని 
ననుగమింపజాలదు. ఇక థాగవతమో, సర్వజంతు తారకమగు సులభ భక్తి 
యోగమును స్ఫుటముగా ఆదేశించెను. సంసారభిన్నమైన లోకము, ఎట్టి జ్ఞాన 
ములతోను సంబంధము లేకుండ, పూలు పరఠచినట్టు మెత్తనైన లూ మార్గమున 
నడచి దరిజేరవలయునని ఆశించుటలో వింతలేదు. సాధారణలోకము యొక్క. 
మనఃస్టితికిని సంస్కారమునకును ' అనురూపమును (పియమును అయిన ఈ 
 యాలంబనము (పసాదించిన [గంథరాజమగుట చేతనే లోకము భాగవతమునెడ 
భ క్రిబద్ధమైనది. ఆపద్వేళల గజేం దమోక్షమును సంజీవనీ మం్యతముగా జపించు 
నట్టియు, గోపికాగీతలను భగవద్దీతలవలె పారాయణము చేయుచున్న ట్టీయు 


ఒం అర్మధులు నేటికిని అనేకులు కలరు... 


లివి . భాగవత వె జయంతిక 


భారతమునందలి శిల్పచాతురి సర్యకళావేతృత గల పౌఢరసికుల కే గాని 
యితరులకు గోచరము కాదు. తిక్కన సోమయాజి భారతవిరాణ్మూ ర్తి నిర్మాణ 
ములో ఏ పద్యమున కెంత [పాధాన్యముండునో అంతమ్మాతమె యిచ్చి అన్నిటి 
కలయికచే సిద్ధిపొందిన మూర్తి సౌవ్టవము నెడ దృష్టి నిల్పెనుగాని, ఎచ్చటను 
పద్యముల సౌగసు కోసమే పద్యములు [వాయలేదు, ఆందుచేతనే సందర్భము 
నుండి విడదీసి విడిగా అలవోకగా పాడుకొని సంతోషింపదగిన పద్యములు 
భారతమున మచ్చునకై నను ఉండవు. ఇక పోతన కృతములై న భాగవత పద్య 
ములు మధురాతి మధురములై, భజనకీర్తనల వలె, పెండ్లి పాటలవలె, ఏల పద 
ములవలె ఎల్పరును ఎల్లవేళల పాడుకోనుటకు అనువై సర్వత గాలివలె వ్యాపిం 
చినవి. వానిలోని వతిలయలు ఉచ్చారణ మా[తముననే మనస్సును తోగొనును. 
ఉత్తమ మధుర కవిత్యమునకు ఒక లక్షణమైన, గీతి భాగవత పద్యములందు 
నిండారియండుటచే వానికి ఇంత (పచారము వచ్చినడి. కవి యనుభవించిన 
దారి[ద్యము, ఆ కాళర్శాతి నెదుర్కొని పోరిన ఆయన. దీరత్వము ఆశ్చర్య 
జనకములై లోకమునకు ఆయన యెడ నిరతిశయ పూజ్య భావమును కలిగించి ' 
నవి. ఇవిగాక ఇంకేవేని కారణము Ru | 


పకక పోతన | భావకవి. అందును భ్‌ క్రి శృంగార భావము 
వర్ణించు పట్టున అతి. మా|(త్రమునకు పాల్పడు భావలోలుడు, 'ఆ ఘట్టములలో 
| పత్యక్షరమునను ఆయన యాత్మభఖావమే పతివలించుచుండును. తెలుగులో 
నిట్టివాడు పాల్కురికి సోమనాథు డొక్కడే.. పురాణక రలలో ఇంత శృంగార 
పియడైన కవి యింకొకడు లేడు. ఆ శృంగారము "వేబంధ శృంగారము 
వంటిది గాక అధ్యాత్మిక కోశమును' ముట్టినది యగుటచే ఆ రసమునకు ఇతర 
కవు ప. స పకాలా పవిత్రతను. పోతన జం. 


ఆంధ కవులలో తిక్కన సూర్యునివంటి వాడనియ, పోతన చం|దుని fe 
వంటి వాడనియ ఒకచోట ప్రసంగ వశమున పూజ్యులు శ్రీ ఉన్నవ లక్ష్మీ _ 


నారాయణ పంతులుగా రనిరి.. అనగా. ఆంధ లోకమునకు. వీరిరువురును రెండు 
వెలుగులు. ఇరువురును తమ తమ కాలములలో తెలుగు జాతికి తెలుగు వేదము. 
లనడగిన మహో న బుషి పుంగవులు, క్షు అని ర 


పోతన = తిక్కన - 98 


చెప్పదగిన మహాకవులు. పోతన జీవితము. తిక్కన జీవితమువలె పరిపూర్ణ 
మైనది కాదు. ఆయన నిస్పృహత్వము కతన ఐహిక అక క దూర 
మైనది. 

తిక్కన లోక పవృ త్తి యందువలెనే కవిత్వము నందును వ్యకావ్యక్త 
స్వరూపుడుగా పట్టువడియ పట్టువడక సంచరించును. (పతి, వాక్యమునందును 
ఆయన మూరి స్ఫురించుచునే పతన, మరల కాదనిపించుచుండును. ఇక 
పోతనయో, సంసారమున పట్టువడక పోయినను కవిత్వమున తడవినంతనే 
చేతికి నందును ఇది తి ఫా నాటక. a ఖావ కవులకును గల 
కాం నొకటి. 


ఛందో నిబద్ధమగు శబ్దము కళాధర్మములైన శ్రుతి లయలను * ఎంత 
వరకు సా ధింపగలుగునో సోతనవలె దృష్టాంత పూర్వక ముగా చూపిన పూర్వ 
కవి ఇంకొకడు లేడు. ఆయన శబ్లాలంకార పియత్యము దీనకి మరికొంత 
వన్నె పెట్టినది. సముచిత [యుక్తమైన చోట ఆయన యను[పాసాలంకారము 
భాగవత కవితా గానమునకు మృదంగ వ్యాపారము నిర్య్వహించుచున్నట్టుంతును. 
కవి స్వేచ్చగా కొవి౩చుకొను భక్తి గానము, ఆ గానమునకు ననురూపమైన 
మధుర పేశల శబ్దము, (ఆ శబ్దముల కర్పునకు మకుటా యమానమైన అంత్య 
[పాసము ఆరం భాగవత్‌ పఠనము తాళము, మద్దె? సహకారులుగా 
(పవంర్తిలు గానసభ కాక మరేమగును !! 


(గోళము వ్యానములు, ₹లిలొటొ. 


4 * 4 


కుప్పించి యెగసిన కుండలమ్ములకా౭ 3 గగనభాగంజెల్డ( గప్పికొనంగ 
నుటికిన నోర్యక. యుదరంబులోను న్న "జగముల దేగున జగతి గదల 
చ[కంబుం జేపట్టి చనుదెంచురయమున బి బైనున్న పచ్చనిపటము జాలి 
నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని కీడి మరల. దిగువ. 

| కరికిలంఘించుసింహంబుకరణిమెజసి నేడు భీష్ముని 'జంపుదు గి నిన్నుగాతు 
న విడ్నవు మర్దన ! యనుచు ముద్వికఖమృష్ట ౯ దెరలి చనుదెంచు షా దిక్టునాకు. 


పోతన జ శ్రీనాథుడు 


శ్రీ వానమామలై వరదాచార్యులు 


“విశ్వ శేయః కావ్యమ్‌” ఆని ఆదికవి మ భట్టారకుని క్రీసూ క్రి క్రి, 
ఏనాడును లోక కళ్యాణమే ప న. మౌనని పై సూ క్రివలన మనకు దెలియ 
వచ్చుచున్నది. 


కవి బుషి కావున విశ్వ[శేయము నభిలషించును. అతడు ఏ స్వార్ధశక్తు 
లకును లొంగిపోవువాడు కాడు. ఆత డాశనే జయించిన ధీరోదా త్త్రమానసము 
గల మహా మనీషి, [పపంచములో స్వార్థ మతిగా బలిసి బలవంతుడు బలహీనుని 
వంచనాశ క్తి ధర్మశ కిని పీషెంచి వి కమించుచున్న నమయమున కవి కలము 
కూరని శస్త్రమువలె విజృంభించి ధర్మ హక జయమునకు తగు యత్న మొనరితిచు . 
టకునై త దవీణలపైె వీరగీతము లాలపించును. అతడే నిజమైన కవి. పద్యము 
లల్ల నేర్చినంతనే కవి గాజాలడు. [పతిభావంతముగా , కాంతాసమ్మితముగా, 
రమణీయార్థ [పతిపాదక శబ్బ్దసంచయమతో నన్యాపదేశ ముగా నుపదేశ మొనర్చు 


నాతడే మహాకవి. ఆతడు ప్రజాహృదయముల మేల్కొలుపు వై వై తాశకడు, వహ 
కవు లంద రట్టివారే. 


కవి శయము వారు భారతమును [వాసి కౌరన పొండవ్పల మన సత్వ. 
మును చిత్రించి దై ఏీ/పవత్తిలో రాక్షస్మపవృత్తికి నేనాడు నపజయము తప్పదని 
చాటినారు. భాస్కరాదులును రామాయణమును [వాసి యదే యుపదేశము 
నొనర్చినారు. ఆ పిమ్మట (శ్రీనాథ పోతన లుదయించి యాం ధవాజ్మయమును = 
సుహృత్సమ్మిత మగు పుఠరాణమార్గము. నుండి కాంతా సమ్మితమగు నుపదేశ 
మొసంగు కావ్యమార్గమున నకిపించినా రనవచ్చును. పోతన భాగవత పురాణ. 
మును రచించినను నందు ప్రబంధ వక్కీయే యందచందనుణ దిద్దితీర్చికొనిన 
దనవలెను. |పహ్హాద చరితము, గజేంద మోక్షణము, రుక్మిణీ కల్యాణము, 
శ్రీకృష్ణ చరిత్రము, వామన చరిత్రము, కుచేలోపాఖ్యానము మనం. యే 


పోతన - (శ్రీనాథుడు 9 


కథ కా కథ స్వతంత కావ్యము లనునట్లు మెరుగులు దిద్దీకోని విరాబిల్రినవి. రసో 
చిత్యాలంకారశోధలతో రాణీంచినవి. 


ఈ యిరువురిలో |కీనాథుతు భోగి, పోతన యోగిగా గనబడుదురు. ఒక 
రార్యధ కోస్తా బిల్లాలలో, మరియొకరు తెలంగాణములో జన్మించినారు. (శీనాథుడు 
రాజుల నా[శయించి సమస్త రాజభోగముల ననుభవించినాడు. పోతన రాజులకు 
తన గంథ మంకితమీయ నిరాకరించి ఐహికాముష్మిక (పదాతయగు (శ్రీరామ 
చం|దుని కర్పించుటలో దార్గి|ద్గమును, కష్టములను సైతము సరకు గొనలేదు. 
ఈ యిరుపురు తూర్పు పడ మరలవంటి విభిన్నమార్గములతో నడచియు సాహిత్య 
(ప్రపంచమున సమానమగు కీర్తి సంపదల నార్జించినారు. 


. శ్రీనాథుడు పండిత (ప్రపంచమున కెక్కువ యిష్టుడె పండితా ఖండలుడని 
పేరు వడసినాకు పోతన భ క్తశిథఖామ కిగా వాసి కెక్కి పండిత పామర (పపంచ 
ముచే తలదాల్పబడినాడు. శ్రీనాథుని కవితలో పౌఢిమ, గాంభీర్యము మెండుగా 
నుండును. పోతన పద్యరచనలో (వస సన్నత, మాధుర్యము, శబ్దసౌంద ర్యము 
అతిశయముగా నగపడును. [శీనాళ ని రచనలలో శృంగారము (_పధానముగా 
నుండును. పోతన కృతులలో భక్రి పధానమైన రసము. [శ్రీనాథుని స్వకావ 
ములో నాడంబరము, ఆవాణభావము విశేషముగా నున్న, పోతనలో నాత్మాభి 
మానము, నిరాడంబరత సాతశాత్క_రిం మచుండును. |శ్రీనాథుడు పాకనాటి నియోగి 
ననియు, భరద్వాజ గోతుడననియు, నాప స్తంబ సూ తుడననీయ, భఖీమాంబా 
మాతయామూత్యుల పుతుడననియు, శాల్చ్పట్టణమునకు జెందిన క మలనాభామాత్య 
పౌతుడననియు నెషకపరచికొనినాడు పోతన కౌండిన్య గోోతము వాడననియు, 
కేసన అకార్భబలకు ప్యుతుడననియు, ' తిప్పన కనుజన్ముడననియు, నేకశిలా 
నగరము నివాసముగా గలిగి యున్నట్లు చెప్పికొనినాడు. [శీనాథుడు 14 వ 
శతాబ్ది యు త్తరార్థ మున బుట్టి 15 వ శతాబ్ది పూర్వార్థ మున నుండి సుమారు 75 
సంవత్సరములు జీవించినట్లు తెలియు: నన్నది. పోతన 15 వ శతాబ్ది పూత్వార్ధము 
చివర నుదయించి యు త్రరార్థమున జీవించియున్నట్టు తెలియవచ్చును. పోతన 


"భోగినీ దండక కృతిని రావు సింగబుహీపాలునకు " నంకిత మొసంగుటయ., 


(శీనాథుడును, తాను శారదను | పార్థించుచు “ఎటుల మెప్పించెదో నన్ను నింక ' 
మీద, రావు సింగమహిపాలు నిండుకొలువుని' అని సర్వజ్ఞ సింగభూపాలుని 


06 భాగవత వై జయంతిక 


యాస్థానమునకే వచ్చినట్లు చెప్పికొన టెచే పోతన iss లించుమించు 
నిరువ్చ రేకకాలము 'వాశేనని చెప్పినచో తప ప్పెమి లేదు. కాని వయస్సున 
పోతన కంచె శ్రీనాథుడు చాల పెద్దవాడని చెప్పగా . నొప్పును. పీరిరు వరకును 
బాంధవ్యము నుతువు గాథలు [పజాముఖముల రూఢియై వెలయట దక్క 
నిరువురు బంధువు లనుటకు చారి తకాధారము తేవియు దొరుకుటలేదు. 


| నీనా థుడు తానాంధ సాహిత్య న్నే తమున విశృంఖల విహార మొనర్చి 
యెదు రెవ్యరులేని యెక్కటి వీరుడై తన యుగము నొకదానిని స్థాపించుకొనినాడు. 
ఇతడనేక (గంథ ములను సంస్కృతము. నుండీ తెనుగు నొనర్చి కావ్యరూసముల 
దిద్దితీర్చినాడు. అంద వా న్రనిర్మిత నైషధ కావ్యము: గణుతి కెక్కినది, ఈ 
కావ్యానువాదమున నితడు మూలమును మించి యొక్కొక్కచో దన ప్రతిభను 
(పకాశింపజేసికొనినాడు. ఇది యొక్క. టే కాక యింకను హరవిలాసము, ఖీమే 
శ్వరపురాణము, - కాశీఖండము, - శివరా[త్రిమావోత్మ్యము, క్రీడాభిరామము, 
ws ma ట్ర ౭శ మాల నెన్నింటిన్‌ రచించెను. 


ఇక పోతన కవీం|దుని నివాసము తేనె మాగాణమగు తెలంగాణమాలోని 
ఏకశిలానగర సమీపమున గల బమ్మెర (గ్రామములో నని చారి తకులు తేల్చి 
చెప్పినారు. శ్రీ కొమజ్దాజు లక్ష్మణరావు గారు, శ్రీ దూపాటి a రమణా. 
చార్యుల గారు ము కకంఠముతో దీనిని [భువ 'పరచినారు, కాని శ్రీ వావిలి. 
కొలను సుబ్బారావు గాత మాతము ఇతడొంటిమిట్టవాడే శని గట్టిగా వాదించచు 
వప న రన కది షన పరీషకు నతన పోయినది, 


పోతన వంశమువారు శివ కులనుట కనేక re అన్నవి. తిప్పన 
“ఈశ్వర సే సీవాకాముడని, _కేసన “మనియె శై వశాస్ర్రమతము గనియె'నని, 
' లక్కాంబ 'నదాశివ పాదయుగార్చనానుకంపానయవాగ్భవానికిని బమ్మెర కేసన 
" అక్క-సానికిన్‌' - అని. . చెప్పికొనినాడు.. ఆయ్యును తిక్కన హరిహరనాధు.. 
'నద్దెకతమూ ర్తిగా నుపాసించినటులే పోతనయు రామునిలో. శివకేశవుల సమైక్య ' 
"రూపమును. గాంచి యపాసించినాడు... మాధవ. మం|తమునకు ' రా? జీవము, 
శివ మంత్రమునకు “మ” జీవమై రెండక్షరముల కలయిక గనిన “రా 'రామోళ్ల. 
1 మితని యదై ద్వైతలావనకు సరిపోయినది. 


పోతన - [శ్రీనాథుడు 97 


పోతన భోగినీ దండకమును [వాసియు, గోపికల శృంగారభంగుల 
వర్ణి ంచియు భ క్రకవిగా పూజింపబడినాడు. ఇతని రచనలలో శంగారమునకు 
తక్కు_వేమియు లేదు. “కాటుక కంటి నీరు చనుగట్టు పయింబడ నేల నేడ్చెదో 
కై టభదై త్యమర్చనుని గాదిలికోడల ! యో మద్‌ంబ !' యని ఆంబ శబ్దముతో 
చె నుడివిన పద్యములోని శృంగారమును పవి|త. పరచినాడు. “ఓహో ! వెరు 
వకుమని తామాహరికిని (శ్రీ కుచంబు లభయం' దిచ్చినవట. చలికి వెరచికొనిన 
(భ్రీపతిని గూర్చియు నిట్టాడుటకు వెనుదీయలేదు. | ఇట్రెన్నేని జూపించవచ్చును. 
భి శృంగారరసము లీతని సొమ్ములు. ఇతని కవితలో శబసెందర్యము 
. పోషించుటకై యర్థ గౌరవమును చెరచుకొను బాహ్యాడంబరము గానరాక పోవుట 
నది పండిత జనమాన నీయమై వెలసినది. శభ్రార్ధములు సుంచరములై పార్వతీ 
పర మేశ్వరులవలె నల్లుకొని పాఠకుని పరవశింపజేయును. భాగవతములోని రీతి 
వైదర్భీ విధానమునకు జెందినది. ఆది (కోతల హృదయము నానందవార్థి 
ముంచివేయును. తన పురాకృత శుభాధిళ్యంబు వలన తనకీ ఖాగవతానువాదము 
లభించెనని చెప్పినాడు. నిర్గర్వియె “అ్రకైవల్య పదంబు గోరి ఖాగవతరచన 
కుపక్రమించెను. 

భ క్రిపరములై న పోతన పద్యములు రత్నములు, అవి రాని యాం|ధుడే 
లేడనవచ్చును. “లావొక్కింతయు లేదు' “మందార మకరంద” “ఎవ్వనిచే 
జనించు” మొదలైన పద్యములు క ౦ఠ స్థము లై నవారు 'పెక్కురున్నారు. 
ఇంతటి భ కకవి “హిందీలో తులసీదాసు తక్క నింకెవరును కనబడరేమో! ఎంత 
భ క్రుడో కకత యాత్మాభిమానము గల కవి యగుట తన భాగవతము 
నధికారమధుపాన మ తబధిరాంధులగు రాజుల కీయక రామచందున కర్పించి 
నాడు. ఇట్టి పోతన తెలుగుల ప పుణ్యపేటి కాదా! ఆతని గన్న ఆంధమాత ధన్య, 
సమ్మాన్య, _శ్రీనాధు డెంతయు పండితుడై మహాకవియై సుఖదుఃఖములను 
ద్వంద్వముల వ వలలో జిక్కుళొనినాడు. కాని పోతన ద్వంద్వాతీ తుడై జనన 
మరణరహితమైన కై వల్యపదంబు గాంచినవాడనిన సత్యదూరము గాదు. ఆంధ 
భాగవత కవిత వంటి కవిత, పోతన వంటి క గల కవి “న 
భూతో న కవివ్యకి న్‌ స దే. 


(కెజగువాజీ, 1975) 


జ 


పోతన కవితోన్మీలనము 
త మధునాపంతుల was శాస్త్రి 


.. భారతీయ సాహిత్యమున దేదీహ్యమానములై న విశ్వవిఖ్యాతములై న మహో 
[గంథములలో భారత భాగవత రామాయణములను మించినవి మరి లేవు. ఇవి 
వేదముల తరువాత చెప్పదగిన రసామ్నాయములు. 


సర్వకాలములందు సర్వ్యదేశములకు ధర్మదీ ప్తి పసి (పసాదించు కృతిరత్న | 
జ్యోతులివి. అనంతమైన కాలమునకు ఆక్షరానుసంధానము స... సంధ్యా 
త్రయ మెట్టిదో ఈ [గ ంథ|తయమట్టిది. 


' బుషివర (పణీతమైన ఈ కృతితయ పరమార్థము తాత్పర్యతః ఒక్క టే 
అయినను (ప్మక్రియాభేదము కలదు, భారతము మహేతిహాసము, భాగవతము 
మహాపురాణము, రామాయణము మహాకావ్యము. 


పురాణము అర్భప్రవణమై మిత్రునివలె ఉపదేశము చేయను. కర్తవ్య 
మును బోధించును. కాంఠాస్రమ్మిత మైన కావ్యము వ్యంగ్య ప! ఉప 
దేశించును, Sa 


కవికుల ప్రవంచమంతయు వ్యాసవాల్మీకి ముఖని స్సృతమైన కన పైవ్యన్లు స్య 
యెక్క వివ రము, 


న టక! బాదరాయణ a 

oe మునియుగ ముఖ నిస స్పృతస్య శబ్దస్య 
సం (బివ్మాత్మనో. వివ ర్రః 
స్ఫురతి మహాన్‌ కవిజన్మప్రపంచః, is ల 

వ శ్రీమద్భాగవతము ఆష్టాదశప్పురాజ ములలో నొకటి. . 'డ్వాదశస్కంధా 
త్మళము.. సర్గము, విసర్లము, స్థానము పోషణము, ఊరి (కర్మవాసన), 
మన్వంతరము, ఈకాను కథలు, నిరోధము, ము శకి, జ కయము. ఈ పది We 
మహా షరా. లక్షణములు. ఆ శయ శక్త్యబ్ఞంర్థమే సర్గాడి నవ లక్షణముల ను 


భన! 


హోతన కవితో న్మీలనము వ. 99 


(పతిపాదనము భాగ్‌ వతమున చేయబడినది. “దశమస ఆ శయస్య విశుద్ధ్యర్థం 
త త్త జ్ఞానార్భం నవానాం. లక్షణం os ఏక సె సవ పాధాన్యాన్నాయం 
దోషః?” అని (క్రీధరీయము. 


ఆభాసశ్చ నిరోధశ్న యతశ్చా ధ్యవసీయతే 

స ఆశయః పరం|బహ్మ పరమాత్మేతి శబ్ద్యతే. 

అవిద్యచే అధ్య స్తమెన యన్యధారూపము (కర ్రత్వాదికము) తొలగి. 
స్వస్యరూపముతో ఉనికి ముక్తి. తదాశయము పర బఐహ్మము; పరమాత స్మ. 
E (శ్రీకృష్ణభ గవదవతారము. 


ఏవంవిధ త త్త ్యనిరూపకము భగవద్భక్తి పబోధకమునై న శ్రీమద్భాగ 
 వతము “'పారమహంస్యము” గా. 'సాత్యత సంహిత” గా “హయ్య గీవ బ్రహ్మ 
విద్య' గా యోగిజన భక్త సంతాన సంతారకమైన మహాపురాణము, భాగవతము 
నిగమ కల్పతరు ఫలముగా అభివర్షితము. పద్మపురాణము భాగవతమును 
బహుధా కీ రించినది- : 


'“వేదోపనిషదాం సారా జ్ఞాతా భాగవతీ కథా 
ఆత్యు తమా తతో భాతి పృథగ్ఫూతా ఫలోన్నతిః,'' 
. వేదముల ఉపనివత్తుల యొక్క సారమే భాగవత కథ, దానికంటె వేరె. 
ఉ త్రమఫలాకృతి దాల్చి విరాజిల్దుచున్నది, వేదము కల్పవృషము. ఆ చెట్టున 
ఒక పండు పండినది. ఆ ఫలము వృక్షముకంటె పృథగ్ఫూతమై ఆత్యుత్తమమై 
ఆస్వాదయోగ్యముగా నుండుట సహజము. ఫలవృక్షములతో ఆమూలపల్హ వము 
రసము వ్యాపించియుండును. కాని యా రసము ఆస్వాదోచితము కాదు. ఆ 
న. రసమే ఫలరూపము. దాల్చినపుడు సర్వమనోహరము, సమాస్వాధదయో గ్యము 
క్ర నగర సంభవించును, భాగవతమట్టి క ” 


“వేద కల్పవృక్ష విగళితమె శుక్ర 
"ముఖ సుధా [దవమున మొనసియున్న 
భాగవత పురాణ ఫలరసా ణన డ్‌ 

పదవి గనుడు రసికభావ విదులు. 


100 ల భాగవత వై జయంతీక 


అన్నారు పోతన్నగారు. |బహ్మ సమ్మితమైన శ్రీమద్భాగవతము భ క్తిజ్ఞాన విరా 
గముల స్థాపనకై [పవృ త మైనది. వేదవేదాంగ సుస్నాతుడై న వ్యాసభగ వానుడు 
గీతాగర్భితమైన భారతమును రచించి కూడ చిత్తకాంతి లేకయున్న సమయమున 
నారదుడు చతుళ్ల్ళోక సమన్వితమైన భాగవతమును ఆయన కుపదేశిం చెను. 
తదుపదిష్టుడెన వ్యాసమహర్షి లోకాను గవార్ధము మహాభాగవత నిర్మాణము 
కావించెను. “జన్మాద్యస్య యతః అను [బహ్మసూత్రముతో మహాభాగవత 
శ్లోక మారంభమగుట యందలి విశేషముగా ్రీధరులు వక్కాణించియున్నారు. 


భాగవతమున కేవలము ఈశ్వరారాధన లక్షణమైన ధర్మమే నిరూపిత 
 మగుచున్నది. ఫలాభిసంధి లక్షణమైన కై తవ మచ్చట లేదు. అమత్సరులై న 
సత్పురుషులకు భూతానుకంప గలవారికి వేద్యమైన వాస్తవము. ఆది శివ పదము, 
ఆధ్యాత్మికము, ఆధిభౌతికము ఆధిదై వికమునై న తాషతయమును ఉన్మూలించు 
వస్తువు. అది భాగవత [బఐహ్మవస్తువు. వస్తువు యొక్క. ఆంశము జీవుడు. 
వస్తువు శ క్రి మాయ. వస్తుకార్యము జగత్తు. “తత్‌ సర్వం వసే "జ వ. వ నిర్గుణ 
(బహ్మోపాసనకు అచ్యుత భావము రుచి చూపించుట భాగవత లక్ష్యము. భాగవత 


భి బహుజన్మల సుకృతము వలనగాని లభింపదు. భాగవత (శవ వణేచ్చ గల 
మానసము పరమేశ్వరుని నివాసము. 


తెలుగుదేశములో బమ్మెర పోతనగారి ఆంధ మహా భాగవత మవతరిం 
చిన తరువాత మూలము నందలి యుపాఖ్యానములకు సౌర్వజనీనమైన వ్యాపి 
చేకూరినదనుట అధికో క్రి కాదు. |శ్రీకృష్ణపర[బహ్మ చరిత్రము నానావిధములైన 
ఆ వ్యానోపాఖ్యానములతో ఉపబృృంహితము,. పరీషిత్తు ఏకు దినములలో తనకు 
ము క్రీ రావలయనని (పతీషించుచున్న ఉత్తమ కోత. ఆవధూతవరేణ్యుడగు 
సక యోగీం దుడు భాగవశ వక్త. [శోతృ వక్తల వైశిష్ట్యము సకళ లోక క్లాఘ 
సీయము. [శోతకు వక్త వినిపించిన ఉపాఖ్యానము అన్నియు జ్ఞాన వైరాగ్య 


బోధకములు; భక్తి ప్రక్యాపకముల. కకయోగి పరీక్షిత్తునకు ముమ్మొదట 


చెప్పినది ఇట్వాంగో పాఖ్యానము. గంగా తీరమున ప్రాయోపవివుడై ఉన్నాడు 
పరీశ్షితు. శృంగి శాపము కారణముగా ఏడు దినములలో తనకు శరిరత్యాగము 
తప్పదని తెలియును, ఆట్టి సమయములో పూర్వపుణ్య వశమున తనంత తానుగా 
వకుత భాగవత వక్షగా పరీక్షిత్తునకు [పత్యక్షమెనాడు. “ఏడు రోజుల. దాకా 


పోతన కవితోన్మీలనము 101 


ఎందుకు? రెండు గడియలలో మోక్షమును సంపాదించిన ఖట్వాంగుడున్నాడు" 
_ అని ఉదాహరించి పరీక్షిత్తునకు గోవింద నామకీర్షనమున చిత్తమును సమా 
రూఢము చేసినాడు శుక యోగి. 


ఖట్వాంగోపాథఖ్యానము అమృత బిందువువలే (కోత యొక్క తతత 
మునకు కై వల్యానంద ప్రవేశికయైనది. భాగవతము పండెండవ స్కంధము 
చివర మార్కండేయ గాథ కలదు. ఈ విధంగా ఖట్వాంగ మార్క ండేయో 
పాఖ్యానములను ఆద్యంతము లందుంచుకొని బహూపాథ్యానములను భాగద తనా 
సూూతపరచు చున్నది. (ధువోపాఖ్యానము, పృథు 'చరి తము, పురంజనో 
పాఖ్యానము, అజామిళోపాఖ్యానము, ప్రహ్లాద చరిత్ర, గజేం[ద మోక్షము, వామన 
_ చరిత, కుచేలోపాథ్యానము, రుక్మిణీ కల్యాణము - ఏ ఘట్టము గై గైకొన్నను 
ఏ యుపాఖ్యానము భావించినను పోతన మహాకవి కవితోస్మీలనము స 
చేతో వీథికి మేలుకొలుపు శయన: 


పోతన పూర్వజన్మ సవాసస సంచితమైన తఫఃఫలానుభవము కలవాడు. 
సహజ పాండిత్యుడు. పోతన గురుకుల క్లిమ్ణడు కాడని కొందరు లాక్షణికులు 
చేసిన యాశేపమును చెళ్లపిళ్ల వేంకటశాస్ర్రగారు సరివారించులు వాసిన 
వ్యానము జ జ పికి దెచ్చుకోదగినది. 


గురుళు శూష కవితాపొప్తి పికి (ప్రధాన కారణ మైనను పూర్వజన్మ పరిపాక 
వశలబ్ధమైన కవిత అక్కడక్కడ గన్పట్టును. "హోతన అట్టివాడు. * దేవతా 
వర(పసాద లబ్ధిమైన కవిత్వము సహజము. కాళిదాసాదు లట్టివారు. “ప 'పేదిరే 
.పాకన జన్మవిద్యాఃి” అన్న కాశిదాసోక్తి పోతనయెడ సంగచ్చమాన మగు 
చున్నది. చదవకుండ విద్వాంసులై న వారిని గూర్చియే పాణిని 'తదధీతే తద్వేది 
అను నధికార సూత్రము చెప్పెను. ఆయా శాస్త్రములు చదివిన వారితో పాటు 
చదవకయే తెలిసికొన్న వారి యెడల కూడ ఆ ws [పవర్తించుచున్నది. 


పోతన పుట్టుకతో భాగవత నె నై విపడు. శక వల్య కాంక్షతో మహానందాం 
గనాడింథకుని చింతించిన భక్తాగణి. నన్నయ తిక్కనాదులు తెల:గు చేయక 
నిడిచిన భాగవళమున్న తన పురాకృత శుభాధిక్యముగా భావించి ఆం, ధ్రీకరి ంచుట్లకు 


109 భాగవత వై జయంతిక 


సంకల్పించిసవాడు. [ప్రాచీన కవుల యెడల పోతనకు గల గౌరవము నిర్వాణ 
మైనది. వాల్మీకి, వ్యాసుడు, బాణుడు, కాళిదాసు, భారవి, మాఘుడు. పోతనకు 
వినుతిపా,తులు. పోతన దృష్టిలో : నన్నయ ఆంధకవితా గొరవజన మనోహారి; 
తిక్కన హరిహర చరణారవిదవందనాభిలాషి. [పాక్తన కవుల యెడల భి 
(పకటనము చేయుటే కాక పోతన వర్తమాన కవులకును |బియము పలికిన 
నిర్మత్సరుడు. అంతకంటె జెప్పదగిన మహాలక్షణము భావికవులను బహూ 
కరించుట. ఆంధ కవులలో కాల|తయ జ్ఞానస్ఫూ ర్రిగల మహాత్ముడు పోతన. 


ఆయన భాగవత కావ్యోష్మ్యకమణము విలక్షణము, అనితర సాధారణ 
మైనది. రాకా నిశాకాలము, చందోపరాగము. గంగా స్నానము గావించి ఇసుక 
తిన్నె పై గూర్చున్నాడు. మహే శ్వరధ్యానములో ea లోచనములు కించి 
దున్మీలితములు, స 


“మెలు(గు చెంగట నున్న మేఘంబు రై వడీ 
నువిద చెంగట నుండ నొప్పువా(డు 
చంద్రమండల సుధాసారంబు పోలికి 
= ముఖమున. బియనవ్వు మొలచువా(డు 
వల్రీయుత తమాల వసువ తీజము భంగి 
...... బలువిల్ద మూ(పునం బరంగువాండు 
అ సన్నిహిత భానుని భంగి. 
ఘనకిరీటము దల గలుగువాండు ' 
సస sll బోలు కన్నులవా(డు 
అ _ వెడ(దయురమువా(డు విపులభ|ద 
మూ ర్రివా(డు రాజముఖ్యు( డొక్క_రు(డు నౌ 
కన్ను(గవకు నెదుర( గానంబడియె. క్ట 


అయనకు గోచరించిన రాజశేఖరుడు రామభద్రుడు. “మన్నామాంకి . 
"తంబుగా. శీమవాభాగవతంబుం. దెనుంగుశే సెయుము, నీకు భవబంధంబులు 
దెగ” నని యానతిచ్చి తిరోహితుడై నాడు. తన కుతూహలము (శ్రీమన్నారాయణ 

ee రచనకు, కానప్పుడు | చేసినది తనకు గోచ 


పోతన క వితోన్మీలనము 108 


రించినవాడు రామభ[దుడు, ఆ నోరాయణు డెవ్వడు ? ఆ మహేశ్వరు డెవ్వడు? 
తహ వ్యవహారము పరత త్యమునందే. ఆదై షత వాసనావాసితములై న పోతన 
మహాకవి నయనాబ్దముఅలో న సమన. 


యడున్మీలన శ'క్తెవ విశ్వ మున్మీలతి క్షణాత్‌ 
స్వాత్మాయతన వి|కాంతాం తాం వందే (పతిభాం శివామ్‌. 


గంగాతీరమున సంకల్పోదయము. ఏకశిలానగరమున ఆంధ మహో 
భాగ వతావతరణము. యావదాం|ధమున ఆబాల గోపాలము దానికి వ్యాపి. 


(పబ్బిన భ క్తిని హరిపై 

గబ్బంబులు చెప్పి కరత కె కై వల్య శ్రీ 
కబ్బుదురట ! హరి పోషణ 
మవబ్బిశ తలిదందు లెచటి కబ్బుదురొ తుదిన్‌. 


నీ పాదకమల సేవయు 
సీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం. 
తాపార భూతదయయును 

దాపసమందార ! నాకు దయ సీయగదే ! 


మన సారధి మన నచివుడు 

మన వియ్యము మన సఖుండు మన బాంధవుండున్‌. 
మన విభుండు గుర (డు దేవర 

మనలను విడనాడి చనియె మనుజాధీకా !. 


ఈ కందముల మందార మకరంద మాధుర్యము ' ఆనిర్వచసీయము. 
పోతనగారి పద్యమునకు కథా సందర్భము చెప్పనక్కరలేదు. ఏ పద్యము 
నెత్తుకొన్నను ఆడి యెక్కడిదో యిట్టే పట్టివేయవచ్చును.. భాషలో పరిశమ 
చేసినవాడు సరే. సాధారణ పాఠకుడు, లిపిజ్ఞానము లేనివాడు, బాలుడు, త్రీ" | 
భాగవత పద్యములను ఛదువుట మన తెలుగునాట ఏ (కొత్త తకాదు, 


104 భాగవత వై జయంతిక 


వ్యా ప్తిం జెందక వగవక 

[పా ప్తంబగు లేశమేని పదివేలనుచున్‌ 
దృప్రిం జెందని మనుజు(డు 
సప్తద్వీపముల నైన జక్కంబడునే ! 


ఆని పోతన్న వామన చర్మితలో చెప్పినాడు. ఆయన ఊన్న దానితో తృ పి పిపడి 
వ్యాప్తి కొరకు, దొర్హాడక ఈశ్వరాధీనబుద్ధితో దితీకినవాడు, ఆశాపాశమును 
(తెంచుకొన్నవాడు. ఆయిన నేమి? సర్వాశావాసితమెన న్వచ్చయశస్సు గడించు 
కొన్న దాయన తెలుగు భాగవతము. పోతనగారి పద్యములకు గల బహుముఖ 
వ్యాపి మతి యే కవి పద్యములకున్నది ? 2 


తెలుగువారికే కాదు, పాళ్చాత్యులకు కూడ పోతన కవిత పారాయణ 
పరిపాటికి వచ్చిన నిదర్శనములు గలవు. _ద్రౌనుదొర మన రాష్ట్రమున ఉద్యోగ 
ధర్మము నిర్వహించుచు తెనుగు వాజ్మయమునకు అఖండమైన అమరమైన సపర్య 
- చేసిన మహామహుడు. ఆయన మండలాదికారిగా ఉన్న సందర్భములో ఓక్‌ 
సేద ధనార్థియె బ్రౌను దొరగారి జర 


లా వొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె [బాణంబులున్‌ 
లావుల్‌ దప్పెను మూర్చ వచ్చె( దనువున్‌ డస్పెన్‌ [శమం బయ్యెడిన్‌ 
'సీవై తప్ప నితఃపరం బెజటుల౮గో మన్నింపం దగున్‌ దీనునిన్‌ 
రావే యీశ్వర ! కావవే వరద! సంరక్నింపు భ దాత్మకా ! 
అను పద్యము దరఖాస్తు చేసెను. |బౌనుదొర పోతన పద్యములు వచ్చినవాడు 
కదా! ఈ దిగువ పద్యమును దానికి బదులుగా [వాసి పంపెనట. 


ఏను మృతుండ నౌదునని యింత భయంబు మనంబు లోపలన్‌ 

_మానుమఃు, సంభవంబు గల మానవకో ట్రకు జావు నిక్కమౌ 
గాన హరిందలంపు మి(క గల్లదు జన్మము నీకు ధాతిపె 
మానవనాథ! చెందెదవు మాధవలోకనివాస సౌఖ్యమున్‌. 


ఆయా కథా సందర్భములలోని పద్యములు పోతనగారివి తెలుగు నాటనే 
కాక యితర్మత నోటనోట విహారము చేయుచున్నవనగా ఆ మవోకవి వచో 


పోతన కవితో స్మీలనము 105 


మాధుర్యము, భావదీ ప్రి యెంతటివో ! పోతన కవివరుని “పంచశత జయంతి” 
తలపెట్టుట "es (పభుత్వము వారి సారస్వత (పితికి చెరగని గుర్తు. 


గోపాల $శు మౌళి కుటిల కుంతలపాళి 
న(కో క్రిలీల రాబట్టినాడు RECNO నేం 
[వజబాళలు శమ రతావ్‌మున నవిచ్చిన్న 


వాజ్యహస్సులు గిలుదాడినాడు BAU. a) 


వెన్నుని తల నెమ్మిపింఛమ్ములో వర్ణ 
విన్యాసరుచి కొల్పవెట్టినాడు 'ద్న స. 
నవనీత దస్యు వెన్నడి 'సమాసపు వెన్న 
_ పూసలు కొసరి కాదేసినాడు ళ్‌! -ట 


లేదుపో! తన కెక్కడి పేదతనము 

భాగవత. రూప. జాతరూపమ్ము ధనము 
నతడు రాసులు వోసె సర్వాం ధజాతి 
కారగింపుగ రసమయంబైన యాని. 


ఖీ 


 మందారనుకరంద మాధుర్యమునందేలు మధుపంబు పోవునే మదనములకు 
నిర్మల మందాకినీవీచికల(దూ(గు రాయంచ చనునె తరంగిణులకు 
లలితరసాల పల్దవ భాదియై చొక్కు. కోయిల చేరునే కుటజములకు 
పూర్ణేందు చం|దికా స్ఫురిత చకోరక మరుగునే సాం దనీహారములకు 
అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమ త 

చిత్త మేరీతి నితరంబు( అ వినుతగుణశీల! మాటలు వేయనేల! 


క. వార వారి న ఖ్రాలకృష్ణుడను 


డాక్టర్‌ ధారా రామనాథ కొసి) 


స మనిషి జీవితంలో నై నా బాల్యం చాలా ముఖ్యమైన ఘట్టం, కల్లా 
కపటం తెలియని వయస్సు. అచ్చ పాలపొంగులాగా స్వచ్చమైన మనస్సు. 
ఇరుగు పొఠకుగు వాళ్ళతో, మాట్లాడినా - పోట్టాడినా దోచినా దొంగిలించినా అదొక 
జ. ఆరం: 


చూడండి. మ్‌ యింట్లో పాదు మా యింట్లో పాలు అని అడ్డుగోడలు 

మనం కట్టుకున్నా మె కాస్‌ ఆసలు పాలకి ఆ తేడా తలియదు, తన దూడకు 
మాతమే యో పాలు దకా్మాలి, ఇంకెవ్వరికీ. చెందకూడదు అనుకొనే ఆవు 
ఎక్కడన్నా ఊందా? మని షే సీమడై. ఆవుపాలని 'లేగ దూడకు సైతం పూర్తిగా 
_దక్కనీక దొంగలాగా హరిసాడు. అమ్ముకుంటాడు. మేడలు కడతాడు, కడకి 
ఆ లేగ పాబుచాలక కన్నుమూస్తై సె దాని తోలును దూదితో నింపి ఆవుకి లేగదూడ 
(బతికే ఉన్నదనే భాంతి కల్పించి పాలు గుంజుతూనే ఉంటాడు, ఆవుకిమా(తం 
తన పాలు అన్న అహంకారంకాని, అవి తన లేగకే చెందాలన్న మమకారం కాని. 

లేవు. అందుచేతనే ఆవు దేవుడు. 


(ప్రవహించే ఏళ్లకీ, దప్పి తీర్చే సీళ్నకి, కొండ కొమ్మున కరళ్ళయిన 
వెన్నెలకీ, చల్పగాలికీ, నింగి మబ్బుకీ, నేలతల్లికీ ఎవ్వరికీ లేని స్వార్థం ఈ 
నిష అనే పవవలో కరుడు కట్టింది. ఈ "మనిషే. పిల్లవాడిగా ఉన్నప్పుడు 
వెన్నెలకు నుల్లెనే పాలనురుగుకు మలెనే స్వచ్చంగా ఉంటాడు. ఎదిగే కొద్దీ 
గిడసబారి అన్నీ తనవే అనీ, ఆంతా తనదే అనీ స్వార్థానికి దిగుతాడు, మనసు 
మదరక ము= అ మంచి సంగతుల పై బుద్ధికుదిరిన ఫీడ్రే. దేవుడు-. లేదా 3 
జీవుడు. య. 


నేను ఐమ్మెర వారి కూలకృష్ణుకను 107 


అందుకనే ఎల్టా లానికీ పిలవాడీలాగా మసలటమం సే ఏమిటో చెబుదా 
మసీ, నీవూ నేనూ స్‌ మసం "కలిసి మందగా ఆందంగా బతకటమంచే 
ఏమిటో నిరూపిద్దామనీ దివినుండి భువికి దిగివచ్చాను. ఆలనాడు వ్యాసురివారూ, 
అయిదువందల ఏళ్ళ కిందట బమ్మెరవారూ, ఆనందమూ రులైన |వజవాసులూ 
నన్ను కని విని పెంచి లాలించి మురుస్తుంటారు; తరిస్తుంటారు. 


ఆసలు నా స్వమాపం సర్వాంతర్యామి అయిన విస్టుత్వం. ఆప్పుడప్పుడు 
_ పరిమితత్వానికి చిహ్నంగా కిరణమయములై న ద్వారాలలో బద్ధుడనై దర్శన 
మిస్తుంటాను. ఇట్టా కనిపించే నా వైభవాన్ని కీర్తించటానికి మహర్షులు నేను 
చెరసాలలో పుట్టినట్టు వర్ణించారు. మహర్షులు మహానుభావులు. నా తత్త్వాన్ని 
లోకసం|గవాబుద్ధితో దర్శించి ' ఆహౌరుషేయములై న బుకుు_లుగా రూపొందిన 
హక్కు_లుగా కటాశ సారు. నిజమే, వారికి ఒకానొక ఆవిష్టమైన చేతనస్థితిలో 
_ నేనే ఒక రమణీయ స్ఫురణజగా భాసిసాను.. దాసిని జాగ త్తగా పసిగట్టి విని 
కని శద్దార్గసౌందర్యం కలిగిన ఒక మహాసృష్టిగా రూపొందిస్తారు. ఇందులో 
వారి సొంతం ఏమీలేడు. ఉన్నది ఉన్నట్టుగా, కన్నది కన్నట్టుగా, విన్నది విన్న 
టట్టుగా చెప్పిన ఇటువంటి వాళ్ళని (దష్టలనీ, (సష్టలనీ సంభావించి లోకం బుణం 
తీర్చుకుంటుంది. నిజానికి వాళ్ళనే కవులనాలి. “నన్ను” చెప్పే ఈ 
కవులున్నారే- వీళ్ళు ఎల్హకాలానికీ, ఎల్హలోకాలకీ బుమల వంటే కవులవుతారు. నా 
చెరసాఅ పుట్టుకను విష్టసూ క్రంలో దర్శించిన వారు ఆటువంటివారే. ఇతర 
బుషలు నన్ను ఎల్లప్పుడూ పీకు మీ భాషలో చెప్పటానికే యత్నం చేశారు. 
న. చేస్తారు. 


ఇంత అందమైన నా కథని సంకేతంగా వేదస ం|పదాయంగా పెద్దలెందరో 
అపొరషయ మార్గంలో ప్రవచించారు. బ్యాసులవారు సంప్రదాయ రవహస్యా 


అన్నింటినీ కథలుగా మార్చి కవిత్వాన్ని చేర్చి మానవకోటికి శాశ్వతంగా చర్వణ 


యల! చేశారు. అందుచేతనే ఆయన ఆటు వేదన్యానులు, ఇటు మ సప. 


తెలుగు ఖావకి దెందినంతవరకు పోతనగారు కవిత్వాన్ని ఒక (పస్థానంగా 
దర్శించి తాము. తరించి తెలుగువారిని తరింపజేయటానికి యత్నించిన మహ 
ష్‌: అందుచేతనే అన్యకంఈం | విషయంలో (పహ్హోదత్వం (శన్నుదోయికి 


108 భాగవత వై జయంతిక 


నన్యకాంత లడ్డంబై న్‌ మాతృభావము. చేసి మరలువాడు) నెర పే తెలుగువాళ్లు 
సైతం ఆయనకి స్‌ పూజా పీఠం పెట్టి గొరవిస్తున్నా రని తెలిసి సంతోషం కలి 
గింది. బమ్మెర వారి సాహిత్యాన్ని బళ్ళ త్రించి ఊరేగిస్తారా! పోతనగారి శిలా 
వి|గ హాలు వాడవాడలా నెలకొల్బు తారా! ఉత్సవాల పేరుతో లక్షలాది (పజల 
పైకం *“కఫ్‌** అని ఊదేస్తారా! నౌది ఒక్క-టే కోరిక. ఎక్కువమంది ఆయన 
కవిత్వాన్ని కళ్ళకద్దుకుని చదివి తరించాలని. ఆటువంటివారి సంఖ్య తగ్గుతున్న 
(a) 
దేమో నని భయం. తగ్గరాదని అభయం. 


అసలు నేను వచ్చేసరికే నంద |వజం ఆనంద వజమైంది. - ఆబాల 
గోపాలం నాకు చేయవలసిన సేవలు, జరుపవలసిన విధివిధానాలు జరిపించారు. 
గమన యశోద చిన్నమగవాని గనెనట చూచి వ తమమ్మ సుదతులార!'' 
ఆంటూ కొందరు, “పాపనికి నూనె దలయంటి పసుపుపూసి బోరుకాడించి పరి 
రక్ష పౌ మ్మంటూ కొందరు, జోలపాటలు పాడుతూ కొందరు. పపంచ 
"సాహిత్యంలోనే సాటిలేని నా బాల్యలీ సౌందర్య హేలగా | వజాన్ని పులకింప 
జేస్తూ ప్రారంభమెనా ఇది శాశ్యత స సందేశంగా విళ్వానికి ఉద్దేశించాను. నౌ 
ఉద్దేశంలో సందేశ మన్నది కేవల (ప్రబోధంలాగా కాక ఒకవైపున మాధుర్యలీలా 
విలాసాలను (పసరిస్తూనే అంత ర్జీనంగా ఒక ధర్మాన్నీ త త్వాన్నీ పతీయమానం 
చేయాలి. ఈ విషయంలో నాలాంటి బాల్యత త్ర త్యం మరొకటి లేదు. ఓక 
సువిశాల కాలపరిథిటో దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి ధర్మసంస్థాపనం ఆనే 
ధ్యేయంతో (పవి రిల్రిన నా జీవితకథ దివ్యమానుషభావాల స. 


ముదు ముందు దుష్టశిక్షణను ఎన్ని మార్గాల నడిపించ టానికి వీలున్నదో 
అన్నిటినీ బాల్యంలోనే అమలు పరిచాను. ఆసలు సృష్టిలోని ఆసద్వస్తువులను 
సద్వస్తువులచేత దమించచేయటమనేడి ఈ కార్య కమ ఠవాస్యం. పూతన 
మొదలు కంసుని వరకు నడచిన ఈ సంహార కాండలో ఒకదానిని మరొకటి 
పోలలేదు. పూతనని చంపటానికి ముందు ఎంత ఆభినయం చేశానో. చూశారా? 


మేల్కొన్న తెజి(గున మెల్లన కనువిచ్చి 
_కేంగంట( జూచుచు గిదికి నీల్లి : 
యావృలించుచు( జేతు లాదరంబున( జాచి 
_ యొదిగిలి యాశొన్న యోజనూ,ది. 


నేను బమ్మెరవారి బొలకృష్ణుడను 109 
| జ : 


విగి చన్నుగవ( గేల వీడించి కబళించి 
గుక్క గుక్కూకు గుటుగుటుకు మనుచు 

నొక రెండు గుక్కల నువిద (పాణంబులు 
సెతము మేనిలో సత్వమెల్డ( 

(దావె నదియును గుండెలు ద ల్రడిల్ల 

' బిమ్మ.దిరుగుచు నిలువక శిరము [వాల 
నితరబాలుర |కియవా(డ వీవు గావు 
చన్ను విడువుము విడువుము చాలు ననుచు. 


ఇట్టా జరిగిన | పతిరక స్పంహారమూ వారికి ము క్రికారకం. కనుకనే 
ఫోతునగారు నా బాల్య కీడకు | పాతిపదికగా-. 


“ఉరు సంస్కారపయోనిధి 

తరణంబులు, పాపపుంజదళనంబులు, (శ్రీ 
కరణంబులు, ము క్రిసమా 

చరణంబులు బాలకృష్ణు సంస్మరణంబుల్‌ ” అన్నారు. 


అప్పడప్పుడు కథలోని కొన్ని ముఖ్యపాతలకి కొన్ని మానసిక 
సంచలనాలు కలిగించి పరత త్య స్పర్శ |పసాదించటం నా బాల్యలీలలో ఒక 
భాగం. ఆయా వ్యక్తులు ఆ స్పర్శని అందుకొని అందులోని ఆనందాన్ని 
పొందారు. కాని ఆ ఆనందస్థితిలోనే వాచ ఎల్బకాలమూ ఉండిపోతే నా కథ 
ఎప్పుడు కంచిని చేరేట్లు? "అందుచేత ఆట్లా పరత త్య దర్శనం కలిగించినర్తే 
కలిగించి ఇట్లా భౌతిక కక్ష్యలోకి లాగేవాణ్డి, మహానంద. గేహిని అయిన 
యశోదకు నా విశ్వరూపదర్శనాన్ని కలిగించాను. ఆందులో చరాచర భూత 
కోటిని తిలకించి ఆ తల్లి ఆబ్బురపడిండి. ఒకసారి నన్ను పట్టుకో వాలని పయ 
త్నించి ఏసిగి వేసారి" నాగురించిన గవర ద్వంద్వస్థితిని ఇటా 
తలపోసింది.- 


బాలు( డీశండని భావింతు నందునా 
మ. "పెద్దలును నెర రీ [కమంబు 
వెల పెజుంగుటకునై. వెజపింతు నందునా. 
_ శకలిగి లే కొక్కడు గాని లేండు 


110. భాగవత వై జయంతిక 


వెజప్పుతో నా బుద్ధి వినిపింతు నందునా 

తను( దానయె బుద్ధి( దప్పకుండు 
నొండెజుంగక యింట నుండెడి నందునా 

చొచ్చిచూడని దొకచోటు లేదు 
తన్ను నెవ్వరై న దలపోయ' బాజెడీ 
యోజ లేదు భీతి యొకటి యెజుంగ. 
డెలమి నూరకుండ( డెక్క_సక్కె_ము లాడు( 
బట్టి కాసి సేయు భంగి యెట్టు 2 


ఈ ఘట్టంలో వ్యాసులవారు మా అమ్మ మ న ఇంత తుం 
తొలిచారు క. 


అన్నగారితో, తక్కిన గోపార్భకులతో కలిసి రకరకాల అలంకొరాలు 
చేసి కొని విహరించటం నాకు ముచ్చట. నాలాగే పిల్లలు ఎల్లప్పుడూ సర్వాాలం 
కృతమూ ర్త రుల సంతోషంతో గెంతుతూ. ఊండాలనీ నా ఉద్దేశం, సర్వాలంకృత 
మైన నా మూ రిని వర్శిస్తూ వ్యాసులవారు వేసిన ఒక బొమ్మకి పూర్వాపరాలు 
సంబంధించి శివృడికి నాకూ అభేదం ఆరో పించారు పోతన్నగారు- 


తనువున నంటిన ధరణీ పరాగంబు 
_ పూసిన నెజిభూతి పూత గాంగ 
[ ముందజి వెలుగొందు ము కాలలామంబు 
తలా “ల సంగడికాని తునుక గాగ 
9 ఫాలభాగంబుపై పె. బరంగు కావిరిబొట్టు 
కాముని గెల్చిన కన్ను గాగ 
గంఠమాలికలోని ఘన నీలరత్నంబు 
_కకునీయమగు మెడకప్పు గాంగ 
వారవల్పు లురగహారవల్టులు గాంగ. 
ల. జౌఢ బాలకుండు 
శివుని పగిడి నొప్పె శివునికిం దనకను 
: చేయి లేమిం చ వెలయనట్టు.. ల. 


నేను బమ్మెరవారి బాలకృష్ణుడను 111 


యమునాతీరంలో మేమంతా చల్చులు మెక్కుటం వ్యాసులవారికీ బమ్మెర 
వారికీ ఎంతో ముద్దు. పకృతితో సామరస్యం నెరపి ఆందులో భాగంగా మారి 
పోయి జ అహ కక అందరితో పంచుకోవటం మనిషి నేడ్చుకోవాలి. ఎవడి 
తల్లి వాడికి కట్టియిచ్చిన చల్తిమూట. వాడొక్కడే భుజిస్తే అది జనార్థణ్యం లాంటి 
ఇప్పటి సమాజంలో మీ స [ప్రవర్తన లాగానే ఉంటుంది. మే మేం చేశాం? 
అందరం తెచ్చింది కలిపి, అన్ని రుచులూ కలబోసి నేలమీద ఆకుల్లో ప పూల 
పొత్తుల్లో గరికమేటల్లో ఏటిఒడ్డున చెట్ట నీడన పశుపష్యాదుల (పక్కన sre 
Hse చేశాం. _ వ్యాసులు, పోతన కూడా ఇక్కడ నన్ను యాగభో క్రగా 
వర్షించి తరించారు. నాది నేను తింటే తిండి. అందరం కలిసి తింటే యజ్ఞం. 


సం ఆ యిం|దుడికీ, ఆ బిహ్మకీ నన్ను పరీక్షించాలని బుద్దిపుట్టింది. 
రజోవిలసనం వల్చ |బవహ్మా, ఐంది క్రి క్రివల్ల ఇం|దుడు గోవత్సాపహరణ గోవర 
నోద్ధరణ ఘట్టాలలో నా సర్వాంతర్యామి త్వాన్ని గమనించగలిగారు. అఆట్టానా 
దివ్యత్వాన్ని తాము er పరిషించి ల కానక చాటటం వారికిష్టం. 


పోతనగారి తెలుగు పద్యాలు చదవటం మొదలు పెట్టి నేను తెలుగు బాల, 
కృష్ణుడుగా మారిపోయాను. ఎప్పుడైనా వ్యాసులవారు కనిపించి “సల నాయనా! 
బాగున్నావా?” అన్నపుడు నేను పోతనగారి పద్యాలు చదివి య. 
ఆయన 'వెండిగడ్డం వెలిగిస్తున్న ముఖవర్చస్సుతో వెన్నెలబావుల్హాంటి కళ్ళతో 
నవ్వుతూ ' నా బాలకృష్ణా! నువ్వు అ తెలుగు పిల్లాడివి అయిపోయావురా”. 
ఆని నన్ను ముద్దు చేస్తారు. 


ఆసలు మా silos నా కథల్నీ గాధల్నీ వ్యాపి చేయటానికీ 
కంకణం కట్టుకున్న మహనీయులు. భ క్రియాగ [సవక్త కలు. వారు భ కికి సర్వో 
తృమాదర్శం (కంద గోపికలి ల్ని చెప్పి “యథా వజగోపికానాం' ఆంటారు. 
sos నా కథ ఎక్కు డ చెప్పినా ఎప్పుడు చెప్పినా పడి (పస కి క్రి లేకుండా 
పూ ర్రికాడు, రామావరారంలో “పుంసాం మోహనుడి"' నైన నా పరిష్వ్పుంగ 
క... కోరారు వీడ. త జన్మలో నేను ఏకపత్నీ వతుణ్లి కనుక బహుపత్నీ 
రూపజీవాత్మరతునిగా (పభవించనున్న మరుజన్మలో అటువంటి అవకాశం కలి 
గిసానని వాగ్దానం చేశాను. తదనుగుణంగా నా ఆ పాకృత మాధుర్య స్పర్శ 


సౌంచిన గోపికలు. నామ ధుర్య దర్శనానికి. ల నిలిచారు. మొదట నా 


119 భాగవత వై జయంతిక 


వేణుగానం చేత అకృష్టలై [కమంగా రాసమండల నృత్యంలో భాగ స్వామిన్నులె 
మరొక మెచైక్కి కాత్యాయనీ [వతదిక్షితలై నన్నే భరగా పొందాలని సర్వా 
త్మనా వాంఛించారు. లౌకికంగా ఏ కొలది మర్యాదవంటి తెర అంబరాల 
రూపంగా నాకూ వారికీ నడుమ అడ్డంగా నిలచినా దాన్ని తొలగించి నాకు 
తెలియని మర్మాలు వారికేమీలేవనీ నన్ను సర్వాత్మనా శరణుపొందటం వినా 
ఎవరికి ఏమీ ధ్యేయం లేదనీ [పవచించాను. కాలాంతరంలో అర్జునునితో “సర్వ 
ధర్మాన్‌ పరిత్యజ్య'* అనటానికి ఆవసరమైన బీజం ఇక్కడే నాటుకున్నాను. 
నదులూ నారీమణులూ [పకృతి స్వరూపాలు, వీరు వీరికి స్వస్వరూప కేం|దాలుగా 
ఉన్న స్థానాలలో లీనంకావటం ఒక అనాచ్చాదితమైన సహజస మ్మేళశనం. ఆక్కడ 
నదులు సాగరాలతోను, [గహతారకా గోళాలు సూర్యునితోను, ఆకాశం వాయువు 
తోను, వాయవు అగ్నితోను- ఇట్టా జరిగే ఏ సంగమానికైనా సరే దిక్కులే 
_ ఆంబరాలుగా ఉంటాయి. ఈ సంగమాన్ని [పలయం అని కూడా ఆంటాం. 
ఆంటే (పకృష్ణమైన లయం అన్నమాట. ఇక్కడకూడా వీరు నన్ను పొందటంలో 
దిక్కులే అంబరాలుగా కలిగి ఉంటారు. దిగంబరత్వానికి సంబంధించిన ఈ 
మార్మిక సిద్ధాంతాన్ని కథలాగా ఆభినయించటంలో నాకూ గోపికలకూ రామా 
వతారంలో ఉన్న ఆడ్డుకూడా తొలగిపోయింది. వారు నన్ను కోరింది పరిష్యంగ 
సుఖం. వారికి నేను ఇన్యదలచింది ము క్రికాంతా పరిష్వంగసుఖం. బాల్యం 
వదలుతున్న వయస్సులో మళ్ళీవస్తానని చెప్పి కాక్వతంగా |వజాన్ని వదలి వెళ్ళి 
పోయాను, ఏళ్ళూ పూళ్ళూ గడిచాయి. గోపికలకు నా భౌతిక దఠ్శనం దుర్భభం 
అయించీ. అలనాటి నా బాల్యస్వరూపాన్నే ధ్యానం చేసి చేసి తలపండి "తమ. 
వెనుకటి జన్మ బుషిత్వాలకు కాలపురుషుడు గీసున్న తెల్రవిబటొమ్మలలాగా తయా 
రవుతున్నారు గోపికలు. నేనూ పెద్దవా జ్ఞయ్యాను. కురుత్నేత సం్యగామం. 
కూడా నిర్వహించిన తరువాత ఒకసారి [గహణస్నాన సందర్భంలో దర్శన ' 
మిచ్చాను. రవ్వంత సేపు ఏకాంతానికి తీసికొని. వెళ్ళి “చిన్నప్పటిలాగే ఆడి 
పాడుదామా?” అని అడిగాను. ఇప్పుడు వారు బూమలై పోయారు. 


మోర సంసార సాగరో తారణంబు. 
_థీయత జ్ఞానయోగి వృద్ధ్యేయవస్తు 
వగుచు( జెలువొందు నీ చరణాంబుజాత 
 యుగళమును మా మనంబుల. దగులనీవె. 


నేను బమ్మేరవారి కాలకృష్ణుడన 118 


అన్నారు: అగా వారు కోరాలనే నేనూ కోరాను. ఆ దివ్యపదవినే వారికి ఇచ్చాను. 
భౌతికంగా స్‌ ప్పుడె స్పుో ముగిసిన మా యీ కథ గోపికల _ఆఅధ్యాత్మి 15 


(పస్థాన గాధ. ఈ కథను పో పోతనగారు వ్యాసులవలెనే ఇ ఇట్టా 'వ్యాఖ్యాసియ చారు. 


' గోపజనము అందు గోపికలందును 
సకల జంతులందు సంచరించు 
నా మహాత్మునకు( బరా౭గన లెవ్వరు 
సర్వ మయుడు లీల సలిపెగాక. 


ఇట్టా లీలా బాలునిగా రక్షస్సంవహ ర్తగా కాస్సేపు, సర్వాంత 
ర్యామగా కాస్సేపు, గోపీలోలునిగా కాస్సేపు, ఆడుకున్న ఆ బాల్యం ఆ (వజం. 
అక్కడి మనుషులు వాళ్ల మనసులు ఆ యమున పచ్చికబీళ్లు ఇవన్నీ తలచు 
కుంటే ఎప్పుఢూ వావకృన్ణు ఇలాగా ఉండిపోతే బాగుండు ననిపిస్తుంది. అట్లాగే 
ఉన్నాను కూడా, అనంతర కాలంలో చుట్టరికాల వల్లి దగ్గరై నవాళ్లను కూడా 
_ ఆవసరం వచ్చినప్పు ఎడు చంపితే ఏ పూతననో, గ్ర టాసురుజ్హో "కంపినంత 
నిర్హి ప్తంగా ఉండేది. ఆందుచెత నేనె స్పుడూబాల కృష్ణుఖే. మధుర వదలి ద్వారక ఫ్‌“ 
చేరినప్పుడు [వజం వదలి బృందావనానికి వలస పోయినదాని కంది గొప్పగా 
ఏమీ లేదు. ఆష్ట మపాషుల సరసాలు, షోడళ సహ సాంగనా విహారాలు. 
నా మనస్సులో ఎప్పుడూ చెక్కు చెదరని జీవాత్మరతిగా, (పకృతి పురుష హేలగా' 
ఉంటుండి. కరుష్మేతంలో రక్తం ఓడిగలు కట్టినప్పుడూ, . యాదవకులంలో 
ముసలం పుట్టినప్పుడూ నాకు పెద్ద విశేషంగా తోచలేదు. చిన్నప్పుడు అగ్ని 
(తాగి గోపకుల్ని కాచినట్లు, క కాళియ ఫణి ఫణా? 6 మీద నాట్యం చేసినట్టు 
- అనిపించేది. ఆప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా నా ముఖం మీద చిరునవ్వు 
చెదరలేదు. నేను యుగ యుగాలుగా (మోగించే వేణువు మం[ద మం|ద నాదం 
మలగిపోలేదు. నేను ఎల్రప్పుడూ వ ఇప్పుడు గక భాషలో బమ్మెర 
వారి స 


క 


పోతన కవిత్వ పటుత్వము 
. శ్రీ తాపీ ధర్మారావు 


““ముక్కూతిమ్మనార్యు ముద్దుపలు "కన్న ట్రే పోతన్నది నహజ పాండిత్య 
మనీ ఆతము రామభ క్రి పరాయణుడనీ సహృదయులు తమ అభ్మిపాయాన్ని 
'గుళికారూపంి గా |పకటించారు. దానితో ఇటీవలి పాఠక లోకానికి బమ్మెర. 
పోతరాజూ, యెడ ఠరామదాసూ ఒక్క తరగతి రచయితలుగా కనబడ నారం 
భించారు. 

| సహజ పాండిత్యం కాబట్టి పోతన్న. ఆంధ శ బ్రచింతామణిగా ని కనీనం 
చిన్నయసూరి పాధైనా నేర్చుకొని ఉండడు. కాబట్టి పతన కవిత్యంలో వ్యాకరణ 
దోషాలూ, తప్పుడు సంధులూ కనబడతాయి. రజల పరిజ్ఞానం అసలే లేదు. 
అందుచేతనే ఆప్పకవిలాంటి లాక్షణికులు పోతరాజును ప్రామాణిక కనిగా 
ఆంగీకరించలేదు. 


మరే మేరుగు లేకపోయినా రచనలో శద్దాడంబర మైనా ఉంచాలని 
పోతన్న ఆంత్యాను[పాస కోసం oe నిఘంటువులన్నీ గాలివజా డనీ కొంద 
కనుకున్నారు. 


_ ఇక పోతన రామభక్తుడన్నారు సహృదయులు, " కాబట్టి అతని కవిత్వం 
వ క్రి పేరితమూ; భ క్తిపూరితమూ. భృక్తిఆవేశంవల్ల ఒప మరచి ఏదో అన్నాడు. 
దో (వాళాడు; అభ క్తి సంబంధమైన గొడవ మినహాయి స్తే ఇంక పోతనలో; 


విత్యమేమి. కనబడుతుంది? అన్నారు మరికొందరు విద్యాధికులూ be 
పముఖులూనూ. 


అయ్యో ! పోతనామాత్యా ! సీవు “దుర్గ మాయమ్మ కృపాబ్ది Nd 
కవిత పటుత్య సంపదల్‌” అని ఆర్థించినదంతా వ్యర్థ మేనా? “కాటుక 
నీరు చనుకట్టు పయింబడ” నేడుస్తున్న ట్టు కిసీపించిన సరస్వతి దృశ్య 
ఎంతా నమంటువుం నిషాయేనా? 'ఇమ్మనుజేక్వరాధమ ల కివ్యనని గ 


'సోతన క వీత్వపటుత్వము న 115 


సత్క-వుల్‌ హాలికుళై ననేమి ? గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులై న 
నేమి?” అని సత్కవిగా సగర్వంగా! oe వట్టి బాకా ఊదుడేనా? 


అభి పాయ గుశికలవల్ల కలిగిన అనర్థమిది. ఆనాటి సవృాదయులు ఆ 
కవులలోని గుణాలన్నీ చూచినవారే. అందులో మరీ స్సుటంగా ఉన్న ఏ గుణాన్నో 
ఒకదాన్ని గుళికా రూపంలో పకబిసారు. తక్కిన కవితా విశేషాలు లేవని 
వా రెప్పుడూ అనలేదు. అయినా ఆ గుళికా పభావం విపరీతంగా పడణమించింది. 


వారు పేర్కొన్న గుణమొక్కటే ఆ కవిలో ఉన్నట్టూ, తక్కిన గుణాలు 
ఏవిగూడా లేనట్టూ ఇటీవలి పాఠకలోకం ఆర్థం చేసుకుంది. రసపోవణగాని, 
కవితా శిల్పంగాసి, భావ నిరూపణంగాని, విషయచితణం గాని ఆ కవిలో 
ఉంటాయని అనుకోరు. చూద్దామని |శ్రద్ధగూడ తీసుకోరు. 


పోతన్న ఆంత తేలికగా (తోసివేయదగినవాడు కాడు. ఎందరో మహాను 
భావుల కన్న మిన్న. అమర్త్యకాంత అయిన ఆంధ కవితా పితామహుని 
వరూధిని మర్య్యకాంతగా పుట్టకపోయానే అని విచారిస్తుంది. చూడండి 


ఎంత తపంబు'చేసి జనియించినవారొకొ మ ర్హ్యభామినుల్‌ 
కాంతు డవజ్ఞ చేసినను కాయము వాయుదు; రే నమర్శ్యనై . 
చింతల కల ఏళ జిదికి సిగ్గరితిన్‌ ; మృతి లేని నాదు చె 
ల్వింతయు హూన్యగేహమున- కెత్తిన దీపిక్రయయ్యె నక్క_టా! 


ఈ విధంగా వరూధిని గణితంలో ఒక లెక్కచేసినట్టు, లాయర్‌ వాదించి 
నట్టు చీంతిస్తుంది. ఇక పోతనగారి గోపిక అలా కాదు. యమునా నదీ తీరంలో 
ఒక వక వ్‌ పుట్టకపోయానే అని విచారిస్తుంది. 


నా మోసంబున కెద్దిమేర వినవే నా Ss 
లేమా నోములు నోచుచో నకట కాళిందీతటిన్‌ వేణువై 
భూమిన్‌ పుష్టైదనంచు గోరదగదే బోధిల్లి యైన నీ 
బామం దిప్పుడు మా ధవాధరసుధాపానంబు గల్గుంగచదే! 


ఇది స్రుభావ సహజంగా, రసముట్టిపడేటట్టుగా ఉన్నది. 


nm భాగవత వై జయంతీక 


వామనావతార ఘట్టంలో పోతన చూపిన “కవెత్యపటుత్యము' అసాధా 

రణం. ఆ ఘట్టాన్ని అంత సమర్థతతో చితించగల కవులు ఒకరిద్దరు మించి 
ఉండరు, బలిచ[కవర్తి దానాన్ని [గహి3చి వామనుడు (తివికముడై [బహ్మాండం 
నిండిపోతాడు. వటు డింతింత్రె మరింత్రె పెరిగి సోతూండటం పోతన్న హృద 
యానికి [పత్యక్షంగా కసిపిస్తూంది. ఆ విధంగానే పాఠకునికి గూడా కనబడాలి 


గదా! ఆ |బహ్మాండత్యం పాఠకునికి [పస్సుటం కావాలిగదా! అలా జరిగి = 


త గదా ఆ రసం పలికినట్టవుతుంది . 


ఇంతితై వటుడింతయె మరియ దానింతై నభోవీథిపై 

నంతై తోయదమండలా[గమున కల్పంతై ([పభారాశి పె 

నంత్రె చం్మదుని కంతయె (భువునిపై నంత్రె మహర్యాటి పె 

నంత సత్యప కోన్నతుండగుచు [బహ్మాండాంత సంవర్థియె. 

అని వర్ణించాడు. ఆకాళవీధి, మేఘమండలం, కాంతిరాశి, చంద్రుడు, (ధువుడు, 


మహర్వాటి, సత్యపదం అని. ఆ. రూపాన్ని పెంచాడు. కాగి ప 
మెంత పెద్దదో కంటికి క ట్టినట్టయిందా? తృ ప్రి లేదు. కాబరే- 


as బుషపమింప బాతమగు ఛ|తంబై శిరోరత్నమై 
[శవణారంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై 
ఛవిమత్కంకణమై కటిస్టలి నుదంచద్ద ంటయై నూపుర 
(పవరంబై పదపీఠమై వటుడు దా దిహ్మోండమున్‌ నిండుచోన్‌ . 


అని వర్ణించి కృతార్థుడయ్యాడు. ఆ 'మహాద్భుతరూపాన్ని es చూపించి 
పాఠకులను చరితార్థులను చేశాడు 


.... నడిమింటి క నున్న సూర్యభింబాన్ని చూడమన్నాడు... ఆది యెంత యెత్తున 

io ఉందో, ఎంత పెకిపోతే దాన్ని తాక గలమో. కశహారూపంగా పతి పౌఠకుడికీ 
తెలుసును. దృష్షిస్‌ ఆ బింబం మీదనే ఊంచి పోతన్న ౩ వామనుడిని పెంచాడు. న 
వామనుడి కడి గొడుగులా గుందన్నా కు ఇంకా. చెంచాడు. ఇప్పు డా బింబం. 

| తలలో పెట్టుకున్న రత్నంలా- గుందన్నాడు. ఇంకా పెంచాడు. చెవి పోగులా 

గుంది. ఇంకా- ర 6ఠాభరణంలా రాగ 'ఇంకా_ భుజకీ రిలాగ; ఇంకొ కాలి ఆందె 

లాగ; ఇంకా పెంచాడు. ఆ బింబం పాదపీఠంలా గుందన్నా డు. ఎంత పెద్ద 


పోతన కవిత్వపటుత్వము స న్న ఎ త 


ఆకారాన్ని ఎంత స్పుటంగా చిితింబాడో చూడండి. పోతన్న శిల్పనై పుణ్యం. 
_ వఏమనగలం? మన మహాకవు లెందరీ మహాకార్య మింత అందంగా నిర్వ ర్తించ 
గలరు? అనకూడదు గాని భగవద్దీతలోని విశ్వరూప సడ ఘట్టంలో. నైనా 
ఇంతటి స్పుటత్యం ఉందేమో చూడండి = 


ద్యావా పృథవోో రిద మంతరం హ్‌ 
వ్యాప్తం త్వయెకేన దిశశ్చ సర్వాః 
దృష్ట్యాద్భుతం రూప ముగం త వేదం 
లోక |తయం (పవ్యధితం మహాత్మన్‌. 


(పపహ్హాదచర్యితలో 'నృనింవోవతార వర్ణన ఎందరు కవు లారీతిని వర్ణించి ' 
సాధకులకు. సాషాత్కారం కలిగించగలరో యోచించినట్లయితే పోతన, కవిత్వ 


పటుత్వం నిస్సందేహంగా తపతప 


గదెంద్రమోక్ష ఘట్టంలో పోతన చూపిన మహాకవి లక్షణాలు. అమోఘ 

ములు. గజేం[దుడి [ప్రార్ధనలో జ్ఞ కాన భక్తి వైరాగ్య (పపత్తులను ఏ విధంగా 
సోపానాలుగా ఉపయో గించాడో చూడవలసినదే.. విష్ణుమూ రి భ్‌ కృవాత్సుల్యం పక 
టించటానికి' పోతన వేసుకున్న పథకం కేవల థ్‌ క్రి | పేరకమే కాదు, అతు త తమ 
కవితా. భరితం కూడా నిరాటంకంగా లక్ష్మీదేవితో కాలం గడుపుదామని నిశ్చ 
యుంచుకున్న విష్ణమూ ర్రితో మనలను ఆ వై కుంఠపురంలో, నగరిలో, ఆ మూల 
సౌధం దాపల, మందారవనంలో, సెలయేటి (పక్క నున్న కలువతిన్నె దగ్గరకు. 
పోతన్న తీసుకెళ్లాడు. అక్కడ మంచి రసవంత మైన పట్టులో గజేందుడి 
మొర విని పించాడు. క్షణంలో రమా వినోడితనం రం. ఆపన్న 
పనన్నత మూ ర్రిభవించి ది. ఆ మెట చెంగు పట్టుకునే విష్ణువు సంరంఖంతో 
_ బయలుదేరాడు, ఆ సర౭భం ఒక మహో, పహాపంల్తత్ల కవి హృదయంలో 
పరుగెడుతూ. వుంది ఆ (ప్రవాహ, వేగంలోకి మనల. సీడ్చాడు పోతన మూడు. 
న. పడ్యాలలో. సీరికి చెప్పకుండా, శంఖ చ కాలు తీసుకోకుండా విష్ణువు వెళ్తున్నాడు, | 
చెతిలో పైట చెంగు చేతిలోనే ఉంది. లక్ష్మి పాపం ఏమో తెలియక శాటీము క్ల 
కుభంబుతో తాటంకా. చలనంబుతో * వెంటపడ్డది. కలువతిన్నె. . నుంచి తిరుగు. 
bs ఆగంభమరుంది, ఆ 'మందారవనంలో నరు లేరు కాబట్టి తన 


{12 ae 


వెంటన్‌ సిరి పతక తరువాత ఆ మూల సౌధంలో కొసారు. అక్క_తున్న 


ఎ 


ఆవరోధ 'వాతం వెంట పడుతుంది. చావడిలో పక్షీందుడు మొదలై నవారు - 


క్రి 
నగరి వెలుపలికి వచేసరికి వె కుంఠంలోని ఆబాల గోపాలం వెంటబడ్డారు. వారి 
లోనే మనమూ ఉన్నట్లు పోతనకవి చేశాడు. చూడం డా | క్రమం- 


(ఫో 


న వెంటన్‌ సిరి; లచ్చి వెంట నవరోధ (వాతము; దాని వె 

నును పక్షీం, దుడు; వాని పొంతను ధనః కౌమోదకి శంఖచ 

నికాయంబుకు; నారదుండు; ధ్యజినీకాంతుండు రా వచ్చి రొ 
న్‌్‌ 


రంభంలో “వెంటి “వెన్క “పొంత” అన్న మాటల నుపయోగిం 
చిన పోతన్న నుపోను సంరంభాతిశయం వల్ల వాటి నుపయోగించటం మాను 
కునాాడు. తానూహించిన సంరంభభా వాన్ని పాఠకుల హృదయాల్లో ఇంత 
చక్కగా | పతిఫలించినటు చేసిన పోతనలో కవిళావిశేవం లేదా? 


ట్రే వ 
ఇంతేకాదు. ఆతినున్ని తమైన నసికావస్థలను చి తించటంలో కూడా 


పోతన్న ఏ కవికీ తీసిపోడు. పాత హృదయం తనదిగా చేసుకొని దానికి సరి 
పోయినట్లు భావాలను [పకటించగలగటం పోతన్న క లవడినట్టు ఎందరికో ఆల 


వడలేదు, 


రుక్మిణి శన (జాహ్మణుడిని కృష్ణుడి దగ్గరకు పంపించింది. ఇంకా 


రాలేదు. ఇక్కడ వివాహ [పయత్నాలు సాగిపోతున్నాయి. కూర్చుని అను 
| 


కుంటూండి_ 


ఘనుడాభూసురు డేగెనో నడుమ మార్గ క్రాంతుడై చిక్కెనో 
విని కృష్పుండిది తప్పుగా దలచెనో విచ్చేయునో యీళగరుం 
నుకూలింప దలంచునో తలపడో ఆర్యామవాదేవియన్‌ 

నను రవ్నీంప నెరుంగునో యెరుగదో నా భాగ్య మెట్టున్నదో! 
శః పన్యంలో పోతన రుక్మిణీ హృదయంలో (పవేశించాడు. అనిన మాటలు 
కొన్ని; అనకుండా ఉన్న ఊహలు కొన్ని, ఆతిమనోహరమెన పద్యం. 'భూసురు 
డేగెనో” అన్నదేగాని “లేదో” అనలేదు. ఆ ఘనుడి విషయంలో వెళ్ళకపోవట 
మన్న ఊహా కూడా రుక్మిణి సహించలేదు. మార్గాయాసం వల్ల కొంచెమాలస్యమె 


యుంటుందని స ని, “వెళ్తే & ముకితో ఇ 
ంటుందని సమర్థించుకొని, “వెళ్లే ఉంటాడు. కృష్ణుకితో చెప్పేఉంటాడు.' 


య 


పోతన కవిత్వపటుత్యము = mie: 


అనుకొన్నది. విని కృష్ణుడిది తప్పుగా భావించి ఉంటాడా ? అని పశ్నించుకుంది. 
ఆతనలాగ తలచేవాడు కాడే అనుకొని “విచ్చేయునో* అనే అన్నదిగాని “విచ్చే 
యడో” అనలేదు. ఆ ఊహే తనకు దుర్భరం, 'లేదు' అన్న పదం తన నోట 
పలకదు. _ తానూ, భూసురుడూ, కృష్ణుడూ అయిపోయారు. ఇక మిగిలినది 
దేవతలు. వారిలో తన. ఇష్టదై వతం ఆర్యామహాదేవి. నలుగురితో పాటు తనకూ. 
ఈశ్వరుడు దేవుడే. ఆర్యాదేవంతటి దగ్గరి దైవం కాడు. కొంచెం దూరం. 
వీళ్లను గురించి సందేహముంది. “ ఈశ్వరుడు అనుకూలించటానికి తలుసాడో | 
తలపడో' అన్నది- ఆంత పరిచయం లేదు కాబట్టి. ఆర్యామహాదేవి విషయంలో 
తలుసుందో లేదో అన్న సందేహం రుక్మిణికి లేదు; తప్పకుండా తలుస్తుంది. 
తనకు నమ్మకమే. కాని ఆమెకు తన్ను రక్షించే ఉపాయం తెలుసునో తెలియదో! 
ఉన్న సందేహమంతా అదే. ఉపాయం తెలిస్తే తప్పక రశ్ని స్తుందన్న మాసే. 
ఇంత వ్యత్యాసముంది కాబట్రై పోతన్న ఈ రెండు సందేహాలను ఈ విధంగా 
(పకటించాడు. విషయ విళశ్వాసాన్నింత చక్కగా [పదర్శించగల సమర్థులు మన 
కవుల్లో ఎందరున్నారు?. ౨. 

ఇన్ని విషయాల నింత రసవంతంగా చితించ గలిగినవాడు కాబశ్లే 
పోతన్న ఆంధ జనసామాన్యానికి అభిమాన కవి కాగలిగాడు. భారత రామాయ. 
రా లలోని ఒక్క పద్యమైనా నోటికి రానివారు చాల మంది భాగవతంలోని 
పద్యాలను పఠించగలరు. ఇటువంటి పోతనలో కవిత్వ విశిష్టత లేదనీ, ఇతను 
వ్యాకరణం రాని సహజ పండితుడని, ఆంత్య|పాస కోసం నిఘంటువులకు [పాకు 
లాడే వాడనీ భావించటం కూడనిపని. ఇంకా సందేవాముంటే ఏదైన ఒక్క 
ఘట్టం సంస్కృత ఖాగవతంతో - సరిపోల్చి చూస్తే పోతన క విత్వపటుత్వం 
కరతలామలకం కాకతప్పదు. 

. రాజాజీగారు కంబరామాయణాన్ని ఇంగ్లీమలో ప్రచురిస్తున్న కై మనలో 
ఓపికున్న సమర్థు లెవరైనా తెలుగు భాగవతంలోని ఒకటి రెండు" ఘట్టాలను 
ఇంగ్లీషులో (పచురించటం మంచిది. అసె లే సంస్కృత భాగవతంతో పరిచయ 
మున్న ఇతర రాష్ట్రాలవారు. కూడా మన ఆం'ధక వి పోతన్నలోని కవిత్వ 
పటుత్వం (గ్రహించి గౌరవిస్తారు... == న 

4 .._(వరిలోధన, 1984) 


'¥ 
From 


పోతన wn రసపోషణము 


— శ్రీ దే వులపల్లి అటా 


వాస్తవము ఏచారించినచో సుకుమారమైన శృంగార చితణమునందు. 


పోతనతో సమానుడై న తెలు సుకవి మరొక్కరు లేరని తోచును. ఏ కొంచెము 


ఆవకాశము కలిగినప్పటికిని శృంగార. రస- పోవణమునకు పోతన గంటము. 
ముందుకు దుముకుచుండును. గాఢమైన థ్‌ క్తిచే ఆవేశము పొందిన సందర్భము 
లలో కూడ పోతన హృదయము శృంగార భావములతో ఉప్పొంగిపోయిన ఉదా 
హరణల నెన్నియెన చూపించవచ్చును. ఒక్కమాటలో చెప్పవలె. నన్నచో 
పోతన శృంగార మాధుర్యము, వైవిధ్యము ఆంధ భాషలోని మరొక [గంథము 
నందు కనిపించదు. విలాస విభమములను,' శృంగార కీడా' విశేషములను, 
ఆపూర్వ మధుర సన్ని వేశములను, హృదయమునుండి ఉత్కటమగ దూసికొని, 
వచ్చు [పేమ భావములను చితించుటలో పోతన్నతో మరొకరికి పోలికయే లేదు. 


పోతన చ్చితించిన శృంగారము. విలక్షణమైనది. మధుర భావోపేత 
మైనది. ఆపూర్వమైన శృంగార ఘట్టములను, వితాసభావము లను పదర్శించుట 
యందు. పోతన గంటమునకు గల నేర్పు ఆద్వితీయమైనది. శృంగార రసచిత 
.. ణక్ష-పోతన' కలిగించుకొను ఆవకాశములు కూడ ఇతర కవీశ్యరులకు తెలియని. 
పరమ రహస్యములు. . ఈ దృష్షితో భాగవతములోని ఇష్టదేవతాది (పార్థనమునే... 
పరిశీలించినప్పుడు మొట్ట మొదటి పద్యములే. మనము చూపించగల చక్కని 
కల oa 


పోతనామాత్యుని సరస్వతీదేవి చంచరీకచయ సుందరవేజి. సైకత కోటి. 
తోయజాత భవచి త్రవ కశీక రై. కవాణి* వామనమూ. రికి మూడడుగుల నేల ధార 


పోయునప్పుడు, ఆ దానమును. (గ్రహించు భగవంతుని వా సమును “ఆదిన్‌ (శ్రీసతి. స 


కొపు పె పె తనువుపై "అంసో త్రరీయంబుపై పాదాబ్దిం బులి పై కప పోలతటిపై పాలిండ్ల పె 
స్తూశ్న అ జెందు” కరమని. ' బలిచక్రవర్తి రి ధావించుటలో బమ్మెర పోతన 


పోతన _ శృంగారరసపోషణము . Il 


శృంగార హృదయము తొంగిచూచుచున్నది. లావొక్కింతయు లేక ధైర్యము. 
విలోలమైన గజేం|దుని రక్షణకు పరుగులెత్తుచున్న పరమేశ్వరుడు వై కుంఠపురము 
నందలి సౌధములోని రమావినోడేయట. వివాద (పోద్దత [శీ కుబోపరి చేలాంచ 
లముతోనే ఆయన వెంట వెళ్లు ఏదేవి సౌందర్యమును గనునింపుడు ! ఆమె. 

తాటంకములు చలించుచున్నవట. ధమ్మిల్దబంధము భుజము మీద నటించుచున్న 
దట. అదృఢముగా నున్న చంచత్కాంచితో శాటీము క కుచముతో ఆ తరు 

_ఇమున ఆ యమ్మ కోటీందు[పభతో వెలిగినదట. ఇటువంటి మనోహర దృశ్య 
ములను We వారు అం[ధకవుపి లో నెంతమంది గలరు? 


ఆం[ధుల అభిమాన ' నాయికయైన క నవాజపాండితుుడు" 
చితీంచిన తీరు అద్వితీయమైనది. తెలుగు సారస్వతములో ఇంత చక్కని ' 
చి తరువు ఇంకొకటి కనిపించదు. సత్యభామ బహు సుకుమారి. బొమ్మ 
పెండ్దింద్దకు. పోనొల్రనను బాల. మగవారి గనిన మరుగుజేరెడు ఇంతి. పసిడి. 
యుయ్యెల లెక్క భయమందు భీరువు." సఖు ) కోలాహలస్వనములోర్వని కన్య. 
వీణ చక్కగబట్టు వెరవెరుంగని కొమ్మ. మాకున తీగె గూర్చగలేని లేమ. సరవి. 
ముత్యము _గువ్వజాలని అబల. చిలుకకు పద్యము చెప్పనేరని తన్వి. అయిన... 
ప్పటికిని 'హృదయేశ్వరుని సమక్షమున వీరనారీమణియై రాక్ష సేళశ్వరుని మీద 
విజృంభించినది. అప్పటి ఆమె సొగసును పోతనయే వర్ణింపవలెను. మరొక. 
కవీశ్యరున కది శ క్రికి మించినపని. ఆమె సౌవర్ణకంకణ రుణరుణనినదములు. 
శింజినీరవమ.తో చెలిమి చేయుచున్నవి. తాటంక మణిగణ ధగధగదిప్తులు గండ. 
మండలరుచిని' కప్పివేయుచున్న వి. ధవళతరాపాంగ ధశధళరోచులు. బాణజొలి * 
[పభాపటలి నడపుచున్నవి. శరపాత ఘుమఘుమళబ్దము పరిపంధిసెనిక కలకల. 
స్వనము నడచుచున్నది* వీరము, శృంగారము, భయము, రౌదము, విస్మయము. ' 
. కలిసి ఆకారము దాల్చిన భామినివలె సత్య మనకు (పత్యక్షమగుచున్నది, ఒక్‌! 
వైపున షీరము, ఇంకొకవెపున శృంగారము ఆమెయందు మూ ర్రీభవించినవి. 
. ఆమె పరుని, జూచినప్పుడు. ఒక పద్ధతి. వరునిజూచినప్పుడు మరొక పద్ధతి, ఏక? 
కాలమున “నొంప మరియు నలరింప ఆమె సమర్గురాలు. పాజేశ్వరుని జూచిన = 
ప్పుడు సౌంపు; నరకాసురుని జూ చినప్పుడు కెంపు 'ఏకక్షణమన, ఆమె కన్నులలో 
కనిపించుచున్నవి. ఆమె మోము హరికి రాకేందుబింబము; అరికి రవిబింబము. 


4డవ భాగవత వె జయంతిక 


ఆమె చేలాంచలము హరికి కందర్పకేతువు; అరికి. ఘనధూమకేతువు. ఆమె 
సందర్శనము హరికి అమృత్మపవాహము; ఆరికి అనలసందోహము. 


కేవల రూపకల్పనయందే కాదు; భావచి[తణ మందును పోతన అసామా 
న్యుడు. ఆయన చితించినన్ని శృంగారభంగికులు, కీడలు, విలాసభావములు ' 
ఇంకొకరు చి తించలేదని చెప్పినచో సత్యమునకు తలవంపులు కలుగ జాలవు. 
కుద్దాకృష్ణుల [కీడావిశేషము, ఉషానిరుద్ధుల |ప్రణయము, రుక్మి జీకృష్ణుల కేళీవి.. 
లాసము మొదలై న ఘట్టములు పోతన్న చితించిన శృంగార వై విధ్యమునకు 
చక్కని తార్మా ణములు. రుక్కిణీదేవితో (శ్రీకృష్ణుని విళసో కులు, ఆ విరసోకు 
లతో నొప్పిజెందిన ఆమె హృదయము, ఆ హృదయములోనీ & భావములు [పత్యక్ష 
మగు విధానము పోతన చితించిన అపుకూప శృంగార ఘట్టములలో నొకటి, 
ఇటువంటి సన్ని వేశమలు ఇంత రమణీయముగా చ్చితించిన తెలుగు కవీశ్వరుడు 
ఇంకొకరు కనిపింపరు, సూరన అయిదు తీరుల శృంగారమును చిత్రించినాడట. 
కొని పోతన ఆరువడి రీతుల శృంగారమును చి త్రించినాడు. 


శ్రీకృష్ణుని గోకుల విహారము, గోపికా వస్తాపహరణము, రాస్రేడలు, 
ఆ సందర్భములలో మధురమూర్తలైన ఆ గోపికల చిత్తవృత్తుబు, సరస 
సల్లాపములు, అలుకలు, ఆన్యాపదేశ ములు, ఆనునయములు, [పణయ కోపముళు 
ఆంధ శృంగార వాజ్మయమున అద్వితీయ ఘట్టములు, ఈ. భాగములోని 
కొర) పద్యము ఒకొక్క. రత్నము. ఇవి సామాన్య మైన రత్న ములు 
"వు అన్నియును జాతిరత్నములు. సానల దీరిన రత్నములు. నల్హనివాడ, 
వద్మనయనంబులవాడు, _ కృపారసంబు పైజల్రెడువాడు, మౌళి పరిసర్పిత 
ఎంఛమువాడై న (శ్రీకృష్ణుని గోపికలు ఒకానొక శరద్యాతిని చేయు అన్వేషణ 
క సందర్భమున విరహత ప్తలై న గోపికల హృదయాలనుంచి ఉబికికొనివచ్చిన 
'పేమభావాలు బహురమ్యముగా చి తించినాడు బమ్మెరపోతన. గో పీకృష్ణుల 
క్రీడా విశేషాలను కనులకు గట్టినట్లు ఆతి సుకుమారముగా మనయెదుట ఆయన 
పదర్శించినాడు. గోపాలకృష్ణని షి తెలిసికొనుటలో గోపికలు ఛూపించు. 
ఏ రులు ఎంతయో మనోహరమైనవి. ఒకచోట ఆయన మోపిన పాద్మాగము 
నపడుచున్నది. అందువలన "అక్కడ కొమ్మకు పువ్వులు గోసినట్లు భావన. 
టనే అడుగుజాడ మాయమైనది. బహుశః సతినె త్తికొని వెళ్ళిన దిహ్న మేమో 
ది. ఇంకొకచోట కూర్చున్న గుర్తులు" కరన వ L పీయసికి ధమ్మిల్లము ఖే 


ప్లోతన - శృంగారరస పోషణము 128 


పెట్టినాడేమో అక్కడ. _ మరొకచోట యెవరో యొక వెలది నిక్కిన చొప్పు 
గోచరించుచున్నది. ఆ ధూర్తగోపాలుడు ఆమెకు ,కెమ్మోవి యిచ్చిన చోటిడి 
యని స్పష్టముగా అనుమానము కలుగుచున్నది. కొంతదూరము వెళ్ళిన తరువాత 
వేరొకచోట నాలుగు చరణాలు (పక్కా పక్కన కనిపించినవి. అందుచేత అది . 
గోపాల కృష్ణుడు ఎవరో యొక యెంనాగ చేయూదిన స్థలమని స్ఫురించుచున్నది. 
మరొకచోట మగజాడ లోపల మగువజాడ కనిపించి:ది. తప్పక. యీ చోట 
ఆ శృంగార పురుషుడు ఎవరో యొక నీలవేణిచే, నొదిగి యుండవచ్చును. 
ఇంకొకచోట రమణి (మొక్కిన చొప్పు కనబడినది. వేరొకచోట అన్యోన్య 
ముఖములై న అం ఘులు (పణయ క లాపమును పదర్శించినవి. వః విధముగా నీ 
ఘట్టము అత్యంత రమణీయముగా, బహుసుకుమారముగా, ఆతి సునోహరముగా 
వర్ణిత మైనది. నే 

తెలుగు భాషలోని శృంగార (గంథములను అవలోకించి నప్పుడు, శృంగార 
కవుల రచనలను పరిశీలించినప్పుడు పోతన చితించిన శృంగారము ముందు 
నిలువదగిన రచనలు ఎన్ని గలవు? అను [పళ్న సహజముగా. కలుగుచున్నది. 
శృంగార కవిత్వము నకు (పసిద్ధి "గాంచిన వారి రచనలు భాగవత శృంగారము 
ముందు దివాకరుని 'మెదుట నున్న దివిటీవలె గోచరించును. వా స్త్రవముగా 
తెలుగు కవులలో శృంగార రస చిత్రణమునందు పోతన సర్వ విధముల అగ 
గణ్బుడు. సోతనను శృంగార కవి యనుటలో తపే బృమి. కలదు? శృంగార 
మనినచో మడిగట్టుకొనవలసిన అవసరమేమి? భ క్రి రసమును ఎంత బాగుగా 
పోషించినాడో శృంగార రసమును అంత సమర్థ తతోనే పోతన చితించినాడని 
చెప్పుటకు 'భాగవతమున ఎన్నియెనను చూపి ంపవచ్చును. ఆంధ శృంగార 
కవులలో పోతనది ఆగ తాంబూలము. తెలుగు. భ క్రి కవులలో పోతన 
మున్నెన్న దగినవాడు. 

పోత్రనను కవిత్వము వలచి వరించినది. దానితోపాటు సాండికను 
గూడ ఆయనకు సహజముగా అలఅవడినది. ఆంధ కవులలో “సహ 
. పాండిత్యు' డను _పల్యేకత పోతన bus కలదు. భాష ఆయన తతర 
(క్రీడాకందుకము. స [2 
(సారన్న నోవనీతము) 


| 3 a 
కక 0) ఫ్‌ me 


పోతన వ్యాజస్తుతి.వ్యంగ్య వై వెభవము 


_--ఆచార్య దివాకర్ల వేంకటావధాని 


ఒకప్పుడు. కేవిస|మాట్‌ విశ్వనాథ సళళ తసనకే పోతన భాగ. 
వతము ' |వాసియుండక పోయినచో మరి ఎవరు [వాసియండెడివారని. తమ. 
గురువులై న. చెళ్ళపిళ్ళ వేంకటకాన్రీగారిని ఆడిగినారట. అప్పుడు కాన్రిగారు 
కానుల. పురుషో త్ర తమక వి [వాసియుండెడివాడని [(పత్యు త్రరమిచ్చిరట. ఈ యభి.. 
ప్రాయము పాక్షికమైనను ఇందుకొంత సత్యము లేకపోలేదు. శ్రీకాకుళము. 
నందలి ఉం ధవిష్టుదే వాలయమను శిథిలమై పోవుచుండ దానిని బాగుచేయింపవలెనని + 
పురుషో త్ర తమ కవి జమీందారుగారికి మన విచేయగా వారీించుక ఉపేక్ష వహించిరట. . 
అంత పురుషో తమ కవి చేయునదిలేక. దేవాలయమున కెదుట నిలబడి సీస పదకీ 
మయమైన ఆం| దనాయక శతకము రచించెనట. ఈ. శతకము ఆంధళతక 
ల వాజ్మ యమున కలంకార[పాయమైనది.. ఇందలి పద్యములన్నియు .' వ్యాజస్తుతి 
ట్ర అండ న. 


“వ్యాజసుతి డ్మఖి నిందా సళ రూఢి రన్యధాో అని వ్యాజస్తుత్య 
లంకోన మునకు కావ్య పకాశమున నీయబడిన నిర్వచనము. దీనినే కావ్యాలంకార. 


స సంగ్రహము “సతతంబు నిందచేతను సుతియున్‌ సుతిచేత నింద చొప్పడ.. E 
వ్యాజస్తుతియె చెలువగు”నని నిర్వచించి యన్నది. నిందా వ్యాజముచే స్తుతిని 


గాని, సో| తవ్యాజముచే నిందనుగాని చేయుటకు వ్యాజస్తుతి యని. పేరు. 
పురుషో త్ర త్తమకవి. పె ఆంధ నాయకళతకమున పెకి నింద ద్యోతితమగునట్టున్నను 
లోపల స్తుతి స్ఫురించునట్టు. పద్యములను. రచించియుండెను. . ఇట్లు, రచించుట 
సులభసార్యమైన పని కాదు... దాని కెంతయో పాండిత్యమును, వ్యంగ్యరచనా. 
పాటనమును, పదార్థ ధ్వని పరిజ్ఞానమును అవసరమైయుండును _ఇట్టుపాలంభన , 


.. పూర్వకముగ శతకమునంతను పూర్తిచేసి యతడు చివర తన యవివేకమును 


 మన్నింపుమని భగవంతుని (ప్రార్ధించియున్నాడూ,. నిజముగా నతన్గికి భగవంతుని 


పోతన వ్యాజస్తుతీ 5 వ్యంగ్య వై భవము = i126 


యెడ నజండమగు భక్తియే కాని నిరసన భావము లేదు. ఆ శతకమునందలి 
పద్యములు విని జమీందారు గారు దేవాలయ జీర్హోదరణము కావించియుండిరట. 
ఆ పద్యముల యపారపథావము తెడ్చట కింతకంటె వేరుగ నేమియు చెప్ప 
నక్కరలేదు. 


పోతన మహా భక్తుడు. “నోరు నొవ్వంగ హరి కీర్తి నుడవవలెి'నని 
యతని యాశయము, 'శ్రేమద్భాగవతము నాతడు (నీరాముని. ) యాజచే రచించి 
యతసకే అంకితము చేసెను. , భాగ వతారంభ పద్భమున నాతడు “మహా 
నందాంగ నాడి: భకు”డై న కృష్ణు స్తుతించెను. వష్ట్యంత ముల యందు కూడ 
నాతడు “'హారికి నందగ్‌ గోకులవిహారికి"* నని యూ గోపాలకృష్ణునే వర్జించియుండెను, 
తనికి దశర థరాముడన్నను, గోపికా రాముడన్నను భేదమే లేదు, భాగవత మున 
a తదవతారములకును సంబంధించిన కథ లెన్నియో యున్నవి. 
శిశుపాలుడు, రుక్కిమున్నగు వార మదాంధులై కృష్ణుని భగవ త్యమున నమ్మిక 
లేక యతనిని పొక్ళత మానవునిగ భావించి ఆయా సందర్భములయందు 
నిందించుచుందురు. ఆ నిండా వాక్యములతో కూడిన పద్య ములను గూడ పోతనయే 
' వాయవలయును. మహాభ కుడెన యతడు భగవంతుని నిందించు పద్యము 
(వాయ నిన్బిగింపకుండుట సహజము. కాసే కథా సందర్భ ముసు బట్టి నిందాస్ఫో 
రకములైన ఆ పద్యముల నాళడు (వాయక తప్పడు. అప్పుడతడు వ్యాజసుతి 
నాశ్రయించి దుష్టులైన యా పా (తలు భగవంతుని నిందించుచున్నట్టును, తాను 
మాత మాతర మున స్తుతించుచున్నట్టును పద్యములు (వాయుచుండును. అట్టి 
సందర్భములం ¢ దిది అనవద్యమైన పద్ధతి. పుషషో తమకవి కూడ నేతాదృశ 

_ పద్యరచన యందు నేర్పు కలవాడని 'సూచించుటకై వేంకటకాన్రి గారు భాగవత 
మును పోతన [వాయనిచో నతడు వాసియండునని జఇెప్పియున్నారు. అంతేకాని 
ఆతడు పోతనతో సమానుడై న మహాకవి యని కః అతనికిని సహపం కి 
కలిగించుటకు, కాదు. 


భాగవత చతుర్ధస్కంధమున 'దక్షాధ్వరధ్వంనవృత్తాంతమున్న ది. కష 
(బహ్మలు చేయు: సత్తంము. చూచుటకై సరసేజగర్భయోగిజనముని సుపర్వ 
| పజాపతులెందరో వచ్చియుండిరి. దకుడు కూడ వచ్చెను. ఇతని చూచి 
(బహ్మయు శివుడును తప్ప. మిగిలిన వారందరును. లేచి నిలబడిరి. దక్షుడు 


126 | భాగవత వంట 


[బ్రహ్మకు న నమస్కరించి సభ్యులు తన కిచ్చిన పూజలుగై కొని యర్హాసనాసీ యడ 
తన్నుగని సభ్యులందరును లేవ శివుడు లేవకుండుటకు కనలి- 


అనయంబు లు ప్రకియాక లాపు (డు మాన 
నుండు మర్యాదలేనివా(డు 
మత।|పచారు( డున్మ త పీయుడు దిగం 
బ6రు(డు భూత పేత పరివృతుండు 
మస్మపమథభూతములకు నాథుడు , 
_భఖభూతిలి షు పుం డస్టిభూషణుండు 
నష్టకౌచుండు మన్మథనాథు (డును దుష్ట 
హృదయుండు ను గ్రపరేతభూని నే 


క్రేతను(డు వితత(స స్తకేశుం డకుచి 

యెన యితనికి శివనాముడను (ప్రవాద. 

మెటులు గలిగె నశివు(డగు నితని నెలింగి 

యెజింగి వేదంబు శూదున కిచ్చినట్టు. (4.48). 


నా తనయను విధి పేరితుడనై యితని కిచ్చితి' నని పలికి చేత జలములు 
(గహించి “మఖసమయమున నితడు దేవతలతో కూడ హవిర్భాగము పొంద 
కుండుగాక” యని శివుని శపించెను. పె సీసపద్యము నందలి “లు ప్త[క్రియా 
కలాపుడు” “మానహీనుడు' “మర్యాద లేనివాడు" మున్నగు పదములు నిందాగర్భి 
తముల వలే కనిపించినను సూక్ష్మముగా పరిశీలింప శివుని మహత్త్వమునే (పక 
టించుచున్నవి. ఈ సందర్భమున పోతనయే “ోదతండు పల్కిన గర్హి త 
వాక్యంబులు విసఫిందితంబులుగ నుండినను ఆర్థాంతరంబున వా స్త్రవంబులగుచు 
భగవంతుండగు రుదునందు ననిందితంబులై. సుతిరూపంబున నొపె (47). 
నని (వాసియుండెను. ఆందు వ్యాజస్తుతి కలదు. పర మేశ్వరుడు ఆ|కియుడు, 
అమేయుడు, ఆపరిమితుడు ఆను గర్ధాంతరము లందిమిడియున్నవి. పోతన 
బాల్యమున శివభకు డే. తరువాత కివశేశ వాభేదమును గుర్తించి. విష్ణుభక్తుడు 
కూడన్దె శ్రీమద్భాగవతమును రచించెను. “చేతులారంగ శివుని పూబింపడేని” . 
మున్నగు వాక్యము లిందుకు తార్కా.ణము. 


పోత్రన వజ = వ్యంగ్య వై వెభవము 197 


అవ్షమస్క_ంధమున యజ్ఞవాటిక కరుదెంచిన వామనుని పాదములు కడిగి 
బలి తాం సరమళ ద్రమ? శనిరమన ధరించి. 


వడుగా! ఎవ్వరివాండ వివ్వండవు; సంవాసస్థలం బెయ్య ది 
'య్యెడకున్‌ నీ వరుదెంచుటన్‌ సవలమయ్యెన్‌ వంశమున్‌ జన్మమున్‌” - 


అని స్తుతించి “నీకేమి కావలయునో తెలుపు” మని ,యడిగెను అప్పుడు 
వామనుడు = - 


ఇది నాకు నెలవని యేరీతి. బలుక దు 
నొకచోటనక నిండియుండ నెర్తు 
నెవ్వనివాండ నంచేమనీ పలుకుదు 
నా యంతవా(డనై నడవనేర్తు 
సీ నడవడియని ఎట్లు వక్కాణింతు 
బూని ముప్పోకల. బోవనేరు. 
నది నేరు నిది నేరు నని ఏల చెప్పంగ 
నేరుపు లన్నియు నేన నేరు 
'నొరులు గారు నొకు నొరులకు నేనౌదు 
నొంటివాండం జుట్ట మొక(డు రేండు 
సిరియు( దొల్లి కలదు సెప్పెద నా టెంకి న 
సుజను లందు దజచు జొచ్చి యుందు. (8.552) 
అని జవాబిచ్చెను. సఘ్టూలముగ జూడ నీ పద్యము వామను డన్నిచోట్ర తిరుగు 
_ చుండెననియు, నతని కెవ్యరును లేరనియు, నత డొంటరివాడనియు, బంధువు 
లెవ-రును లేరనియు, పూర్వము సిరి యుండెననియు, తానెప్పుడును సుజనుల 
యందు చొచ్చియుండు ననియు తెలుపుచున్నది. నిజమున కిది పర్మబహ్మ 
వర్ధన, అతడొకచోటనక యన్నిచోట్ల నిండియుండును. అతడెవ్వరికిని చెందిన 
వాడు కాదు. అతని యంతవా డతడే. ఆతడు సత్వరజ స్తమో గుణముల 
యందును, స్వ మర్య పాతాళ ముల యందును సంచరించుచుండును. ఆతడు 
అన్ని హా. |! పట్టుగొమ్మ. ఒరుల "తడు సాయ మొనరించును గాని 
ఇతరు లాకనికి తోడ్చడ నవసరను లేదు, _ సృష్టికి పూర్వమాతడు ఒక్కడే 


128 F భాగవత వై జయంతీక 


-యండెను. ఆతనికి బంధువు లెవ్వరును లేరు. పూర్వము విష్ణువుగా నున్నప్పుడు 
లక్షీ యతని తోడనే యుండెను. ఆత డెప్పుడును సుజనుల మనస్సునందు 
. నివసించుచు అతనన 


న బలి వదాన్యతను మెచ్చుకొని 


"ఒంటివా(డ నాకు నొకటి రెండడుగుల 
మేర యిమ్ము, సొమ్ము మేర యొల్త( 
గోర్కె_ దీర |బహ్మ కూకటి ముళ్రైద 
దానకుతుకసాం[ద! దానవేంద!. (8: 566) 


అని యడిగెను, ఇందలి “ఒంటివాడ, మూడడుగుల మేరయిమ్ము; సొమ్ములు 
నే నొల్పను; [బహ్మ కూకటి ము న్రైదను”' ఆను పదములు పరమార్థ గర్భితము లె 
యున్నవి. “పద, తయము మా|తమే యడిగితివి. దాత పెంపు సొంపు దల(ప 
'వలదో' యని "బలి పలుక, వామనుడు “మదాకాంతామితంబై న మూడడుగుల్‌ 
మేరయ [తోవ కిచ్చుటయ [బహ్మాండంబు నా పాలికిన్‌”* అని పలికెను. ఈ 
వాక్యములో “నీవు మూడడుగ a Press ఆక్రమి ంచెద”” న 
నను ధ్వని యున్నది. 


శుకుడు వామనుని యథార్థ తత్వ మెరింగించి క. గాన 
మీయనలదని బోధింప, బలి. 1 


ఎన్నడుం బరువేడ( బోండ(ట, యే పటపట కన్నవా 
రన్నదమ్ములు నై నె న లేరట, యన్ని వివ్యల మూలగో 
-శ్రేన్నెలేంగేన పోడగుజ్జయణు, చేతులొగ్గి వసింప నీ 
చిన్నిపాప న్‌( దోసిపుచ్చ గ జి త్తమొల్లదు సత్తమా! (8. మ 
అని అడిగినది యిచ్చుటి యందు తన చృఢ సంకల్పమును తెలి పెను. ఈ పద్యం 
.స్థూలదృష్టికి వామనుని .డీనత్వమును, పాండిత్యమును, బాల్యమును తెల్పునట్లు . 
కన్పడుచున్నది. కాని యాంతరముగ వామనుడు పర[బహ్మ మనియు, నతని 
hy కితరులను వేడవలసిన యవసరము లేద* యు, నొంటరి. వాడనియు, ఇతరులు ప 
“గాని. అన్నదమ్ములుగాని లేని: వాడనియు, _అజుడనియ, - సర్వవిద్యామయు 


నియ తెలుపుచున్నది. బలి వామనుని పాదములు కడిగి చ — 


శిరమున జల్లుకొని. _ 


పోతన వ్యాజస్తుతి వ వ్యంగ్య వైభవము . 189 


“వి ప్రాయ (పకట్కవతాయ భవతే విష్ణుస్వరూపాయ వే 
a. విదే (తిపాదధరణిం వానర యంచున్‌ 

. (అహ్మ| పీత గంబని ధారవో సె కన ఖు 
అను స. వామనుని వి విష్ణు స్వరూపత్వమును, (బహ్మకల్పత్యమును సు నుతింప 
బడినవి. మామూలుగా దానమిచ్చునపుడు దాత పలుకు పలుకులవలె దోచినను . 
పై మాటలలో (పతి గహీత పర్మబహ్మ మూర్తి రి యను నంతరార్థ మిమిడి ఉన్నది. 
వామనుడు కూతరు. మహి తమును తెల్పచు-ా 


ఇదియేమి వేడితని నీ 
మది వగవక ధారవోయుమా సత్యము సెం 
పొౌదవంగ గోరిన యర్గం 
విది యిచ్చుట SE మాకున్‌. (8-614) 
న | a జ్‌ / 

అసి పలికెను. ఆ పలుకులు విని బలి హర్ష నిర్భర చేతస్కు-డై - 


“పష పుట్టి సరత పుట్టక “ నేళ్చెనో; 

చిట్టిబుద్దు లిట్టి పొట్టివడుగు; 

పొట్టనున్న వెల్లి బత! నని నప్వి 

ఎలమి ధరణి దాన మిచ్చెనపుడు. (ర8- -618) 
ఈ మాటలలో పుట్టకముందే యాతడు (ప్రౌఢ వాక్యములు నేర్చెననియు, నతని 
పొట్ట యందెల్ల బూమెలు కలవనీయు స్ఫుకించుచన్నది. 


కృష్ణుడు రుక్మిణిని రథముపై. నిడికొని Sie శిశు పాల జరాసంధాదు . 
లాతని నెదిరించిరి. కృషమ్ణుడు వారి నందర నోడించి రుక్మిణితో వెడలిపోవు 
చుండ రుక్కిణి సోదరుడై న రుక్మి ఏకాక్షౌపాణి బలముతో కృష్ణుని వెంట 
నంటెను. ఆతడు కృష్ణుని నిలునిలుమని తిరస్క రించి వింట నారి సంధించి 
యిట్లు పలికెను = 


Oe Sas నూ హైప గొనినోవో 
నేపాటి గలవా నేదివంళ 


fe oe 


180 భాగవత వె జయంతీక 
మెందు జన్మీంచితి వెక్క.డ( బెరిగితి 
వెయ్యది నడనడి నెవ్వ( డెటుంగు 
మానహీను(డ వీవు మర్యాద లెజు(గవ్వు 
మాయ గై కొని కాని మలయరావు 
నిజరూవమున శ్యతునివహంబుపై బోవు 
వసుధేవండవు గావు వావి లేదు 
._ కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు 
విడువు విడువవేని విలయకాల 
శిఖికిఖాసమాన శితశిలీముఖముల 
గర్పుమెల్ల 6 గొందు కలవామందు."" (10. 1762) 


ఇందును వ్యాజస్తుతి యున్నది. రక్కి కృష్ణని నిందించుచునే ఈ 
వాక్యములు పలికెను. “నీవు మాతో సమానుడవై న వాడవు కావు మా పాప 
నెట్లు గొరిహోయెదవు! నీకేమి గౌరవము కలదు? నీ వంశమేది? ఎచ్చట పుట్టితివి? 
ఎచ్చట పెరిగితివి? నీ నడవడి ఎట్టిదో ఎవ్వడెరుగును? మానహీనుడవు. మర్యాద 
లేరుగవు. మాయతోగాని శ్యతువులపై పెనగుటకురావు. యథార్థమైన రూపముతో 
క తువుం నెడిరింపజాలవు. ధరణీశుడవు కావు. నీకు వావి వరసలు లేవు. గుణ 
హీనుడవు.'”” ఆని అతని భావము. పోతన కృష్ణుని పర్మబహ్మత్వ మెరిగినవాడు 
కావున నిందా మహత్యమును కూడ వర్ణించుటకు తగిన పదములనే వాడి 
యుండెను, “నిజమునకు రుక్కికిని కృష్ణునకును ఎట్టి సాదృశ్యమును లేదు. 
వారికీ మళకమునకు వాస్తికి నున్నంత భేదమున్నది. పర([బహ్మ అమేయుడు. 
ఆతసి వంశవరనము లెవ; రును wen ఆతడు మాయతో సర్వ పపంచమును 
నిర్వహించును. అతడు యథార్థమైన రూపముతో శ తువుల నెడిరింపడు. జాతిచే . 
శతియుడు కాడు. |తిగ ణాతీతుడు”” ఆను నర్థమును పోతన పె పద్యమున 
నాంతరమాగ' నిమిడించెను. oP ee 4 


గోపికలు కృష్ణుని దుడుకుచేతలు యళోద. క్షెకిగించిరి. యశోద వారి 
నెట్లో యూరడించి పంపెను. ఒకనాడు ఐలభ్యద |పముఖులై న గోపకుమారులు 
క్ల. లన్టుడు వ సును తిననని యశోదకు తెల్చి రి, యశోద. కాలుని కేలు పట్టుకొని 
మవ్నెందేకు భషించితివని యడిగెను, అప్పుడు కృష్ణుడు. మ. EF మన్ను 

వో ఎవ్యాజసుతి అ వ్యంగ్య వై వె భవము 18| 


| దినంగ నేశిశువునో యాకొంటినో, వెట్టినో నమ్మం జూడకు వీది మాటలు”” అని 
పలికి తన నోరు తెరచి చూడే పెను. Me కు కృష్ణుడు శిశువును కాదు, కుధార్లు 
డును కాదు, వెట్టివాడును కాదు. అతడు పర|బహ్మ స్వరూపుడు. గ్‌ 
ఆతని నోట యశోదకు బ్రహ్మాండ మంతయు కన్పిం చెను, "అప్పుడు యశోద 
ఆశ్చర్యపడి. 


““బాలమాతుండగు సలీలుని ముఖమందు 
విశ్వమెల్ల నెటు వెలసియుండు 
య ౧ 
బాలుభంగి నశ(డు భాసిల్లు గాని స 
ర్వాత్ము. డాదివిష్టుండగుట సిజము”” (10.842) 


అని భావించెను. 


ఒకనాడు యశోద పెగువు త్రచ్చుచుండ కృష్ణుడామె కడ కరిగి 
పాలిమ్మని యడుగుచు కవ్వము పట్టుకొనెను.. ఆమె కూకటి దువ్వుచు నతనికి 
పాలిచ్చి ఒక. పీఠముపై కూర్చుండబెట్టి పౌంగెడు పాలు దించుటకై ' యరిగాను, 
అంత కృష్ణుడు పెరుగుతో కూడిన కుండకు రాతితో (బద్దలు కొట్టి ఆందలి 
వెన్న తినెను, యశోద తిరిగి వచ్చి వికలములైన దధికుంభ శకలములు. చూచి. 
కృష్ణుడు వెన్న తినెనని ఎరిగి ఆతని నచ్చట కానక వెదకుటక్టై యరిగెను. 
ఆతడు వేరొక యింటిలో రోలు దిరుగవేసి యెక్కి. యుట్టిమీద నున్న వెన్న 
నొక కోతిపాలు చేయుచుండుట గాంచెను. ఆంత నామ సెలగోఆ చేత 
బట్టుకొని... 


“కానిమ్ముకికానిమ్మురా. జస 

_ తనయా! ఎవ్య్యయందు బిక్కువడ నే దండంబునుం గాన నే 
వినివారంబును బొంద నే వెజపు నే విభాంతి యుం జెందము 
న్ననియో నీ విటు నన్ను గై కొనవు నే డారీతి సిద్ధించునే”' 
అని యదలించెను. పిమ్మట తనలో - 


“రాయు, తీతండని ఖావింతు నందునా 
నే పెద్దలును నే రరీ (క్రమమును 


182 a భాగవత వైజయంతీక 


వెజపెలుంగుటకునై వెజపింతు నందునా 
కలిగి లే కొక్కండు గాని లేండు 
వెజవుతో నా బుద్ధి విసిపింతు నందునా 
'తీను(దానయై బుద్ధి దప్పకుండు 
 నొం డెటుంగక యింట నుండెడి నందునా 
చొచ్చి చూడని దొకచోటు లేదో” (10.868) 
ఆని వితర్కించి యతని తాడించుటకె. సమీపింతెను, ఆతడు. 'రోలు దిగి పరు 
వెత్తెను.. యశోద కూడ. వారించుచు. నాతని వెంట పరువె తెను, అప్పుడు 
పోతన “ఘనయోగీంద మనంబులుం వెనుకొనంగా ' లేని లీలారతున్‌” అని 


కృష్ణుని వర్ణించెను యకోద కృష్ణుని పట్టుకొని యతని కొట్టుటకు చెతుల (క 
కట్టదలచి.. 


“పట్టిన బట్టువడని నిను 
బ వైదమని చెలముకొనిన? బర్డుట బెవే 
పట్టువడనం [డు పట్టి | 


పట్టుకొనన్‌ నాకుంగొక సులు వళమే ! 


/ ఎక్కడ నై నెనను దిరిగెద. 

. _వొక్కయెడన్‌ గుణము గలిగి యుండవు నియమం 

౨... బెక్కడిది నీకు మజచినం. 
జక్కన బోయెదవు పెక్కుకాదల, అల్లా! 


ee తశోయంబు లివి యని తొలంగవు చె వొచ్చెదు 
. తలంచెదు గసైనం దరల నెత్త 
న మంటితో నాటలు మానవు కోరాడె. 
“దున్నత స్త సంభంబు లూ(ప(బోయె ~~ 
దన్యుల, నల్బంబు లడుగంగ. బాజెదు a 
| “తాచ (వేటల జారి అవి దెచ్చె. 
దలయవు నీళ్లకు నడ్డంబు గటైదు, ... 
| మసలివై వారివృత్తి వె మొనయంజూచె 


పోతన వ్యాజసుతి - వ్యంగ్య వైభవము ~~ 188 


దంబరంబు మొలకు నడుగవు తిరిగెద 
వింక6 గల్కితనము లేల ప పుత్త! 
నిన్ను వంప (వాల్బ నే నేర ననియొ నీ ™ 
 విట్టు |క్రిందు మీందు నెలు(గకునికి. (108 878,874,875) అని పెక్కు 
భంగుల నాతని నదల్చెను. ఈ పద్యము లన్నిటియందు నంతర్గర్భితముగ 
కృష్ణుని పర ఐహ్మత్వము నిరూపింపబడెను. ““తోయంబు లివియని తొల(గవు 
చొచ్చెదు' ఆను సీసమున దశావతార వర్ణన మున్నది. పోతన కృష్ణావతారము . 
నకు పిమ్మటి యవతారములను కూడ నిందు సూచించెను. ఆ రెండు. పాదముల 
కును బాలుని పరముగనే అర్థము చెప్పుకొనవలెను, 


- కంసుడు ధనుర్యాగమిషమున కృవ్షబలరాములను మధుఠానగరికి రప్పించి 
వారిని సంహరింపవలెనను నుద్దేశముతో వారిని గొనివచ్చుటికై అక్రూరుని 
జం పెను. బలరామకృష్ణులు కంసుని వధింప నెంచుచున్న వారగుటచే అ| కూర 
చోదితమైన రథమెక్కి మధురాభీముఖముగా జనుచుండిరి, దారిలో వాడికి యమున 
కనిపించెను. వారచ్చటనాగి జలములు (తావి తిరిగివచ్చి రథముపై పె కూర్చుండిరి. 
అక్రూరుడు వారికి | మొక్కి వారి యయమమతితో యమునానదికడ కరుదెంచి వేద 
మం[తములు జపించుచు ఆ నదిలో స్నానము కొవించెను,. ఆతనికి యమునానదీ 
జలములందు రామకృష్ణులు కనిపించిరి. అతడాశ్చర్యపడి రథము వంకకు చూడ ( 
వారచ్చట కూడ నుండిరి, ఆది తన మనోవి్శఖాంతి యేమోయని మరల యమునా 
_ నదీజలములను నిశితముగా పరికింప నందు శేషుని, తద్భోగపర్యంక మధ్యమున 
(శ్రీదేవితో నొప్పి (బహ్మరు దాది స్తు సూయమానుడై న పరమపురుషని గాంచి కర 
ములు మొగిడ్చి స్తో తము గావించెను. ఒష్టువట్టు ఆకూరునికి తన సహజరూపము 
చూపి తిరోహితుడయ్యెను. అకూరుడాళ్చర్యచకితుడైై సీరు వెడలి న రథారో. 
వాణ మొనరించెను, అప్పుడు కృష్ణుడాతని జూచి "a 


Te నున్నవి 
తలపోయయగ నీవు పోయి తడవయ్యె నదీ. 
. జలముల' నభమున ధరణిం 
.. గలుగని చోద్యములు నీకు గానంబడెనే !” (10.1285) అని యడి 
గెను. అకూరుడేమిచెప్పుటకును తోపక-_ 


1£4 భాగవత వెజయంతిక 


లోకములందు( జెప్ప రీశ్వర ! నీటన్‌ 
సెలన్‌ నింగిని నున్నవె - 
వలో జోద్య్జంబులెల్త నెగడు మహాత్మా !' (10.1287) అని నమాధాన 
మిచ్చెను. ఈ సమాధానము నందలి యర్థము ధ్యనిమంతమై కృష్ణుడే పర 


(బహ్మమకు భావముకు వ్య కము చేయుచున్నది. ఇందు వ్యాజసుతి లేదుగాని 


*పటోన లేని చోద్మము 


Pb il 


py 


3} 


టీ దము నం ద్‌, 
జంగ యు. A 


ఈ విరముగి పోతన సందర్భమువచ్చిన చోట్ట నెల్ల వ్యాజస్తుతి వూర్వక 
ముగనో, వ్యంగ్యపూర్వకముగనో కృష్ణుని పర్యబవ్మాత్వమును |పకటించు 
చుండును. అతడు మవోభక్ర్తుడగుటచే కృష్ణుని గోపాలకునిగా కాక పర|బహ్మము 
గనే పరికించును. తన లోపలనున్న యాభావములే యాతడన్యాపదేశముగ 
పెక్కు చోట్టి వెల్లడి చేయుచుండును. ఇట్లు వ్యంగ్యగర్భితముగ (వాయుట నులఖభ 
మైన వని కాదు. సూలముగ చూచినప్పుడేదో సామాన్యార్థ మే గోచరించును. 
సూక్ష్మము” వరిశీలింప నందలి తాళ్యకార్థ ము స్పురించి పఠితలకు పారవశ్యము 
కలిగెచుకు. నిత్యమును వారిభక్రిపరాయణుడై. తాత్వికలోకమున సంచరించువా' 
తగు చేతనే పోతన యిట్టి యమృతమైన రచన చేయజాలెను. 


క మలామశర్చించు కరములు కరములు ఫ్రీనాథు వర్ణించు. బివ్వూజివ్వూ 
సురరశ్నకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషళాయికి (మొక్కుశిరము. శిరము 
విష్టునాకర్ణించు వీనుణ వీనులు మధువై ర దవిలిన మనము మనము 
భగవంతు వలగొను పదములు పదములు పురుషో తమునిమీది బుద్ద సై 
దేవదేన్సని జిండించు దినము దినము చొ'కవాస్తుని (బకటించు కు చదువ 
సేంభినీధవుంజెప్పెడు గురుండు గురుతు తండి! వారిండేరుమనియెడి తం్యడితం డి. 


పోతనామాత్యుని స్త్రీ వాతలు 


జర 


శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు 


పోతనామాత్యునకు వివిధ చి'త్రవృత్తులు గల నాయకులను సృష్టించుట 
కంటెను నాయికలను 'సృష్షించుటలో నెక్కువ యపేక్ష యున్నట్టున్నది. ఆతడు 
వర్ణించిన శకుంతల, శర్మిష్ట, దేవకి, చేవయాని, రోహిణి, యశోద -వీరందరును 
చిత్తవృత్తులలో కేవలము విభిన్నలై న వ్య కులు. 


ఊర్వశి ; 
ఊర్వశికి మిితావరుణుని శాపము గలిగెను, అందుచే నామెకు మానవ 
జన్మ మేర్చడినది. కాని యంతకుముందే యూర్యశికి పురూరవుని పై పె నొక [పేమ 
కద్దు, కారణమేమనగా, ఆతని శౌర్య సౌందర్య గాంభీర్యాది గుణములను ఆమె 
యం(దుని. సభలో నారదునిచే విన్నదట. ఊర్వశి భూలోకమునకు వచ్చి 
సపృరూరవుని ముందట నిలబడినది. స తాః 1 


సరసిజాక్షు మృగేం దమధ్యు విశాలవకు మహాభుజున్‌ 

సురుచిరా ననచం| దమండల శోభితున్‌ సుకుమారు నా 

పురుషవర్యు పురూరవుం గని పూవుటంపరజో దుచే, 

దొరంగు [కొవ్విరితూ(పులం మది దూల పోవ(గ (శ్రాంతయె, (9.588) 
ఊర్వశి (థాంతయైనను ఆమె తన హృదయము నెరిగింపలెదు. ఊరక నిలచి 
యున్నదట. ఇది గ్రీరర్మమే. పురూరవుడును ఊర్వశిని చూచెను, వాడు 
“దీని కర్మగహణంబు లేనిచో జీవనమేటి'”'కంచు మరునిముసముననే నిర్ణ 
యించుకొన్నాడట. ఎట్టకేలకు వాడే న. నారంభించెను. న. 
ప జ 


ఎక్కడనుండి రాక ! మనకిద్దరకుం దగు; నీకు దక్కితిన్‌ 
ముక్కడి వచ్చెనే యలరుముల్కు_లవా, డడిదంబు (దిప్పచే 


వ... . భాగవత వైజయంతిక 
దిక్కూ నెజటుంగనీడు నను దేహము( దేహము గేలు గేల సీ 
చెక్కు.న(జెక్కు. మోపి తగు చ చెయ్వుల. నను చ. గావ వే! (9. 892) 


ఊరి మహా పొఢ. వాడీ మాటలన్నంతనే వీడు లఘుహృదయుడని యామె 
యర్థము సేసికొన్నది. ఈ భావము నామె బైటపెట్టినది కాదు. ఇంతలో గంధ 
ర్వులు వచ్చి పురూరవుని (పేమ విఘాతమును 'జేసినారు. ఆమె వాని కన్ను ' 
మరగి పోయినద్‌. నాటిను-డి పురూడ వుడు వెణ్టివాడై యూర్వశిని వెదకుచు తిరు 
గుచున్నాడు. ఒకసారి సరస్వతీ నకీతీరమున నామె వాని కంటబఐడెను. ననిన 
' వదలి పోయినది మొదలు ' ఊర్యశికి వీని గాలియే లేదు. యోగవియోగములకు 
మనసివ్వరాదనునది యామె నేర్చుకొన్న కామశాస్త్ర వేదాంతము; పురూరవు డామె 
కడశేగి దీనముగ యాచించినాడు- అపుడూర్యశి తన మనస్సులో వీనిని 
గురించి యన్న నిజమైన భావమును బైట పెట్టినది. అదీ యిది= స 


మగువలకు నింత లొంగెదు 

_ మగవా:డవె సీవు 1. పశువు మాడ్కిన్‌ వగవన్‌ 
దగవె ? మానుషపశువును 
మృగములు గని రోయుగాక, మేలని తినునే. @ 415) 


ఈ తల పామె కీనాడు గలిగినది కాదు. పురూరవుని జూచిన మొదటినాడే 
 యేర్చడినది. ఈ భావము నింతవరకు దాచినది. "ఆ తరువాత నామె తన 
హ్‌ లన్‌ నీ రీతి వెల్లడించెను- 


: తలంపుల్‌ వ మాట లుజ్జల సుధాధారల్‌; విభుండై నీ ప పూ | | 
... “విలుతున్‌. మెచ్చర యన్యులన్‌ వలతురే విశ్వాసమున్‌ లేదు; (కూ. 
"రలు తోడన్‌ ఐతినైన చంపుదు' రధర్మల్‌. నిర్ణయల్‌ చంచలల్‌ 
వూ Bye వారి 'వేడబము. లా వేదాంత స సూ కంబులే / 


య. పురూకవుల ప్రేమలో పురూరవుడు [పేమైకవపడు,. కడుంగడు దీనుడు 
గూడ. జ్ర దేవకాంత వానితో నెప్పుడును సేవలు జేయించుకొన్న దే గాని. వాని క 
కొకనాడైె నను సేవకేసినట్లు 7 గానరాదు: ఇది యనుకూఎపతిక, 


(0. 416) వ 


పోతనామాత్యుని స్రీ “ ee wT 
శకుంతల : | 

దువ్యంతుడు వేటకు బోయెను. ఆశ్రమమునందు శకుంతల యొక్క 

తియ యున్నది. ఆశ్రమమున | పవేశించిన దుష్యంతున కామె కంట బడినది. 

దట్టపు దుజుము, మిజుమిటు చూడ్కులు, నట్టాడు నడుము - దుష్యంతున 

కింకేమి కావలెను? వెంటనే యతడు తన మనస్సును బై. బైట పెట్టినాడు. ఆమె 

కును దువ్యంతుని జూచిన వెంటనే మతివోయినది. ఇంతలో మన్మథ డొకడు 


నడుమ దూరెను. వాడు కుసుమాస్త్రము౨తో నా బాలను గొట్టినాడట ! శకుంతల 
తాలిమి సెడి యిట్లు బదులు వలికినది - 


అనివార్య పభ ! మున్ను మేనకయు విళ్వామి త భూభ ర్రయున్‌ 
గని, రా మేనక డించిపోయె నడవిన్‌, గణ్బ్యుండు నన్నింతగా 
మనిచెన్‌ , సర్యము నా మునీం|దు( డెబు(గున్‌ మద్భాగధేయంబునన్‌ 
సరః గంటిన్‌ పిదపన్‌ గృతార్థ యున్‌, నే. డీ వనాంతంబునన్‌. 

ర 
శకుంతల ముగ్గ, భావగోపన మింకను ఆమెకు బాగుగ నలవాటైనది గాదు. 
ఊర్వశి తాను “పుఠూరవుని (పేమెంచితి నని నోరార. చెప్పనేలేదు. శకుంతల 
చెప్పినది. ఆ చెప్పుట '“కృతార్థనగుదున్‌'' ఆని యెంతో నాజూకు గానన్నది. 
న తలము న బుట్టిన కన్యక యింతకంచదె మరి యేమనును 2 


దేవయాని - శర్మిష్ట 


పోతనామాత్యుడు సృష్టించిన దేవయాని మవాగర్వోద్యమస్థాని. భూరి... 
కోపానలాక లితగ్దాని కూడ. ఆమె దృష్టిలో శర్మిష్ట తండి శు(క్రాచార్యునకు 
దాసుడు. తన చీర కట్టుకొన్న శర్మివ్టను ““విపాతములే కుక్కలకు హవిర్భా 
గంబుల్‌ '* అని యామె |పశ్నించుచున్న్చదడి. శర్మిష్ట కూడ కోపమున తక్కువది _ 
కాదు. కాని యా కోపమ్ము శ్నణమాతము. శర్మిష్ట దేవయానికి దాసియైనది. . 
దానికీ కారణము. తండి యాజ్ఞ. అపుడామె ''చలమింకేల పోనీలె'” మ్మని & తన్ను 
తాను సవరించుకొన్నదట. ఆ సవరింపు తన కార్యమును సాధించుకొనుటలో 
డీక్షయే. “ఎడరు వేచి ఒకానొకనాడు యయాతిని లోగొన్నది. దేవయాని కా. 
సంగతి తెలిసి |క్రోధమూర్శిత యయ్యెను. యయాతి భంగపడినాడు. ఆమె 


188 భాగవత వై జయంతిక 


విన్నది గాదు. యయాతి యపరాధము శుక్రుని చెవులకు తాకనే తాకినది. 
శర్మిన్గ క్షత్రియకాంత కుచితమైన భావగోపనము గల యువతి. దేవయానికి 
తోచిన భావము దాచికొను నలవాటు లేదు. 


వింధ్యావ రి, 


_ ఐలిచకవరర్తి భార్యే ఎరు వింధ్యావళి. ఈమెకు నోరేలేదా యనిపించును. 
అంత డీర్చ మైన బలిచకవ ర్తి కథలో నామె మన కగుపించునది రెండుమారుదే. 
బలి వామనునకు మూడడుగుల మేర దానమిచ్చినాడు. ఎదుటనున్న కులా. 
చార్యుడు వామనుని రహస్యములు విప్పిచెప్పి వానికి దానమిచ్చినచో సర్వ 
నాశనమగునని హెచ్చరించెను. బలి వినలేదు. ఆచార్యుడు మోరమగ శపిం 
చెను. తన యెదుట నింత కథ జరుగుచున్నను వింధ్యావళి పల్లెత్తు మాటనలేదు. 
వటుని కాళ్లు గడుగుటకు నీరు మాత్రము తెచ్చినది. ఆ సన్ని వేశమును పోతన్న 
యిట్లు వర్ణించెను - 


దనుజలోకనాధు దయిత వీంధ్యావశి; 

రాజవదన; మదమరాళగ మన; 

వటుని కాళ్ట గడుగ వర హేమఘటమున 
_ జలము దెచ్చె భర్త సన్న యెటింగి. (8.604) 
ఈ సందర్భమున మూలములోని 'జాలకమాలినీ" యను విశేషణమును పోతనా 
మాత్యుడు వదలెను. వింధ్యావళి స్వభావమునకు, రాజనమునకు పొత్తు గుదుర. 
. దని యేమో! “భర సన్న యొజింగి' యను చేర్చు పోతన్నదే. దీనితో కథకు 
[బాణము వచ్చినది. వామనమూర్తి బలిని బంధించినపుడు మాతము ఆమె 
యూరకుండలేక పోయినది. 


తతమ త్తద్విపయానమై కుచనిరుంధచ్చోళ సంవ్యానయె 
ధృత బాష్పాంబువితానయై కరయుగాధీనాలిక స్థానయై 
. “పతి భిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే””. యంచుత 
త్సతి వింధ్యావళి చేరవచ్చె (తిజగదశామనున్‌ వామనున్‌, (8. 658) 
వచ్చి యచ్చేడియ వామనమూ ర్తి న. ba నిలుచురిడి 
న - 


పోతనామాత్యుని స్రీ పాతలు 189 


నీకున్‌ క్రీడార్థములగు 
_.లోకంబులు జూచి పరులు లోకులు కుమతుల్‌ 
లోకాదీశుల మందురు 
లోకములకు రాజవీవ లోక స్తుత్యా! 


కాదనడు; పొమ్ము లేడీ 


_రాదనండు; జగ త్త9యైక రాజ్యము నిళ్చెన్‌, 

నా దయితు గట్ట నేటికి? 

శ్రీ దయితా చిత్రచోర! ses (8. 680 681) 
శః రెండవ పద్యము పోతన్న స్వక పోల కల్పిత మే, మొదటి పద్యము ఆమె 
మనోనిశ్చయమును దెలుపును. సర్వమునకును భగవంతుడే కరయను విశ్వాస 
మామె పతి యూహలోను గలదు. ఆందుకే వింధ్యావళి. శుకుడు, బలి- వీరి 
నడుమ జరిగిన రగడలో |పవేశింపనే లేదు. రెండవ పద్యములో _ వింధ్యావళిని 
పాపము! న్రీత్వ మావేశించినది. తన పతినే వామనుడు గ్రైను. ఆ పరీక్ష కామె 
నిలువలేక పోయినది. ““ఆయ్యా! మాట తిరుగక నా పతి మూడు లోకములను 
దానమిచ్చినాడే. ఇట్టివానిని సీవు కట్టుట న్యాయమా?" యని నేరుగా వామన 
మూర్తి హృదయమునకే యామె [పళశ్న వేసినది. వింధ్యావళి భగవంతుని 
గురించి వాడిన రెండు విశేషణములును రెండు. ముత్యములు. “థ్రీ దయితా 
చిత్తచోరి యనుటలో “నీకును భార్య యున్నది. భరకు కష్టము [పా పించి 
నపుడు భార్యకెంత దుఃఖముండునో యా లశ నడిగి చూడు” మనుచున్నది. 
“నిన్ను జేరిన భక్తులకు కల్పవృక్షము వలె కోరికలనెల దయసేయువాడ వని 
(పసిద్ధి యున్నడే! నా భర్తను సర్వనాశము జేసితి వేమయ్యా!!”” యని యెత్రి 
పొడుచుచున్నది. ఆ యడుగుటయు కొంత గడుసుగ నున్నది. -వింధ్యావళి మహో 
గంభీరమైన చిత్తవృత్తి గలది. ఆమె యెప్పుడును పలుకదు. పలికిన (పతి 
మూటయు తూచి పలుకును. . 


గోపికలు : 


గోపికలు వింధ్యావళి వంటి వారు గారు. కృష్ణు డొకటి తల్లే! వారు పడి 
మాట లాడుదురు. మనసులోని భావమును మాటు సేయుట వారెన్న డెరుగని 


40 “భాగవత వై జయంతిక 


విద్య. శోపికల యసూయలు, (పేమలు, ఈర్ష్యలు, [ప్రణయ కోపనులు సర 


మును మజుక్షణమే కృష్ణునకు దెలియవలసినదే, గోపన్రీల విలాసములు వారి 
రూపురేఖలు వడించునపుడు పోతన ఎంతో అందముగ శృంగార రనమును 
గా 3 

గోపకాంతలు యళోదప కృష్ణుని యల్ణరి చిల్దరి చేష్టలు దెయపు 


తీర్చిదిద్దను. 
దీనిని పోతన 


ఘట్టము మూలములో మూడు శోకములుగా మాత మున్నది. 
పెంచి సుమారు ముప్పది పద్యములు |వాసినాడు. గోపికా విరహవర్ణన, 
(క్రీడ, [భమరగీతలు-- ఇట్టి వానిలో పోతనామాత్యు డా గోపికలు తానే యెపోయి 
నాడు. కాకున్నచో నంత బాగుగ నా ఘట్టములు [వ్రాయుట యసౌధ్యమైన పని, 

దళమ స్మృంధములో సత్యముగ నాతడొక విరహ పరిత ప్తయె పతి వతయిన 
గోపికయే యైనాడు. ఆ మహాకవి తన కామ కోధాదులను భగవంతుని పె ని షే 
పీంచుటకు ఫలము ఆతడు మాత్రమే కాదు; తెలగుదేశమే తరించుటయైనది 


కృష్టవిరవా సరిత పయైశ Een పోతనామా ా త్యుడు కృష్ణునుద్దేశించి 


రాస 


ఆద నందనందనుం డంత ర్లితుండయ్యె .. 
పాటలీతరులార |! పట్టరమ్మ ! 
హేలావతుల గృష్ష! యేల బాసితి వని . 
యెలేయలతలార ! యడుగరన్ము ! 
వనవావు. గిచటికి వచ్చి డా/గండు గదా 
_ చూతమంజరులార ! చూడరమ్మ ! 
మానినీ మదనుతో మారాక యెజింగించి. 
మాధవీలతలార ! మనుపరమ్మ 1 


జాతిసతులవాయ సనీతియ్సే వారిక్షని 

జాతులార ! కిశల( జాటరమ్మ! - 

కదకులార! పోయి కదలించి శిఖిపింఛ 

జాటుం దెచ్చి కరుణం జూపరమ్మ ! (10. 1. 1016 వ 


పోతనామాత్యుని స్త్రీప్మాతలు = 141 


అని దీనముగా బలికెను. పోతనామాత్యుల విషయమున మనకు దక్కిన భాగ్యము 
గూడ నంతే. ఆ మహనీయుని గురించి మన మీ పద్యమును మాటిమాటికిని. 
మననము సేసికొనవలసినదే. ఆంధ సాహిత్యములో నాతడొక స్వప్నము వంటి 
వాడు, కవులెందరో పుట్టికి. పుట్టుదురు. పోతనామాత్యుల వంటి తపస్వి, బుషి, 
కవి పుట్టునని మాతము ధై గ్యముగ జెప్పలేము.. 


(ఆంధ్‌ మవోఖాగవతో వన్యాంనములు, 1957 ) 


పక 


కంజాక్షునకు (గాని కాయంబు కాయమే ? పవనగుంభిత చర్మభన్ర్రిగాక 
వై కుంఠుంబొగడని వ క్ర)మే ఢమథమ ధ్వనితోడి ఢక గాక 

హరి పూజనములేని వహ స్తంబు హ స్తమే తరుకాఖ నిర్మిత దర్శిగాక 

_ కమలేకు( జూడని కన్నులు కన్నులే తనుకుడ్య జాలరం|ధములుగాక 
చ|క్రిచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక 
నిష్ణుభ క్రిలేని విబుధుండు విబుధుడే పొాదయుగముతోడి టు 


సంసారజీమూత సంఘమ్మువి చ్చునే చ కీదాస్య [పథంజన నము లేక 
తాస త్రయాభీల దావాగ్నులాలునే విష్ణు సేవామృత వృష్టిలేక 
సర్వంకషాఘాఘ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్ని లేక 

ఘనవి పద్దా ఢాంధకారంబులణ (గునే పద్మామనుతి రవి[పభలులేక 
నిరుపమా పునరావృత్తి తి నిష్కళంక ము క్రినిధి గానవచ్చునే ముఖ ఖ్యమైన 
ళార్డి కోదండ చింతనాంజనములేక తానురసగర్చునకునై న దానవేం[ద ! 
nm ae 


అంధేందూదయముల్‌ మహాబధిరశంఖారావముల్‌ మూకస ' 
ద్గ్రింధా ఖ్యాపనముల్‌ నపుంసక వధూకాంక్షల్‌ - కృతఘ్నావశీ ag 
బంధుత్యంబులు భస్మహవ్యములు లుబ్బ్ధదవ్యముల్‌ (క్రోడ స 
ద్గంధమ్ముల్‌ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్‌ . 

ఆంధ మహాభాగవతము - రనానుభూాత్‌ 


డాక్టర్‌ జి. వి. నుుబహ్మణ్యము 


నల్వనివాండు పద్మనయనంబులవాడు కృపారసంబు 'పె( 
జలెడువాండు మౌళిపరిసర్పిత పింఛమువాంయడు నవ్వు రా 
లెడు మోమువా( డొక(డు చెలల మానధనంబు. దోచె నో 
మల్టి యలార ! పీ పొదలమాటున లేడుగ దమ్మ చెప్పరే ( 


ఈ పద్యం విని పరవశించే తెలుగువారికి భక్రి రసం కాదంటే లక్షణ 
శాస్త్రం మీద గౌరవముంటుందని నే ననుకోను. భక్రైకి మారుపేరుగా పోతన 
భాగ వతాన్నే చెప్పుకుంటారు తెలుగువారు. పండిత పరిషత్తులు మాతం మధు 
సూవన సరస్వతి రచించిన భగవద్భ క్రికసాయనం మీద సిద్ధాంతరాద్ధాంతొలు 
చేసికొని అనుభూతిని పాండిత్యవిభూతితో కలిపి నెన్నుదుట దిద్దుకుంటాయి. 
చర్చల కతీతమైన రశ్యలక్షణ (గంథం భ క్రిరసాయనమైన భాగవతం. 


భక్తి అనేది కావ్యభాషలో రసనామమైనా మౌలికంగా అది భగవల్లతణ 
మైన చిత పరిపాకం. ఆకలి ఆవుతున్న పసిపాప అమ్మ పాలకోసం అలమటించి 
నట్టుగానే మానవ్పని ఆంతరాత్మ ఆఖండ చిన్మయానందం కోసం ఆరాటపడు 
తుంది. తియ్యనిపాలకై తల్లిపాలిండ్డకోనం తడివే పసికూనలాగానే అంతరాత్మ 
ఆ ఆనిర్వచనీయానందానుభూతి కోనం అన్వేషణ (పారంభినుంది. ఆ అన్యేనణ 
లోనే అంతరాత్మ ఎంతో ఎదుగుతుంది. యౌవనం పరిపాకానికి (పకీక యౌవ 
నంలో ఉన్న స్రీ మనోవారుని మధురానురాగం కోనం ఎలా రతిభావాన్ని భణి 
స్తుందో, ఆన్వేషణలో ఆరయెన ఆంతరాత్మ ఆలా ఆ పరంజ్యోతి. పరిష్వంగం 
కోసం పారవశ్యంతో పలవరిస్తుంది. అలా భగవదతితో _పారవళ్యాన్ని చెందే 
పరణత మైన చితపరీపాకమే భ క్రి. రతిచ్చాయ. ఉండటంచేత 


పెకి అది ౪ 
రంగా కసపక్త్సుతుంది.. మ న ఎగా 


య కాని అడి లోకంలో _పియసీపీయుల మధ్య కనపడే 
మైన కతి కాదు; కావ్యాలలో కనపడే అలౌకికమైన రతీ కాదు; జీవాత్మ 


ఆంధ మహాభాగవతము - రసానుభూతి 148 


పరమాత్మల ఆదై్వైతస్థితి కోసం ఆంతరమైన చైతన్యం అభిలషించే అవ్యక్త 
మైన ఆధ్యాత్మిక రతి. అది పరిపూర్ణం. అఖండ ఆనందనిధానం. భాగవతంలోని 
గోపికల పణయత త్యం ఆదే, పై పద్యంలో గోపిక క్రన్వాష్షిరరిక్తది గోపాల 
కృష్ణుణైనా పరమార్థంలో పరమాత్మ త త్త్యాన్నే. 


పెకి కనపడుతున్న ఈ స్రీ పుంస భావంలో నుండి ఒక మధురమైన 
ఆధ్యాత్మిక రతిభావం (పతీయమాన ఆ అవుతున్నది. ఆ రతి భగవత్సరంగా పవ. 
హిస్తుండటం చేత భ కిగా పరిణమిస్తున్నది. ఈ భక్తి ఇందియ పరితృ ప్తికోసం 
లశ్నీించింది కాదు; భవబంధ విము కికోసం (పవరి రించింది. వేణుగానలోలుని 
కల్యాణపి గవాన్ని కన్నులార గాంచిన ఆ గోపకాంత లు- పరమేశ్వరుణ్ణి మ. 
చిన భాగవతో త్రముల్హాగా పరమానందాన్ని పొంది తరించారు. 


హరి సురుచిర లలితాకృతి. 

దరుణులు గని ము క్రవిరహతాపజ్వరలై 

పర మోత్సనంబు సలిపిరి 

పగ మేళ్వరు( గనిన ముక్తబంధుల భంగిన్‌, 
అని పోతన్న వర్ణించాడు. _ ఉద్ధిష్టతాత్సర్యాన్ని ఉపమానంలో ఉంచి ఉజ్జ్వల 
చేశాడు. శృంగారం యవనికగా భగవద్భక్తి లాస్యం చేసిన కవితారంగం 
వ (గంథం. 


భాగవతాన్నంతా అలా ఉంచి ఈ టో సహృదయుడు పహైండే. 
రసానుభూతిని గురించి వివేచిసే మనకు కొన్ని విశేషాలు తెలుస్తాయి. 


1. సహృదయుడిందులో ఆలౌకికా రాల వెనుక ఆధ్యాత్మిక భావనం 
చేస్తున్నాడు. 


పా|తృల్గో తొదాత్మారన్ని భకీంచి రసానందాన్ని పొందుతున్నా 
(పాతిభాసిక మైన జ స్థితి కొంది అధీ౨ మైన ఆత్మానంద స్థితిని అందుకోవాలని 
అ వ్య కంగా పయత్నిస్తున్నాడు.. 


1 అ భాగవత వై జయంతిక 


లి. గోపికల రతిభావం Sess న్న్న పొందుతున్నా భగవద్వి 
పేస్టు గే సంబంధింఛిన భావాలు సహృద నికి అసాధారణాలై ఆశ్చర్యజనకాలె 
ఆలోచనాన్ని రేకెత్తిస్తున్న వే కాని తాదాత్మ్యాన్ని కలిగించటం లేదు. అంటే 
సహృదయుడు భక్త పాత్రల్లో తాదాక్క్యాన్ని పొందగలడు, కాని భగవంతుని 
పా[తలో పొందలేడు. అందువల్ల భాగవతంలోని పధాన. పాతయెన భగవం. 
"తుడు అలౌకిక విభావ వస్పూర్తి రితో. వెలుగొందినా ఆధ్యాత్మిక విభాగంగానే అనుగ మ్మ 
మాను గర 


“Ad AN కితోడు భాగవతంలో భగవత త్యం సగుణ నిర్గుణ మార్గాల 
ననుసరించి నిరూపితం కావటంచేత స సహృదయుడు సగుణరూపంతో సహాను భూతి 
పౌందలేకపోతు ర్నాడు. నిర్షణత కాన్ని హృదయంతో సాధించలేకపోతున్నాడు. 
అందువల్ల భగవద్విషయంలో బుద్ధీ న్మాశయించ వలసివస్తున్నది. ఆలౌకికం 
హృదయగ మ్మం, ఆధ్యాత్మికం బుద్ధిగమ్యం కావటంచేత భాగవతంలో సవృద 
యుడు బంక సగం ఆలౌకికం; సగం ర 


క. భాగవత పా తల్లో భగవ, దూపభావనం చేసేవి కన్నీ, భగన త్త త్త 
భావనం చేసేవి కొన్నీ ఉన్నాయి. "అందులో భగవ దూపభావనం చేయటం 
భగవ్యదతి. త _త్త్వఖావనం చేయటం త _త్రజ్ఞానం, లాక్షణికమతా న్నను 
సరించి భగవ్మదతి స్థాయిగా కలిగింది భక్తి. త_త్త్వజ్ఞానం 'స్థాయి భావంగా 
నిలచేది' శాంతం,. see ఈ రండూ అలౌకికాలై న కృంగారాదులకంచె విశిష్టము 
లై నవనే చెప్పాలి. భ క్రి శాంత రసాలు రసనామవాచ్యాలై నా రసాతీతాలని సంభా 


వించాలి. భక్తి రసమని అంగీక రించినవా' గందరూ దాని కాస్టితి నంగీకరించారు. 
అంగీకరించనివారే భ్‌ _క్రిని భావమని భావించారు. 


| సహృదయుడు భగవ _దూపభావనం చేసే స్‌ పకక సహానుభూతిని 
పౌంది గా సాయిని చరణం చేయటం వల్ల UG రసమే భ క్తి, తదా 
నందమే శ క్రిరసానుభూతి. 


మ భగవ త్త శ్వభావనం చేసే భాగవత పాత్రలు జ్ఞ జ్ఞానులై ఉం 
వారికా త త్యం ఆత్మజ్ఞాన రూపమైన మోక్షస్థితికీ సాధక మౌతుంది. నన. | 
కూపానుసంధాన రూపమైన. ఆత్మరతియే' ఆప్పటి స్థాయి. అభినవగు ప క్‌ 
అన్నట్టు ఆదీ స్థాయితమము. య రసమని పిలవటం బేపచారికమే.. సహృద 


ఆంధ మహాభాగవతము - రసానుభూతీ = 146 
యుడు భాగవతంలోని భగవ త్రత్తాన్ని స్థాయిగా గ్రహించి సగుణత త్తం వెనుక. 
నున్న సచ్చిదానందాత్యక క పర బహ్మత త్ర గ మే సత్యమని. తెలిసి అదై ప్రత్‌ స్థితిని 
సాధించి ఆత్మానందం పొందటమే రసానుభూతి, 


8. కషప బట్టి విచారి సే- భాగ వత పఠితయైన సహృదయుడు (ప్రధానంగా 
ఆ సికుడై ఉండాలి. ఆ పెన "ఆధ్యాత్మిక చింతనాపరుడై ఉండాలి. భాగవతంలో 
రమణీ యార్థం కోస మే కాక, పరమార్థం కోసం కూడా వెదకాలి. ఇటువంటి చిత్త 
పరిపాకం ఉంటేనే భగవదతి (పకొశిస్తుంది. లేక పోతే ఆభాస ఎదురౌతుంది. 


భాగవతంలోని అవతార కథా బాహుళ్యం భగవద్భ కుల గాథా పపంచం 

ఆ |గంథంలోని భగవ్యదతికి ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నాయి. నిర్గ్ణణపర(బహ్మాన్ని 
నగుణోపాసనం. ద్వారా. సాధించే సాత్వికభ కియోగం భాగవత [పతిపాదిత 
సరమ తాత్పర్యం. భక్తి ఎన్ని భావాలతో మిళితమై మెలగటానికి వీలుందో, 
ఎన్ని విధాల (పవృత్తుల్లో ఎన్నెన్ని అవస్థలను పొందటానికి అవకీళముందో భాగ 
వత కథా పపంచం విశ్యరూషంగా (పదర్శి: చింది. నవవిధ భకుబు పెద్ధనామాలు, 
పెట్టుకొన్న పెపమాష్ట మ్మాతమే. వాటిలో ఆవాంత3భేదాలు శత సంఖ్యల మీద 
వి శ్రషించవచ్చు. భాగ “Re చదివిన న హృదయులు శృంగారాది వికృతిరసాలు 
గాని, పకృ 'తిరనంగా పరిగణింపబడిన శాంతం గాని భ క్రిభావోద్దీపాలై ఎలా 
భగవ దతిగా పరిఢ విల్లుతాయో ఆఅనుభవించి'చూడవచ్చు. తత్వజ్ఞాన స్థాయియైన 
శాంతం యోగిజన గచ్యుమైతే భగవ్యదతి స్థాయియైన భక్తి సంస్కారవంతు 
లైన సహృదయుల కందరికీ సాధ్యమన్నట్టుగా భాగవతం నిరూపించింది. “భక్తి? 
ఏవ. వ్‌ క్రో రసః అన్నమాట అనలేదు కాని “భ రః ఏవ పరిపూర్ణ రసః అని 
మధుసూదన సరస్వతి దర్శనాన్ననుసరించీ, ప్రవచింస వచ్చునని 'భాగవతరసాను 
భూతి సవృదయు" కు [పరణ కలిగిస్తుంది. పోతన భ డికి ఆవేశాన్నీ, ఆలోచ వ 
ననూ రెండు రెక్కలుగా తీర్చిదిద్ది త కాక్స్‌ ఆత్మానందాన్నీ అందించే 

సవ్యసా చి త్వాన్ని న! చేశాడు, 


భ క్రికి చి త్రపరిపాక మెంత అవసరమో భావావేశం అంత అవసరమని 
' ఖాగవతరచనలో పోతన వ్యజ్యమానం చేశాడు. రసానుభూతిని కలిగించటానికి 
10) | 


భాగవత వై జయంతీకీ 


క 


లో మౌలికంగా తోడ్పడేది + విభావవిస్పూ రిని దృుశ్యాయమానం 
న. రచనలో కావ్యశరీర స్థానీయమైెన శబ్దం ఉంది. బె చైతన్య 
మన కర ఉండి. గుణవ్యంజకమైవ శ బార్భ సంయోజన ముంది. వైఖరీ 
న్ని వెలార్నగల రీతి విధానముంది. కోభాతిశయత్వాన్ని కలిగించడానికి 
ఆల:కారముంది. వీటిని జీవింపచేసే జాచిత్యం ఉంది. [పాణం సోయగల 
వ్యంగం ఊండి. ఆత] క్రయిన రసం ఉంది. భగవ దూపరతిని సై సాయిగా పోషింప 
దలచుకొన్న పోతన్నకు రూపవైభవాన్ని అందింపగల శబం ధాతుపుష్టి వంటిది. 

భౌతిక శరీ సౌందర్యం లయాన్వితమై అలంకృత మెతే మధురంగా ఉజ్వలంగా 
భాసిస్తుది. చైతన్య స్ఫ్పోరకమైన అర్ధం ఆవేశంతో లాస్యం చేయగలిగితే 
రూపం న్య త్యాయమాన మౌతుంది. అందువల్లనే పోతన తన రచనను శద్దాలంకా 
రాలతో వదమల చేసాడు. తేక . _ఆర్థాన్ని వ, (కవిన్యాసం చేయిస్రాడు. 

సగుణమైన పర్‌, _ఐహ్మ 0 లీలావిలా సాలను పచరించే భాగవతాఖ్యా నంలో శూ 
ర్థాల సంవిధానం ఇలా ఉండటమే రసానుభూతికి దోహదం చేస్తుంది. చేపట్టిన 
వస్తువును హాపుకొట్టించే వాక్చాకం కుదరటం సవాజక వికి సవాజాలంకారం.. 


_ 
ఇల 


చ 
tA 
PR 


ఫీ 


న ల, 
CHE uy} 


y rar 
(క ల్ల ' 
tre వ 
isi 6 


ళ 


A 


లక 2} 
వ 
ళ్‌ 


ఆంతేకాము, భ క్రి కవితలో ర క్తి కట్టాలంటే శ్రవణం, సంకీర్తనం, 
ంతినం ఆనే భ క్రిమార్గాల కది పరపోచకంగా ఉండాలి. కవితకు అలితళట్ర 
సంయోజఐ। సంవల్లా, హరా! పునరావృ త్రి తివల్లా, అను పాసయమకాది శబ్దా 
అంకొర సంవిధానం వల్తా శవణసుభగ త్యం త ధారావాహికమైన 
గతివల్హా, భగవద్దుణ సంకీ ర్రనంవల్రా, రాగ రంజిత మైన శ్రైలివ ల్లా, నం. 
తస. చేయగలిగే పద్యవిక్య వల్లా కవితలో సంక ర్రనకు సౌలభ్యం ఏర్పడు : 
అ భావనా గంభీరాలైన న ఆర్జారంకారాల వల్లా, వ్యంగ్యసౌరభాన్ని వెదజల్లే 
వాక్యవిన్యాసంవల్లా ఆరటిపండొలిని ౩ పెట్టినట్టు అభివ్య కృంచేసే తాత్విక తాత్పర్యం 
వల్లా కవిక్వ ఎం పఠితలలో చింతనను శ్రేశె శ్రింపజేసుంది. బమ్మెర పోతన 
కవిత్వం ఈ లక్షణాల నన్నింటినీ సలక్షణంగా Ss వల్ల 
భ కి రసానుభూతికి శ _క్రీమంతమైన సాధన మ. 


రష్‌ 


“మందారమకరంద మాధుర్యమున దేలు 
మధుపంబు వోవునే మదనములకు' 
ఇటువంటి రచనలోని మ శవ హ్‌ 
స మాధుర్యం _శవణాన్ని ఆకట్టుకుంటుంది. 


ఆంధ మహాభాగవతము - రసానుభూతి = 147 


“కమలాషు నర్చించు కరములు కరములు 
శ్రీనాథు వర్షించు జిహ్వ జిహ్వ! 
ఇటువంటి రచనలో సంకీర్తనం స్వాదువుగా వినిపిస్తుంది. 


“ఇందు( గలం డందు లేండని 
సందేహము వలదు; చృకి సర్వోపగతుం 
డెందెందు వెదకి చూచిన 

నందందే కల(డు దానవాగ ణి! విందే” 


వంటి పద్యాలు పఠితల్లో తాత్త్విక , చింతనాన్ని సేరేపించే వృాద్యపదోక్టిప 
నివత్తులు. 


“ఆమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలం బె 
ద్దమ్మ, సురారులమ్మ కడుపాఅడి పుచ్చినయమ్మ, దన్నులో 

నమ్మిన వేల్పుటమ్మల మనముుల 'నుండెడి యమ్మ, దుర్గ మా 

యమ్మ కృపాళ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వసంపదల్‌.' 

వంటి పద్యాల్లో కనపడే వ్నత్త్యనుపాసం వట్టి శభ్రాడంబరం కాదు. పఠితలను 
నాదనామ క్రియారాగంతో మైమరపించే. సమ్మోహనమం9| తం. తేట తెలుగు 
మాటలే a డీర్ణ సంస్కృత సమాసాలు కూడా మందారమకరంద |ప్రవా . 
హంలా పోతన్న కవితలో తరుగని రుచుల నీనుతుంటాయి. చూడండి- 


mre ఘనసార పటీర వ మరాళమల్రికా 

హారతుషార 'ఫేనరజలా చలకాశ ఫణీశకులదమం 

దారసుధాపయోధి సిత తామరసామరవాహినీశుభా 

కారత నొప్పు నిన్ను మతిం గాన(గ నెన్నడు గల్లు భారతీ! ' 
హోతన్న థ్‌" _క్రికవితయే ఆంధ మహాభాగవతానికి (పాణం. 


కవిత్వానికి ఆవేశం అ 'సంయమనం ముఖ్యమా ? అన్న 
మీమాంస కొందరు చేస్తారు. శిల్ప సం|పదాయవాదులు సంయమనం ఉతమగుణ 
మంటారు. పోతన్న భ్‌ క్రి పధాన రచనం చేస్తున్నాడు, భక్తి జ్ఞాన పసూనంగా 

పరిమ?ిస్తే సంయమనం తో కూడిన కవిత రాణిస్తుంది. జ్ఞానవిశిష్టమైన భక్తి. 


148 "భాగవత వైజయంతికో 


రసోల్రాససితిని భజించాలం వే సంయమనం కంటె ఆవేశం రసపోవకంగా రంజి 
స్తుంది. స్థానం పోతన భాగవతంలో భ కకీ శ క్రిగా నిలిచింది. భక్తి కవిసూ_క్రీ 
నాశ్రయించి. మధురలాస్యం చేసింది. ఆంగికీ ఉద్దీపనంలా నిలిచే. సాంగమైన 
రసవ|ద్రచన పోతన కవిత. పోతన కవితకు భ క్తి భి త్రిక. శబ్దం ధాతురాగ ౨. 
భావం శేభాచిత్రం. భగవన్నామగుణలీ లాభివర్ణనం ' వర్తవిన్యాసం. ఆవేశం 
స్ఫూ.ర్తి. అలంకారం అందం. భగవ|దతి జీవితం. అనుభూతి ఆత్మ. పోతన 
కవితను చదివే సహృదయుడు భక్తి నుండి రసానుభూతి దాకా పద్యాన్ననుస 
రించి (ప్రస్థానం సాగిస్తాడు. 


“ఎవ్వనిచే జనించు జగ మెవ్యనిలోపల నుండు లీలమై 
'యవ్వనియందు డిందు బర మేళశ్వరు( డెవ్వడు మూలకారణం 
బెవ్య( డనాది మధ్యలయు. డెవ్యండు సర్వము దానయైనవా( 
డెవ్య(డు వాని నాత్మభవు స నే శరణంబు వేడెదన్‌.’ 


ఈ పద్యం గజేందుని నోట పలికించిన సుతి. సర్గ|ప్రతిసర్ణాత్మక మొన | 
_ పురాణ లక్షణాలను పుక్కి టబట్టిన్మ విశేషణాలను _పురాణపురుషునికి వాడటం 

నై రాణసగకూవా వాని కనువై న బొచిత్యం. నిర్వ్యాపార డై న్స్‌ నిర్ణణ బహ్మను | కియా 
శిలియెన చైతన్యంగా చెప్పి సగుణత్యసాధనకు బోధనను సమకూర్చుటం సరం 
నామ [పయోగ విశేషం. విభక్తి |కియాన్వయం కలిగ్గించేది కొబట్టి భగ వడా 
కార రతి వ్యంజకం. చివరకు శరణాగతి భ క్రి ప్రప శ్రికి పతాక. రూపారూపా 
రోపం చింతనకు చింతామణి. పోతన “ఫరమేశ్వరా!” ఆని పిలిస్తే వైకుంఠ 
వాసుడు పలకటం శివ కేళవాదై తసిద్ధిని భక్తికి [పసాదించే ఉపాయం. నిర్లు అకా 
నికి గణసంకీ ర్రనం వల్చ రూపారోపం చేసే భ _కిమార్గాని కీపద్యం అనవద్యమెన 


త్‌ 


“సిరికిం జెప్పండు. ₹ంఇచ్యక్రయ గమున్‌ శేదోయి సంధింపం డే 
స పరీవారంబును జీరం డగ పతిం బన్నింపం డాకర్ణికాం. జ 
తరధమ్మి లము జక్కనొత్త re వివాద ప్రోల్టిత శ్రీకుచో 

. పరిజేలాంచలమైన వీడండు 'గజ్బప్రాడావనోత్సాహా యై యె 


ఆంధ మహాభాగవతము - రసానుభూతి 149 


“ఇది సగుణ క్రియాలోలమైన భగ వదాకారచిత్రణం. భ_క్తరష్షణ కళా 
పారీణుడై. న భగవరితుని ఉత్సావోవేళానికి సచ్శితవ్యాక్యానం. "భక్తుడా "భగ | 
వంతునితో సహానుభూతిని చెందిందానికంషె దీనావనరక్షణోద్యోోగంతో ఉన్ని 
[దుడై న భగవంతుని లీలావిలాసచర్వణం వల్ల ఆర్హ్ఫమైన హృదయంలో భగ 
వదాకార' రతిని పతిబింబింపజేసికొని. మననం చేస్తాడు. భ క్రచి త్తవృత్తుల్లో 
సవరం మజ్జనోన న్మజ్ఞనం జేస్తూ భగవ దతిని క న్‌ పెంచుకుంటాడు. 


భాగవతంలోని భాగవతు రనభావో ల్లాసం స సహృదయుల ఆలౌకిక రస 
భావాలకు సహషప క్తి భోజనం. భగద|దూపగుణనామ లీలాత త సంకీ ర రనం 
సరద తులకు భగవదాకారరతిభావస్థా యి సంస్థాపకం. భగవ దతి చరణం 
సహృదయ రసస్థితి పోవణం. షా సరంతర స్మరణ మనన ధ్యానాది జనిత 
Sr సంవలిత ఆత్మానంద సంవాదస్థితి భాగవతరసానంద స్థితి. మహో 
నందాంగన |బహ్మానందం. తదానందాంగ నాడింభకుడు భగవ దతిస్థాయి రూప 
భక్తి రసానందకందడై న రసఇహ్మం. భాగవత రసానుభూతి. భగవంతుని 
రూపమును దవీభూతచి త్ర తము నందు ము| దించుకొని ఆలౌకికమూ, ఆర్యాత్మి 
కమూ అయిన _అనుభవస్థితియందున్న ఆనందవ్య కీ కి! “ర సో వె సః", 


4 


వేదకల్పవృకు విగళితమై శుక 

: ముఖసుధా.దవమున మొనసి' యున్న 
భాగవత పురాణ ఫలరసాస్వాదన 
పదవి( గనుఃడు రసికభావవిదులు ! 


గ్రరనోల్గానము, 1980 ) 


¥ . «¥ శ 


ఆమ్మల. గన్నయమ్మ ముగురమ్మల. మూలపుటమ్మ చాలంబె _ 

ద్దమ్మ సుఠారులమ్మ కడుపొణడి( బుచ్చినయమ్మ దన్ను లో 

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ ' దుర్గ మా 
యమ్మ కృపాబ్ధి క మహ త్వ కవిత్వ పటుత్వ సంపదల్‌, 


కుచేలోపాఖ్యానము 
: im ps శివశంకర స్వామి 


శ్రీక్ళ ఇమన్‌ సఖుడైన కుచేలుడు విజ్ఞాని. రాగాడి విరహితస్వాం తుడు, 
అ 


జాం తుడు. మానధనుడు. విబితేం (దియుడు. బహ్మవే త, బహుసంతాన 
ముండుటచే దారి ద్జబాధ ననుభవించుచు అన్యులను నీచముగా యాచింపక 

నంత లభించిన కాసును ఐంగారు నాజెముగా తలపోయుచు - 'సంత్భ ప్రి వి చెందుచు ' 
నెట్లో యతడ్షు భార్యను, బిడ్డలను ప్రొషంచుదుంతను, 


ఇతని భార్య ఆభిజాత్యము కల వనం స బిడ్డ 
లాకటిచే మలమల మాడుచు అన్నము పట్టుమని ఆకులు, గిన్నెలు చేత బట్టుకొని 
వచ్చి చుట్టును జేరగా నామె మిక్కిలి దుఃఖించి భర కడకు పోయి “పే పేదరికము 
నివారించు నుపాయ మూహంపకున్నావు | 


బాల్బసఖుడ్రై న స్ట ప్పద్మష్మతన్నేతు. 
గాన నేగి దారి ద్యాంధకార మగ్ను' 

న మము నుద్ధరింపుము హరి కృపాక 
న్‌ రవిదీ 1 పె పడసీ మవోత్ర త్య! నీవు. 


వరదుడు సాధుభ్ర కజన వత ఎలు. డార్త శరణ్యు( డిందిరా 

వరుడు దయాపయోధి భగవంతుండు కృష్ణుడు తా కుశనలీ 
పురమున యాదవ [పకరముల్‌ భజియింపుగ నున్న ప. ప్‌. 
వరిగిన నిన్ను _ జూచి విభ, డప్పుడ యిచ్చు స. సంపదల్‌, 


కొలిలోనం దను మున్నె రంగని మహా కష్టాత్ముం డై నట్టి దు 

ర్బలు( డాపశ్సమయంబునన్‌ నిజపదాద్దాతంబు లుల్టరబులో. 
దలణయవన్‌ తోడన మెచ్చి యా రి వారు(డై, _తన్నైన నిచ్చున్‌; నుని 
ళల భ కిన్‌ శకుంత లర్రి కిడండే | సంపర్వి₹ సం. 1 


పచేలోపాధ్యానము . ఘా 151 


ఆని బోధించెను. కుచేలుడు సంతోషించి కృష్ణుని జూడబో వుట యిహపర 
సాధకమని తలచి భార్యతో ' “సవ చెప్పినట్టు చ కపాణిని జూడబోయిన పుడు 
రి కహ స్తములతో జనక కానుక కొనిపోవలెను గదా! ఏమున్నది?” అనెను. 
ఆమె కొన్ని యటుకులు భర్త యు తరీ మము కొంగున గట్టగా నతడు గోవింద 
| దర్శనో త్సాహియై బయలుదేరెను, తోవలో నతనికి జంకు కలిగినది. 


“ద్వారకా Seah కెట్లు హోవుదును. 2 అంతఃపురములో నికి బోవు 
నెడల ద్వారపాలకు 6గగింతురు. వారి కేమి బహుమాన మీయగలను? “ఎక్కడి 
విపుడవు * ఇందుల క్త వచ్చితివి? అన్న నేమి చేయుదును ? కృష్ణుడు నన్ను 
ఉ పేక్షింపడు. అతని చిత్రము, నా యదృష్టము” అని వితర్కించుచు కుచేలుడు 
నగరములోను క్రమముగా నగరిలోను (పవేశించెను. వివధ హర్మ్యములను 
జూచుచు తుద కొక మందిరమున స్రీలు చామరములు వేయుచుండగా శాక్‌: 
కూడ కృష్ణుడు హంసతూలికా తల్పము పై గానపడెను. 


ఇందీవరళ్యాము వందితసు[ తాము 
కరుణాలవాల భాసురకపోల 
హర్యక్షనిభమధ్యు నఖిలలోకారా ధ్యు 
ఘనచ[క్రహస్తు జగ[త్సశస్తు 
కౌస్తుభాలంకారు కామితమందారు 
సురుచిరలావణ్యు సురళరణ్యు 
ఖగరకులాధిపయాను కొశీయ పరిధాను 
పన్నగ శయను నబ్దాతనయను 
మక రకుండలసదూషు మంజుథాషు 
నిరుపమాకారు దుగ్గసాగర విహారు 
భూరిగుణసాం దు యదుకులాంభో ధిచం[దు 
విష్ణు రోచిష్టు జిష్టు సహిష్టు కృష్ణు. 


కని డాయం జనునంత కృష్ణుండు దళత్క-ంజాతమ( డపే ప్పెద అ 
(పుని న|శాంతదరిదపీకితు కృశీభూతాంగు జీర్ణాంబరున్‌ 
ఘనతృష్టాతురచిత్తు హాస్యనిలయున్‌ ఖండో త తరీయుం గుచే 

బుస్‌ నల్దంతనె చూచి స దిగెం దల్భమున్‌, 


152 భాగవత వె జయంతిక 


కు స 
స్ట 
బామరము వేసెకు. పద్ధాంతకాంతలు ఆశ్చర్యము చెందికి. కృష్ణుడు కుచేలుని 


త్తమవంశ సంజాతను పెండ్రియాడీనా వకుకొందును. నీ మనస్సు ఐహిక 
వ: కానట్లు తోచుమున్నది.'' ఆనెకు. అనంతరము తోక, 


ప్న » a 46 
చేయి పట్టుని చిన్ననాడు గురుకులములోని సంగతులు కొన్ని జ్ఞప్తి చేసి ““సీవు 
డీ 


న 

్స సంభాషించి '“ఒకనాడు 
సంగవహముకు గూర్చియు, గుకుమహిమను గూర్చియు సంభాషించి '“ఓకోనా, 
గురుపత్మీవియోగమున ఇంధనార్భ మడవికి జని జడివానలో తడిసి రేయెల్ల 


న్లో 
చట గడిపినాము: [పాతఃకాలమున గురువు సాందీపని వెదకి వెదకి మనను 
i | శి 
కనుగొని యూరడించి నిజమందిర మునకు గొనిపోయిన సంగతి జ్ఞ ప్రియున్న దా? 
యని కొంత |పసంగించి కప్‌ వచ్చునపుడు నాకేమి యుపాయనము 


తెచి+తివి?, 
హా 


డళమైన పుష్పమైనను 

వణవైనను సలిలమైన బాయని భ క్రిం 

గొలిచిన జను లర్వించిన a 

నెలమిన్‌ రుచిరాన్నముగనె యేను భుజింతున్‌.”’ 
ఆను కృష్టుకకు కుచేలుడు మోమోటమిచే ఆటుకు లీయనేరక తలవంచుకొని 
మన్నకుండెను. కృష్ణభగవానుడు (దావ్మాణుని స్థితిగతులు దివ్య చిత్తమున 
(హించి ముడివిప్పి అటుకులు గుప్పెడు తీసికొని తిని మరియొక గుప్పెడు 
తీసికొనబోగా రుక్మిణి. భర్త చేయి పట్టుకొని వారించెను. కుచేలు డార్యోతి 
గోవిందుని మందిరమున వివిధ రుచ్యపదార్థమేలు భుజించి మృదుశయ్యాతలమున 
న్న్‌దించి ఆరుజోదయమున లేచి కాలు విధులు నిర్వర్తింప కృష్ణు డతనిని కొంత. 
దవ్వు పంపెను. తోవలో విపుడిట్లు తలపోసెను: “పురుషోత్తముని దర్శించి 
తిని. నా జన్మము. ధన్యమైనది. సోదరుని వలె నన్ను కృష్ణుడు బహువిధమ.ల 
నాదరించినాడ్రు.. - కై 


శ్రీనిది యిట్లు నన్ను బచరించి మనంబుగ విత మేమియ 

స్నీని తెజంగు గానబడై నెన్న దరి దు(డు సంపదంధు(డె 

కాన్నక్ర తన్ను జేక(డని కాక శితార్రిహరుండు నత్కపాం చ 
భోనిధి నర్వవస్తు పరిపూర్ణునిగా నను జేయక్షుండునే??* వ 


కుచేలో పాఖ్యానము fr ow త ఫైకి 


ఇట్లు dons నిజపురము జేరి మహాసౌధమును గాంచి ఎవరిదో. యను 
కొనుచుండగా దివ్యవనితల వండి తెరవలు గీతనృ త్త. వాద్యములతో నతనిని 
ఆంతిప్తరిలోనికి గొనిపోయిరి. దివ్యాంగన వలె నానందముతో కలకలలాడుచున్న . 
నిజభార్యను గాంచి యతడు సంతసించి హరిలబ్ది “వైభవము _లఅనుభవించుచు 
మనోవికారము లేక వారిధ్యాన పరాయణుడె యుండెను. 


జీ వేశ ౧రు లేకముగా నున్నను వారిని గం. (శుతి యిట్లు చెప్పచన్నది- 
ద్వా సుపర్ణా సయుజా సథాయా 
సమానం Sse పరివ స్వజాతే 
తయో రన్యః పిప్పలం స్వాద్య తి 
అనశ్న న్నన్యో అభిచాకశీలి. 


కుచేలుడు జీవుడు. _ కృష్ణుడు ఈశ్వరుడు. . జీవేశ్వరులకు తత్వతః ' 
భేదము లేదు. అయినను సంసారిత్వము వలన [బహ్మమునకే జీవత్వవ్యప 
దేశము సంభవించుచున్నది. ' పార్థివశరీరమున (బవేశించిన పిదప జీవుడు కించి 
జ్ఞాడ ననియు, ఐశ్వర్యహీనుడ ననియు భావించును. సంసారియగుటచే బుద్ది 
తాదాత్మ్యము నొంది సస్వఠూ పమును మరచి ఆనై శ్వర్యమునే పొందును. 


కుచేల జన్మమునకు పూర్వము జీవుడు లౌకికై కై శ్వర్గమదమత్రుడై ఐసాక 
' భోగముల ననుభవించుచు' నారాయణ పూంయణత్వమును విసర్జించెను. 
దువ్కర్మాచరణ మునకు ప్రతిఫలము వివిధచాధారూపమున నుండును. కుచేలుడు 
జన్మతః దర్శిదుడు. కుచేల మనగా జీర్ణవస్త్రము. _ ఇక్కడ వస్తను లౌకిక a 
భోగములకు సంకేతము. కుచేలమైనప్పుడ్న దారి ద్యచివ్నమే. 


“దరి|దాయ కుటుంబితా.”” ' ధనహీనులకు సంతానము మెండు. పే 
మొ తము ఇరువదియేడుగురు బిడ్డలు కలిగినట్టు ఒకచో గానవచ్చుచున్నది. సర్వ 
విధముల సమర్థత యున్నను ఉపశనేకతానము వలన భాధలు తప్పవు. 
ఆందులో తాను "భరింపళేని బిడ్డలను గనుట దరిదునకు తగనిపని. బిడ్డలకు 
గుడ్డలు తగినవి ఈజాలక పోవుట యటుండ . కడుపునిండ అన్న మైనను "పెట్ట 
జరు కావుననే కుచేలుని సంకాన్‌నా ఆకలిచిచ్చుచే మాడుచు పవైడోగిరము 


భాగవత వై జయంతిక 


154 | 
పెట వని యకుగుట నంభవించెమ. ఆ వ్యధ భరింపజాలక యొకనాడు ఆతని 
Sn దాః దాదివారణమున కుహాయ మూహింపవలసినదని కోరినది. | అరల 
శక “ వు బో ల్‌ 

వరకు నతనిశ ఈ విషయము తో చనేలేదు. 


ఆఅఐమలో రో ఆలిజాత్యము. తన యంత లభ్యమెనదే పుచ్చుకొనునుగాని 
అతడు యాచన చేయడు. ఎట్లో కుటుందిపోవణము చేయుచుండెను. అట్టవాడు 
వీడో న. నుండును. 'న్మిగవాము లేక బహుసంతానము కన్నను “ఆతని 
కొక గొప్ప సుగుణమున్నది. ఆది నిరంతర వారిధ్యాన పరాయణ త్వము, 


పోపదేశము లేకుండ ఉతమ She పాఠంథభము అనరు 
అతన be యొకనాకిట్లు చెప్పినది 


నన్ను (విహ్మాన్‌ భగవత సఖా సాక్షాట్‌ [శీయఃపతేః 

(విహ్మబ్యళ్చు శరణ్యశ్చ భగవాన్‌ రతర పతిః. 

ఇందలి కబములు సార్థకములు. ఇదియే ఉపదేశమయ్యెను.. దుష్కర్మ శేష 
ముండటిచేతనే అప్పటికిని పెద్దమ్మవారు ఏవో సంశయములు కలిగించినది. 
గోవిందడర, నొ కాహ్‌క్వన రశించినడి. 


లీలామానువ విగవాుడైన కృష్ణ ne కక రోనము, తు 

వం సవనీంతములు. తాను భగవదవకతారుడైనను లోక సం(గవోర్థము 

శీ ముఊఈ us నెట్లు సత్కరింపవలెనో, బాల్యసఖు నెట్టు నంభావింప 

వలనో లోకము కొజ్ఞబంతి వలె నిరూఢము చేసినాడు. కుచేలుడు ' అంతిపురము 

Fికీ కోయి మరువా డుదయము కృష్ణుని వద్ద సెలవు తీసికొని పోవు వరకును 

కర్టితమైన ఘట్టము మధురాతి మధురము. పకరానావకు మాధవు డే ఆట్టి 
Cth! ఆబ్టి వాక్కులు పలుకగండు, అరల ఆతని పురమలో సమస్త సంపదలు సమకూడి్షి అతని శై యెదురు = 
కరుడు ను (తోవలో నున్న కుచేలున కా విషయము. తెలియదు. 

కృచేలోపాఖ్యానము . ర 155 


కారణము సంపదంధుడు భగవానుని విస్మరించననియ తలపోయుట ఆతని 
యదృష్టము నకు నసూచనయే. 


ఆపోపదేశము 1 వలన వివేకోదయమైనది. పర మేశ్యరానుగహము వలన 
నిజస్థితి అనగా ఐశ్వర్యము లభ్య మైనది. అప్పుడు భగవానుని యెడ భావము 
డృఢతమమగ ను. ఇంటికి జని కుదేలుడు సంపద ప సు 
భగవానుని యందే లగ్నము చేసి యుండెను. 


భూభారము హెచ్చి వసుంధర గోరూపధారిజియె (బ్రవ్మాదులను తరచుగా. 
(పార్థించినట్లు పురాణముల వలన తెలియుచున్నది. భూఖారమనగా జనబాహు 
భ్యము. |పాబీన కాలము నుండియు భరత వర్షమునకే కాక (ప్రపంచమునకే 
యిక్కట్టు తెచ్చు చున్నది. [పజ సంతాన నిరోధము చేసినగాని పం బాగు 
పడదు, లోకమునకు కుచేలత్వము తొలగదు. 


(ఆం|ధో మవోతాగవతోవన్యానమల, 19ల్‌7 ) 


* అ ఖః 


హరికిం బట్టపుదేవి పున్నెముల్మపో వర్థంవుంబెన్నిక్క చం 
దురుతో (బుట్టువు భారతీగిరిసుతల్‌ నోనాడుపూ(బో(డి తా 
మరలందుండెడి ముద్దరాలు జగ ముల్‌ మన్నించు నిల్లాలు భా 
సురతన్‌ లేములు వాపుతల్లి సిరి యిచ్చున్‌ నిత్యకల్యాణముల్‌ !!. 


పుట్టంబుక్లి శరంబునన్స్‌ మొలవ నంభోయానపా (తంబునన్‌ 

నెట్టంగల్లను గాళింగొల్వను బురాణింపం దొరంకొంటి మీ 

దె్టేవెంట రచింతు దత్సరణి నాకీవమ్మ ! భ్ఞాయమ్మ | మేల్‌. 
_పట్టున్‌ మానకుమమ్మ ! నమ్మి తి(జుమీ (వాహ్మీ | దయాంభోనిధీ ! | 


పోతన వ్య క్రితము 
ఆచార్య సి, నారాయణరెడ్డి 


బమ్మెర పోతన అనగానే భా" వతం గురొస్తుంది. భాగవతం ' అనగానే 
భ్‌ క్రితో తడిసిన గాథలు ఆలలు అలలుగా హైంగివస్తాయి- గజేంద్రమోక్షం, 
(పహ్హాదచరి[త, వామనచరి్యత, రుక్మిణీకల్యాణం, 'ఆంబరీషోపాఖ్యానం, ఆజా 
. మిళోపాఖ్యానం- ఇంచుమించుగా భాగవతంలోని ఉపాధ్యానాలన్నీ. ఈ భర్త 

. మణుల చరిత్రలను, ఏక|తితం చేసిన మూలసూత్రం వాసుదేవత త్వం. వ్యాసు “| 
నంతటివాడే వేదాలను వింగడించి, ఆషాదశష్పరాణాలను విరచించి, |బహ్మ 
సూతాలను [పవ వచించి, భార తాన్ని (పబంధీకరించి అప్పటికీ. మనస్సు నిండక 
“హరికీ యోగివరులకూ అభిలషితమైన భాగవతగాథ పలుకనై తినే అని ఖిన్ను 
.డైనాడు నారదబోధితుడై విష్ణకథాశిరోమణియెన భాగవతాన్ని ఎన్నుకున్నాడు. అ 
ఈ రకంగా తన ప కలిగిన ఆరకొరలను తీర్చుకున్నాడు. 


కల తెలుగుశే క er అసలై న కె సేత. ఆ 


యమ్మను ఆంతకుముందు చిటిపౌటి నగలతో సింగారించిన తెలుగుకవులు లేక 


పోలేకు. వారి వెన్నెలపదాలూ, తుమ్మెదపదాలూ, ఉయ్యాల: పాటలూ, నివాళి 
పాటలూ, ఏలలూ, జోలలూ పుడమితల్లి కడుపున కరిగిపోయి ఉంటాయి. దెకీ 
యుల మాటుమణిగి. ఉంటాయి. ప ఏ తాటాకులలోనో, రాగిరేకుల, 
త్యానికి తొలిసారిగా | కక కలిగించింది నా. ఆంచే. నేటి a 
భాషకు. పాదులు వేసిన వారు నన్న య్య- తిక్కన్న. ఎరన్నలే | భావకే కాదు 
తెలుగులో కావ్యరచనాశై నిని తీర్చిదిద్దింది కూడా ఈ మూ ర్రితయమే! చతుర్వేద 
సారమైన వ్యాసభారతం వారిచేతిలో వడి .కావ్యచిక్క_ణత్వాన్ని సంతరించుకులదె. 


. పద్యవిద్యకు ఆద్యుడై న వాల్మీకి రచించిన రామాయణం' భాస్కరాదుల ద్వారా | Us 


న వ పదం శ ఏంది. ఆ విధంగా భారతీయ సంస్కృతికి మూల కందా 


వారత, రామాయణాలు కర్రా శేశికందినని, 


పోతన వ్య కిత్యము fe” | 157, 


ఇక మిగిలింది వ్యాసభాగవతం. అప్పటికి దానిపై ఎవరిచూపూ పడనట్టుంది.' 
చూపు పడినా చేయిసాచే చొరవ ఏ కవి కీ కలుగనట్టుంది. ఇ మహాభాగవత భలం 
ఒక తెలుగు చిలుక కొరకు వేచి ఉంది. ఆ చిలుక తెలంగాణా నడిబొడ్డులో 
ఓరుగల్లు గడ్డలో బమ్మెర కొమ్మపై ఇప్పటికే వీరభ|దవిజయాన్ని వినిపించింది. 
భోగినీదండకాన్ని ఒక రాచవలరాచవాని చెవులకు రసికవాణిగా అందించింది. 
,ఆ శుకరాజే మన పోతరాజు. అ ““శుకమ థాసుధా[దవమున మొనసి యున్న” 
భాగవతఫల రసాస్వాదనం. తెలుగు రసిక భావవిదుల మహిత భాగ ధేయం. 


- వీరభ, దవిజయం రచించేనాట్‌కి పోతన్న పిన్నవాడు. పెక్కు సత్కృ 
తులు [వాయనివాడు. తన గురువై న ఇవటూరి సోమనారాధ్యుని, (పసాద మహి 
మచే ఆ కృతిని రచింపగలిగిన్నాడు. వీరభదవిజయం పోతన్న చేయనున్న 
సేద్యానికి తొలి' చాలు. సర్వజ్ఞసి: గభూపాలునికీ కానుక వెట్టిన భోగినీదండకం 
మలి చాలు. ఇకచాలు, ఆ Sa పోతన్న మనసు జు తిరిగింది. ఆటు 
. వీరశై వమతం మీదా ఇటు రసికరాజానుమతం మీదా దృష్టి తొలగింది. వ్యాసు 
నికి 'విష్ణకథ విరచించని కొరత తోచినట్రే మన సోతన్నకు “శ్రీమన్నారాయణ ॥ 

థా[పపః చ విరచనాకుతూహలం”' కుట్మలించింది. ఆది రాకానికాకాలం.. 
టం సమయం, గంగాహ్నానం, మ హేశ్యరధ్యానంం అదీ పోతన్న సీ స్థితి. 
కక చదల లిత లోచనుడై" ఉండగా రామభ్యదుని సాఇాల్కారం. మహాభాగ 
వతం. తెలుగు సేయుమని ఆనతి, వెరగుపడిన చితంతో పోతన్న అంగికృతి 
చ్మితం!, పోతన్నకు కలిగిందేమో 'విష్ణుకథా రచనా కుతూహలం. చేసిందేమో 
మహేశ్వరధ్యానం. క శైదుట నిలిచినవాడో - రామచం్యదుడు. ఆ మహానుభావుడు 
సూచించిన వస్తువో- గోవిందకథా కద:బమైన భాగవత్మగంథం. అంకితం తన 
పేరనే అన్నాతు ఆ రామరాజు: బానన్నాడు నున పోతరాజు. “శ్రీడామచందుని 
సన్నిధానంబు కల్పి.చుకొని, “హోరికి నందగోకుల విపోరికి అంటూ వష్ట్యంతా 
_లెత్తుకొని ఆ౦ధభాగవతాన్ని చిన్నిళ్ళష్ణువికి సమర్పించుకున్నాడు, రామన్నను 
కోతగా నిలుపుకొని భాగ వతగాథను విన్నవించుకున్నాడు. ఇది'చ్మితమా? కాదు, 
పోతన్న పెంపొందించుకున్న సమచి త్తం. శివుడు, కేశవుడు, 'రాముడు,కృష్ణుడు- 
ఈ నాలుగు మూర్తులకు ఏకత భజించడు పోతన్న అఆభేదభక్తికి తులలేని 
తార్యాణం. ఇంతటి .సనున్యయ దృక్పథం అప్పటి మత వాతానరణంలో 
అపూర్వం! : i గ 


158 భాగవత వైజయంతీక “| 


* వీ కథను ఎన్నుకోవాలి? ఏరుకున్న కథను ఎక్కడ ఎత్తుకోవాలి? ఆ 
వస్తువును స్‌ దృష్టితో వి సరీస్తున్నదీ ఎలా వివరించాలి? తన కవితా లశ్మ్యాలను . 
ఏ రకంగా సిద్ధాంతీక కించాలి? ఎ కవికైనా ఈ ఆవస్థ తప్పదు. కృత్యాద్యవద్థ . 
ఆంటే ఇదే. 


సరిగ్గా పోతన్న తిక్కన్న తెన్నునే అనుసరించినాడు. భాగవతావతారి , 
కను విరాటపర్వావతారికకు తోబుట్టువుగా తీర్చి దిద్దినాడు. తిక్కన్న లాగే తన 
వస్తువును తానే 'ఏరుకున్నాడు పోతన్న. తిక్కన్న భారత రచనా కౌతుకం 
కనబరిసే పోతన న్న శ్రీమన్నారాయణ కథా (పపంచ విరచనా కుతూహలం కన 
బరచినాడు. ఆతడు నిదించే సమయంలో ae కన్నట్ట టుగా హరిహరనాథుడు 
కనిపిసాడు. ఇతడు గంగాతీరంలో మహేశ్వఠ ధ్యానం చేస్తూ కన్ను లరమూసు 
కొని ఉండగా రామభ్యదు డగుపిసాడు “కరు ణారసము పొంగి తొర గెడు 
చాడ్పుని' అన్న. సీసపద్యంలో హరివరనాథుణ్ణి రూపు కట్టించినాడు తిక్కన్న. 
య మెరుగు చెంగట నున్న మేఘంబు కైవడి” అన్న సీసపద్యంలో సీతానాథుణ్ణి. 
చి తించినాడు పోతన్న. ఆతడు సర్వేశ్వరుడు. ఇతడు రాజముఖ్యుడు. అక్కడ 
హరిహరనాథుడు సెలవి విస్తాడు - తారతరచనా [ప్రయత్నం భవ్య పురుషార్థతరు. 
పక్వవరిమని. దానిని సోనకు కృతి యిమ్మని, ఇక్కడ రామభ దుడు అనతిస్తాడు- 
మహాభాగవతం తెనుగు సేయుమని. తన పేక ఆంకిత మిమ్మని. నామె. ఇత. 
వృత్తాన్ని స్వీక రించడం, నరేశ్వరుణ్ణి కాక సర్వేశ్వరుణ్ణి కృతిపతిగా నిర్ణయించడం |. 
తిక్కన్న పోతన్నలకున్న సమధర్మం. ఈ కృతులు రచించే నాటికి ఇద్దరి 
మనః పవృత్తుము ఎల్లలు లేని భ క్రిపరిత్తులు. భారత రచనం తిక్కన్న దృష్టిలో 
ఆరాధన విశేషం, భాగవత రచనం పోతన్న దృష్టిలో భవబంధ విమోచనం 


ఇక్కడే ఉంది పోతన్న అదృష్టం. చి త్తస్థితికి తగిన ఇతివృ త్ర తం దొరికింది, 
పరవశించి Ma 


పలికెడిది భ్లాగవతమ(ట; 
పలికించు విభుండు రామభ దుండ(ట; నేం. 
ఐలికిన భవహర మగునంట 
పలి కెద వేజొండు గాథ క నేలా? 


పోతన వ్య క్రిత్వము న జ 158 


నాలుగు పలుకులను [పాసస్థానంలో చిలికి తన పణ వెలార్చుకొన్నాడు. 
అయితే భాగవత రచన అంతంత మా; (తాన జరిగేది కాదు. ఈ సహజపాండిత్యు 
నికి అది తెలియదా ? అదీ విన్నవించుకొన్నాడ-- 


ఖ్‌ 


భాగవతము దెలిసి పలుకుట చితంబు 
శూలికైన( దమ్మి చూలికైన 
విబుధజనుల వలన విన్నంత కం 
తెలియవచ్చినంత లేటపటుతు. 


భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చితమట ! నిజమే. 
రామాయణం అలలా సాగిపోయే వ! కథ. భారతం భిన్నలౌకిక _పవృత్తుల 

సః ఘర్షణ వ్యధ. భాగవతం గూ లదృష్టికి కృష్ణలీలా శే పటిక, విమ్షభ కుల కథా 
వాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్య మధ్య ఎన్నెన్నో విప్పలేని. వేదాంత 
(గంథులున్న మహా గంథం. ఆ ముడులు విప్పడం హరునికీ విరించికీ దువ్క్మ 
రమే! మరి ఆ భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలె. భారం అత 
నిపై వేసి వ్యాస భాగవత వ్యాఖ్యాత అయిన (శ్రీధరుజ్జి ఆలంబనం. చేసుకొని 
తెలియవచ్చినంత తేటపరచినాడు- ఈ వినయశీలుడు. ఈ తేటపరచడం ఏ 
తెలుగులో? నన్నయ [పారంభించిన తత్సమపద బహుళ మైన తెలుగులోనా+ లేక 
పోలకురికి సోమన్న (పఘోషించిన జాను తెనుగులోనా [| పోతన్న సాత్వికత 
అహంతలకూ వింతవింత "నరక అతీత మైనది. 


ణ్‌ 
_ కొందథికి. దెకుగు గుణమగు.6; 


 గొందజికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌ 
_ గొందజికి గుణములగు; నే 

_ = నందటి మెప్పింతు, గృతుల నయ్యె యెడలన్‌. 

' కొందరికి తెనుగు గుణమట, ఇందులో పరోక్షంగా పాలకురికి, పత్యక్షంగా 
తిక్కన్న కనిపిస్తున్నారు. కొందరికి సంస్కృతం గుణమట. ఇందులో సుదూ 
_ రంగా నన్నయ్య, సమీపంగా శ్రీనాథుడు ఏనిపిస్తున్నారు. ఈ పద్యమే పోతన్న 
సత్వమూ రికి ఆద్బం పట్టింది. “ఆయా సందర్భాలను బట్టి అందరినీ మెప్పిస్తాను' 
అన్న మాటలో వినయం ఎంత మెతగా ఉందో, విశ్వాసం ఆంత ఒత్తుగా ఉంది. 
భాగవతం చదివితే తెలుస్తుంది ఆతని సంస్కృత గుణం; అచ్చ తెనుగుతనం. 


160 భాగవత వైజయంతీక 


నన్నయాదులు భారతాన్ని ఆం] ధీకరించినారు. భాస్కర రంగనాథాదులు 
రామాయణాన్ని కండించినారు. నాచన సోమన, మారన వంటివారు పురాణాలను 
అనువది=చినారు. విరెవ్యరూ తన పురాకృత శు భాధిక్యం వల్ల భాగ వతాన్ని 
తెనిగించలేదు. దీనిని తెనిగించి పునర్జన్మ లేకండా తన జన్మను సఫలం చేసు 
కుంటానవి ఇఆక్తాంశ్నించినాదు పోతన్న. “వేయి నిగమాలు చదివినా సుగమం 
కాని ముక్తి భాగవతనిగమం పఠిస్తే అత్యంత సుగమం" అని విశ్వసించినాడు. 
ఆము క్రవాంఛే భాగవత రచనకు మూలం, మొట్ట మొదటి భధమ. ఆ ఆశయా. 
నికి డిద్దిన ముఖతీలకం. 


శ్రీకై వల్యప వంబు( జేరుటకునై చీంతించెదన్‌ లోకర 
శైకారంభకు, భ కపాలన కళా సంరంథకున్‌, దానవో. 

దేక స సంభకు గేశిలోల టూ సంభూతనా 

నా కంజాత భవాండకుంభకు, మవోనందాంగనా డింభకున్‌. 


ఇది నాందీళ్లోకం వంటి పద్యం, ఆశీ కృమస్కి యావస్తుని ర్లేశాలలోని ఒక 
అజ ఇం నిశేపించడం దీని లక్ష్యం. “శ్రీవాణీ గిరిజాశ్చిరాయ ' అని న న్నయ: 
_ అన్నాడు, ““శక్రీయన గొరినా బరగ”ో అని తిక్కన అన్నాడు. “అత వల్య 
పదంబును పోతన్న [పస్రావించినాడ్తు. - ఈ పద్యంలో నమస్కి యతో పొటు. 
వస్తుని ర్రాళంకూడా ఉండడం విశేషం. భాగవత కధానాయకుతు నందనీందనుడు. 


అత sins లోకరక్షణం ఆ అవతారానికి |పేరణం.. "అతడు... 


గజేం|దాది థ్‌ కులను 'హాలించినవాతు. హెరణ్యకశిపు (పభృతి దానవుల ఉదే 
న సంభింపజేసినవాడు. ఈ రెండు ఆంకాలు శ్రీమన్నారాయణుని శిష్ట | 
రక్షణకూ. దుష్టశిక్షణ కూ మ భాగవత కథాచ కరి ఈ రెండు 
ఆంకాల చునే చర్మకమించింది. ఈ రకంగా. పోతన్న పైపద్యంలోని | సౌద 
చ్రతువకంలో భాగవతంలోని పన్నెండు స్కంధాల పరమార్థాన్ని నిర్దేశించినాడు. 
మరొక విశేషం, ఈ పద్యంలోని నందాంగనాడింభకుడు కేవల స్థితికారురే కాదు. 
సృష్టికారుడు కూడా. ““కేశిలోల విలసద్ద్భగ్గాల సంభూత నానా కంజాతభవాండ 
కు౭భకు'' అనే [పయోగంలో ఆది ధ్వసించింది. “'దానవ్నోదేకస్త సంభకు”” అనే 
మాటలో అతని లయకారత్వం స. అంటే ఈ య నండింపబడిన 
పర మాత్కుడు as 


పోతన వ్య క్రిత్వము me 181 


అవతారికలోని రచనాలక్ష్యాన్ని పరికించినా, నాందీ పద్యాన్ని పరిశీలించినా 


ల 


పోతన్న ధ్యేయం కై వల్యమేనని "బోధపడుతుంది. భవబంధం రాహిత్యం. జన 


నా 


న 
సాఫల్యం “ఆ కైవల్యం వల్లనే సాధ్యం, ఆ చవల్యం పోతన్న వాంఛించిన. పరమ 


పదం; పురాజన్మతపఃవలం. ఈ కై వల్యకాంక్ష [ప పవృ తికా భాసించే నివ 
భాగవతంలోని (పధాన రసమైన భక్తికి ఆదిలోనే ఎత్తిన వై జయంతిక. 


ఇంచుమించుగా సమకాలీనులై న శ్రీనాథ పోతనామాత్యుల వ్యకి కిత్యాల 
వాసి ఇక్కడే ఉంది. శ్రీనాథుడు శృంగారిగా పంత వ్యాపృతుడైనా “*ఈశ్వ 
రార్బనక శాశీలుండ ననే చెప్పుకున్నాడు. భోగినీ. దండకం వంటి పరమ 
_ శృంగారకృతి రచించినా పోతన్న మహాభ క్తుడుగానే 'పేరొందినాడు. కాశీఖండం, 
. భీమఖండం, హరవిలాసం, శివరాతి మావోత్మ్యం వంటి భ కే (ప్రబంధాలు 
(వాసినా నై షధంలోని ర _క్రివల్లనూ, చాటుపద్యాలలోని శృంగార(పస కి క్రివల్లనూ 
శ్రీనాథుడు. శృంగార సనాథుడుగా శ 'సిరపడినాడు. రుక్మి బీకల్యాణం, రాస్యకీడాభి 
వర్ణనం వంటి ఘట్టాలలో ఎంతటి కృంగారదంతురితాలై న వర్ణనలు చేసినా 
పోతన్న తెబుగుల పుణ్య పేటిగానే కీ ఎంపబడుతున్నాడు. ఇందుకు ఒక కారళకా౨-. 
కాలం గడిచినకొద్దీ వీరిచుట్టూ అల్లుకున్న కథలు... మరొక కారణం- కావ్యావ 
తారిక ల్లో వీరి వ్య కిత్వాలు వేసుకున్న ము[దలు. శ్రీనాథుని కృ ఎ్రతులన్నీ నరాం 
కు. అతని జీవితంలోని ఉజ్జ్వలఘట్టాలన్నీ రాచకొలువుకే సమర్పితాలు. ' 
పవైడు వరిమెతుకులు, గుక్కెడు మంచినీళ్లు పుట్టని దుర్షళలో కూడా ఆ రాజస 
మూ రి ఆటు కృష్ణుణ్జా, ఇటు శివుజ్హ దుయ్యబబ్దనాడు. ఇరవై సంవత్సారాలు 
' కొండవీటిలో విద్యాధికారిగా ఒక వెలుగు వెలిగి అంతటితో యళోభిలావ సన్నగిల్లక - 
ఎక్కడో. కర్ణాటదాయల కొలువులో నిక్కి పడే గౌడ కిండిమభట్టును as 
వివాద[పొఢితో ఓడించి, అతని: కంచే ఢక్కను పగులగొట్టించి రాయల 
గారంలో స్వర్ణ స్నానం చేయించుకునే దాకా తృ. పిపడని మతళహంకృ్ఫతి ఆతనిది. 
దిక్కూ మొక్కూ లేని ఆవసానదళలో, దివిజ కపివరుల గుండెలు దిగ్గురనెటట్టు 
కడడొపిీరిలో గూడ కవిత లల్రగలిగిన (పౌఢవ్య క్రిత్వం ఆతనిడి. మరి పోతన్న 
వ్య క్రిత్వం ఇందుకు భిన్నం. . అతడు య. కొలువలేను; సిరులకె 
'పకటించలేదు. 


ఉరుకులాడలేదు; అధికారాన్ని ' ఆశించలేదు; అహంకారాన్ని వ 


HH; 


162 భాగవత వైజయంతిక 
పూర్వకవులతోపాటు వర్తమాన క భావిక వులను గూడా బహూకరిం 
చిన వినయభూవణు డతడు. సమకాలీనకవులను సంఖావించడమే ఒక విశేషం. 
పుట్టని స జేకొట్టడం మ. సహన లకక నిదర్శనం. 


ఆవతారిక దృష్టాానే కొక భాగవత కథల్లో, ఉపాఖ్యానాల్లో పోతన్న 
మూలాతిరి కంగా పెంచిన పట్టులను బట్టీ, పేర్చిన Se స్య బట్టీ అతని సత్య 
రమణీయమూ రి రి సాక్షాత్కరిస్తుంది. గజం, (దుని యు. (పహ్హాదుని 
నిశ్చాయంలో,. గోపికల ఉద్వేగంలో, మ. డ్‌ po ఇవేకాక నవవిధ 
శి కింితల బహుముఖివికాసంలో భ_క్రికన తరంగితమైన పోతన్న చి త్తనృత్తి తి పలు 
విధాల [పస్ఫుటమవుతుంది.. వ్యాసభగ వానుని ని భాగవతకోళాని న్ని సె 'సెతం క్షణకాలం 
మరచిపోయి ఆయా భాగవతుల (శవణకీ ర్త రనలకు తోనై ఆ పాతలన్నీ తా నె 
పరవశించి పద్యసంఖ్యను పెంచి | పతిభాశిఖిశాల పె భాసింలెక సన్ని వేశాలు ఆం|ధ 
భాగవతంలో కోకొల్లలు. . ఆందుకే ఆంటున్నాను- ఆవతారికలోనే కాక ఆం(ధ 
భాగవతంలో గూడా అడుగడుగున పోతన్న సాత్విక చిత్తవృత్తి, భ_క్తిభావనా 
పవృ త్తి వేయి రేకులతో విప్పారినవని. | 


నవవిధ భక్తులను కథాత్మకంగా ప్రపంచించిన [పథమ [గంథం వ్యాస 
భాగవతం. ఆ భక్తిరన ఘట్టాలను ఇంతకు రెండింతలుగా వి సరించి తొలిసారిగా 
మధురభ కక్రికి పచ్చలతురాయిని కూర్చిన తలుగు కావ్యం పోతన్న. భాగవతం. 
నవవిధభకుల్లో- [శవణం, | కీర్తనం, స్మరణం, పాదసేవనం, ఆర్చనం,,. 
వదనం, దాస్యం, ఆత్మనివేదనం. ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. 
సఖ్యం మాతం వీటికంచి' భిన్నత త్యం. కలది. . రుక్మిణికీ శ్రీకృష్ణునిపబల్ల గల 
క క్రికీ భ క్రికీ నేపథ్యం ఆత్మనివేదనం. "అర్చన వందన స్మరణాదులు ఆ ఆత్మా. 
కణంలో న నుంచి ఉదయించిన రేఖలు... కుచేలు డున్నాడు; అర్జును చున్నాడు, 
ఏశ్ళది (ప్రధానంగా సఖ్యభ క్రి కి ఆనుషంగిక౭గా ఆ సఖ్యం చుట్టూ స్మరోణవందన 
పాదసేవనాదులు పరివేషించక పోలేదు. మరి మధురభ కి కికి మూలమేది? 
వాత్మ పరమాత్మల వియోగం. అఖండ పరమాత్మ నుండి ఖండళః ఆంఠతః 
ఏడివడిన జీవాత్మలు ఆ మూలాత్మను. కలుసుకోవాలనే తపనయె భగవదతి 
గావనకు (పాతివడిక. (తేకాయగంలో మునులు, ద్వాపరయుగంలో గోపికలు 
bois సంత ప్తె న ee Se ష్‌ ఇళ్లూ, 


పోతన వ్య క్రిత్యము 168 


వాకిట్టా . ఉన్నాయి. కొందరికి ,పతులూ, సుతులూ ఉన్నారు, అయినా శారద. 
యామినిలో యము నాతీరంలో బృందావనిలో గోపాలుని మురశీగానం ఆలకించ 
గానే ఆన్నీ మరచి పరుగులు తీస్తారు. బృందావని చేరుకొని నందకికోరుణ్ణి కానక 
రసోన్మాదంలో ఎలుగె త్రి పిలుస్తారు. ఆ మోహనమూ రిని పదేపదే స్మరించుకొని 
ఇలా ఆ కందిసారు- 


'నల్దనివాడు పద్మనయనంబులవాండు కృషారసంబు పై 
జ ల్రెడువాండు మౌళిపరిసర్పిత పింఛ మువా(డు నవ్వురా 
జిల్లెడు మోమువా( డొక (డు చెల్వల మానధనంబు న 

మల్రియలార! మీ పొదల మాటున లేతు గదమ్మ! చెప్పరే.. 


ప ఆ మాధవుడు, ఆ గోపికామనోభవుడు' తళుక్కున మెరుసాడు' 
' అంతలోనే. అంతర్హి తుడొతాడు. కతు గోపికల వియోగ. 'విధుర హృదయాలు 
ఇలా సం|భమిస్తాయి - 


ఆదె నందనందనుం డంతర్హి తుండయ్యె( 
బాటలీతరులార! పట్టరమ్మ! F 
_హేలావతులం గృష్ష! యేల పాసితి వని =. ee 
యెలేయలత రార! యడుగరమ్మ! 
వనశాకు( డిచటికి వచ్చి డాయగ(డు గదా 
_. చూతమంజరులార! చూడరమ్మ! 
మానినీమదనుతో మారాక యెటీ(గించి 
మాధవీలతలార! మనుపరమ్మ' 
వ బాయ నీతియె హరి కని 
శాతులార! దిశల( జాటరమ్మ! 
కదళులార! పోయి: కదలించి శిఖిపింఛ 
జూటు( దెచ్చి కరుణ, జూపరమ్మ! 


“సమస్త చరాచర జీవకోటికి అధినాథుడు మాధవుడు. ఆ మాధవుడే తమ ధవుడని 
(భమించినారు గోపికలు. ఆ (భమావరణమే వారి మనస్సుల మీద మోహయవని 
కలను కప్పింది. వ్‌ ముగ్గ పవృ తే మధుర భ కీకి మూలం. ఈ వధుర ఖభ క్రిని 
రాస కీడాది వర్షనంలో హృదయంగ మంగా చితించినాడు పోతన్న. 


164 భాగవత వై జయంతిక 


లోకంలో భ క్ర కవులు పలువురున్నారు. వారందరు |పజాకవులు" కాలేరు. 
ఒక తుకారాం, ఒక సూరదాసు, ఒక కబీరు, ఒక పోతన్న [పజాకవులుగా 
(పాచుర్యం పొందిన భ కకవులు. మరి (పజాకవి ఎవడు ? సామాన్య (పజల 
జీవిత సమస్యలను చి(తించేవాడు. ఇదీ వాగా. వాడుకలో ఉన్న అభి పాయం. 
ఈ దృష్టితో. హే పోతన [పజాకవి కాలేడు. అతడు (పజల దై దెనందిన జీవిత 
సమస్యలకు బొమ్మకట్టి చూపలేదు. భాగవతుల భ క్రిభావ పరంపరకు శ్రుతులు 
కూర్చి కృతులు అల్బుకున్నాడు. -ఆ భాగవతుల్లో (పహ్హాదుని వంటి ' ఆజన్మ 
జ్ఞానులు ఉన్నారు, గజేందుని వంటి ఆర్థజ్ఞాను లున్నారు. కుచేలుని వంటి ఆర్థిక 
దుర్గ శాపరిపీడితు లున్నారు. . ఈ భర్తల స్థితిగతులు వేరైనా, వారీ వ 
సంస్కారమళులు వేరైనా ఆందరిసీ "కలిపికుచ్రే. మూలసూ తం ఒకటుంది... 
అదే ఆరి. అది కీవాత్మలు పరమాత్మకు నివేదించుకునే అలౌకికమైన ఆరి, 
భకస రమైన ఈ అఆ .ర్రిని సాఠ్యకాలీన సామాన్య పజల ఆ ర్తిగా చితించడం | 
వల్లనే భ క్ర కవియెన $ పోతన్న 1పజాకవి యెనాడు. 


. . “కలడు కలండనెడు వా(డు కల(డో లేడో | అటో ఆందోశించినవాడు 
కరిరాజ్షే కానక్క_రలేదు; ', ఏ మూగజీవికైనా నా ఇదీ చెల్లుతుంది. ““ఇందు 6 గల. 
డందులే(డని సందేహము వలదు... ఇది' ది ఏ పప్షోదభాషితమో కానక్కరలేదు. 
జ దృఢ సంకల్పునికై నా ఇది సరిపోతుంది. '“ఊరకరారు మహాత్ములు” 
దిన్ని ఏ గర్గమునికో ముడి వెట్టనక్కర లేదు; ఇప్పటికీ ఏ మహానుభావుని రాక 
. తైనా ఇది వ ర్రిసుంది. ““ఎందతో మహానుభావులు” అన్నంత వ్యాపి పి పొందిన 
సూక్తి ఇది. "అయితే ఈ సూక్తి సహజ గాంభీర్యాన్ని కాస్తా వదలుకొని కాలం 
గడిచిన కొద్దీ ఛలోక్తిగా మారడం :కూడా జరిగిండి. త్త. సామెతల కోవలో 

చేరిందన్నమాట. | 
ఓక కవి రచించిన ప పద్యపాదాలు సామెతలుగా, లోతోక్తులుగా చెలామణి 
కావడం కంటె ఆ కవికి అంతకు మించిన ప్రాచుర్యం ఏముండి? ఇలా లెక్కించు 

కుంటూపోతే. పోతన్న వందలాది ' పద్యాల్లోంచి. వేలకొద్ది పాదాలను ఉదాహదించ 
వలసి వస్తుంది. (పారీనాం[త్ర కవులలో బహుళంగా ' ఉదాహరింపబడుతు న్న 
వాళ్లల్లో ఇద్దరే ఇద్దరిని చెప్పుకోవాలి. ఒకడు. పోతన్న. మరొళడు, వేమన్న 
జేవున్న ఆ అక్షరాలా జ కః అయధం. సంఘ సంస్క్హరణం 


పోతన వ్యక్తిత్వము : వ. . 165 


ఆతని లక్ష్యం. ఆతని _పతిపద్యం జల Se టి పజల 
భాషలో (పజల సమస్యలను చితికపట్టి వేమన్న [పజాకవి మై యెనాడు. బమ్మెరకు 
వెళ్ళి అక్కడి పొలాల నడిగితే చెబుతాయి ఇదిగో! ఇది పోతన్న గుడి! అదిగో! 
అది మల్లన్న మడి! అని. పోతన్న గుడి నిజంగా గుడికాదు. పాతుకొని ఉన్న 
కిక రాతిపలక.. ఆ రాతి పలకను పోతన్న [పతిరూపంగా నేటికి అక్కడి పల్లీ 
యులు భావించుకుంటున్నారంటే ఇప్పటికీ పోతన్న ఎంత సజీవంగా ఉన్నాడో. 


ఊహించుకోవచ్చు. మరి వ్‌. మడి మాటేమిటి ? ఈ పోతన్న కొడుకైన 
రైతన్న వ. పొౌలమది. 


కవితాకేదారోన్ని పండించిన హాలికుడుగా అన్ని వేళలా శలచుకోవడానికి 
'అనువై న పద్యఖండాలను అందించిన ఆదర్శ మానవుడుగా పోతన్న చిరంజీని. 
భావికవులను బహూకరించిన ఆ పరమ భాగవతునికి తప్ప అంతంత మ్మాతం 
వానికి ఉంటుందా ఇంతటి సముజ్జ్వ్యల భావి. ఎప్పుడో పొట్టి వడుగై న వామన. 
మూ ర ఇంత్రై ఆంతే అంతంత మూడు లోకాలను ఆకమించినట్లు- ఎక్కడో 
'బమ్మెరవంటి 5 చిట్టూరిలో పుట్టిన న పోతన్న మూడు కోలాలను ఆకట్టుకునే అమృత 
కృతులను నిర్మించగలిగినాడు. 


భాగవతాన్ని తెనిగించి పోతన్న తన జన్మను సభలు చేసుకొన్నాడు: ఆ 
భాగవత పద్యాలను పఠించి తెలుగు (పజలు తమ జీవితాలనే పండించుకున్నారు. 


(వికానలవారి, 1978) 


వరగోవింద కథా సుధారస మహావర్షోరుధారాపరం 
పరలంగాక బుధేందచం[ద+! యితరోప్తాయానుర క్రిన్‌ |బవి 
'_స్తరదుద్దాంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దు. 
స్తరగంఫీర కఠోరకల్మవకన ద్ధావానలం బా అునే !' 


సహజవాండిత్యుల వారి సరదాలు 
. స్రీ ఆరు(ద 


"కొంతమంది కవులకు కొన్ని పదాలు ఎలాగ ఊతపదాలు అవుతాయో 
ఆలాగే కొన్ని ఉపమానాలు కూడా విరివిగా వాడేవి అవుతాయి. మందార 
మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు” అనే ఖావం 
పోతరాజు గారికి చాలా యష్టం. దీనిని ఆయన పాల్కురికి సోమనాధుని రచన 
నుండి (గ్రహించారు. చిన్నప్పుడు పాల్కురికి సోమనాధుని రచనలు బాగా చదువు 
కొన్న పోతరాజు గారికి ఇవి చక్కగా _ఒంటపట్టాయి. యౌవనంలో [వాసీన , 
భోగినీ దంచ రంల ల ఛావాలను పలాల? గారు ఇలా చెప్పారు - 


క సింగభూపాలుపై (వాలి నాచి త మున్మ త తమై సోలి కామాశలాయ త్తమె 
me తేరాదు నే నా మరుండై న గాకీవరుండై స్రీ వాణీధవుండై న దేవో తరుండై న 
నన్యున్‌ మదిం గోడ్డగా 'నొల్లనే ? ఉల్పసత్చుల్ల మందారరా. జ: ్మరందంబునుం 
(గోలు మతా? దుత్తూరముం (గోలునే ? హేమ రాజీవ రాజీరజోరాబితా కాశ 
గంగానదీలోల కల్లోల డోలానట[దాజ హంసంబు 3 వాలగండూపదీ భేక భేకీ 
ఢులీ సంకులాసారకాసారముం జేరునే ? మండితా న శ్రీమాత నిరకత్స 
యోధారలన్‌ [దావు _సారంగి కుంభాంత రాంభః [పపూరంబులన్‌ దావునే (an 
'మాధవోజ్జాత చూతాం కురస్వాదులీలా ౨సత్కోకిలేం్యదంబు క రాకలలా 
తకీ కాఖకన్‌ జా రి? | 

ఇవే భావాలు భాగవతంలో చాలాసార్లు దొర్దాలు. చూడండి 

హరినామాంకిత సత్కథామృతరస వ్యాలోల్నుడై నట్టి స 

త్పురువ శేష్టు డసత్కథా 'అవణవా[పూరంబు, దా( (గోలునే 

వరమందార మరంద. పానకుతుకస్వాంతద్విరేవంబు స స 

త్వరమై = చే(తివేములకు. న న య 


'సహజపాండిత్యుల వారి సరదాలు 187 


కాన సరోజలోచను జగత్‌ స్రవనీయ కథా సుధారసం 

_ బానిన యట్టి జిహ్వా యిత్తరానుకథాలవణోదకంబులం 
బానము సేయం జూచునె సుపర్యమహేజ మరొందపానశో 
భానయశాలి యైన మధుప|పభు* డేగునె వే(పచెట్టకున్‌, (8.448) 


. పూని భవత్సదాంబురుహమూలని వాసులమైన మెము మే - 
ధానిధి ! నీ విలోకనము( దక్కంగ నన్యముం గోరనే రమే 

ల సిత పారిజాతకుసుమస్సుట నవ్య మరందగంధ కో 
. భానయకాలి యైన మధుపంబు భజించునె న (4. 927) 


మందారమ కరంద మాధుర్యమున న( దేలు 
మధుపంబు వోవునే మదనములకు 

నిర్మల మందాకినీ వీచికల( దూంగు 
రాయంచ సనునె తరంగిణులకు 

"లరితరసొల పల్పవథాదియై చొక్కు. 

తోపులు సేదనే | కుటజములకు( 

బూర్దేందు చం] దికాస్ఫురిత చకోరకం 
ఖరుగునే సౌం్యదనీహారములకు =. 


నంబుజోదర దివ్యపాదార వింద 

చింతనామృత పాన విశేషమత 

చిత్ర మేరీతి సితరంబు( జేరనేర్చ 

వినుత' గుణశీల ! మాటలు వేయునేల ! (7.150) 


నను బాణి గహణం బొనర్చితి కదా నా భ రవున్‌ సీవ; దె 
వనియోగం బిడీ తప్ప దప్పురుషతాపాక్యంబు సిద్ధంబు ; సౌ 

_ ఖ్యనివాసున్‌ నిను( జేరునా(టడి' పరుం Tobe నేర్చునే ; 
వనజం బానెడి తె యన పక నావా నం బమహేక్షించునే ! (9. ర్‌లి0) 


సిరికి Bess సేయ భవచ్చర ణారవిందముల్‌ 
సరసిజనే[త | మూ తపము సంపడ( జేరితి మెట్ట కేలకున్‌ 


జ 


168 ను 1 భాగవత వైజయంతిక 
మరల(గలేము, మా మగజ నూటల నొల్లము ; పద్మగంధముల్‌ 
మరగిన తేంటు అన్యకుసుమంబుల చెంతల( జరు. | (10. la 998) 


పోత్సరాజుగారి (పసిద్ధమైన పద్యాలలో ““స్పిర్రికిం జెప్పండు కంగచ క్ర 
యుగముం జేదోయి. సంధింపండు '”(రి. 08) అనేదీ, '“తనవెంటన్‌ సిరి లచ్చివెంట 
_ నవరోధ్యవాతమున్‌” (8.86) అనేదీ చాలా ముఖ్యమైనవి. భకులను రత్చీంచడా 
నికి ఎవరికీ చెప్పక: ండౌ విష్ణువు బయలుదేరితే భార్య, పరివారం ఆనుసరించారని 
ఈ అస్టమస్కంధంలో గజేందమోక్షణంలోనే కాక ముందుగా వరు 
స్కంధంలోనూ వ్రాశారు. 


సనకసనందనాదులు విష్ణువును సేవించుకొనడానికి వచ్చారు. వాళ్ళకు 
జయవిజయులు. “ఇప్పుడు అవకాశం దొరక” దన్నారు. అడ్డగించారు. మునులు 
ఘర్షణపడ్డారు... శపించారు. ఆ కలకలం లోపల నున్న.. హరి ఆలకించాడు. 
శ్రీదేవితో సరసాలాపవినోద సౌఖ్య రచనలు చేస్తున్న వాడు, వాటిని చాలించి 
వ. మా ణిక్యగేహళులు గడచి వెళ్లాడు. ఆతని వెంట “శరనిధి 
కన్యకామణియు సం| భమ మొప్పగ' తోడు వెళ్ళింది. ఆమె వెంట అచ్చరలు 
మ. వాళ్ల తరువాత పక్షీం[దుడు కూడ ఉన్నాడు. “వై నతేయాంసవిన్య స్త 
మహ_స్తకలిత కేయూరవలయ కంకణము లొప్ప' ఆని పోతరాజుగారు వర్షిం. 
చారు. జయవీజయులకు కొపం ఇస్తున్న సనకసనందనాదుక వద్దకు వెళ్ళిన 
శ్రీహరిని పోత్రరాజుగారు ర్‌ గద్యపద్యాలలో (8. 588-540) వర్ణించారు. ఈ. 
దృకాాన్నే వారు సంక్షి ప్ర పం చేసి “తన వెంటన్‌ సిరి లచ్చి వెంట” అనే ౬కే 
ఒక పద్యంలో తరువాత చెప్పారు. 


'దళమస్కంధంలో శ్రీకృష్ణుని వెతుక్కు.ంటున్న గోపికల చేశ పోతరాజు 
గారు చెప్పించిన, పద్యం వినని తెలుగువాడు. దేశంలో ఉండడు. చూడండి అది- 
నల్పనివాండు పద్మనయనంబులవాండు కృపారసంబు వై పెట. 

స్ట జల్రెడువాండు మౌళి పరిసర్నిత పింఛమువా(డు నవ్వురా య. 

జిల్లెడు మోము వా( డొక(డు చెల్వుల మానధనంబు దెచ్చె నో 

మల్టియలార ! వ పౌదలమాటున లేడు వ మ [నన 


CE Ce (10-1-1018) - 


సహజపాండిత్యుల. వారి సరదాలు | 169. 
అముతే ఇటువంటి పద్యాలే టు గారు. నవమస్కృంధంలోనూ వాకాడు. 
అక్కడ రానుజ్జి వర్ణిస్తూ ఇవే “మాటలు హతే చూడండి 


ఈ. 


నలనివా(డు సన తల మవాశుగంబులున్‌ 

విల్లును దాల్చువాండు( గడు ఏప్పగు వక్షమువా(డు మేలు పె. 

'జల్లెడు వా(డు' నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులం 
జల్లెడువా(డు నె న రఘుస త తము డిచ్చుత మా కఖీష్టముల్‌ ! (9 స. 


. వా స్తవానికి పోతరాజు గారి దృష్టిలో ms కృష్ణుడన్నా లేడా 
లేదు. రాము డా దేశించి [వాయమన్న పు పుస్తకాన్ని పారంభిస్తూ శ్రీకృష్ణుని 
. నందొంగనా డింభకుని ప్రార్థించారు. నా కృష్ణ పరంగా |వాకారు. మిగతా 
కవులంతా షష్ట్యంతాలు కంద పద్యాలలో వాస్తే పోతరాజుగారు ఉత్పలమాలలు 
గట్టి పూజించారు. (పతి పద్యంలోనూ అంత్యాను పాస హాయిగా వాడారు. కృష్ణ 
సుతిలో వాడిన అను పాసను రామకథ చెప్పడంలో విరివిగా వాడారు. నవమ 
స్కంధంలో వారు. 258 నుంచి 862 దాకా శ్రీరామ చరిత [వాశారు. అంటే 
105 గద్యపద్యాలు. వీటిలో అనుపాసలు తెగ వాడారు.. చిట్టచివర ఇలా, 
(వాళారు- 

మంతనముణ సద్గతులకు(. 

 బొంతనములు ఘనములై న పుణ్యముల కిదా' 

_ 'వింతన పూర్వమవోాఘని' 
కృంతనములు రామనామ కృతి చింతనముల్‌. (9-868) 
ఇటువంటి పద్యమే రుక్మిణీ కల్యాణం. (పారంభిస్తూ చెప్పారు 


భూషణములు సెవులకు, బుధ క లా 
తోవణము; లనేక్త జన్మదురితౌఘ విని : 

కోషణములు, మంగళ తర స స్మా 
ఘోషమణములు, గరుడగ మును గుణథాషణముల్‌. . 


పోతరాజు గారి దృష్టిలో శ్రీరామనికీ, శ్రీకృవ్ణనిక తేడా లేదు. స్య 
ఇటువంటి సంవాధరచనలు సాధ్యమైనాయ. అయితే రశమస్కంధంలోని “నల్లని 
వాడు” అనే పద్యమే ఎక్కువ |పచారం ఆయింది, | 


హోతరాజు గారి భాగవతంలోని వివిధ ఘట్టాలలోని కొన్ని పద్యాలు మన 
జాతి జీవనంలో కలిసిపోయాయి, ఎవరైనా అపురూపంగా మన యింటికి వస్తే 
“ఊర కరారు మహాత్ములు” అంటాం. ఇది పోతరాజు గారి పద్యపాదం. దశమ 
స్కంధంలో బలరామ కృష్ణులకు సంస్కారం చేసి నామకరణం కావించడానికి 
గర్గుడ మందకు వెడతాడు. అప్పుడు నందుడు తగిన ores చేసి ఇలా 


ఆంటాడతు. 


ఊరక రారు మహాత్ములు; 
వా రధముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం 

 గారణము మంగళములకు; | 
నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా ! (10-1-284) 


ఈ పద్యంలోని తొలిపాదం తెలుగువాళ్ళ సంభాషణలో ఓక చక్కని వాక్యంగా 
నిలిచిపోయింది. ఇటువంటిదే “మాట తిరుగలేరు మానధనులు"”” అనేది. ఇది 
అష్టమ స్కంధరిలోని వామనావతార ఘట్టం లోనిది. ప బలిచ|క 
వర్తి క్‌ స రి పద్యం చూడండి. 


[బతుక వచ్చు. గాక బహుబలధనములై న 

వచ్చు. గాక లేమి వచ్చు గాక 

జీవధనమలై న న జెడు( గాక పడుగాక సంత ఇ 

' మాట దిరగలేరు మానధనులు. : (8-602) 

బలిచ|క్రవ ర్తి రి ఈ మాట అనడానికీ రెచ్చగొట్టిన వ|కాచార్యుని Cia: 
దేశం కూడా చాలా దేసిద్ధమెనదే. చూడండి. 


వారిజాకులందు వె వై వాహికములందు( 
. (ద్రాణ వితమాన 'భంగమండు( 
జకిత గోకుల్మాగ. జన్మర క్షణ మందు 
వకు నఘము 'వొంది దధిప ! ల్‌ (8. 659). 


ఇలాగే ““ప పృథివి నధిపులు. నూతన [పియలు గారో ఆనేది కు 
సిద్ధమే. ఇది (కముకగితళోనిన (10.1. 1488). ఇదేభావం . “ోనర్రవరు. 


నహజపాండిత్యుల వారి సరదాలు = | 171 


. లోయమ్మ నూతన |పియులు గదే” (10.1.1221) అన్న సం క్రిలో కూడా 
ఊంది పోతరాజుగారి పద్యాలలో (ప్రచారం పోందిన మిగతావన్నీ ఒక ఎత్తు. 
ఈక్రింది కందపద్యం ఒక్కటీ ఒక ఎత్తు.. 


నీ పాదకమల సేవయ 

సీ పాదార్చకులతో డి నెయ్యమును నితాం 
తాపార భూతదయయును న 
దాపసేమందార ! నాకుదయసేయం గదే! (10.1118) 


ఇది కంసవధ కోసం మధురకు వెళ్ళిన బలరామకృష్ణులకు మాలికుడు దండ 
యిచ్చిన మ్లట్టంలోనిది. తమకు పూలహారం ఇచ్చిన మాలికుణ్ణి 'నీకేమి వరం 
, కావా'లంటే అతడు పె పద్యంలోని కోరక కోరుతాడు. ఇది పోతరాజు గారి 
వ్య కిగత ప్రార్థన కూడా కావచ్చు. 


హోౌతరాజు గారికి చాలా ఇష్టమైన అంత్యాను పాస భాగవతంలోనే తన 
విశ్వరూప (ప్రదర్శనం చేస్తుంది. శః ఆంత్యాను| పాస భాస్కర రామాయణం . 
నుంచి హోతరాజుగారు అలవరచుకొన్నారు. నాచన సోముడు మరికొన్ని శబా 
లంకారాల మజాలు నేర్పాడు. ఎల్దయ్య గారు ఆర్థాలంకారాల రహస్యాలు 
బోధించారు. పాల్కరికి సోమనాథుని 'ఆమితా వేళానికి సోతరాజుగా రే ఏకైక 
సే వారసులు. భాషా[పపంచంలోని శబ్దాలన్నీ వారికి కరతలామలకాలు. ఆను 
(పాసలు వాడేటప్పుడు గాని పర్యాయపదాలను గుప్పించేటప్పుడు గాని తడుము 
కోవడం లేనేలేదు. క్ష . 


ఫోతరాజుగారి భాగవతం ఆం|ధదేశంలో (పచారం కావడానికి మధుర - 
మధురమైన శైలి కూడా కారణమే. “భాగవతమున కింతటి (పజాదరము 
అందలి భ క్రి పభావము వలననే కాదు. మంద గంఫీరగమనము గల యీతని 
శైలి వలనను -వచ్చినడి. అది సహజధారా -విలసితము. ఓజః| పసాదగుణో జ్ఞ్యలి 
తము. బిగువైన ఆ పదబంధమున సంస్కాతములు, తెలుగులు చెరి సగముగా _ 
" గుళ్చిన మల్గెలుజాఖులై. పరిమళించును.” ఆని గడియారం వేంకట శేషకాన్తి 
గారు చెప్పిన మాటలు (విజ్ఞాన సర్వస్వము, లీ వ సంపుటి, పుట 985) వాస్త 
వాన్ని వ్యాఖ్యానం చేస్తాయి. 


భాగవత వై జయంతిక 


. పోతరాజు గారీ ఛందస్సులు భాగవతాన్ని. కూలంకషంగా చదివిన పాఠ, 
కుజ్జి సమ్మోహింప జేస్తాయి. వారి ఆటవెలదుల నడక నేటి విరుపులకు దగ్గరలో 
ఉంటుంది. “భాగవతమున (పతి సీనపద్యము కడపటను సాధారణముగ .నాట 
వెలదియే తగులచుండును. Ee [వాసిన యాటవెలదులు కూడ నెక్టువ. 
పీసితోని సౌం ఎదరకమును “చాలు! చాలు!” ననునంతవరకు పోషించినవాడు 
వేమనయోగి! కాని తొలుత వొక వింత యొయ్యారముతో ఆం| ధభాషలో నాట 
వెలది యడుగు పెట్టిన దీ పోతన్నతోనే” అని పుట్టపర్తి నారాయణాచార్యులు ' 
గారు అభిప్రాయపడ్డారు oe Se పుట 196,197). 


పోతరాజు గారి ఆటవెలదుల నడకలోని ఘలంఘలలు చెవులను [భమింప 
జేయడం వల్లనే వారు సీఫాల తరువాత తేటిగీతులు ఆలపించడం కన్నా ఆట 
వెలదులను అడిస్తారనే భావన కలుగుతుంది. ఆయికే వాస్తవానికి ఆయన భాగవ 
తంలో. |వాసిన 829 సీసాలలో 677 లేటగీతులు, 2929. ఆటవెలదుతు ఎత్తు 
గీతులుగా (వాకారు, వీరభ్యదవిజయంలో 118 సీసపద్యాలున్నాయి. అందులో 
101 ఆటవెలడదులు, 17 తేటగీతులు మ్మాతమే ఉన్నాయి. శ్రీనాథుడు తన 
సీసాల తరువాత ఒక్కటే ఒకక్సి. ఆటవెలది మిగతా 824 తేటగీతులే [వాకాడు, 
ఆం[ధ ఛందః పరిణామంలో ఇదొక ముఖ్యఘట్టాన్ని సూచిస్తుంది. వీరభ|ద 
విజయం (వాసే కాలంలో బహుకా పోతరాజుగారు ఆధునికుల పద్ధతులు వినక 
పోవడంవల్ల [పాచీనుల పద్ధతి వెష వైపు (మొగ్గారు.. తరువాత థ్రీనాుడు వాడినర్లే 

ఎక్కువ 'తేటగీతులు సిసాల పిదప వాడారు. 


మహాకవులు శీవితదృక్పథాలలో. కూడా ఎవరికి వారే. చనిపోతున్న 

సమయంలో కూడా శ్రీనాథుడు “కస్తూరి కేరాజు (పసుతింతు?' అని వాపోయాడు, 

_ పోతరాజుగారిది ఎప్పుడూ పై పెళేయే. అది ww కూడా ర్‌ పరిక్ని త్తుకు 
క శృంగి చేత. 


: సోము హరణ్యదానములం పతృలినంగు ధనంబు లేమియం శ 
దేము సవంచనంబులుగ; డీవన వ; వేసరింపగా. రాను” 
అని (. 488) అనిపించారు. na 


Ter వారి సరదాలు 178 
వస్తుతః సోతరాజుగారికి భోగాలంచే ఇష్టం లేదు. వారి దృష్టిలో కటిక 
నేల క్రనునీయల. _పట్టుబట్టల కన్నా ముతకదుసులే వారికి మెత్తగా ఉంటాయి. 
అందుకే భాగవతంలో. ఇలా ఒక పద్యం చెప్పా రు... అ 


కమనీయ భూమిభాగములు లేకున్న వే 
_. పడియుండుటకు దూది పజుపు లేల? 
సహజంబులగు కఠాంజలులు లేకున్న వే 
భోజన భాజన పుంజ మేల? 
వల్కలాజిన కుఠావళులు లెకున్న తే 
కట్ట దుకూల సంనుంబు లేల? 
గొనకొని వసియింప గుహలు లేకున్న వే 
[పాసాదసౌధాది పటల మేల? 
ఫలరసాదులు గురియవే పాదపములు; 
స్వాదుజలముల నుండవే సకలనదులు; 
పొస(గ భిక్షలు వెట్టరే పుణ్యసతులు; 
ధనమదాంధుల కొలువేల తాపస్తులకు? (2. (2.21) 


ఇహలోకంలో పుకపొ తాభివృ ద్ధిగా పోతకాజూరు చల్లగా జీవించినా. 
పరంలో వారు కోరుకున్న వరం ఒక్క టే ఉంది-అది మోక్షం. 


హోతరా జుగారు 'భాగవతం సథమస్కంధ్లంలో (శ్రీకారం చుట్టి కైవల్యం 
కావాలనుకొన్నారు. “'ఢ్రీక వల్య పదంబు జేరుటకునై చింతించెదన్‌”' అని 
(గంథం ఆరంభించారు. దశ మస్క ంధంలో చిట్టచివర శకయోగిచేత ఫల|కుతి 
చేప్పిస్తూ ఈ కృష్ణక థాసుధారసము |గోలినవారు '“కాంతు రచ్చ్యుతపదం బైనట్టి. 
కే కై వల్యమున్‌”” (10-9 - 1887) అ) ముగించారు. వారి ఆకాంక్ష త తొలినుంచి 
ఇ ధదాకా ప్‌ కై వల్యమే. భాగవత జన్మవల్ణ వారికి' పునర్జన్మ లేదని భావించారు. 


నిజమే! కోల గారికీ పునర్జన్మ లేదు. అసలు మరణిస్తే కదా మకీ ళీ 
పుట్టడం అనే సమస్య వస్తుంది! “తెలుగు సాహీత్యం జీవించి ఉన్నంతకాలం 
ఆయన (బతికే ఉంటారు. గ 


 గ్రనమ్యగ్రాంళ సాపొత్యుం-ల్‌, 196ల్‌) 


. పోతనార్యుని వైశిష్ట్రము 
---. ఆచార్య ఖండవల్లి అష్మీరం జనము 


బమ్మెర పోత్తనామాత్యుడు సంస్కృత మునందలి (బ్రమద్భాగవత ము 
నాంధికరించిన మహాకవి. తెనుగు భారత భాగ వతములు ఆంధదేశథమందలి 
పల్రెపల్లైలలోను వ్యాపించిన వి, (గామ జనులు కూడ వీనిని ఆదరముతో చదువు, 
చుందురు. ఇవి తెలుగువారి జాతిసొత్తులు. ఆం[ధభాగవతమును [(వాసిన పోత్రనా 
మాత్యుడు కవ్యితయము వారి తరువాత మ. ఆధికముగా పొందిన | 
ర 


సత వన తిదే జీవించియుండును. రాజుల. నాళ 
_యించుటయు వారికి (గంథములు క్నతి. యిచ్చి ధనార్థ్భనము చేసి భోగభాగ్య 
ముల ననుభవించుటయు పోతనకు గిట్టకుండెను, పోతన తన భాగవతమును 
రాజుల కివ్వనొల్లక శ్రీరామచం|డున ఏక సమర్పించెను, భూపాలురకు గ్రంథము 
లంకితమిచ్చుట పాసహేతువని యీ మహాకవి యభి పాయము. కవిత్వ మొక . 
పుణ్యకళ యనియు దానిని భగవంతుని తన. నందు వినియోగించుట 
_ మోక్షదాయక మనియు తిక్కనామాత్యుడు వచించెను. బమ్మెర పోతరాజు. 
' కూడ ఇట్టి _మహోన్నతభావమునే కలవాడు. ఈ యుదారాశయమును' పోతన 
పలుమారు "తన [(గంథములొ (పకటించెను.. హరినామసుతి గావించు కావ్యము 
బంగారు “కనులములతో విరాజిల్లు మానస సరోవరమువంటి. దనియు, హరినామ 
స్తుతి లేని కావ్యము విచ్మితార్థములు కలదయ్యు. పాపిష్టి గొయ్యి వంటి దనియ 
'ఈ మహాకవి a 


" హరినాషస్తుత్తి సేయ కావ్యము సువర్థాంభోజవాంసావళీ 
సురుచి, (భాజితమైన మానససరసూ్యూర్తి “రన్‌ వెలుంగొందు; శ్రీ 

. హరినామస్తుతి లేని కావ్యము విచ్శితార్థాన్వితం బయ్యు శ్రీ 
కరమై యుండ స. ప భగ. (1.96) 


పోతనార్యుని వై శిష్ట్యము 175 

భాగవతము రచించునాటికి పోతనామాత్యుని మనస్సు ఈ విధవ గా 
నుండినను జీవితము మొదటి నుండియు ఈతడు తి విముఖుడు కాడని 
తోచును. (పారంభమునం దీతడు రాచకొండ (ప్రభువగు 


దీనిలోని కవిత్వము, క. పోతన శైలిని బాగుగ పోలియు 
పోతనామాత్యున కత్యంత [పీతిపాా తమైన పదాంతాను! పాసరీతియ | పౌఢ 
సమాసకల్పనమును ఈ దండకమలో కన్పించును. ఇట్లు పోతరాజు చిన్నతన 
ములో నరాంకిత ముగ కవిత్వము చెప్పిన వాడై నను కం 

మీదను, నర సుతి మీదను వైముఖ్యము జనించెను 
పోతనామాత్యుని వంటి నిర్బీకుడును, నిరాడఆ a తాం 
మరియొకడు లేడనుట అతిశయో క్రి కాదు. 


ఆం ధభాగవతము వవంచవాజ్య యము లోన యుద్దంథము లలో స్థానమా 


పొందుటకు దగియున్నది. దీనియందు మనము మూడు ముఖ్య లక్షణములను 
గమనింపవచ్చును. ఒకటి భక్తి సంపద. రెండవది వేదాంతవి స్తరణము 


మూడవది రసనిర్భర మైన కవిత్వము. ఈ మూడింటి యందు wa _హోతనా 
మాత్యుడు సాటిలేని మేధావి. భ_క్తియ్‌ యాత్తని కవిత్యమునకు | ణాధారము. 
వంటిది. _ద్రహ్తాద చరి. (తము, గజేం|ద మోక్షణము మొదలగు య. స్థలము 

అందు. దీనిని చూడవచ్చును. ఖ్‌: -క్రితత్పరుడౌలుచే పోతనామాత్యుడు సంస్కృత 
'.-భాగవతములో లేని యపూర్వభావములను కూడ ఆం(ధభాగవతములో చేర్చి 
తన (గ ంథమును మూల[గంథము కన్న పెంచి చి [వాసినాడు. త తకః విషయము 
లను వేదాంత చర్చలను గూడ పోతన సరక్షజనసులభముగా రచించెను. కకనిది 
యదె దై ్వతదృష్టి- ఇక కవిత్వగుణమ:ను చెప్పు వలసిన ప్పుడు పోతరాజు కొన్ని 
సందర్భములలో కవితయమును గూడ మించిపోయిన మహాకవి యని విమర్శ 
కుల. యభిిపాయము.. ఆర్థగౌర వమును, పదములు వాడుటలో పొదుపును 
క్రవి తయమువారి ప అమలు, కూవావేశమునందును, పాఠకుని తన = 
వెంట లాగుకొని పోగల ఆకర్షణశ క్రియందును పోతనామాత్యుడు మిన్న. తన 
భ క్యావేశముచే నీతడు నా స్తికహృద యము నందు కూడ య! భక్తి జపించు 
నట్లు [(వాయగలడు. ఈతనికి భక్తిరస ముతో పాటు ఫోంగా కూడ 
దీకిదాయకము. దశమ స్కంఠమ కోని త్రి క్రికృష్ణచర, తయందు పోతరాజు భక్తి 


176 శూ భాగవత వై జయంతిక 


శృంగారములను విశేషముగ జూపెను. శ్రీకృష్ణుని బాల్యచర్మితను దర్శించుటలో ' 
నీతెడెంతయా మెలకువ |పదర్శించెను. బాలుర |క్రీడాదికము నీ మహాకవి 
చక్కని పరిశేలనతో తిలకించి |వాసెను, ఐశ్వర్యము, ధనము మానవునకు 
దర్పము పెంచుననియు,- దారి[ద్యమే మేలనియు చాటి ఐమ్మెర పోతరాజు నిక్క 
ముగా రైతుకవియు, పె 'పేదలకవియు, [పజాకవియు అయినాడు, 


(౪0 సాపాత్యూ బరి [ల నం[గవాొము, 1949) 


య > శు 


హరినామస్తుతి సేయ కావ్యము 'సువర్ణాంభోజ హంసావళీ 
సురుచి భ్రాజిత మైన మానస సరస్పూర్తి లిన్‌ వెలుంగొందు శ్రీ 
హరినామస్తుతి లేని కావ్యము విచ్శిార్థాన్వితంబయ్యు (శ్రీ 
కరమైయుండ దయోగ్య దుర్మదనదత్కాకోలగరాకృతిన్‌ . 


పాంచాలీ కబరీ వికర్షణ మ హాపాపక్ష తాయుమ్మ-_లన్‌ 
జంచద్దర్వుల ధార్తరామ్ట్రల ననిం జంపించి గోవిందు. డి . జ్య 
"ప్పించెన్‌ రాజ్యము ధర్మపుత్తునక( గల్పించెన్‌ మ హాఖ్యాతి( జే 
యించెన్‌ నాకు రంగ మధ హలా కాం 


తల్లీ ! | నిన్ను దలంచి ప పుస్త సకము చేతన్‌ బూనితిన్‌ నీవు నా . 
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుకుల్‌ సుశ బ్రంబు దో. 
భిల్లం బల్కుము నాదు వాక్కు_నను సం|పీతిన్‌ జగన్మోహనీ | 
వుల్తాబ్దాకి ( సరస్వతీ | శభగవతీ! సందు! బింబాననా | 


బాలర సాలసాలనపబ్దవకోమల కావ్యకన్యకన్‌ fa 
క్‌ గూళలకిచ్చి యప్పడుపు(గూడు భుజీంచుటకంటె. సత్క వుల్‌ 

వాలికులై ననేమి .? గహనాంతరసీమల( గందమూల మ 

ద్దాలికులై న నేమి 2 నిజదార సుతోదర పోవణార్థమై.. 


-. (బపది మాతృహృదయుము ' 
క ఆచార్య క జోగారావు 


|దౌపదీ పుతకోక ఘట్టము మవోభారతమున సౌ పిక పర్వమునను 

(ఏకాదశాధ్యాయము), శ్రీమద్భాగవతమున | | పథమ స్మ్కంభమునను (స ప్రమా 

ధ్యాయము) గలదు, ఆ పట్టున నా రెండింట నామె మాతృతర్త మావిష్కరింపబడిన 
తీరు వేరు. అదే అ వ్యాస విషయము, 


భారత యద్ధ మె పోయినది. ఇక పొం ండవులదే కురు! |తమున ఏకచ్చ 
(తాధిపత్యము. మస త పట్టమహిషి | దౌవది పట్టిన. సంతములెల్ల నెరవేరినవి. 
| ఆమె ఉల్లాస మహవాీఠాశిలో తతత. న సమయముది, కాని అప్పటికే ఆమె 
- కొక కోళమున శోకము కొంత లేకపోలేదు. ఆది పితృకోక ము. తన నపత్నులగు 
హిడింబా సుభదలవలె పుతశోకము మా (త మప్పటెకెరుగ?దామె. తన పతులకు 
జయము నిశ్చయమై యిక నట్టి విపత్కర విషయము నూహింప నక్కరలెని 
పరిస్థితి యామెది. కాని హఠాత్తుగా ఆశ్వ్థామ సౌ పిక పర్వమున నిర్వహించిన 
కఠోరదుర్వార యామె కర్ణ పుటముల బడిసడి. ఆపుడామకు పు తకోకము కన్న 
పుుతఘాతియగు ఆక్వత్టామమై నావా మెక్కువగా (వజ్విరిల్లి పాండవులశ్వ 
జామను సపరివారముగా నాశనము చేయికున్న తానే పాయోపవేశళము చేయుటకు 
ప్రతిన పట్టినది. భారత, మిట్లు చెప్పుచున్నది ద్‌ 


తస్య ప్రకృతి దౌజేర్నచే దద్య త్వయారణే. 

.. .హాయతే సానుబంధన్య యుధి వ్నికమ్మ జీవితమ్‌. 
.... ఇహైవ ప్రాయ మాశిష్యే తన్నిబోధత పాండవాః 
. నచేత్భం మవాప్నోతి (| దొ ణః పాపస్య కర్మణః. 

eS [సౌప్తిక bl 14, 15) 
“19 


178 “భాగవత వై జయంతిక 


ఇంత ఘోరమైన పతినశు ఇదివరకామె తన జీవితములో పట్టి యుండ 
లేదు. తన పాణమే ౩ పణ మొడ్డ పట్టిన (ప్రతిన యిది. ఆమె జతలు చెల్రింప 
భీముడున్నాడు. మహాభారతము [పకారము ఆతడే యామెచే నియోగింపబడి 
నాడు. కాని కృష్ణార్జునులు, ధర్మజుడు ఆతని ననుసరించినట్టును వ్యాసభగ 
వానుడే దిగివచ్చి అర్జునాశ్యజ్ఞామలకు జరిగిన ఘోర యుద్ధమును పరిష్క-రించి 
నట్టును చెప్పబడినది. 


భాగవతమున |చౌపకి తన కొడుకుల కొరకు తానేడ్చుటయేగాని యొక 
(పతిన బట్టినట్టుగాని, అశ్వత్థామను హతమార్చ వలసీనదసి యొకరి నాదేశించి 
నట్టుగాని చెప్పబడలేదు. పెగా అక్షంతవ్వ్యుడగు హంతకు డశ్యత్రామను క్షపుంచి 
నది. అర్జైనుడే అశ్వత్థామను హతమార్చ స్వయముగా (పతినగొని బయలుదేరును. 
ఆ సందర్భమున వ్యాసుడెక్కుడను అవతరింపడు. అర్జునుడశ్వళ్థామను బంధించి 
దౌపది కడకు గొనివచ్చును, ఆపుడు క వైదుట కర్మజుగుపితుడై అవాజ్యు 
ఖుడై యున్న అశ్వత్థామను జూచి [దౌపది ఎంత చెడినను గురుపు (తుడని 
కాబోలు నమస్కరించినదట. ('“వామస్యభావా కృపయా ననామ చి ఆని 
భాగవతము. అట నా [దౌపదీ విశేషణమునకు భాగవత వ్యాఖ్యాతలగు ఢ్రీధరుడు 
కోభన స్వభావ యనియు, వీరరాఘవుడు అకోధన స్వథావ యనియు అర్థములు 
చెప్పిరి.) వెంటనే ఎంత హంతకుడై నను అతడట్టు బంధనముతో కొనిరాబడుట 
సహింపనిదై “ముచ్యతాం మచ్యతా మేష [బావ్మాఖో౬నితరాం గుఠుః'” అనగా 
““విడువుడు విడువు డితడు [బాహ్మణుడు. గురుశ్వుకందె వేరుకాడు'” ఆని 
యన్నదట. తడుపరి యర్జును నుపలశ్నించి యిట్టన్నది-- 


సరహసోో ధను ర్వేదః సవిసర్గోపసంయమః 

ఆస్త్ర (గామశ్చ భవతా కిక్షితో యదనుగహాత్‌. 

సవీషవ భగవాన్‌ (దోణః (సజారూ పె పర వరకే 

వ పత్నా్యాస్తే నాన్వగాద్వీరసూ: కృపీ, 
(భాగవత థు స్కంథను 7, 44, 45) 

ఆనగా “పయోగోపసంవోర పూర్వ క్రమగు ధనుర్వేదము సరహస్యముగా 
సానుగవాముగా నీకు నేర్పిన దోణభగవాను డీ పు్కుతరూప పమున గన్పట్టు 
చున్నవాడు. అందుచేతనే. పీఠమాతయగు కృపి పతి సనుగ మింపలేదు*' అని 
యర్థము. ఆ వెంటనే ధర్మరాజు నుద్దేశించి. 


ద్రౌపది మాతృహృదయము 170 


తద్ధర్మజ్ఞ మహాభాగ భవద్భిర్లౌరవం కులమ్‌ 
వృజినం నార్హతి (పాప్తుం పూజ్యం వంద్య మలీన్తశః (46) 


(ధర్మజ్ఞ! మహాభాగ! మీ వలన పూజ్యము, వంద్యము నగునట్టి గురుకుల 
మునకు చేటు కలుగరాదు. ) 


మా రోదీ త్రస్య జననీ గౌతమీ పతిదేవతా 
యథాహం మృతవత్సార్తా రోది మ్యుశుముఖీ ముహాః. (47) 


(నే నెట్టు మృతవత్సార్తనై అృశుముఖిన్నై మాటిమాటికి నేడ్చుచుంటినో 
పతిదేవతయగు. కృపియు న ట్రేడ్వకూడదు. ) 


యెః అటి [బహ్మకులం రాజనై $ రజితాత్మ భిః 
త త్కుల్ను |పదవాత్యాశు సానుబంధం శుచార్చితమ్‌. (48) 
(ఆజితేం దియులగు ఏ రాజుల వలన [బావ్మణకులమునకు కోపము. 
కలుగునో ఆ రాజకులమునే త్మతో్కధాగ్ని దహించును ) ఆని యన్నది అప్పటి 
యామె మాటల తీరు ధర్మన్యాయ దయాన్వితము, నిర్వ్శశీకము. సమభావసముల్ల 


సితము నైనదనియు ధర్మజుడును త్మతత్యులగు డిజులును ఆమె నభినందించి 
రనియు. 'భాగవతమున నిట్లు చెప్పబడినది 


ధర్మం న్యాయ్యం సకరుణం నిర్వ్యశీకం సమం మవాత్‌ * 
రాజా ధర్మసుతో రాజ్ఞ్యాః పత్యనంద ద్యచో దజః.. (48) 
ఆప్పటి కింకను ఖీము డొక్కాడే అశ్వత్థామ వధార్హుడని వాదించువాడుగా 
మిగిలినాడు, ఆతడు చేయి చేసికొను తోపు న కృష్ణుడు కలుగ జేసికొనుటచే 
అశ్వత్థామ రశీంపబడెను. ఆదియే భాగవత 'దౌపది కభిమతమైనది. 
ఆ ప్మాతలో భాగవతక ర ఎంత మహోన్నత మాతృఖావము నిమిడ్చినాడు ! 
ఎంత హృదయస్పంది యెన సన్నివేశమది ! . 


ఆపుడు ;దౌపది కురుక్నే!ఆ మవోరాజ్ఞి..ఆచ్చో న్యాయాన్యాయ విచార 
మొనర్చుట కామె కధికారము గలదు. శిశు పాంతకునకు శిష ఉరికి తక్కువ 
మరి లేదు. ఈ సందర్భమున ఆ మహారాజ్ఞియ ఆ నేరమున కెర యైనది. ఆది 


180 టే. భాగవత వై జయంతిక 


గాక ఆమెకు దోషియగు నశ్వ్యత్థామకు తమతమ తండులనాటి నుండి యొక 
పగ పరిపాటిగ వచ్చుచుండినది. భాగవతమున |దౌపది కా |పతీకార స్మృతి 
యైన యున్నట్లు చెప్పబడలేదు. అందు |దౌవది (దోపి నొక మహావాఖ్ఞివలె 
గాక మాతృత్వము మూ ర్రీభవించిన యొక మహా దేవతవలె చూచినది. అందును 
ఆ మాతృత్వము . తన బిడ్డలను మాత్రమే (పేమింపగలిగి వారి మృతికి 
దుఖించు సామాన్య మాతృత్వముగాదు. ఏ తల్లి బిడ్డల యెడనైన సానుభూతి 
(ప్రకటింపగల వాత్సల్యము, ఏ బిడ్డల తల్లి యెడనై న సానుభూతి (వకటింపగల 
యౌదార్యమును గల మహోదాత్ర మాతృత్వము. అదియే సూనృతమైన 
మాతృత్వరహస్యము. మాతృత్వ మహిమ కది పరసీమ. 


భారత (ద్రౌపది పాతలో రాజస ప్రవృ త్రి గన్పట్టును. అందు పుతశోక 
 మామె యెడ కోధముగా పరిణమించి ఆ, కోధ మ్మపతికారమై జపతీకారమునకు 
[పేశేపించినది:. థాగవతమున అసలే ఆతిన మృదులమగు నా మాతృహృదయము 
నకు మరింత మార్గవము చేకూర్చిన 1న దా ప్యుత శోకము. ఆ విషయమున భారత 
చ్మితణము లోక సామాన్యమైన వా స్తవికతకు చాల సని? పహాతముగా నున్న దగును 
గాక. కాని భాగవత చితణ మా -మవోగ?థ పక క మార్గ మునకు దగినట్టు 
లోకో తరమై జదర్శ (ప్రాయమై యొప్పుచున్నది. ea 


ఇక నీ; (గ్లౌపదీ పు_తళోక సందర్భమున భారత భాగవతాం|ధీక ర్ల లెట్లు 
య. యించుక పరిశీలిచుదము. ఆ పట్టున భారతాంధీక ర్త తీక్కన : 
రచన సాగించినాడు. చూడుడు. 


“అగ్వర్థామోద్దామరణ క కరణ స్మరవయు దన చితం బుత్తలె పెట్ట 
j కోపంబు డిపింపి” (దోపి. pees నిట్ణనుచున్నది- 


అ 


“భూరమజ | గాఢని ద్రం. 
.గూరిన సమయమున ముట్టికొని నా సుతులం 
గూకతం దెగటార్చెను భౌ. ఫ్‌ వ 

మ పారంభుండు. గురుతనూడాః కృక్రనలీలన్‌. 


దౌపది మాతృహృదయము ౨.౨. .. 181 


అది యాజని పెనుచిచ్చై 

మది. గాల్ప( దొడంగా; దీన్ని మాన నుపాయం 
బు దలంప నొండు లే ద 
య్యదయుని ముట్టుకొని నామ మడయట దక్కన్‌, 


అత బనిచి నేం డటు 
సేయింపక తకి_లేని( జెప్పెద విను మే 
mw సీ " 
కాయ ముే బకింతు( జుమ్ము కౌరవనాథా!'” 
(ఆంధ వహ షా 281,82 లీల) 


“వ్యాసముని (పజణీత పరమార్థము' నే భబించినాడు సోమయాజి. కాని 
భాగవత త త్యమును ' నవనాడులలోను జీర్ణించుకొన్న మహాకవి పోతన 
తా నప్పట్లున మూలక ర యడుగుజుడలలోనే నడచుచు ఆ యడుగు చేయుట. 
లోనే యుక కొత యుడు గు నొక [కొత యొడుపుతో వేసినాడు. దౌపటదిచే 
నశ్యత్థామ నుద్దేశించి యొక సంభాషణము చేయించినాడు, ఆది ఆము చశమైనను న. 
మనోజ్ఞమైన మార్పు. చూడుడు... 


“అర్డనుండు తెచ్చి చూపిన బాలవధ జనిత లజ్ఞాపరాజ్యాఖుండై న 
క కొడుకుం జూచి ee సుస్వభావ యగు నా తుం . 


పరంగన్‌ మామ [వార లన! మున్‌ బాణ|పయోగోప సం 
వారణాద్యాయుధ విద్య అన్నియును |దోణాచార్యుచే నభ్యసిం 
చిరి; పు తాకృతి నున్న (దోణుండవు; సీ చిత్తంబులో లేశముం 
_ గరుణాసంగము లేక శిష్యసుతులన్‌ ఖండింప(గా( బాడియే ! 


భూసురు(డవు !' బుర్జిదయా 
'భాసుకు(డవు ! శుద్దవీరభట సందోవో 
Rs [గేసరుయవు! శినమారణ 
మాసుర కృత్యంబు ధర్మ మగునే తండ్రీ! 


182 భాగవత వై జయంతిక 


ఊ|దేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావనిన్‌ లేరు, కిం 
చిద్దోంహంబును సీకు( జేయరు, బలో లేకంబుతో టీ(కటిన్‌ . 
భ ద్రాాకారుల( బిన్నపాపల రణ పొఢథ కియాహేనులన్‌ . 
న్మిదాసక్తుల సంహరింప నకటా ! నీ చేతు లెట్టాడెనో ! 


అక్కట ! ప్యుతశోక జనితాకుల భార విషజ్దచి తనె 
" పొక్కుచు నున్న భంగి నిను బోర. కిరీటి నిబద్ధు( జేసి నే. 
డిక్కడ క్రీడ్సి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నే, 
డెక్కెడ నిట్టి కోకమున నే కీయ నేడ్చుచు( బొక్కుచున్నదో !”” 
(ఆంధ మహాభాగవతము 1.160- 168) 


ఇందలి కొన్ని భావము లమూలకములు. కొన్ని మూలమున "ద్రౌపది 
అర్జునాదులతో నంభాషించిన సందర్భమునందలివే కాని యిందొక కొతదన 
మును దెచ్చుకొన్నవి. ఆ సమయమున (ద్రౌపది తన కడువున చిచ్చు పెట్టిన 
యా|దోపాని పలుకరింపక ఆతని తల్లిదండులను దలచి క్షమించుటయే చాలును. 
ఆయినను తనవంటి మహారాజ్ఞి యట్టి నీచుని పలుకరింపరాదనక పూని యతని 
నుద్దేశించి “ధర్మమగునే తండ్రీ ! నీ చేతులెట్టాడెనో ! భవదీయమాత నే(డెక్కడ 
నిట్టి శోకమున న్మేకియ నేడ్చుచు. బొక్కుచున్న'డో” అని మాటలాడుట, ఆ 
యాడిన తీరులో తన పుతళోకాతురతను మాతృ పేమను ఎదిరి పరిస్థితిని 
సానుభూతితో [గహింపగల యుదారతను మాతమే (ప్రకటించి (దోహిని పల్లెత్తు 
పరుషమాడక గౌరవించిన భంగి యామె. మాతృత్వ పతివ్షకు మరింత వన్నె 
బెట్టుచున్నది. అనగా 1దౌపది మాతృహృదయావిష్క్మరణ సందళ్ళమున సంస్కృ శ 
తాంధ భారతము లొక్కతీరుగను, .వానిని సంస్కృత భాగవతము, దాని 
నాం్యధభాగ ఎతము నతిశయించుచు నున్నవనుట సుస్పష్టము. . 


(భారతి, పోవోంబుర్‌ 1968ల) 


శ 


. అ పుహో హాభాగవతము- అనువాద వెఖరి 


— డాక్టర్‌ (పసాదరాయ కులపతి 


ఆంధ సాహిత్యములో మొదట సర్వధర్మసారమగు భారత ముదయించి 
నది. నన్నయ తిక్కన ఎక్హాపెగడలు దాని కర్తలు. రామకథ రంగనాథ 
రామాయణముగా_ ఉతర రామాయణముగా, భాస్క ర రామాయణముగా తెను 
గున రూపొందినది. సు|పసిద్ధమగు భారత రామాయణ భాగవతములలో పోతన 
నాటికి భాగవత మొకటి ఎవరును స్పర్శింపక మిగిలినది. కవిత యమునకు 
తీసిపోనీ బహుముఖ | పజ్ఞగల మహాద్భుత విద్వత్కవియగు శ్రీనాథుని చూపేలో 
దానిపై ప్రసరింపలేదు. ఎవరి చేతను ఆది అనువదింపబడకుండుట తన ఆద్భ సృష్ట 
ముగా 7 పోతన భావించెను, 


ఒనరన్‌ నన్నయతిక్కనాది కవ లీ యర్విన్‌ పురాజావళుల్‌ 

తెనుగున్‌ జేయుచు మత్పురోక్కత జ భాధిక కంబు తానెట్టిదో 

తెనుగున్‌ చేయరు మున్ను భాగవతమున్‌; దీనిం దెనింగించి నా 
జననంబున్‌ సఫలంబు జేసెద పునర్ణన్మంబు లేకుండగన్‌. - (1-19) 


షోతననాటి సంస్కృతాం|ధ (గంథసందర్భమును పరిశీలించినచో రెండు 
విధములగు అనువాద పద్ధతులు గోచరించును. ఒకటి భారత. .కవు అనుసరించిన 
పద్దతి. రెండు అ నాను. డనుసరించిన పద్దతి. పోతన ఈ రెండు పద్ధతులకును 
మధ్యే ఫమార్శ మనుసరించెను. రెండింటి పైనను ఆయన కాదరమే. నన్నయ తిక్క 
_ నాదులవలె ఒక్కక్క చోట కథభాగమును దీసికొని ఆయన స్యతంతానువాదము 
నొనక్సినాడు. మరియొకచో శ్రీనాథుని వలె (పతి. శ్లోకము నొక పద్యముగా తీర్చి 
దిద్దినాడు. శ్లోకము కంటె పద్యమున కధికతర సౌందర్యము తెచ్చుటక్షై అవసర 
మైన మార్పులు చేసినాడు. ఇంక కొన్నిచోట్ట అర్థ వివరణము కొరకై మూల 
వ్యాఖ్యాతల అభ్మిపాయములను గై గె కొని వానిని శ తన రచనలో చొప్పించి 
నాడు, మరికొన్ని చోట్ట భావపరవకుడై మూలమును విడిచి వక విజ్భం 


184 భాగవత వైజయంతిక 


లీంచి రన్‌ సోచేకమున ల సతత తు ఈ విధముగా నం | 
వాదములో గ చూపించిన ఆఖండ (పజ్జావి శేషము కనుక ఘట్టములలో ఈ 
[కింద పరిశీలింపబడుచున్నది. 


పరమ మనోహరమగు రాస|క్రీడా ఘట్టమును సంస్కృతమున పారాశ 
ర్యుడు కూడ పారవశ్యముతోనే రచించినాడేమో అనిపించును. దీని ననువదించు 
టలో పోతన చూపిన నేడు అపూర్వమను, అనితరమును. గోపికలు కృష్ణుని 
వెదకుచు తరులతాగుల్మ ను లను ను నిట్టనిరి = 


మూ. దృష్టోవః క్షి ఎదళ్వళ్ట ! ప్రక! న్య(గోధ ! నోమనః 
క నందసూను ఏ ర్షతో హృత్యా _పేమహాసావలోక నై 8 
కచ్చిత్‌ కరప కాశోకనాగ పున్నాగ చంపకాః 
.రామానుజో మానినీనాం గతో దర్పవార స్మితః, (10-80-5,6) 


చూత |పియాఖ పనసోపన కోవిదార 
జంబీర బిల్వ వకుళాామ కదంబ నీపాః 
యేఒన్వే పరార్థ భవికా యమునోపకూలాః 
శంసంతు కృష్ణపదవీం రహితాత్మనాం నః. (10-80-9) 
వీనికి రనవంత మగు పోతన అనువాదము చూడుడు- 


పున్నాగ! కానవే పున్నాగవందితు 
._ తీలకంబ ! కానవే తిలక నిటలు 
ఘనసార కానవే ఘనసారళోభితు 
బంధూక ! కానవే బంథుమి[తు 
మన్మథ ! కానవే, మన్మథాకారుని 
" వంశంబ ! కానవే వంశధరుని 
చందన ! కానవే చందనశీతలు. 
_ కుందంబ | కానవే కుందరదను 


“తను! కానవే ఇంగదవిభవు | 
ల కువల ను ! కానవే కువరయేకు.. 


ఆం ధమీవాభాగవతము.అనశువాద వైఖని 185 


(ప్రియక పాదప! కానవే | పియువిహారు : 
ననుచు కృష్ణుని వెదకి రయ్యబ్దముఖులు. (10. 1008) 


పున్నాగవందితుడు, తిలకనిటలుడు మొదలగు కృష్ణవి శషణములను 
పోతన' కల్పించి మూలములోని అర్థ సౌందర్యమునకు కచ్దిసౌందర్యము జోడు 
చేసెను. జగ్మత్పసిద్ధమగు * నల్లనివాడు పద్మ నయనమ్ముల వాడు” అను పద్య 
మీ సందర్భములో నిదే, దానికీ మూలము అ 


మూ. గోహ్యః కామాత్‌ భయాత్‌ కంసో 
ద్వేషాచై ద్యాదయో నృపాః 
సంబంధాత్‌ వృష్ణయః స్నేవోత్‌ 
యూయం భక్త్యా వయం నృప (113) 
" ఇది నారదుడు లర పలికిన మాట, దీని అనువాదము సుప 
- ఖ్యాతమైనది. 


కామోతగ_ంఠత గోపకల భయమని Hobo వైర క్రియా 
సామ|గిన్‌ శిశుపాల ముఖ్యనృపతుల్‌ సంబంధులై వృష్టాలున్‌ 

(పేమన్‌ మీరలు భక్తి నేము.నిదె చక్రింగంటి మెట్టైనను 
ద్ధామధ్యాన గరిష్ట్రుడైన హరి జెందన్‌ వచ్చు ధ్నాతీశ్వరా ! (7.8) 


' సామాన్యముగా పోతన శైలి యనిన ఇట్లు భారాశముగా పసన్నముగా 
నుండును. ఈ పద్ధతిలో నమయసముచితమగా రసభరితముగా పోతన చేసిన 
ఆనువాదములో ఆయా విధానములకు [ప్రత్యేకముగా నుదావారణము లీ కింద 
చూపబడుచున్న వి. 


'యథామూలాను బాదను 


._ యథామూల మనుమాట నిజమున కెప్పుడును సార్థకము ౪ కాదు. ఛందోను వే 
' గుణముగా నడువవలసిన పద్యములలో పదమునకు పదమెప్పుడు నవతరింపదు. - 
ఒక భాష నుండి మరియొక - భాష కనువాదము జరుగునప్పుడు యథా మూల. 
భావానువాదమే కాని యథామూల పదానువాద ముండదు. కాని నంస్కృతము 
న్గుండి తెనుగున ఖ్‌ నప్పుడు సంస్క శ్రకములోని ౩ పదములు ధారాళమఃగా 


14 వ. భాగవత వెజీయంతిక 


తెనుగులోనికి ,పవేశించు నవకాశముండుటచే. మూలములోని పదభావములు 
రెండును పరిశీలించుట విమర్శకుల కలవా-టైనడి. ఏదై నను మూలము నెట్టి 
మార్పులు చేర్పులు చేయక చాలవరకున్నది ఉన్నట్టుగా ఆనువది౭చుట 
దుదాహరణములు కాంచవచ్చును, ఆనగా ఏ ఒకటి రెండు పదములలోనో 
మార్పు కనిపించినను అర్జములో మాత. మెట్టి మార్పు నుండదన్న మాట. 


మూ. సాధయిత్వా జాత శతో। 
స్వం రాజ్యం కీత వై రతం 
అజీహన దా?జ్రసేనాః 
cs 
కచస్పర్శ క్షతాయవః. 


యాజయి త్వాశ్వమేథభై స్తం 
.(తిభి రుత్తమ కల్పకైః. 
తద్యశః పావనం డితు 
స్ట శతమన్యో రివాతనోత్‌. ” (1.8.6,8) 


అను, పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్‌ 
చంచద్గర్వుల ధార్తరాష్ట్రంల ననిం జంపించి, గోవిందు డీ 
ప్పించెన్‌ రాజ్యము ధర్మపు|తునకు, కల్పించెన్‌ మహాఖ్యాతి, చే 
యించెన్‌ మూడు తురంగ మేథములు దేవేం[ద (పభావంబునన్‌.(1.1/5) 


'కితవై ర్హృతం' అనునది వదలబడి “చంచద్గర్యుల' అనునదీ తెనుగున 
చేర్చబడినది.. మూలములోని పావనం” తెనుగున “మహా యైనజి. ఇవి ఆల్బ 
మెన మార్పులు. మిగిలివ దంతయు మూలానుసరణమగు రమణీయానువాదము. 


గోపికలు శ్రీకృష్ణ సీ విధముగా (పార్థించినారు- 
మూ. - [పణతదేహినం పాపకర్శనం 
! తృణచరానుగం శ్రీనికేతనం 


వణివణార్చితం తేప పదాంబుజం సంస సక “లన న్‌ . 
."కృడు కుచేషు నః కృంధి నృచ్ళ యమ్‌, ఎ (10.817) 


ఆం(ధ్రమహాభాగవతము-అన వాద వై ఖరి మ 187 


అను, గోవుల వెంట (దిమ్మ రుచు కొల్చిన వారల పాపసంఘముల్‌ 
[దోవగజాలి ్రీదనరి దుష్టభుజంగ ఫణాలత్మాగ స సం 
ఖావిత మైన నీ చరణపద్మము' చన్నుల మీద మోపి త 
ద్భావజ పువ్పభళల్ల భవబాధ వారింపు వరింపు మాధవా! (10. 040} 


“'ఫణాలతా గ” ఫణాతలా గయైన ఇంకను రమ్యముగా నుండును. 
'హృచ్చయం' ఆనుదానికి “భావజపు వృభల్చభ వబాధ” సార్థక మైన యనువాదము, 
ఈ సమాసములోని భకాళము ee స్పష్టముగా 'వ్యక్ర కము చేయగలదు. 


యథామూల (సాయము : 


పూ ర్రిగా sen ననువదించుట ఆన్ని సందర్భములలోను 
సాధ్యము కాదు. అది అవసరమని కవియును ఖావింవడు. యథామూల పాయ 
ముగా ననువదించుటయే తరచుగా కాననగును. వీనిలో మూలభావమున కొన్ని 
ఆల్పమగు: మార్పులు చేయబడి యుండును. అనగా ఇది యథామూలానువాదమ్మ 
నకు ఒకడుగు దూరములో నుండును. దీనిని సన్నిపాతానువాద మనినను 
అనవచ్చును. ఈ పద్ధతి కుదాహర ణ ము లీ కింద చూపబడుచున్న వి. 


మూ. నారాయణం నమస్కృత్య నరంచైవ నరో త్రమం 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయెక్‌. (1.2.4) 


అను. నారాయణునకు నరునకు 
థారతికిని (మొక్కి వ్యాసు పదములకు నమ 
సారము సేసి వచింతు ను 
దార[గంథంబు దళిత తనుబంధంబున్‌ . (1.55) 
సంస్కృతములో “అనుష్టుప్‌” వలెనే తెనుగున కందము మిక్కిలి చిన్న 
ఛందము. తెనుగులో మూలములోని 'జయి మను మాట లేకున్నను పోతన 
కత్యంత స హజమైన అంత కాస అను నొక శద్దాలంకారము విజృంభించుట కిది 
నిదర్శనము. 


మూ. నయద్వచ శ్నితపదం హరేర్యళో 
జగత్సవిత్రం |పగ్ఫణీత క ర్షిచిత్‌ 


188 భాగవత వైజయంతిక 
తద్వాయసం తీర్థముశంతి మానై 
నయ[త వాంసా విరమం త్యుశిక్షయా . (1.5.10) 
అను. హరినామస్తుతి సేయ కావ్యము సువర్ణాంభోజ హంసావకీ 


సురుచి; (భాజితమైన మానస సరస్సూూర్తి రిన్‌ వెలుంగొందు, భీ 
హరినామస్తుతి లేని కావ్యము విచ్శితార్థాన్వితం బయ్య శ్రీ 
కరమె యుండ దయోగ్య దుర్మదన దత్కాకోలగరాకృతిన్‌ . (1.94) 


మూలమునందలి ' ఉశిక్షయి విడువజడినను వాయసకు కంటె కాకోలము 


ఈ సందర్భమున శ _క్రేమ తరమగు పద మగుట గమనార్హ ము. వాయస మనిన 
కాకి. కాకోలమనిన మాలకాకి. - వీరభ్యద సముద్భవ ఘట్టము- 


మూ, 


[కుద్ద స్ఫు దష్టోన్గపుట న్పధూర్ణట . 
ర్దాం తటిద్వహ్ని సటోగరోచివం 


న్‌ ఉత్స. ఎత? రుద సృృవా. సోక్టితో హసన్‌ 


గంభీరనాదో దో విససర్ద తాం భువి. (ఉ.5,2) 


* ఆద్యూం డ్యుగ డు స ంఠు డిభదె పోతా దష్టోవడై 
_మాద్యద్భూవి మృగేం[ద్ర ఘోవ మున భీమ ప, కియన్‌ నవ్వుచున్‌ 
(| విద్యుద్వహ్ని శిభాసముచ్చయరుచిన్‌ వెల్లొందు చంచజ్జటన్‌ 


సద్యః GG క వయిచెన్‌ క్యాచ|క్ర మధ్యంబునన్‌. (4. 106) 


. మూలమునందలి. “గంఖిరనాదము' తెనుగున 'మాద్యద్భూరి మృగేం[ద 
ఘోష మగుట ఒక విశేషము, యుద్ధమున నిహతుడై న కరా ఆ రాజు 
హ్‌ విలపించు ఘట్టమీ డిందిది- . 


మూ, 


రుదంత్య ఉస య. పంకజం 
సించంత్య అసైః కుచకుంకుమారుభై 8 
వసస స కేశాళరణా. క్నుచం నృణాం. 


3 నృజంత్య క ఆ, శోందనయా విలేపిరే.. Pos (7.2.82) 


ఆంధమహాభాగవతము-అనువాద వైఖరీ = i 


అను. (సస్తాకంపిత కేశబంధములతో సంఛిన్న హారాశితో = 
హస్తాబ్దంబులు సాచి మోదుకొనుచున్‌ హానాథ; యంచున్‌ బహు 
(పసావో కుల తోడ నేడ్చిరి వడిన్‌ పాజవ పాదంబు'పె 
అసోక స్తన కుంకుమారుణ వ వర్షింపుచున్‌ . (7. 42) 
బహు (పస్తావోక్తులతోడ నేడ్చుట స హజమును, రమణీయమునునగు 

అమూలకము_ “గజేంద మోక్షణము” "లోని కోక మీ, (కిందీది- 


మూ. నయస్య దేవా బుషయః పదం విదు 
రంతుః పునః కో ఒర్వతి గంతు మీరితుం 
యథా నటస్యాకృతిభి ర్విచేష్టితో 
దురత్యయానుకమణ సృమావతు, (8.8.6) 
అను. నర్తకుని భంగి పెక్కగు | 
మూర్తు లతో నెవ్వడాడు మునులున్‌ మి విజుల్‌ 

క్రీ ర్రింపనేర రెవ్వని 
వర్తన మొరు లెరుగనేర రట్టివాని ను ంతున్‌. a ne WS Te) 


ణ్‌ 


'దుర త్యయాను[కమణః” ఆనుదానికి ఎవ్వని వర్తన మొరు లెరుగరనుట 
జాత్యమగు రమ్యానువాదము. దీనిని మొదటి పాదమున కగువాదమన్నను కాదన, 
లేము. వర్తనపదము అన్నింటిని ఇముడ్చుకొన్నది. | 


' వ్యాఖ్యానా వలంబనము : 

అనువాద సమయమున చాల క్లోకమ కర్గనిర్ణయము చేయటకు పోతన 
వ్యాఖ్యానముల సాహాయ్యము గైకొనెను. కొస్నుయెడల వా్యాఖ్యలల్‌' న్‌ వాక్యము 
“లకు వాక్యములే తెనిగించిన సందర్భ:హాలు కూడ. గలవు, ఆందును [పధానముగా 
ఆయన శ్రీథ రవా్యఖ్యనే (హించినట్లు కన్నించుచున్నడి, విమర్శకు లందరును 
ఈ విషయమున, ఏకకంఠ నుతోనే వ దానికి కొన్న ఉదాహరణములు- 
కుంతీ దేవిస్తుతి- 


మూ. గోప్యాదదే తోయి కృతాగసి దామతావ” 
ద్యాతే దళాశుకలిలాంజన సం; భకోకాక్షం 
వక్రం నినియ భయభావ నం prt ep es లుం 
సా మాం విమోహయళతి లీక ద్చిభేతి... (4శిశిలి 

190 : భాగవత వై జయంతిక 


శ్రీధర వ్యాఖ్య : త్వయి కృతాగసి దధిభాండ స్ఫోటం కృతవతి, 


అను. కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో 
గోపిక తాటగట్టిన వికుంచితసాంజన బావ్పతో యధా 
రా పరిపూర్ణ వ కము కరంబుల [పాముచు వెచ్చనూర్చుచున్‌ 
వాపడవై నటించుట కృపాపర ! నామది చోద్యమయ్యెడిన్‌ , (1.191) 


తెనుగులోని దధికుంభ భేదనము వ్యాఖ్యలోని దనుట స్పష్టము. 


మి 
ఈ |కిందికోకము ఆరునుడు ధర్మరాజుతో పలికినది. 

ke రా న] ద్ద 

మూ. యద్దోరు మా పణిహితం గురుభీష్మకర్ల 
. ౧ ఇ (వన! 

[(దౌణి [తిగ ర శల సెంధవ బాహికాదె ర్ట 

అలాంతి శ రా అ 
అస్త్రాాణ్యమోఘ మహిమాని నిరూపితాని . 
నవక ag సానా . (1.16.16) 


శ్రీ ధర వ్యాఖ్య : ఆసురాణి హార ణః క శిపు (సీర అస్తా9ణి నృహరి 
దాసం | (పహ్హాదమివేతి, 


ఆను. ఆసురెం్యదుం డొనరించు కృత్యములు (పహ్హాదుం (బవేశించి గె 
og సమర్థ ంబులు గాని కై వడి కృపాశ్యర్థామగాంగేయ సూ 
ర్జసుత (దోణధనుర్విము కబహుడివ్యాస్త్ర పపంచంబు నా. 
దెసకున్‌ రాక తౌలంగు మాధవుదయాదృష్టిన్‌ నరేం|దో తమా! (1.865) 


భావచాలనము : 


మూంములో సూత్ర పాయమగా క్ట కుప్రముగా నున్న అనేకాంకములన 
చాల సందర్భములలో పోతన చక్కగా పెంపుచేసి యున్నాడు. (భ్రీధరాది 
వ్యాఖ్యాన సావోాయ్యముతోనే కాక శేవల స్వకీయ కల్పన. సామర్థళముణే గూడ 
ఎన్నో విషయములను మ-లాతిశయముగా ఆయన వర్ణించియున్నాడు. అర్థవివర 
జాత్మక మగు భావచాలన కుతూహలమే దీనికి కారణము. ఆ విధముగా క 1 


మును దాసుగా విస్తరించిన న. న. కుదాహరణము క bs 
నొనగబడుచుక్చ Du: 


ఆంధమహాభాగవతము- అనువాద వై ఖరి 191 
మూ. ఆంగుష్టమాత్ర మమలం స్పురత్‌పురటమౌళినం 
ఆపీచ్యదర్శనం శ్యామం తటిద్యాసస మచ్యుతం 
(శ్రీమద్దీర్షచ తు ర్చాహుం త ప్రకాంచనకుండలం | 
క్షతజాక్షం గదాపాణి మాత్మన సర్వతో దిశమ్‌. (1.12.8,9) 
పరీకి జ్ఞనన ఘట్టములోనిది పై శ్ఞోకము- : 


అను. మేఘంబు మీది కొమ్మెలుగుకై వడి మేని. 
పె నున్న పచ్చని పటమువాడు 
వష హాగకమలి కాంచన మణిమయ 
మక రకుండలకాంతి మలయువాడు 
శరవహ్నీ నణగించు సంరంభమున జేసి 
కన్నుల నునుగెంపు గలుగువాడు 
బాలార్క మండల |పతిమాన రత్నహా 
టకవిరాజిత కీరీటంబువాడు 


కంక ణాంగద వనమాలికావిరాజ 

మాను డసమాను డంగుష్టమ్మాత దేహు 

డొక్క గద జేతదాల్చి నేతోత్సవముగ 

విష్ణు డావిర్భవించె నన్వేళ యందు. (1288) 


“శ్యామం తటిద్యాససం' ఆనునది మొదటి పాదమైనది. మూలములో 
వసనమును *మ్మాతమే. తటిత్తుతో పోల్చగా పోతన మేనును గూడ మేఘముతో.. 
పోల్చి కిక చక్కని పూర్ణోపమను సిద్ధము ఇ సెను. శ ప్రకాలచన కుండలం” 
అనునది 'గండభాగంబుల” అని రెండవ "పాదమైనది. మూలనులోని కాంచనము 
నకు పోతన మణులను గూడ తాపటను చేసి వాని కాంతి గండభాగముల మీద 


మలయించి నూతన సౌందర్యమును తెచ్చినాడ షే '“క్షతజాక్షం' ఆను దానికి 
శ్రీధరులు వ్యాఖ్యానించుచు అసో మద్భ కస్యాపి గర్భే ఆస్తా9ద్‌ పీడేతి 
సంరంభా దత్యార కన్నేగం అనెను. దానిని గహించి పోతన 'శరనహ్ని నణ 


గించు' అను మూడవ. పాదమును కూర్చినాడు. 'ఆత్యార కనే! తం అనుటకంటలు 
“నునుగెంవ్త" అనుటలో ఒక అంవోకతనమును, లెక్కలేని తనమును వ్య కమగు 


198 


భాగవత వై జయంతిక 


చున్నవి. 'స్సురత్‌ పురటమౌళినంి అనునది బాలార్మ మండలి ఆను నాల్గవ 
పాదమైనది. ఇక్కడ బాకార్కమండల |పతిమానవైనది రత్నమో హాటక మో 


కాదు, వా 


కరా విరాజిత మైన కీరీటము. మూలములోగ 'స్టుంత్‌' తెను గున ఇంత 


సాగినది. మూలములోని “ శ్రీమద్రీర్ణచతుర్చా హుం' Ere 'కంకణాంగద వన. 
మాలికా విరాజమాను డగు విశేషణము వ వచ్చినది. ఇట్టర్థ యుతముగా అధిక తర 
సౌందర్య స సంపాదకముగా తెను గు పెంపొందినది. పీకదద్రావిక్భావ Mer 
లోని దీ [కింది శ్లోకము. 


మలు 


మూ. 


అను. 


. ఆఖింలోకభయంకరు. డగుచు న 
"కదు డుదమంచె మారట దృద్రుడగుము,. త 108) 


తతో౭తికాయ స్తనునాస్పృళన్‌ దివం 

సవాసవావాు ర రనరుక్‌ | (తిసూర్యదృక్‌ 

కరాళ దంషైో9 గ మూర్రజః. 

కపాలమాలీ వివిధోద్యతాయుధః. (4.5.8) ఠ 


అభం వివోద్యభ వ్మిభమ్మాభభమ. 
యః దీర్షశదీర మమత 

[ప జ్వాంజ్ఞ లన గప కాలాల 
జాజఇల?మాన కేశములు మెజయ 

Fait. పండాభదోరండ 
సాహ్మసధృత హేతిసంఘ మొప్ప 


మ. చక వీక్షణద్యుతి జ 


క్రకచ క కక కాళదంన్దరిలు. వెలుంగ 
మనకపాలాస్టివనమాలికలును దనర 


క్రూర పునరుక్తి క్రితో మొదటిపాదము మూలములోలేని ఒక అద్భుతత్వమును 


సంతరించుకొని వీరభ డని. మూ రిని కాబ్దీక చి తణముగా మన. కన్నులముందు 
నిల్పినడ్‌. “జ్వందగ్ని మూర్భజః” అనునది సీసము రెండవపాదముగా. కొంచెము: 


_ పొడుగుసాగి వ వజ్యంన గుణమును. ప సంహెక్షంగకొన్నుర.. “నవస 


ఆం|ధ్రీమవోభాగ వతము_ అనువాద వైఖరీ 198 


బాహుః“, “వివిధోద్యతాయుధః' అను రెండు సమాసములును కలిసి మూడవ 
పాదమైనవి. - ఆ బాహువులకు *“దిగ్వేదండ శుండాభత్యము” ఆధికమగా వచ్చి 
నది. *ఘనరుక్‌ (తిసూర్యదృక్‌ ' అనునది సీసము నాల్గవ పాద మైనది. మూలము 
లోని “కరాళదంష్షలు' తెనుగున [కకచ కరినతను తెచ్చుకొన్న వి. మొ త్రము 
మీద మూలను కంటె అఖిల లక భయంకరత్యముతో తెనుగు ఇదర విజ్బం 
భించినది. 


(ప్రహ్లాదుని శీల సంపదను చి|తించు క్రోకమిది- 
| (sf) Ws | ౨ 


మూ, |ఐహ్మణ్య క్షీలసంపన్నః సత్యసంధో జితేందీయః 
ఆత్మవ త్సర్యభూతానాం ఏకః (పియసుహృ త్తమః 
దానవ తృన్నతార్యాం ఘః పితృవద్దీన వత్సలః 
(భాతృవత్సదృళస్సిగ్ధో గురుష్వీశ్వర భావనః. * (7.4.82,88). 


ఆను. తనయందు నభిలభూతములందు నొకభంగి 
| సమహితత్వంబున జరుగువాడు 
పెద్దల బొడగన్న భృత్యుని కైవడి 
జేరి నమస్కృతుల్‌ సేయువాడు 
కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన _ 
మాతృభావన సేసి మరలువాడు 
తల్లిదం[డుల భంగి ధర్మవత్సలతను “కై 
ర్‌ ( 
దీనుల గావ జింతించువాడు 
సముల యెక సోదరస్థితి జరుపుపాడు 
'దై వతము అంచు గరవల దలచువాడు 


లీలలందును బొంకులు లేనివాడు. 
లలిత తల పహ్హాదు డధిప | భి త న్‌్‌ 


“ఆత్మవత్‌ సర్వభూతానాం' అనునది తనయందు” we పాదమెనది. 
“దాసవత్‌ సన్న తార్యాం మై" అనునది “పెద్దల బౌడగ' న్న ఆను పాదమెనది. 
శ 


18) 


194 భాగవత వై జయంతిక్ర 


మూఅములోనిడి కేవల భావము. తెనుగులోనిది భావచితము. తెనుగు చదవ 
గానే (పహ్హాచుడు పెద్దలను కాంచుట, వెంటనే భృత్యుని వలె దగ్గరకు జేరి 
నమస్కరించుట కంటేముందు దృశ్యము వలె కన్ఫించును. శిల. సంపన్నకః, 
భ్‌ అను రెండును “కన్నుదోయికి” అని భావ చితముగా: స. 
_దినవి. 'పితృవ ద్రీనవత్సలిః' అనునది “ తల్లిదండుల భంగి” ఆని. అనూదిత మై 
నది, “సత్యసంధళి అనునది “లీలలందును బొంకులు లేనివాడు" అని ఆధికతర 
విశేషణముతో నొప్పినది, నవ్వులకె న అబద్ధ మాడడనుటచే (పహ్హాదుని కీలము 
- మరింత పరిపుష్టమైనది. ఈ విధముగా మూల క్లోకములకు తెనుగు పద్య మన్ని 
విధముల మెరుగు వెట్టినదనుటలో సందేహము లేదు. 


బాలకృష్ణుడు గోపబాలురతో గూడి చబ్జులారగించు ఘుట్టముం 


మూ. బ్‌ఫ ద్వేణుం జఠరపటయో శ్రంగ.వే॥ తేచ కే 
వామే పాణా మసృణకబళం తతృలాన్యంగుశీమ 
తిష్టన్మధ్యే స్వపర సుహృదో వోసయ న్నర్మభిస్స్వెః 
స్వళ్లే లోకే మిషతి బుభుజే యజ్ఞభు న (10.1811) 


ఆను, కడుపున దిండుగా గట్టిన వలువలో 
లాలిత: వంశనాళంబు జొనిపి 
విమలకృంగంబును వే తదండంబును . 
జారీ రానీక డాచంక నిరికి 
మీగడ పెరుగుతో మేళవించిన చర్చి. 
a ముద్ద డాపలిసేత మొనయ నునిచి 
. చెలరేగి కొసలి తెచ్చిన యూదుగాయలు 
మ. సందునను దావెలయ నిరికి ' 


Te నడుమ వ. ల. హు 

న . నర్మభావణముల నగవు నెరపి -. జై 

_. యాగలోక్త కృష్ణు డమరులు వెరగంద * . = 
_వైళవయిమెరసి చలి గడిచె. (10496) | 


రమమాభాగవతమ-అనువాద వై వె ఖరి 195 
*ఇజఇభరపటయోః8 అనునది “ఉదర వస్ర్రయో ర్మథ్యే" యని ' శ్రీధరులు 
ఖ్యానింప “కడుపున దిండుగా గట్టిన వలువలో” అని పోతన అనువదించెను. 
తి కట్టుకొనుటలో ఆనేక కలక కలవు. దిండుగా కట్టుట యనగా దట్టి 
విగించిక ట్టుట, ' పరుగెత్తుటకు, దూకుటకు, ఆడుకొనుటకు సుకరముగా 
డును. కృష్ణుడు క్రీడాపరుడై. తడుట ఇచట సందర్భము కావున దిండుగా 
నట్టు పోతన వర్ణించెను. శ్లోకములోని “వామే” అనునది కాకాక్ని న్యాయమున 
ప కెంటికీని విశేషణ మగునని శ్రీధరులు చెప్పియుండుట చే రెంటికీని 
చంక, డాపలిదెతి అనీ. పోతన -ఆనువదించేను. మూలములో “మసృణ 
శి మని యుండ శ్రీధరులుదానిని “మస్ఫణం స్నిగ్ధం దధ్యోదనక బళం” 
ఎయు, 'తత్పలాన్య ంగులీష' ఆను దానికి 'తదుచితానిబిల్యామలకాది 
కాని ఆంగుశకీసంధిషి అనియు వ్యా; త్యానించిరె. తెబుగుదనము కృష్ణునకును 
ఎటించి పోతన మీగడ పెరుగుతో. మేళవించిన చల్లిముద్దలు, ఊరు 
యలు [ప వేశ పెట్టినాడు. అది అత్యంత సహజము, కవినాటి నోట్‌, పరిస్థి | 
లు, ఆచారములు కావ్యమున (ప్రవేశించుట తరచు ' జరుగుచుండును. శ్రీధర. 
ఫఖ్య సవోయముతో కొంత, తన భావనాళ క్రితో మరి కొంత ఇట్టనేక విధ 
ఎల పోతన మూలమును వి స్తరించినాడు. 


'పాలకృష్ణుడు గనులకు గాయు సందర్భము- 


మేఘ గంభీరయా * వాచా" నామభిర్దూరగాన్‌ పశూన్‌ 
క్వచి తాలు ప్రీత్యా గోగోపాల మనోజ్ఞయా. (10.16.12) 


ను. రా. వూర్ణచంద్రిక ! రా గౌతమీగంగ ! 
రమ్ము భగిరథరాజతనయ ! 
రా సుధాజలరాశి! రా మేఘమాలిక ! | 
రమ్ము చింతామణే ! రమ్ము. సురభి ! 
_ దా మనోహారిణి! రా సకం 
రా భారతీదేవి! రా ధరిత్రి! 
రా శ్రీమహాలక్ష్మీ ' రా త న 
రమ్ము మందాకిని ! రా శుభాంగి !. 


196 భాగవత వై జయంతికి 


ఆనుచు మరియ గలుగు నాఖ్యలు గల గోవు 

లడవిలోన దూరమందు మేయ 

ఘనగభీర భాష గడునొప్ప జీరు నా 

భీరజనులు బొగడ పెంపు నెగడ. (10.601) 
“'నామభిః ఆని మ్మాతము సూచించి వ్యాసుడు వదలగో పోతన దాని 


నిట్లు వి సరించెను. అందమైన పేర్లు సృష్టించటతో పద్యమునకు ఎక్కడలేని ' 
ఆందము వచ్చినది. మూల వి "సరకారునకు సామర్థ్యముండ వలసిన దిట్టి చోటులనే., 


అది పోతనలో పరిపూర్ణత్వము నొందిన దనుటకు ఇట్టి పద్యములే తార్కా-ణ 
ములు. | 


మూలలిన్నత : 


అనువాద సమయమున మూలములోని పదములకును , అరుం పక 


భిన్నమగు పదములను, భావములను చేర్చిన సందర్భము అక్కడక్కడ కన్పట్టు 
చున్నవి. ఆట్టి వాని కుదాహరణములు కొన్ని- 


మూ అహో మహీయసీ ప జీవితాకా యయా భవాన్‌ 
భీమాపవర్ణితం పిండ మాద చే గృహపాలవత్‌. (1.18.24) 
విదురుడు దృతరాష్ట్రనతో పలికీన 'శోకమిది- 


తక బిడ్డలకు బుద్ధి చె సెప్పని 
(గడ్డికి హన మ వండికొన్ని పొం" డిదె పె 
బడ్డాడని ఖీముం డొర 


గొడ్జెము. లాడంగ గూడ గడిచెద వధిపా ! Us 811). 


మూలములోని 'గృవాపాలవత్‌” (కుక్కవలె) పోతన వదలి, పె బడ్డాడు, 
ఒరగొడైెముకాడు మొదలగు జాతీయములను ' వాడి చక్కని. నుడికారము 
పెంపును స, 


Ps 


స్విచ్చానువాదము ; 
మూ. ఆహో అమీషాం వయసాధికానాం 
విపశ్యతాం లోకగతిం విమోవాః 


ఆయ్భధమహాభాగవతము-అను వాద వైఖరి 197 


యతోద్భృవ స్తత గతంమనువ్యం ౪ 
స్వయం'స ధర్మా అపి కోచం త్యపార్గం.. ౨ (7297) 


. అను, మచ్చిక, వీరి కెల్ల బహుమ్మాతము చోద్యము దేహి పుట్టుచున్‌' 
చచ్చుచునుండ చూచెడరు చావకమానెడువారి భంగి నీ ' 

చచ్చినవారి 'కేడ్చె దరు చావుకు నొ బ్రక డాగవచ్చునే 2 9 
ఎచ్చట బుక నచ్చటికి నేగుట నై జమ న. (7.46) 


ఈ కిందివి హిరణ్యకశిపుని పలుకులు= 

మూ. పరోఒప్యపత్యం హితకృ ద్యదౌషధం 

న స్యదేవాజో ౬ప్యామయవ త్సుతో౬ఒహిత: 

ఛింద్యా త్పషమంగం హి యదాత్మనో హితం 
శేషం సుఖం జీవతి యద్విసర్జనాత్‌. (T.5.8 7 

అను, ఆంగ|వాతమ లో చికిత్సకుడు దుష్టాంగలబు ఖండించి శే య 
షాంగ్యశేణికి రత సేయ్యుకియ నీ యజ్ఞున్‌ కుల్యదోహి దు 
స్పంగున్‌ శకేశవపక్షపాతి నధమున్‌ సట వీర్యవతో 
త్తుంగఖ్యాతి జరించెదన్‌ కులము 'నిర్దోషంబు గావించెదన్‌. (7.188) 


అనువాద సౌంశర్యము : 


హోతన చేసిన అనువాదవై bie పైన చర్చింపబడి నవి. ఆయా సంద 
.ర్భములలో మూ -మునకు. మెరుగదిద్ది. వృదయంగమముర్లై , చదివినంత మాత 
మున ఆకర్షించు అనువాద పద్యము. లు పోతనలో వందలకొలది కలవు. ఆయన. 
శైలిలో నున్న వై వై శివమే అట్టిది. సకలాం[ధ. సాహిత్యములోను ఆయన వాసి 
నన్ని ధారణాయోగ్యపద్యములను (పజల. మనస్సుకు హత్తుకొనునట్టు (వాసిన 
వారు హస లేరు. అట్టి రమణీ యాన్నువాదమునకు కొన్ని ఉదాహరణములు: 


మూ, థీకృష్ణ కృష్ణసఖ వృష్ణల్పషభావనీదృక్‌ 
రాజన్యవంశదహనా నపవర్ష వీర్య । 
గోవింద గోద్విజ సురా ర్రిహిరావతార . | 
యోగీళ్వ రాఖిలగురో భగవ న్నమస్తే ! (1840) 


తర . భాగవత వై జయంతిక 


అను. శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాక రా! ' 
లోక దోహ నరేం|దవంశదహనా! లో కేశ్యరా! దేవతా 
నీక 1బాహ్మఐ గోగణా ర్రీవారణా! నిర్యాణసంధాయకా! 
నీకున్‌ ore శ్రుంపవే భవలత ల్‌ స ( 1౪9) 


సంస్కృతమున నున్న “నమ సే” “నీక్షన్‌ (మొక్కేది నని అనువాదము 
చేసి ఆంతటితో ఆగక *్యతుంపవే భవలతల్‌” ఆనుటతో ఆధికతరమగు అర్థ 
స్ఫూర్తి వచ్చి నది. మూలములో లేని “నిర్వాణ సంధాయకాి ఆను సంబోధనము 
దానికి దోహదము చేసినది. సంస్కృతములో కంటె తెలుగులో సంబోధనల 
కొక సౌకర్యము కలదు. వృ త్రమధ్యమున “కృష్ణ సఖి మున్నగనవి వ్యాక రణరీత్యా 
[హస్వాంతము లగుటచేతను, ఛందోదృవ్టితో ఆక్కడ [హస్వమే ఉండవలసి 
వచ్చుటచేతను, ప్లతోచ్చారణ కవళళము లేదు. భక్తితో న్యాకోశించునప్పుడు 
సంబోధనాంతమగు ఆచ్చు ప్రతమగట సహజము. _అకౌరాంత, _ఇకారాంత 
శబ్దములు సంస్కృతములో వలె కాక స్విచ్చగా దీర్చ ము తీయు అవకాశము 
తెనుగుభావలోని ఒక విశిష్ట లక్షణము. అందును అధిక " దీర్దాక్ష రములకు వీలున్న 
శారూలవృ త్ర తమువంటి . వాని నెన్నుకొనుటలో పోతన సామర్థ్యము తేటతెల్ల 
మగుచున్నది. “శ్రీకృష్ణా! ఆని అనుటతోనే ఆ పిలుపు దిక్కులకు ష్యాషక్రచున. . 
దానిపై వరుసగా “యదుభూషణా” “నరసఖా” మొదలగునవి. ఆ పిలుపులోని 
ఆత్మీయతను ద్విగుణీకృతము గావించినవి, “శృంగార. రత్నాకరా' ఆనుటతో 
ఆడి పరాకాష్టన ందుకొన్న ది. కుంతినోట అమూలకముగా' శృంగార శబ్దమును 
పలికించుట కౌచిత విరోధమని కొందరు కంకింపవచ్చును. శృంగారము. కామ 
వాసన కతీతమైనదనియు, అది ఆక్కడ జీ వేశ్వర సంబంధ సాన్నిపాత్య 


సూచక మనియు" భావించి నచో సరిపోవును. అనన్య విషయమగు ఆ రల కుంతి 
తష దీని పై పె లోకమే 


మూ. త్వయి మే2నన రవివయా మతి ర్మధుపతేఒసకృత్‌ త టె! ల 
రతి ముద్వహతా దద్ధా గంగేవౌను ముదన్వతి. య 8.48 ర) 


పోతన దీనికి (వాసిన పద్యములో (1 198) ఈ రతి శబ్దమును వదలి 
వేయు చే నంవ్మృతల్డికమునే గచ ట్‌ ఉదావారింసవలసి నర్ఫ్భునడ్డి, ఈ రతికి 


ఆం్యధ్రమహాభాగ వతము-అనువాద వైఖరి. 199 


_ “అనవచ్చిన్న పీతి" అనియే శ్రీరరులును అర్థము చెప్పిరి. ఈ రతి లౌకిక రతి. 
ఎట్టు, కాదో, అట్టే ఈ కృంగారమును లౌకిక శృంగారము కాదని గు. ర్తింప 
నగును. కనుక పోతన [ప్రయోగించిన సంబోధనము వా సార్థకము. 


శరతల్పగతుడై న నీమ్మడు తన్ను దర || హతో నిట్టను 
చున్నాడు-. _ 


మూ, యత రర్మసుతో రాజా గదాపాణి ర్భృకోదరః ( 
కృష్ణోఒశ్రీ గాండివళ్ళాప పః సుహ హృత్‌ కృష్ట సతో విపత్‌.. (1.9. 15) 


ఆను, రాజట ధర్మజుండు, స ధని, శాతవో 
ద్వేజకమైన గాండివము విల్లట, సారథి సర్వభదసం 
యోజకుడై న చ క్రియట, ఉగగదాధరుడై న భీము డ 
య్యాజికి తోడువచ్చునట ఆపద గల్షుట్‌ దేమి సరా ] (1. 210) 


“అటి అనునది స్థలార్థకముగా కాక ఒక విశేషార్థమున (పయోగించుట 
భారత రచన నాటికి తెనుగున మొదలై నది (మునికన్యకయట నేనట), ఆశ్చర్యా 
ద్యర్థక మై ఈ శబ్దమొక (పత్యేక (పయోజనమును తెనుగుభాషలో సంతరించు 
కొన్నది. ' ఈ పదము సాహాయ్యమతో పోతన ఎత్తిన ఈ పద్యపు చెత్తుగడ 
పరమరమణీయమై మూలములో లేని సౌందర్యమును తెనుగునకు తెచ్చినది. 


వృతరచకలో పోతన కభినివేశ మెక్కువ.. అట్లని మిగితినవానిలో ' 
తక్కువని కాదు, ఒక్కొక్కరికి ఒకొక్కదానియందు (పక్యేకమగు ఇష్ట 
_ ముండును. ప్రావీణ్యముండును. |పసిద్ధి యుండును. తిక్కనకు కందమునను, 
శ్రీనాథునకు సీసమునను గల [పక్యాతి అట్టిదే. పోతన “ఆడిగెదనని కడువడి , 
జను" వంటి కంద్య పద్గములను, 'మందారప:కరంది వంటి సీసపద్యములను 
ఆత్యద్భుతముగా |వాయకపోలేదు. అయినను ఆ ఛందముల కాయనను చెప్పు 
కొనరు. వృత్తరచనలో పోతనది పెట్టిన పేరు. ఏ భావము ఏ ఛందములో 
ట్ట సమస నగు కవి ,తానే నిర్ణయించుకౌనును,. 


800 భాగవత వై జయంతిక 

సంన్మృతమలో వ ఛందమున్నదో ఆ భావము నా ఛందములోనే 
తెచ్చుట కిటేవలి ఆధునికులు. కొందరు (పయత్నించుచున్నారు. శిఖరిణి, దా 
[కాంతవంటి వృత్తములు సంస్కృతములో సౌందర్య్భవంతమ లై. నట్టు తెనుగున 
కానేరవు. [పాలీనాంధకవు అందులకే తెనుగుభాషకు తెనుగుపలుకుబడీకి ఏ ఛంద 
ములు తగునో వానినే స్వీకరించి రచించిరి. ఆఅనుష్టుబాది చృందములలో రచింప 
ఐడిన సంస్కృత శ్లోకములను ఆ దృష్టితోనే తెనుగువారు తెనుగుజేసిరి. లాగ 
వతములో పోతన ఇట్టి సందర్భములందు కార్హూలమ త్తేభాదుల నక్కు.వగా వాడుట 
గమనార్హము. ఆ వృత్తము లాయన చేతులలో ధీరగంభీర గమనమును నేర్చు 
శని తెలుగు సారస్వతమున కాదర్శ పాయములై నవి. 


పోతన భాగవకానువాద విషయమున మనకొక సత్యజ్యోతి సాషాత్క- 
రించును. ఆది ఏమనగా, భారత కవిత్వమువలె ఆయనది కేవల కథానువాదమును 
కాదు; శ్రీనాభారుల కవిత్వము వలె భావానువాదమును కాదు. ఆయనది వృూద 
యానువాతము. సంపూర్తమూ ర్తి సందర్శనాత్మకమగు కథాశిల్పదృష్టితోపాటు 
. (పతి పద్య ల్లోక సన్నిహితానువాద సమన్వితమగు (పతి పద $ల్పసమీక్షణ 
మందును జ్యాగత్‌ దృష్టి కలిగియుండి, వీని నన్నింటిని మించిన ఒకానొక విశిష్ట. 
సౌందర్యపరిస్పురణమే, ఆంతర్హిన ఖావపారవళమే తన : ధ్యేయముగా 
పెట్టుకొని పాండిత్యము కంటె పఠమార్థ మునకు, మూర్తి సందర్శనము కంటె 
స్ఫూ ర్రిసంస్పర్శనమునకు, మేధావిలసనము కంటె వాదయ వికాసమునకు, 
_ఆక్చర్యావవా (పజ్ఞా (పకటనము కంటె పారవశ్యావహ రసోదయమునకు 
(పాధాన్యమునిచ్చు రచనా పద్ధతిలో ఆయన భాగవతము ననువదించెను. 
అట్లని పాండిత్య మేరాశిల్పాడి విశేషణముల నెవ్యరికిని కీసిపోని దారచన. 
కాని (పాముఖ్యము మాతము రసనివృందమానమగు ఆనంద [బవ్మాస్వరూవప 
సాషాత్కారమునకే. దానిని పోతన హృదయానువాద వైఖరి సాధించినది. ' 


(కధ భాగవత బిమల్భు 9) 


సత్యభామా స్వరూపము. 


డాక్టర్‌ రాజేశ్వరి 


'సత్యభామ' అను పదము శ్రవజగోరరమైనంతనే. వాసెన. కట్టుకట్టి 

చీకటింటిలో అలక పులక రించిన యొక భామామణియో, “సత్యభామా విధేయుడు 

గాక' అని భర్తను గద్దించిన యొక మదవతియో, ఏడదోయొశ సమయమున 
పొలయల్క దీర్చుటకై (పణమిల్లిన నాధుని “వామపాదంబున దొలగం దోచిన! 
యోక ధూరనాయికయో మనకు స్పురించును. నిజమునకు సత్యభామ స్వరూప 
మది మాాతమేకాదు, ఆ. ఖండిత నాయికాత్యాంశ నవరసళిసమున్మేష మగు నామె ' 
 గుణపద్మమునం దొక దళము మాతమే. ఆమె కరుడు గట్టిన వీరవనిత. 
శృంగార రసరాబ్లి. నేర్చరితన మామె సొమ్ము. (ప్రబంధ వాజ్మయముననే 
గాదు, ఆంధ పటు నంతను తరచి చూచినను వీరత్వమున ఆంతటి 
దిట్టతనము గల శ్రీ మూ ర్తి మరియుకటి కనిపించదు. . సుభ దలో మాత 
మారేఖ కొంతకొంత శాసించక: (పత్యక్షముగ కదనరంగమున క తిని బట్టక 
. పోయినను వీరత్వ ముట్టిపడు హృదయముతో మహాభారత యుద్ధమునకు సూత 
ఛారిణి యైనది (ద్రౌపది, కాని ఆమెలోని వీరత్వము పరోశ్షముగనే పంప 
బడగా 'సత్యభామలో నయ్యది ప్రత్యశ మైనది. 


సత్యభామ పూర్ణరూపము వీర శృంగారముల సంగమస్థానము: ఆమె. 
తరుణాంగుళులకు వల్చకీతం త్రుల మీటుట ఎంత కె వనమైన విద్యయో శస్తారిస్ర 
_పయోగాదు లంత యలవడిన విద్యలు. సరస కర్పూర కదళికా తరుల నడుమ 
సాపరాధుడై న నాథుని, దండించుట యందెంత సమద్ధరాలో తిలోక పూజ్యుడగు 
మురశీధరుని మనసు నెరిగి వ రించుట యం దంత “నేర్పరి. కాని రానురాను 
కన్నం దృక్పథమున ఆమె, శృంగార రసదేవతగ మాత్రమే భాసించినది. 
దక్షిణాయ్యధ యుగము నాటికి ఆమె గర్వితగ, కుపితగ, ఖండితగ కూడ 
| (పజాసీక ప్ప దృష్టిలో. రూఢ మైపోయినది. ఆ శృంగార ' రసరాజ్ఞికి ఖండిత 
నాయికొత్వము రనుణీయతనే . ఆఫాదించినది, కాదనలేము _కాని ర కేవలము 


505 . భాగవత ల! | 


* కాదని క Ses అద్దానిని ఎజ్జన, నాచన సోమన, పోతనలు_ ఎత్తి 
_ చూపకపోలేదు. వారి రచన లలో సత్యభామ. పూర్ణ స్వరూపము చూడతగ్గది. 


ఆందును ఆ వా పాతయందు చూపిన మెళుకువలు అత్యద్భుతముగ ' పరాకాష్టకు | 
పోయినవి. 


పోతనా ర్యుని సత్యభామతో ఓర్పును మించిన నేర్పు, భక్తి కిని. మించిన 

యు కి "వీర శృంగారములు ఆండగ నేకకాలమున ద్రదర్శింపబడినవి. కాని 

స స పట్ట భాగవత కృష్ణుని చర్యయే వేరు. ఆమె [పత్యక్షముగ. నరకా 

నురునితో యుద్ధము సాగి౭ంచువరకు (శ్రీకృష్ణుని కామె యందున్న. వీరత్వాంశ 

అసలే తెలియదేమో యనుపించును. ఆమె హృదయపు లోతు లెట్టివో కాసి 

కేశీమందిరమునందు భర్తతో మాట వరుసతై నను మ. తన శ క్ర సామర్థ్య 
ములను చెప్పుకొని 6 యుండలేదు. 


'నరకాసురునితో యుద్ధ మునకై పోవుచు కృష్ణుడు తన పోకను గూర్చి 
యలదోక గా [పసంగింప సత్యభామ _ హృదయ ముప్పొంగ్గును. తానుగూడు 
కృష్ణునితో నటి కేగి తన పావీణ్యమును' (పదర్శింపవలెనని ' ఆమెకు చిరకాలము 
నుండియు కోర్కె. అద్దాని కిడీ తరుణమని మురిసినది. కాని సరసురాణ భర్త, 
కది తానై వెలితిబడి చెప్పదు. తదింగిత మెరిగి ఆతడు, రమ్మని పిలువడు. 
పిలువనిచో ఆమె పోలేదు. అప్పట్టున తన నేర్చంతయ ' సంధించి భర రో 
చిక తంబురా నతీయు క్రితో “దేవా | సీవు నిశాట సంఘముల నుద్దీపించి చెరకాడ 

సీ | పావీణ్యమును చూడగోరుదు. గదా |ప్రాణేశ! నన్నీ వెంటన్‌ గొనిపొముు 
నేడు కరుణన్‌” అని విన/మయె వేడికొనును. ఆ వేడికోలు మరుగున ధ్వనితార్భ 
మెంతయేని గలదు. “లోకమున _నీ మగడు వీరాధివీరుడని జనులందురు, 
ఆర్ష ఉగత్పఏథ్యాతములై న మీ శ్చ శి సామర్థ్యములు . వారును వీరును చెప్పగా 

వినవలసినదే గాని ఆర్థాంగినై న వ (పత్యక్షముగ చూచు యోగ్యత. లేదా ! 
వీరలిమ్మ నలేదు- మాడలిమ్మ సలేదు. నాథుని సామర్థ్యము . కన్నులార చూడ 
హా ఆంతమ్మాతప్పు చనువు క ₹"'ఇనునది సస. 


( అద్దానికి కృష్ణుడు వీసమైనను వీగక వినియ విన. _నట్టూరకున్నాడు. 
సత్యభామ గతః కింతరము దోపలేదు. మరల పైదాని కనుబంధముగ జూచి 


న్న 


సత్యభామా స్వరూపము 209. 


వళెంచి నీ డేవీసంవాతీకెల జెప్పుదు భవ దీప [పతాపోన్న వ తుల్‌” అన్నది. 
ఈ వాక్య మొక మనోహర భాన విలసితము. పదారువేల గోపికలలో, ఏడుగురు 
పట్టమపామలలో, ఇంకను అచ్చటచ్చట నున్న | పియురాం[డలో నే యొకరి 
యందై నను, నాయందు కంచె మీ కధికమైన (పీకి. యుండవచ్చును. 
చెప్పలేక నా కడ మోమాటము చెందవచ్చును. నిజమునకు కోకశును 
'నంటిన * "ప్రియురాలు మెచ్చినదే విద్భయని సంభావించుట మాన్యము. "నేడు 
నా రాక ననమతించినచో మీ [పతాపాదులు చూచి మీ హృదయము నంజీన 
దేవీ సంహతికెల్ల నా యంతట నేను పోయి చెప్పుకొందును. ఆ (సయోజనమున 
క నను నా రాక ననుమతింపరాదా యని భావము, క సత్యభామ నేర్పులో 
వివక్నితాన్య పరవాచ్యమై నాసించినది. 


అపుడై నను కృష్ణుడు రమ్మనడు ' సరికదా, ఆసమ్మతినే వెలిబుచ్చుచు, 
యుద్ధమున- “వాయునిర్హత పద్మవనరేణువులు గావు, -తురగ రేఖా ముఖోద్యూత 
రజములు గాని, ఆకీర్ణ జలతేరంగాసారములు గావు, శతు ధనుర్ము క సాయక 
ములు గాని; కలహంస సారసకాసారములు గావు: దనుజేం: _దసెన్య కద౭బక 
ములు గాని; అని వీమియో చెప్పుచు us యుద్ధమైనను సామాన్యులతో గాదు 
దానవులతో సుమా ! ఆబలవు. నీ వేడ, రణరంగమేడ? అవి వలదు.వలదనును 
ఆ దిగజారు మాటలకు సత్యభామ ఉప్పొాంగు తన ఉత్సాహమును వరలు 
లేదు. దైత్య సమూహముతోడి యుద్ధ మని గదాన న్నీ తడు భయ పెట్టున దను 
కొని మరికొంత నేర్పుతో “దానవులై 'న నేమి, మరి దై దైత్య నమూహాము లై ననేమి, 
సీ మానిత దివ్యబాహువుల మాటున నుండగ నేమి శంక యనినది. ఈ యు క్రికి 
(పత్యుక్తి లేదు. “నీ వుండగా నాకేమి శంక' యని సత్యభామ యనునపుడు 'నే 
నున్నను సీకు భయమే. రావల'దని కృష్ణు డనలేతు. ఆయనే గాదు మగడని 
పించుకొన్న ఏ మగవాడును అట్లనడు. ఈ సందర్భ మట్టిది. ఆ సంధిగ్గావస్థలో 
_ కృష్ణుడు తడబడుచుండ సత్యభామ వెంటనే “కరతోయజములు ముకుళించి (మొక్కి 
అంజలి వీడకయే విన్నమయై భర్తను చూచినది. ఆ చూపులోని భ క్రి, వినయ 
నంపద భ రృహృదయము నేడియో కలచివై చినది. భార్యయైన నేమి, భక్తులైన 
నేమి, ఆ భ కి వినయములకు కట్టుబడవలసినదే శృంగారమునకు చలింపకున్న 
అరసికత్వమే. ద్యోతితమగును. గాని భక్తి కరుణలకు కఠుగకు న్న మానవత్వము 
నక్రే కాదు. దేవత్యమునకును లోపమే. అ కీలక మెరిగిన ఫోతన కృష్టునిచే 


204 భాగవత వై జయంతిక 
తరుణ మెరిగి “సరే” యనిపించినాడు. కదనరంగ [ప్రవేశమునకు ముందు పోతన 
చి తించిన సత్యభామ నేర్పట్టిది. . 

వా సందర్భమున ఎత్తాోగ్గడ నారనపోమనల పోకడలే చేరు. వారి 
రచనలలో యుద్ధాత్పూర్వము సత్యభామకు కృష్ణునితో వాగ్వాదమే లేదు. కృష్ణు 
డామె శక్తులను బాగుగ నెరిగినవాడు. ఆంతియెకాదు, తనకు యుద్ధమున చేదోడు 
వాదోడు!: నుండుటకే సత్యభామను వెంట నిడుకొని సోయెనేమో” ననిపించును.. 


. భాగవతమున కృష్ణుడు సత్యభామతో గూడ. గరుడారూఢుడై (పాగ్ద్యోతిష 
(ప్రాక్పాంతము చేరి” యుద్ధమునకు గడంగ (రణ| పావీణ్యధన్య సత్యభామలేచి 
పంభద్వీరసంరంభయై పాణిం బయ్యెద చక్కగా దురిమి సంఘటిత నీవీబంథయె 
తన [పాణేక్యాగభాగంబున నిలచినదట. భర్త లేచి నిలువబడ, భార్య బహుమాన . 

పురస్పరముగ లేచి నిలబడుట మర్యాద. ఇద్దానిని పొటించుటకు కాబోలు సత్య 
భామ నించిన డనుకొనినాడు శ్రీకృష్ణుడు. కాని యంతతో నామె యూరకొని 
యుండలేమ. యదువంళమౌళి చేతిలోని వింటిని నెమ్మదిగ స్పృశించినది. విల్హం 
బులను చూచినంత మా్యతమున పోయినదేమి యనునట్లు కృష్ణుడామె కందించి. 
_ నాడు. ఆ విల్ణండిన తోడనే ఆమెలో నూత్నళ క్రి మెరసీనది. ఆహవసంరంభో .. 

. త్నాపానియె వరుని యండగా పరుని. చూచినది. వ్యవధాన మీయలేదు. అగణ్యా 
నంతలేజోవి శేషావిర్భూత [పతాపముతో _వీరాలోకదుర్లోకయై దైత్యసంఘము 
నిర్వీర్యమగున్‌ట్టు బాణ్యపయోగోప సంహరణాద్యాయుధ విద్య లన్ని యును 
య థాకమముగ సంధించినటి. శ్యతుధనుర్ము క్రనారాచ మర్దన సమ్మానితయై 
ఆమె నేర్పుమీర గుణము సారింప ఆ జ్వావల్రీ ధ్వని గర్హనముగ, - విల్లు ఇం్యద 
శరాసనమగ, సరోజాతుడు మేఘముగ తాను విద్యుల్లతగ భాసించెనట. అప్పుడు 
వీరత్వముచే వింత చెలువము నందిన ఆమె చక్కదనము ద్విగుణీకృత మైనదట. 


కృష్ణుడు ఆ |ప్రావీజ్యమునకు ఆళ్చర్యచకితుడై ఎదుట వీర్మాగణి రాద 
రూపమును చూచును, తక్షణమే. ఆ శృంగారవనములో చక్కగా తీర్చిన చంద 
కాంత శిలామయ వేదిక కడ నిర్భరకౌతూహలముతో ముదులు గురియా. సా|త్రా 
జితిని తలచుకొనును. “లక్షావలోకమ్ముతో . వలేయ్రాకాగ ధనుర్విము క విశిఖ. 
(ూకావాకారాకియ హేలాగతిని” పోరు వనీథను చూచుచు. పృష్పాచయ. మొన 


శ 


సత్యభామా స్వరూపము = లంక 


రించుచు లే గౌనసియాడ, లలాటచేఖ చెమరింప నలసి తొలగిపోవు అలివేణిని, 
తలచుకొనును. కౌసుుభమణిహారుతు తన్ను తానె మరచి, వీణె చక్కగ బట్టు 
వెర వెరుగని. ఆతివ బాణాసనము నెట్టు బట్టినడో, చిలుకకే పద్యము జెప్పుచు 
ఆలసిపోవు అలివేణి అస్ర్రమం| తము లె, న డభ్యసించినదో, సరి ముత్యములను 
గూర్పజాలని తరుణి ఏ నిపుణత సంధించినదో నిశితశరములన వితర్కించు 
కొనినాడు. యుద్ధరంగమున శ|తువునకు ఆమె చేలాంచలము ఘనధూమశేతువు 
గను, బాణవృష్టి మవిరోషదాయిగను భాసింప, కృష్ణున కవి కందర్చకేతువై 
_హర్షదాయియై యొప్పినవట. నిజాంగ న |పావీణ్యము వృదయంగమమై యొప్ప 
కృష్ణుడు రసావలోకనముతో సరసముగ సత్యను జేరి “కొమ్మా ! దానవనాథుని 
కొమ్ము ఆహవమునకు దొలగినది ఇచ్చెద 'దిగిజయము. గైకొమ్మా !' అని 
యక్కళావిలాసినీ హస్తగత బాణాసనము నందుకొనుచు మెచ్చితి ననునట్టు 
నిండు మనముతో చూచినాడు. “నే ధన్యనై తి” అన్నలు సత్యభామ సరసాలోక 
నముతోనే eee 


ఇది పోతనామాత్యుడు చితి=చిన సత్యభామ. వినయమునకు లోపము 
రాని కార్యదీక్ష, శృంగారమునకు భంగము లేని వీరత్వము, వీసము పండ 
సమస్థా బులో నడిపినాడు. ఇం దంగిరసము వీరమే కాని యంతకు తక్కువ కాని 
జాజ్ట్వల్యమానశోభతో శృంగార మంతర్వాహినియై (ప్రవహించినది. తనా 
సత్యభామ పూర్ణరూపము (పత్యక్షీ కరింపబడినది. 


ఎజ్జనార్యుని హరివంశములో నరకాసురుని బాణఘాత్తము తన ఫాల 
భాగమున సోక, కృష్ణుడు మూర్చపోవును. సత్యభామ పరిచర్య చేయగా వ 
వనితను తాన రణమునకు. పురికొల్పెను. సత్యావధ్యూఖి ఆహన కే? నరకున 
అసన్నమరణ పీరణనము కొగా కృష్ణుడు నిజాంగన చాతుర్యము నకు మడి మెచ్చి 
పెల్లుబుకు _పీతితో సమర స్వేదజలో జ్ఞ్యలంబై. న న యా యుగ్మలి ఫాల భాగము. 
తుడిచి, “ఆలసితివి వింటిని మ్మనచు చారులోచనను సాభిలాషగ చూచును. 
వెద్దానిని రుక్మిణి సేవించి కై వస మొ గర్చుకొనలేక పోయి: దో, దేనికై. పదారువేల 
'గోపికామణులు మోహవి, భాంతలై. ఆ ర్తిపడిరో, ఎద్దానిని a రతికళా 
మందిరములో వాంఛించి పొందబేక (భమసిపోయినదో ఆ మహ త తర తేశోమయా. 
ప bu ఆమె పె సోకినదట. ఈ కడపటి భావ మ్య్‌ 5 


06 భాగవత వెజయంతిక 


a) 


“లి చాలును శంభుదాసుని భావౌన్నత్యము నెరిగికొనుటకు. ఇప్పట్టున 


టా a 


ల్‌ 


ననసో సోమన కీయౌడార?ము ఆబ్బియుండలేదు. సరికదా ఆ మహ తరతరుణము. 
జ బం 


tek 


తడు ఆభరణములతో నె సరిపెట్టుకొనినాడు. ఈ సందర్భమున పోతనయు ఆభ 


స 


సై 


ళ్‌, 


రణ పసావము కావింపక పోలేదు. కాని “మెచ్చితి నిచ్చెద గురువిజయము”” అను 
టు అల్‌ 
విజయచ;విలో కోరిన యాభరణము' ఆను మాట వాబ్యసిద్ధ్యంగ మగుట, [పాధా 


ము గుపవిజయమున కే యబ్బినది, అది కొంతలో కొంత నన. 


సతాఖామకు సంబంధించినంత . వరకు తక్కిన ధ్రథా eee సోమ 
నారుూదు ఎజ్బన కంతేవాసియైనాడు. ఎల్జిన కృతిలో కృష్ణుడు . మూర్చదేరి న 
“నమంచితో డా. హా సావాసిక వి విభాసిని*యగు నా థామినిని జూచి “ఏను పరిపీడి 
తుండనై డస్సితీ నొక్కింత న్‌ు కయ్య౭వు మోపు మోవు'”' మనినాడు. సోమన 
మూర్చదేవిన కృష్ణుని అ వ కార్జమింద నీవు సమరంబె కోరుదు వవస 


రంబువచ్చె” నన్‌ చెను.” ఈ నుడిలో SrA సత్యభామ పవరము 
సేయవచ్చెడ నమటయు కం wa ఎప్పటి కప్పుడే ఉపే ఎక ంయుచు వచ్చి నేడు 
సమయము వచ్చినది కావున భారము 3 వపాంపుమనుటయ జరిగినట్టు తోచును. 


ఎజ్జన నె సోమనలవలె సత్యభామ పాతను సోషించుట మాతమే కాక 
పోతన స్వతం్యతుడై చితించినాడు. కాని ఒక (గంథమ యొక్క ఛాయ ఎంత 
కాదనుకొన్నను తరువాతి దానిపై కొంత కొంత సోకకపోదు. అట్టివి ఒకటి రెండు. 
సోమన హోతనల నడుమ కాననగును. 


ఫోమన ; 
ఆరి( జూచున్‌ వారి ఇప, వనము మందారకే 
సరమాలామకరదిద బిందునలిల స్యందంబు లండంబులై 


తొరుగం బయ్యేదకొంగొకింత దొల(గం 'చోడో: శరాసారమున్‌ 
దరహాసామృత పూరముం గురియచుం దన్వంగి కేళీగతిన్‌. 


ప స్త నొంప నలరింపన్‌ కోమరాగోదయా. 
కచ _భూకుటి మందహాసములత్రో వీరంబు న్‌ 


Wy 


సత్యభామా నాలను భ్‌ 3 లి? 


జరగం గన్నుల. గెంపు సొంపు( బర(గం. పకల 
సర సాలోక సమూహమున్‌ నెజపుచుం జం దాస్య హేలాగతిన్‌. 
పె వానిలో అరిహరు౬. పరవరులుగా మారిరి. 


సోమన ; 
తం|గ్రీవినోదంబు తడవు సె(పని (వేళ్ల 
' గొనయంబు తెగల పై గోరుకొనుట : 
యద్దంబుపిడిముట్ట నలయు 'పాణితలింబు ' 
ల స్తకం బిశతియించు త కలిమి. 
చెలిక తై నొ తిలి చీరలేని యెలుంగు 
వ. జెదరకునికి 
[ప్రమద, న.రన కేళి బరిఢవింప పదం 
బె దు ఠాణంబుల నల(త( ఐడమి. 


i 


సోయగప్పు( జి|తరూపంబు( జూచుచోట 
వేసరు విలోచనంబులు వికృతదైత్య ' 
లక్ష్య మీషించుటయు మొక్క-లంపు గెలుపు 
గై కలా సత్యభామ. స 


ad 


* 


శః + పద్యభావమనే పోతన తనివితీర చక్కని "రెండు సీసములలో గు పము 
గావించుకొనినాడు. | 


' బొమ్మ పెండ్డిండ్డకు( బోవ నొల్హని, బాల 
రణరంగమున కెట్టు రా(దలంచె |! 
మగ వారి( గనిన( దా ' మజుగు( జేరెడి యింతి 
పగవారి గెల్వనే పగిది. జూచెం ! 
బసి(డి యుయ్యెలలెక్క భయమందు ఖీరువు 
ఖగపతి స్కంధ మే కడి.ది నెక్కె! 
సఖుల కోలాహల స స్వనము లోర్యని కన్య 
పటహభాంకృతుల కెబ్బరగి 'నొర్చె | 


లర... భాగవత వై జయంతీక 


సీల కంఠములకు నృత్యంబు( గరపుచు 
నలసి తలగిపోవు నలరు బోడి. 
యే విధమున నుండె నెలమి నాలీఢాది 
మానములను రిప్తల మాన మడ(ప! 


పీణె( జక్క_(గ( ఐట వెరవెలుంగని కొమ్మ 
| రు 
కాణాసనం బెటు పట్టనేర్చె ! 
ష్‌. ద 
మా(శున( దీ గూర్చంగ “నేరని లేమ 
గుణము నే క్రయ ధనుఃకోటి గూర్చె! 
సరవి ముత్యము [గువ్వజాంలని యబల యే 
నిపుణత సంధించె నిశితశరము(! 
ఖిలుకకు( బద్యంబు చెప్పనేరని తన్వి 
యస్త్రమృంతము లెన్నం డభ్యసించె ! 


పలుకు మనిన చెక్కు పలకని ముగుద యే 

గతి నొనర్చె సింహగర్గ నములు 

ననగ. మెజ సె టక రాలా. గుణధామ 
ws wae అ 


సోమన పద్యములో సత్యభామ కఠోరమ ల కెట్టోర్చెనో యను భావమును 
పోతన పద్యములలో నెట్టు నేర్చెనో యను భావమును “ద్యోతితములు. ఇక మిగి 
లిన భాగమున ఎవరి తీరు వారిదే. * ఒకరి వాట మింకొక రికి రాలేదు. అందుకు 
_ ప్యాతపోషణ చితణాదుల పట్ట నాయా కవులకు గల భిన్నధృక్పథములే కారణ 
ములు. ఆ Ds కాధారము వారి న్న! 


ఎజ్జనార్యుని క వితము సత్యనివ్షము ఆదీ సంయమన మెరిగిన సహ్బ 
దయ హృదయాహ్లాదకారి. 'యగును కాని బాహిరమగు నిందియో| దేకమును 
కలుగజేయదు. సోమనలో రజో గుణస్పర్శ యధికము, పాండిత్య (ప్రకర్షతోపాటు 
కౌతుకమును కడదాక. న. ఎజ్జిన- 


_నత్యభామాస్వరూహషము . 209 


విల్దుం గేతువు( [దుంచి రథముల నుర్విం గూల్చి సూతున్‌ వెసం 
(దెళ్ళుంజేయంగ హీనసార్ధతమెయిన్‌ దీనత్వ మట్టొందియున్‌ 
భల్లంబుల్‌ నిగిడింప క. చాపంటొండు గె కొన్న న 
వ్విల్లున్‌ నుగ్గుగ జేసినా క్షణము దేవీరత్న ము|గ్లోద్దతిన్‌. 
ఆని సత్యభామ నరకా కాసురునితో చేయు యుద్ధమును సౌమాన్యముగ వర్ణింప 
సోమన. “* ఆరింజూచున్‌ హరింజూచు” అని చముత్యారావహముగా వర్ణించినాడు. 


ఎట్జన సంయమనము గల ,కవిస తముడు. సోమన లౌక్యము నెరిగిన 
నాగరికుడు. కావుననే ఎజ్జ్బన కృష్ణుడు తన 'దేవీతో నై క్యమునంద సోమన 
కృష్ణుడు కాన్క్మను మా[తమే ఈయగల్లినాడు. రాచమర్యాదలు, ద్యూత (కీడలు, 
నర్మగర్భోక్తులు, యుద్ధ వర్ణనలు సోమన రచనలో చెక్కిన చెణుకులు. జాన 
' పదుల యుదంతమన్నను ఎజ్జనకు వెట్టి యభిమానము. గోకుల బృందావ వన వర్త 
నములలో ఎజ్జినకు గల పల్టీజన జీవిత వేదిత్యము తేటపడును. ఎజ్జిన eB 
యము సోమన" పలె షోడశ సవ| సమపాషీ పరివృతుడగు వన్నెల కృష్ణుని వై వెప 
గాక నవనీత చోరుడగు నందగోపాలునివై పే మొగ్గినది. 


ఇక పోతనామాత్యుడు కృష్ణలీలలో తేలియాడి తన జీవితమే కృష్ణార్పితము 
గావించుకొనినాడు. సాధారణముగ వాలమును బట్టిన చేయి కలమును బట్టు 
టరుదు. పోతన చేయి హలమునకు వి శాంతి నిచ్చుచు గ గ బట్టినది, ఇంకొక 
మాట- ' రాజసభాంగణములలో, వారకామినీ 'సంగతములె న “కవివరేణ్యుల 
గంటములలో, శిష్టక వుల కనుపాపలలో నాట్యమాడు వాణీ రాచనగరు పొలిమేరల 
కావల తరివోని పంటశేదారముల నడుమ ఇచ్చుకొనుటయేగాని తెచ్చుకొనుట 


యెరుగని పోతన |మోల కన్నీరిడినది.. అది హాలికులకె కాదు; _యావధ్భారతీ | 
'యులకును గర్వకారణమే. 


పోతన సత్యభామ ప్యాతకడ విలక్షణ మార్గము నవలంబించినాతు. అది 
| సత్యభామ యదృష్టమే కానోపు, మొ త్తముపై పోతనార్యని త త్రకమునకు. చేపట్టిన 
(గంథమునకు నేక వాక్‌ కాత కుదిరి ఆం(ద (ప్రడానీకమునకు అవిచ్చిన్నమగు కృష్ణ [ 
సు కురిసినదీ. , 
| (లాల, మే 1958) 
14) సక 


పోతనార్యుని కథాకథన శిల్పము 


యాల ధూళిపాళ మాస 5 
కు | 


ఈ శీర్షిక యందు మూడు కథలు పరిశీలింపఐడుచున్నవి. అవి పరి 
శతు అ. గజేం్యద మూక ణము ప్రహ్లాద so 


పరీక్షిత్తు శాపము .: | 

పరీక్షిత్తు వేటాడి దగగొని శమీకముని య్యాశమమునకు బోయి సమాధి 
గతుడైన యా మునిని జలమర్థించెను. ముని మాటుమాటాడకునికి మృతోరగ 
మును .నంసమున వై చి వెడలిపోయెను. " ఆది మునిబాలకులు చూచి శృంగితో' 
జెప్పిరి. శృంగి . కోపించి తక్షక విషాగ్నిచే రాజేడవనాడు చచ్చునని శాప 
మిడెను. తరువాత తండి దగ్గణ నేడ్వగా శమీకుడు సమాధి బాలించి కుమారుని 
వలన విషయమెతిగి రాజునకు కాపవృతాంత మే కబురువెట్టినాడు. 


ఈ కథలో [ప్రధానాంశము శృంగి శాపమిడుట. బాలురు చెప్పినంతనే 
కృంగి కోపించి కౌశికీనడికి పోయి శాపము పెట్టినాడు. రాజు తం(డిమై నురగ 
మును వై చినాడని విన్నంతనే మజియొకడై నచో నేమి చేయను? త్యోరగా తండి 
కడకు వచ్చి చూచును pr కృంగి యట్లు చేయక నదికి పోయినాడు. అతని 
కోపస్యభావ మట్టిది.. అతని స్వభావ మతని పేరే సూచించుచున్నది. మూల. 
(గంథమునం దీపేరు లేదు. వ్యాఖ్యానమునం దున్నది. ఈతని స్వభావమునకు . 
తో డతడు బాలుడగుట, తేజస్వి యగుట. కాబట్టి యీ వృత్తాంత మిట్టు నడచు. 


టకు కీలకము శృంగి స్వభావము. పోతనగా రీతని త. యపమానము వేసి. 
కథనంతయు. దీపి ంపజేసినాడు. 


న. మూలమున తస స్య కష తేజస్వీ విహరన్నాలకో ఒర్భకై కి యని 
a కథను దీపి ంపజేయట కిది చాలును. రాజు వచ్చినప్పు డచ్చట. శృంగి 
: లేడన్సుటకు 'విహర్గన్న ర్శతై క యన్నది. చాలును. కాప మిడుటకు ఆతి తేజస్వి” na 


పోతనార్యునీ కథాకథన శిల్పము లట లే 211 | 


యన్నది చాలును. ఈ రెండు విశేషణములకు , 'బాలకః' యను విశేవ్యము . 
సమానము, మూలము శాపము బుషికుమారుని తేజస్విత్మాపయు క్త కమని నిర్ణ 0 
రించినది, అరడువలనంల 


“కృష గలే భగవతి కా స్తర్యుత్పథగామినాం 
కనుకు సదా ౯ కాస్మిపళ్యత మే | బలమ్‌' 


(దుర్మార్గులకు కాసకుడై న శ్రీకృష్ణుడు పరమపదమునకు చనగా వీ రాగడము 
చేయుచున్నారు. ఇపుడు వీరిని నేను శిక్షీంతును. నా బలము చూడుడు.) 
ఆని యాతడనును. భ్రీకృష్ణుడు లేని లోటును దాను పూరించునట. ఇది వాన్ని లే 
లక్షణము. పోతనగారు కృంగియం దీలక్షణములను దీసివేసినాడు. ' అత డెంత 
తేజస్వియైనను బుషిజాలకుడు. స్యభావముచే సాధులక్షణములు గలవాడు. 
తన్ను బరమేశ్వరునితో సమానమగా చేసికొనుట పోత నగారికి నచ్చలేదు. , సరి 
గదా మచ్చగా కన్పించినటి. ఈ శాపకారము నిర్వహించుటకు వాసియం దింత 
యహంకారము పెట్టనక్క-అలేదు: వాని బాలస్వభావమునకుతోడు వాని పేరును 
వ్యాఖ్యానించిన జాలుననుకొన్నాడు శాప మిచ్చుటకు దగిన శ కీ వానికున్నదని 
వేలుగా జెప్పనక్క_జలేదు.. అతడు శమీకుని పుుతుడగుటయే చాలును, 
అందుచేత పోతనగారు మూలమునందలి యతి తేజస్వితను జెప్పక' పూర్వోక 
_ శ్లోకమునందలి వాని నామధేయములను. వ్యాక రించుటకొక్క. యుత్చేంేకు వాడి, 
నాడు-. “అని పలికిన సమానవయోరూపమునికుమారలీలాసంగి యైన శృంగి ' 
శృంగంబులతోడి మూర్తి ధరియించునట్లు విజృంభించి". యనా, డు. పూర్వోక 
శ్లోకమునకు 'బాలకులార ! ధరి(తీపాలకు శపియింతుననుచు బలువిడిని విలో 
కాలిక న ముని కుంజర బాలకు డరిగెం [దిలోకపాలకు లదరన్‌" అని, , (వాసి 
నాడు. '*విళోలాలకు' డనుటచే వాని కోపతీ వత, “తిలోకపాలకు లదరన్‌” 
_అనుటచే వాని తేజస్విత ధ్యనించుచున్నవి. ఇట్లు వాని స్వభావమును ' దీర్చి దీని 
నాధార ముగా చేసి యీ కథాక థనములో సొగసులు తెచ్చినాడు. రాజు వచ్చి 
దాహమడిగిన సందర్భమున మూలమున నిట్టున్నది-' “విశుష్యతాలు కుదకం తథా 
భూత మయాచతి. ఇచ్చట నొక చిన్న పళ్న: శృంగిరోదనము విని శమీక 
ముని సమాధి చాలించెను గదా! పరీక్షిత్తు, మాట లతని కెందుకు పిస్పింపఠేదు? 
దీనికి స స మాధానము మూలనున వాచ్యముగా లేచు. పోతనగారు “ఎండి తడిలేక 


gig య. ౨. భాగవత వైజయంతిక . 


స కుత్తుక యెలుగు డింద మందభావరి నిట్టను మనుజవిభుడు' ఆని తెలుగుచేసి 


నాడు. ఇది. పోతనగారు సందర్భమునకు జేసిన వ్యాఖ్యానము. “విపవ్యత్తాలు". 
అన్న. మూలమునందలి విశేషణమలటోని గంభీరభావమిదియే. "రాజు 
మందముగా మాట్టాడినాడు గావున సమాధి భంగముకా లేదు. శృంగి 'యెలుగెత్తి 
యేడ్చుట' వలన "సమాధి భంగ మైనది. 


-*శ్చంగి యబై శాపమును బెట్టనేల? యని వతయుకి ప్రశ్న. మూలమున | 
“ఇతో లంఘిత మర్యాదం తక్షక స్స ప్త ప్రమే౬హని” ఇత్యాదిగా శాప, (ప్రకారము 
చెప్పబడినది. అట్టి శాప మిడుటకు రాజుయొక్క మర్యాదా లంఘనము 'హాతున. 
కొని శృంగి ' Te మర్యాదా లంఘనదోవమునకై నచో కాప, 
(ప్రకార మట్టుండనేల? పోతనగారు . మక్యాదాలంఘనమును హేతువును జేయక 
లంఘన[పకారమను హేతువును జేసినాడు. “ఓడక వింటికోపున మృతోరగవ ముం 
గొనివచ్చి వం. మజ్జనక్క నంసతలరిబున? బెట్టి దైర్యం 
న. రాజు” ఆని ని ప్రకారము వివరించినాడు. 


పోతనగారు చేసిన మజియొక షు శమీకుడు ' సమాధి చాలించిన 
తరువాతే 'పుత్రం స ప పచ్చ వత్స కృస్మాద్ధి రోదిషి? కేనవాతే విపకృత మిత్యు 
కన్య న్యవేదయత్‌. నాయనా! ఎందులకెడ్డువు? నిన్నెవరేమి చేసిరని [పళ్నించె 
నని మూలమునందున్న ది. ఇది చాల సహజమైన (పశ్న. పిల్రవా డేడ్చుచు న 
“రాగా నేతండి టె యైన నడుగ్యవ్రళ్న యూంతియే.. కాని వ స; దీనిని మరల 


ade నాచరింపము (| 
'లోకులకున్‌ మనము .నర్వలోకసములమున్‌ a 
. శోకింపనేల పు పతక? : 
న కాకోదర మేలవచ్చె కంఠంబునకున్‌ (3 


మూలమునందలి పళ్నకిది తల్మకిందు. సుతుని 8 రోదనమునకు. కారణ 

మెవరో యేమో చేసియుందురనుకౌనుట శమీకుని ప్రశ్న వెనుకనున్న మనస్థ్రితి. — 
" తెనుగు సేతయందు నెవరు నేమి చెసి యండకూడదు.. _మనకెవరు' నసకారులు 
లేరన్నది [(పళ్న మూలమైన మనస్థితి. శమీకుదు సమాధ్యవస్థ నుండి లేచినాడు.. 
“సమే. ిహ్మణి ఆరీయతే వ మనః ఇతి సమాధి తః _సమభావము నుండి పుట్టు. 


పోతనార్యుని కథాకథన శిల్పము శ . 218 


ప్రశ్న రూపమెట్టుండును 2 సామాన్య గృహస్థుల (పశ్నవలె నుండునా ? ఇట్టి 
మనస్థ్రితి యో ss శమీకుని మహర్షి లక్షణము ముందు కథ నడుపును. 
ఈ (పశ్నలోనే కుమారుని తప్పిద. Ss యొజీగిన లక్ష ణము వానిని 
మందలించు లక్షణము ధ్వనించుచు శమీక మహర్షి యొక్క. సాధుస్వభావమును 
ద్వంద్వ సహిష్టుతా గుణమును ధ్వనించుచున్నది.. “సాధూనామర్థ ౦ వాగను 
వర్తతే' ఆ జరిగినదాని కనుగుణమైన |పశ్న. “వాచ మర్గోనుధావతి' కి నిచ్చట 
(పస క్రిలేదు. ఒక జరుగరాని కీడు లోక మునకు జరుగబోవుచుండగా నాసంగతి 
నెఖుగకయే హృదయము పరిత్రాపపడట సాధులక్షణము. ఉత్తమ (పకృతి 
లక్షణము. పర మేశ్యరా సత్వ 'స్థాపక మైన లక్షణము. ఉ త్రరకథ యందలి 
శమీకుని యుడార (పవర్త రనమున కిది చూళిక పట్టుట, ఈ పద్యమిట్లు (|వాయట . 
పోతనగారి కథన శిల్పమందలి యనర్హ ష్‌ ఆయన మహానుభావత్వము నకు 
నిదర్శనము. * 


కథకు పోతనగారు చేసిన మటియొక రమణీయాలంకారము బాలురు 
వచ్చి శృంగికి రాజాపరాధము చెప్పుట, “మూలమున “అర్భతైః - రాజ్ఞాఘం 
సే (పాపితం తాతం [శుక్వా* యని యున్నది. పోతనగారు-. 


క నరగంధ గజస్యందన 

ఫే తురగంబుల నేలు రాజు తోయాతురుందై 
పరగున్‌ నీ జనకుని మెడ 
కరగ ము దగిలించిపోయె నోడక తండీ ! 


ఎయని చెప్పిరని _ాసినాడు, రాజనగా .బాలుర దృష్టి యట్టుండునో యీ పద్య 
మందు. మనకు తెలియగలదు. ఈః సద్య మిట్టు [వాయట పోతనగారి మానవ 
స్వభావ పట్టాక నకు నిదర్శనము. బం.) 


ఇంతకు నిట్టి యపరాధియైన రాజెవ్వరో బాలురకు గాని, శృంగికి గాని 
తెలియదు. మణి శమీకుడు పరీక్షిత్తునకు కబురంపనేల ? మూలమునందు. దీనికి 
“సమాధానమును నాలోచనమీద కుదుర్చుకొనవలేను. పోతనగారు “పించు 
టయును వినిపించిన నమ్ముని తన దివ్య జ్ఞానంబున నమ్మానవేంటదుండు పరి 
శీస్సర పండని యెజీంగి యని వాసినాడు. ఈ క మారరు 


214 భాగవత వై జయంతిక 
ననుమేయుము. ఒక మవ్శగంథమును దెనుగుసేయట యనగా నందలి సర్వ 
విషయములను జక్కగా భావించి శంకా స్థానముల నన్నింటిని నుతరించుదు 
వాయుటగాని తోచినట్లు (వాయుట కాదు.. పోతనగారు చక్కగా ఖావించి 
యుపప తిమంతముగా కథ [వాయుననుటి కింతకంటె నిదర్శన మేమి వలయును? 


గజేంద మోక్షణము : స న 
అష్టమ స్కంధమున వర్ణితమైన దీశాను చరితము. అవతారముల నను 

వంచు భగవద్భ కుల సత్కథల నీశాను వ్రరితములందురు. ఈ గజేం్యద 

మోశణము తురీయమన్వంతరము నందలిది, ' 


ఇ౭దద్యుమ్న మవోరాజు మలయాచలమునం దాాశమము నిర్మించుకొని 
వాడి పూజనము సేయుచు నచ్చటికి నభ్యాగతుడై వచ్చిన యగ స్య మవార్షికి 
(పత్యుర్థానాదికము సేయకునికి నవమానితుడై న బుషి ఆతనికి కౌంజరయోని 
 బుట్టుమని శాపమిచ్చెను, 
హూహూ నామ గంధర్వుడు దేవలుడు స్నానార్థమై యరుగుదేరో సరసిలో 

ఆం కీడాస కడై యుండి యాతని పాదములు నుకరివలె పట్టుకొని యతనిచే 
యావామ కమ్మని శాపము నొందెను. అతడు (గావామై |తికూటాచల మందలి 
సరస్సుక నుండి తృషార్జితుడై వచ్చిన గజరాజును పట్టుకొనెను. కరి మకరము. 
అక సవా సవర్గములు పోరు సాగినది. | కరిరాజునకు బలము తగి జన్మాంత. 
రీయకమైన పుణ్య విశేషమున సతి లబ్ధిమై పరమేశ్వర సుతి సేయ వారి 
గ కడవాహనారూఢుడై వచ్చి న్మగావహాముగా గజేందుని సరస్సునుండి "పెకి " 
తాగి యుభయలకు కాపమోక్షణ మిచ్చి రక్షించెను. జ క 5 


ఈ కథను పోతనగారు 186 పద్యములలో బాగుగా పెంచి వాసినాము. 
నయనకు మిక్కిలి పియమైన కథలతో నిది యొకటి. 'తెలగుదేశ మున విశేష. 

హీశకగా సగ నో కఠలలో దీని కగస్థానము. దీనికి కారణ మేమి? 
ఎ శవగారి 'జీవవేదన మీ కథ యందు తక్కిన కథల యందు కంటె నెకు 

కుగా [పకిరింబించుటద్నోే "హోత స షం 
వాసిన త్రీక్వ వే ల లను కళలను [వాసిన తీరు వేయు. దీనిని 
లక పోతనగారి కీ కథయందింత యాప్యాయత యుండుటకు. 

షి తనార్యని కథాకథన శిల్పము 215 


తెనుగుదేశము నందిడి విశేష (ప్రచారము నందుటకు నీ కథ సామాన్య సొంసా 
రికుడై న జీవుని పరిస్థితికి చేరువగా నుండి వారికీ తెలిసిగాని, తెలియకగాని వారి 
శ్రీవ స సంపుటియందున్న మోకేచ్చ నుత్కటముగా (ప్రతిపాదించుటయే కారణము. 
ఆవిద్యాపాశములందు చిక్కుకొని సంసార గ ర్వమందు పుక్కిలిబంటిగా మునిగి 
యుక్కి-రిబిక్కిరగుచు దరిజేరుటకై జీవుడు సేయు యాకోశమునకు గజేందుని , 
పాటు (పతీక, గజేందుని. కు సర్వ జీవకోటి నిరంతరము సేయుచున్న 
మొజి, గజేందుడు జీవకోటికి (పతినిధి. పోతనగారు గజేందుని కథ యందు 
చూచిన పరమార్థమిది. ఇచ్చటనుండి యీ కథా రచనము నాయన తీర్చినాడు. 
ఈ పరనూర్థమును రథా మధ్యమున ని వేపించుటచేత పోతనగారి నిర్మాణచతు 
రత తెలియదగును. ఈ కథ యందలి 184 పద్యములలో సరిగా 67వ పద్య 
మున ' నీ సరమార్గమును పోతనగారు నిక్నేపించినాడు. 


ఊహా కలంగి bugs టోలమునంబడి పోకచన్‌ మహో 
మోవాలతా నిబద్ధపదనున్‌ విడిపించుకొనంగలేక సం 
దేహము పొందు దేహ కియ డీనదశన్‌ గజముండె భీషణ 
|గాహ దురంత దంత పరి ఘట్టేత పాదఖురా[గశల్యమై. 


ఈ యుపమాలంకోరము కేవల మీ పద్యమునశే పరిమితము కాదు, ఈ 
సాదృశ్యము కోథయం దంతర్వాహిని యని చెప్పుట కిట నీ యుపమను (ప్రకటించి 
నాడు పోతనగారు. ఇడి మహో (పతిభావంతమైన కథారచనాశిల్పము.. ఈ సాద్భ 
కన. బట్టి జీవలక్షణము న్‌ 


పవృ _త్రిమతముగా నడచు జీవుని జీవలష్షణమును ఐటచి చూపించు టకు 
గజేం|దుని విహారము వర్ణించిన తరువాత పోతనగారు కాసారమును గుణించి 
యొక పద్యమును వాసెను. ఈ పద్యము లోపలికి దిగనంతవరకు 'మకరము. 
పట్టనంత వరకు సంసార సుఖలక్షణ మెట్టుండునో ధ్యనించును- 


_తోయజగంధమ్ము దోగిన చల్చని 
మెల్లని గాడ్పుల మేను లమర.' 
గవలనాళాహోర విమల వాక ,_లహంస 

' ధవములు సెవుల పండువులు సేయ 


అటి భాగవత వైజయంతిక 


" వులదిందీవరాంభోరుహామోదంబు' 
[ఘాణరం|థంబుల గారవింప . 
నిర్మల కల్లోల నిర్గతా సాఠంబు 
వదనగహ్యరముల వాడు దీర్చ 
దీజగదభినవ సౌభాగ్య దీ ప్తమైన 
విభవ మీక్షణములకును విందుసేయ 
నరిగి పంచేం| దియ వ్యవహార ములను 
మజచి మ త్రభయూధంబు మడుగు ey 


“| మదపుజేనులకు కాసా రాకర్షణము పంచేం[దియ | పీతికరము.. (పవృ త్తి త్‌ 
మార్గపతితులకు 'సంసారము పంచేం| దియ (పీతిమా త. జనకము. వానికా 
జ్ఞానము, వీరి కీ జ్ఞానము లేదు. అవి కాసారమందు నిం[ద్రియాకృష్ణములై 

పడినవి, వీరు నట్టే సంనాత మందు పడిరి. | 


తరువాత మకరము ప. దుని ని ఇట్టుకొన్నది. రః సందర్భమున. గూడ . 
పోతనగా రుపమనే వాడినాడు. “భానుంగబశించి పట్టు స్వర్భానుషగిది నొక్క 
మక రేర్యదుం డిభరాజు నొడిసిపనై' నటి. లుల స యపమాన మేమి చేయు. 
చున్నది? ఈ యుపమానము వేదాంత శాస్త్రము 'నందలిది. “రావా[గస్త స్తదివాక 
రేందునద్భక్షో మాయాసమాచ్చాదనాత్‌ జ సన్మాతః ' కరణోపసంవారణతో 
యో౭.భూత్సుమ ప పః పుమాన్‌” అని. శంక రభగ వత్సాదులు. ఈ యుపమానము 
మాయాసమ్మాకాంత జీవలక్షణమును జెప్పునట్టిది. ఈ మకర మవిద్యక [పతి 
 యనుటికు 'మజియొకచోట- “ఇట్లు విస్మితన్మక. చ్యకంబయి. నిర్వక్వవ్మికమంబున 
నర్పహవృదయజ్ఞానదీపంబు, నతి! క్రమించు 'మవహామాయాంధకార౭బునం బోలె 
నంతకంతకు నుత్సాహకలహ. సన్నాహ బహువిధ జలవగావాంబయిన (గావాంబు 


_మవాసాహసంబున” నని మరల నుపమానమునే పోతనగారు. స్వీకరించినాడు. aly, 


ఈ 'రెండుపమానముల నిట్టుపయోగించి యేంతట నూరకొన్న చో పోతన 

గారు సామాన్యకవియే యగును. కాని యాయన య ట్లూరకుండునాడు గాదు. ఈ 
రెంటికి గజేందుని. మోతణమైన ' 'తఠువాత శుపసంవోర బొట్టు చెప్పినాడో. 
చిత్తగింపుడు-- po oe 

పోతనార్యుని కథాకథన శిల్పము =. ౨. 


తమముం బాసిన రోహిణీవిభు[ కియన్‌ దర్చించి సంసారదుః 
ఖము వీడొన్న విర క్తచిత్తుఫిగతిన్‌ |గావంబు పట్టూడ్చి పా 

దము అల్లార్చి కరేణుకావిభుండు సౌందర్యంబుతో నొప్పెసం 

_(భమదాశాకరిణీకరో బ్లిత సుధాంభస్స్వ్నాన వి|శాంతు(డై. 


మరల నవియే యా రెండే యపములు. ఇట్టుపమలు వాడి సాదృశ్య ముఖమున 
' జీవుని యా ర్తి స్వరూపమును, . బంధ మోక్ష ములను. విచి తముగా ధ్వనింప 
జేయుచు నీ కథను రమణీయ mores రచించినాడు, 


ఇది రెండు మొక్కల కంటు కట్టుట వంటిది. నేలమీడి మొక్కకు చెట్టు 
కొమ్మ యంటు కట్టితిమి. ఆ నేలమీడి "మొక్క యేప్పుగా నున్నంత వరకు" "న్స 
యంటు కట్టిన కొమ్మయాకులు మొక్కయాకులలో -నణగి మణగి యచ్చట నొకటి 
యిచ్చటనొకటి క న్పించునట్టంతర్గత మైన జీవుని వేదన యుపమాన బలము వలన 
పైకి తేలి యటనట వ్య క్తమగుచున్నది. కొమ్మ యంటుకొన్న తరువాత మొక్కతల 
[తుంచి వేయుదుము. అపుడంటు బాగుగా పెకీ వచ్చును. ఆదే కథ యంతయు 
చదివిన తరువాత గజేం| దుని బాధే యతని, మొజయు నతనివి యగుట మాని 
జీవుని వేదన యందు లయిుందును. 


లావొక్కింతయు లేదు; ధైర్యము Hae (వాణంబులున్‌. 

_ ఠావుల్‌ దప్పెను; మూర్భవచ్చె(; దనువ్వన్‌ డసె సెన్‌; (శ మంబయ్యెడిన్‌ 
సీవేతప్ప నితఃపరం బెలు(గ మన్నింపందగుం దీనునిన్‌ ; 
రావే యీశ్వుర! కావవే వరద! సంరక్షించు భదాత్మకా!. 


ఓ కమలా ప! యో వరద! యో[వతిపక్షవిపతదూర! కు. 

య్యో! క వియోగవంద్య సుగణో తమ! యో శరణాగతామరా 

నోకహ! యో మునీశ్వర మనోహర! యో వినులపభావ! రా 
కరుణింసవే తలే వ గావవే!, 


ఈ యా, కోశము గజేం|దునిదా? పోతన గారిదా? మనదా? కథ చదువు 
నప్పుడు గజేర్యదునిదీ.. పోతనగారి పద్య మనుకొన్న ప్పుడు పోతనగారిది. మనన 
కాలమందు మనది. న్యాయమున కిది యెవరిడియు కాదు, సాధారణీకృతి. పొందిన . 


918 భాగవత వై జయంతిక 
యచ్చమెన జీవుని వేదన యిది. గజేం|దుడు వట్టి యాలంబనము. గజేం|దుడు 
విభావము. ఆతని నాలంబించి భావనా, మహిమవలన పోతనగా రనుభవించి 
వ్యంజకతామహిమ వలన సహృదయులకు [పతీతి గోచరము చేసినట్టిడి. ఇది 
యచ్చమైన జీవుని వేదన. 


తరువాతి పద్యము లన్నియు “నల వై కుంఠపురంబులో నగరిలో” మొద ల. 


ఠెనవి పూర్వోక్త సాదృశ్య బలముచే నాకీ ప్తమైన భక్యావేశము చేత గజేందుని 
రక్షణమును స్వరక్షణ లక్షణలక్షితముగా భావించుటచేత (వాయబడినవి. అనగా 


నీ జీవుని మొ యంత తీవమైనదిగా నుండవలెను. “కుయ్యో కవియోగివంద్య 


లోని కూయి యంత 'దూకము “అలవై కుంఠపురంబులో నగరిలో నామూలణ. 


ఫౌధంబు దాపల నా పూలతోటలో కొలని యొడ్డున చం[దకాంతపుటరుగు మీది 
రమావినోదికి' విన్పింపవలెను. విన్పించిన నతడు రమావినోది కాడింక - మణి 
యాపన్న |పసన్నుండగునట. ఆది యాయన బిరుదు: అసలదియే పేరు [కింద 
విశేషముగా వాడినాడు పోతనగారు. ఆయన కూయి నాలించెనా- నిలువ లేడు. 
సంరంభించి యొక్క యటుకున వచ్చును.. సిరికిం జెప్పుట లేదు! ఈ మవో 
సంరంభము సీ భ కపాలన పరాయ్రణత్వమును స్యవిషయక ముగా భావింప 
కున్నచో నిట్లు (వ్రాయుట యండునా? ఈ కథ [వాయుటలో ఫోతనగారి యాను, 
భూతికి కూడ నిందుచేత సాశాత్పవేశము గల్లినది. . స 


(ప్రహ్లాద చరితము: 
(పహ్హాద చరి[తము నందున్న కీలకము సంఘర్షణ. భాగవత లషణము 


నకు నాసురలక్షణమునకు గల నిత్య సంఘర్షణ నుండి కథ పుట్టుచున్నది.. 


కాబట్టీ కథాకథన శిల్బమంతయు నీ సంఘక్షణ నుద్దీ .ప్తము చేయటలో నుండును. 


మూలకారు డీ (ప్రహ్లాద చరిత్రమును [వాసినది యూతి అక్షణమును 
ర్యాకరించుటకు. ఊతి యనగా కర్మవాసన. ఇది పభాకభరూపమున రెండు 
)ధములు. శుభ కర్మవాసన మహదను[గహము వలన నేర్పడును. మవాద్యాగ 
ూమువలన నవభవాసన యేర్పడును. [పహ్హాదుడు శుభకర్మవాసన కా| యము. 
ారణ్యకశివుపు డకునకర్మవానన కాశయము.. హిరణ్యక శడు వైకుంఠ వాసుడైె 


'మ, హరిపార్స్వుచరుడై నను విప్రశాపవశమున రాక్షసుడై జన్మించెను. 


పోతనార్యుని కథాకథన శిల్పము యఖ 219 


(పహ్హాదు డసురగర్భన్టుడెన ను సాఠదాను| గవాము వలన పరమ భాగవతుడై . 
_ జన్మించెను. _ఈ యిద్దర కేక త్రావస్థితి వలన పితాపు[త స సంబంధము వలన సి 
రెండు భావములకు సంఘర్షణ మేర్పడ్డది. కథలో నున్న చమత్కారాంళమిది. 


ఇది కథకు ప్కనాది. ఇచ్చటి. నుండి కథా లక్షణ మంతయు వివృతము 
గావలయును ers 


హిరణ్యకశిపున కనంతమైన తత్తషజ్ఞాన మున్నది. కాని వాని రాక్షస 
స్వభావము, వాని విస్టుద్వేష మంతకంచె నీబ్బడి ముబ్బడిగా నున్నని. వాని 
' యంత పరమవివేకి మటిమొకడు రేడు. వాని యంతటి మూర్జుడును లేడు. ఇవి 
రెండును పరస్పర విరుద్ధ గుణ: ములు. విరుద్ధగుణముల కేక తావస్థితి హిరణ్య 
కశిపుడు. వాని యంతఃకరణమందలి హర సర్వజీవుల యంతః8కరణము 
నందిట్టి ముడి యున్నది. ఇదియే జీవ లక్షణము. వాని వివేకము. వాని కపయో' 
గింపకుండుట. హిరణ్యక శ పుడు హిరణ్యాతుని మృతిచే చింతించుచున్న తల్రికినీ 
వధువునకును చేసిన. తత్ర్వాపన్యాసము (తిమతాచార్యులు వ్యాఖ్యానించినట్టి 
ఘట్టము. వానికి సృష్టిరహస్య మంతయు తెలియును. మాయా స్వరూపమంతయు 
తెలియును. త 'త్యవిషయమున వానికి తెలియని యంశము లేదు. కాని యీ 
విజ్ఞానమున కిదే; వాని రాక్షసలక్షణమున కదే. జ 
తల్లి కింత త తబోధ యొనర్చుటకు తేషు చేసెనో చూచితిరా ! 
అంధ్ర కవ. ,వహిత పూర్వక్షణమునందే రాశ్నసులకు గోభూసురవర్ణా శ్రోమధర్మ ము 
బ్‌; వేదములను నాశనము చేసి రండని ముదలయిచ్చినాడు. ఇచ్చి వచ్చి చేసి 
నది త త్వబోధ, తరువాత పరమదారుణమైన తపస్సుచేసి ' కోరరాని వరము 
లన్నియు |బవ్మాచే వడసినాడు. అనగానేమి ? వాని విజ్ఞానము, వాని వివేక 
మొరులకు జెప్పుటకే గాని వాని , కుపయోగింపలేదన్నమాటయే గదా ! దీనికి 
కారణమేమి ? వాని యందున్న యశుభవానన; _దాని' త్మీవత యట్టిది. దాని 
స్వరూపము విష్ణుద్వేషము. తీవమైన పరమేశ్వర ద్వేషము. ఈ ద్వేషమే వానికీ 
ము క్రిహేతువై నది. ద్వేషముఖమున వాని సాధన సాగినది. 


మతి పహ్హాదుడు దైత్యగర్భమున బడినను కుభవాసన వలన నతని, 
_ సాధన భ క్రిమార్గమున సాగినది. భక్తులో. నతడు [ప్రథమ 'గణ్యుడైనాడు. 


890 ee sie 


భ క్రపాలనమునకై వచ్చిన యవతారము శ్రీ నృసింహావతారను. భ క్రపాలనము 
నకై (పత్యేకమగా భగవంతు డవతరించిన దీ యొక్క సందర్భముననే. తక్కిన 


యవతారములందు భ క్రపాలన మానుషంగికము. కాబట్టి యీ యవతారలక్షణము 
సాత్యతమతమును. వ్యాక రించునటిది. సాత్వతమతమే భాగవత ధర్మము. పహ్హాదు. 
చరితమిట్లు భాగ వతధర్మమైన సాత్వత మతమునకు పట్టుగొమ్మ. ఏభావము. 
చేతనై నను బరమేళ్వరుని పొందవచ్చుననుట కీ కథ నిదర్శకము. హిరణ్యకశిపుని 


ద్వేషము, [ప్రహ్లాదుని భక్తి పరస్పర సంఘర్షణము చెండి శ్రీ నృసింహమూ ర్తి 


_ యావిర్భావమునందు పర్యవసించినవి. ఈ సంఘర్షణము నృసింవామూర్తి 
._ యావిద్భూతికి కారణమైన దన్నమాట. కాబట్టి కథలో 'సంవిధానకము నృసింహ. 
- మూర్తి యావిర్భావము. ఈ సంవిధానక నిర్మాణమును మూలకారు డద్భుతరీతిలో 

. నిర్వహించినాడు. పూర్వో క్తమైన శథాపరమార్థ మంతయు మిక్కిలి నిగూఢ 


"ముగా కథయందు మేళవించి పరమగంభీరముగా -జెప్పినాడు. పోతనగారీ 


సంమఘర్ష ణమును లెస్సగా భావించి దాని త్మీవత్వమును నిరూపించుటలో నదర | 


మైన (ప్రతిభను ఆరర్శిరి! చినాడు. 


ఈ సంఘర్షణా క్ష వతను 'నిరూపించుటకే పోతనగారు" పహ్హాదముఖమున 


పలికించిన (పసిద్ధపద్యమలన్నియు 'నుపయోగించినవి. ఆ పద్యములు విడిగా 
చూచిన దివ్యానుభూతిమయములై వృదయమును భక్త్యుత్సుళమును జేయును. 
సక 'సందర్భమును బట్టి యూ పద్యములు హిరణ్యకశిపునియందు నెట్టు. నస. 
నుదేకింపజేసినవో విచారించిన క థావిషయక ముగా వాని రమణీయత తెలియను. 
నరు కశిపుడనును- rag dob 
నా తోడం బితిభాషలాడెదు. జగన్నాథుండు నాకంటె, సీ. 
భూత శేణికి రాజు లేడొ కడు సంపూర్ణ పభావుండు. మ... 
| ర్మాతం జంపిన మున్ను న వెదకితిన్‌ ' బల్మా లు MSE 
డేతద్విశ్వములోనలేండు మటివా(డెందుండురా దుర్మతీ ! 
ఎక్కడం గలండే [కియనే 
న. చక్కటి వ ర్తించు నెట్టిజాడను వచ్చున్‌ 
=. జక్కూడతు నిన్ను విష్ణునిం 
న. .వైప్కుట 'గ్రేకెకవు వాని. స భృత్యుని పగిడిన్‌, 


mre ON ॥ 


హోతనాడ్యని | కథాకథన లము గ య 221 


ఇవి రెండు పద్యములు, ఈ పద్యములందు హరణ్యక శిపుని తీవద్వే మము, 
వాని దురహంకారము మా(తమే గాదు, వాని మూర్ధత్వము గూడ చక్కగా 
వ్య కృమగుచున్నది. వాని మాటలందరి పరస్పర వై వె రుధ్యము. వాసి మూర్దత్వ 
మునకు పతీక. తాను పూర్వము ప పలుమాయి వెదకెనట! నారాయణుం డేత 
ద్విశ్యములోన లేడట! మతి వెదకుట యెందులకనగా నతడు తన భ్రాతను 
జంపినందువలనట! ఆ నారాయణుడు లేనివాడయినచో తన (ఖాతనెట్టు చం పెను? 
ఆ చంపినవానికి నునికి లేదనుట యెట్లు? తా నున్న శ్యతువు కొఆకు వెదకినట్రా? 
లేనివానికై వెదకెనా? ఆ లేనివాడు | వాతను జంపుటయేమి? మటల నట్టివానిని 
దాను జంపునను చెమి? కాబట్టి వాని పరమమూర ర త్యము, వోని "ద్వేషము క 
గట్టినతనమిది. సరిగా నీ రెండు ప పగ్యములకు రెండు పద్యములలో (పహ్హాదుడు 
సమాధానము చెప్పును. హిణ్యక శిపుని వైరము భగవంతుని య స్తిత్వమును 
నిరసించునంతవజ ఏ. వచ్చినది. (ప్రహ్లాదుడు. వానికి సరిగా వ్యతిరేకము. పోతన . 
గారీ రెండు పద్యములలో (పహ్హాదుని + నోట నీ వ్యతిరేక తను ణా సంఘర్ష 
ఇను క నందించినాడు. (పహ్హాదు డనును --- 


కలండంభో ధిం గలండు గాలి. గలండాకాశంబునం గుంభినిన్‌ 
గల డగ్నిన్‌ దిశలం బగళ్ళనికలనీ ఖద్యోతచం[దాత్మలన్‌ 
ం గలం, డోంకారము నం [దిమూ ర్ల రుల (దిలింగ వ్యక్తు కులం దంతటన్‌ 
. గల డీశుండు గలండు దండి! నదికరగ్రానని యూయా యెడన్‌. 


క గల డందు లేండని 
సందేవాము వలదు చ॥కి సర్వోపగతుం 
. డెందెందు వెదకి చూచిన 

. నందందే' గలండు దానవ్యాగ జి! వింటే! 


రండు న. మన్న నవికేకము వలన క లేడని. 
రెండు పద్యములలో పరమమైన భగవద్భావము వివేకము వలన నంతట గలడని 
తరువాత “ఆని యివ్విధంబున నని. చిన్న వచనముతో సీ సంఘర్షణము 
_ ననువదించి [క్రింది పద్యములోనికి _నాకర్షించి - వ్యాఖ్యానించుచున్నాడు 
పోతనగారు -__ వల 


299 భాగవత వై జయంలతీక 


హరి సర్వాకృతులం గలం డనుచు( (వ హ్హాదుండు భాషింప, స 
త్యరు(డై యెందును లేండు లే(డని సుతుం దైత్యుండు తర్జింప, శ్రీ .' 
నరసీంవోకృతీ నుండె నచ్యుతు(డు నానాజంగ మస్థావరో 

త్కరగ ర్భంబుల నన్ని దేశముల నుద్దండ [పభావంబునన్‌ . 


పద్యమునందలి మొదటి రెండు చరణములు దైవాసుళల భావములు 
సమానకోటిలో [పతిపాదితములై నవి. మటియ నిచటి చమత్కారమేమనగా. 
పూర్వో కపద్యములందలి [కమము వీడి యిట ప్రతీపముగా నీ భావములు 
లను. (ప్రతిపాదించుట. ఇట్లు (పతిపముగా (పతిపాడించుటచేత నీ భావములు 
పునఃపునః పతిపాడితములై పునఃపునఃఖండితములై వీని పరస్పర సంఘభృున్షి. 
వ్యంగ్యమగుచున్నది. -. న 4 


ఇట్టి సంఘృష్టి నుండి థీ నఠసింహమూ రి తపు ఇతే శ్రీ నఠ 
సింవోకృతి యిట్టి సంఘృష్టినుండి యావిర్భూతమగుటచేత నడి స్వభక కపాలనమః 
తద్విపక్ష విదార రబమునందు సమర్థమెనది. ఇందుచేత నీ కథకు (పాణమీ 
సంఘర్షణ. ఈ సంఘర్షణా నిరూపజమింత యద్భుతముగా నిర్వహించుట 
పోతనగారి కథాకథన శిల్పమునకు నికషోపలము. మూలమునందీ పద్మములకు 
మూలమేమియు లేదు. ఇది పోతనగారు కథకు చేసిన వ్యాఖ్యానము. 


“ ఈ) మదాంగభ మవోఖ్రాగవోతానులీలనయు ) . 


అమరారాతి కరాక్షరోబ్డీత పవితాంభఃకణ శ్రేజికిన్‌ - 
గమలాధీశ్వరుడొడ్జె. ఖండిత దివౌక స్వామి జిన కస్త 'స్తమున్‌ 

గ మలాకర్షణ సు సుప స్తము రమాకాంతా కచోపా్తమున్‌. 
విమల శ్రీకచ శాత చూచుకతటి వివ్యస్తమున్‌ హస్తమన్‌.. ' 


భాగవతము-సామాజిక భక్తి 


_-డాక్టర్‌ తెలి'కేపల్లి లక్ష్మీనారాయణ కాస్త్రి 


మానవుడు సామాజిక జీవి. ఆత వ్య క్రిత్వ వికాసములలో సమాజ 
(పభావము (పత్యక్షముగనో, పరోక్షముగనో గోచరింపక తప్పదు. తస 
యదృష్టము కొలది తనకొక యున్నత పదవి సం|పా ప్ర ప్త మైనపుడు తనకన్న 
న్యూనముగ నున్న సామాజిక స్థితిగతులకు సంచలించి వానిని సముక్నీత 
మొనర్పు మానసిక స్థితినే సామాజిక స్పృహ యనవచ్చును. ఈ స్పృహ, 
యే కొంతమందికో పరిమిత మైనదని భావింపరాదు. అన్యులకు లేని యే కించి 
దవకాళమైన అనుభవించు ప్రతివ్యక్తి యందును నిది పొడగట్టినపుడు సమాజ 
సముద్ధరణ మనివార్యము. కాని స్వార్ధము పేరుకొని పరార్థ మును విస్మరించి 
వక కలవాటు పడిన వ్యక్తులలో సీ సామాజిక స్పృహ నడగద్ధతుః న 


-సంనియమ్యేంద్రియ [గామం సర్వత సమబుద్ధయః 
తే (పాప్నువంతి మామేవ రా హితే రతాః. 


జగద్ధితమున స్తం వారలే తనను. పొందెదరని శ్రీ గీతా 
చారో కి. సర్వభూత వృదయాంబుజ వర్తియగు తన్ను అవజ్ఞ చేసి విగ 
హారాధనా విడంబనమున మూఢుడగువాడు భస్మకుండమున. వేల్చిన యిట్టి 
వాడగునని శ్రీమద్భాగవత కపిలాచార్య [పబోధము.? శ్రీహరి ఆర్చా విగ 
చ హమునే పూజించుచు భ క్రులను గాని ఆన్యులను గాని సేవింపనివాడు సాధారణ 


. భక్తుడు. ఈశ్వదని పై (ప్రేమను భగవద్భ కుల తోడ మెతిని, భగ వద్భక్తు 


he వ్‌ Ba a ఆంధ్ర మహాలాగవశము క. 955 
క్త ఆర్బాయా మేవ హరయే పూజాం యః (శోద్ధయే హత 
న తద్భ_కేమ చాన్యేమ సభ క్రః (ప్రాకృత స్మృతః. సం. భాగ. 112.47 


224 , ne భాగవత వై జయంతిక 


లపై కృపను చూపువాడు క్రషత భ కుడు.' సకల భూతములంచు తన 
యము పరమేశ్వరుని యొక. సత్తను, తనయందు భగవంతునియందు సకల 
భూతముల సత్తమ సందర్శించువాడు భాగవతో త్రముడనియు ఆ మపితాత్ము 
డొనర్ను సమాజ పరమేశ్వర సంసేవనమే పరమేశ్వరున కక్యంత త 
మనియు న. 2 


కర్మిష్ణి స్వక ర్మానుష్టాన మునకు ఆకాటిపడును. ప గూర్చిన చింత. 
కాని స్పృహ కాని వాని కనవనరము. ఎవరి కర్మ వారిది. ““ఆవశ్యమను. 
భో క్రవ్యం కృతం. కర్మ కుభాశుభమ్‌”” ఆని ఆతని సిద్ధాంతము. అనుభవము. 
వలనత్ఞాని మనసు పరిపక్యము గాదని ఆతని మతము. అందుచే నాతడు 
సామాజిక స్పృహకు దూరుడు. కాని విశ్వకల్యాణార్థ మ. యజ్ఞయాగాది కృతువు 
లొనర్బు నిష్కామ కర్మయోగుబును కొంతవరకు. హూ చైతన్య సము 
పేతులే యని తలంపవచ్చును 


సరోక్షజ్ఞానులు స్వకీయ తరణోపాయ సంసర్గ చిత్తులు. “ఆత్మనో 
మోవకార్థమ్‌' అని మా[తమే థావింతురఃగాని “జగద్ధితాయ చీ ఆను నాలోచన 
కాయత్తులు గారు. శ్రీ శంకర భగ వత్సాదులు “దేయం డీనజనాయ చ 
చిత్రమ్‌*"- అని పార్థించుట యిట్టిదే. తన దేశములో నొక కుక్కయైనను 
ఆకలితో బాధపడు నంత వరకు తానెన్ని జన్మలనై న నె త్రెదననిన వా డపరశంకరా 
చార్యుడు శ్రీ వివేకానందస్వామి. 


కర్మజ్ఞానులకు సాధనావస్థలో నన్యస్థితుల గూర్చిన యాలోచనముండదు,, 
కొని భక్తుడు 'సాధనావస్థలో. షు ' సిద్ధావస్థలో గాని. సర్వభూత నివాసుడగు 
థీ వాసుదేవుని ఆరాధించు సమున్నత 'పథగామి. అందుచే జగన్మిథ్య యను 
సిద్ధాంతము. భక్తునకు యుక్తము గాదు. విష్ణువు విశ్వమయుడై డై నప్పుడు. విశఇము 
స్ట యగును, అట్టి వకు భక్తునకు య 


1. కారే FTES బాలి శేషు ద్వాషత్ను చ et 
ESE మె్రీ కృృపో. పేషా. యః కరోతి స స మధ్య మః. uu భాగ, 11.2.46 
కల సర్వభూతేషు యః ప శ్యేదృగవద్భావ మాత్మరః ; . Fee 

క నారాల wo భాగ వతో త్రమః. Se _సంభాగ. 112.45. 


భాగవతము. సామాజిక భీ ల CY 


అత్యంతానుకూలమై ము క్తి పద మగుచున్నది. అందుచే నతనికి సామాజిక స్ఫృవా 
'అత్యంతోత్క_టము. జీవీహృదయ స్థ పరమశివ సందర్శన మతని పరమోన్నత 
భక్తి సోపానము. అతనికి కులమత ఏభేద సంకుచితదృష్టి యేమ్మాతముండదు,. 

ఇట్టి సంసారదృష్టితో నటమటించు మూఢులను గూర్చి భ కవరేణ్యులు సదా 
పరితపింతురు. ఇట్టి జీవారాధనమునే “సామాజికభ క్రి” యననగును. భవభూతి 
దీనినే “లోకారాధనిమని పేకొనెను. ఏవంవిధ లోకారాధనము కొరకు శ్రీరామ 
చం[దుడు స్నేహమును, దయను, సౌఖ్యమును, అవసరమగుచో' సీతను సైతము 
పరిత్యణింతు ననెను.! ఆయన సామాజిక భక్తి క నా కావుననే ఆయనది 
“రామరాజ్య” మని కీర్తి గాంచినది. 


as రుల శేఖరుడు ప్రహ్లాదుడు పర మేళ్వరునితో క్‌ విధముగ మొర 
పెట్టుకొ నెను- 

భగవద్దివ్యగుణానువర్ద న సుధా పాడె పెక చిత్తుండనై. 

బెగడన్‌ సంసరణో[గవై తరణికిన్‌, భిన్నాత్ములై తావకీ 

యగుణస్తో తపరాజ్మాఖత్వమున మాయాసౌఖ్య భావంబులన్‌ 

సుగతిం గానని మూఢులంగని మదిన్‌ శోకింతు సర్వేశ్వరా!8 

ఇట్లు విమూఢచీత్తులగు జనానీక మును గూర్చి (ప్రహ్లాదుడు పరితపించుట 
ఆధునిక దృష్టిలో సామాజిక స్పృహయే యగును. ' కాన్స్‌ యిది పరోక్షమగు ' 


"సామాజిక స్పృవా. _(పత్యషమగు సామాబీక స్పృవకు వ నిదర్శనము . 
భాగవతో త్తముడగు రంతిదేవుని se 


సకల దిగంత వ్యాప్త యశోవిరాజితుడు రంతిదేవుడు. అతడు సర్వస్వ 
మును దీనులకు సమర్పించి కేదఠికమును వరించెను. కూటికి నీటికి కరువేర్పడి 
నను అతని ధైర్యము సడలలేదు. సకుటుంబుడై యొకచో నలువది యెనిమిడి 
దినములు ww ముండవలసి పు ఆ మరునాడే ఉదయమున ఆ మహా 


bas స్నేహం దయాం వ సౌఖ్యం యది వా జానకీ మపి 
“ఆరాధనాయ లోక న ng ముంచతో నాస్తి మే వ్యథ. (టి శ్రరరామచరితమ్‌ l. ల్‌) 
వ. అంధ మహాభాగవతము ".86ిక్‌-. 


15 


పలీరి. "భాగవత వైజయంతిక. 


తునక కొలదిగ ఘృతము, పాయసము, సలిలము సంపా ప్రించెను. "ఆకలి 
గొనిన కుటుంబముతో వానిని స్వీకరింప నతడు సంసిద్ధమాయెను. 


ఆంతలో మధార్పుడై న భూసురు డొక్క డతిథియె వచ్చి ఆహారము 
నర్థించెను. రంతిదేవు డతిథిదేవు నర్చించి “హరి సమర్పణ” మంచు పాయ 
సాన్నమున సగపాలు భూసురునకు సమర్పించెను. ఆతడు సంతృప్రుడై వెడలిన 
పిమ్మట నొక హ్మదు డళనార్థియై వచ్చెను. రంతిదేవుడు తన వద్దనున్న 
యన్నములో నొక భాగమిచ్చి సంతుషు నొనర్చగా నాతడు న్మివ్య-మించెను.. 


అనంతరము వేరొకడు కుక్క_గమితో "నేతేర నన్న శేషమిచ్చి వానికి మొక్కి. 
సాగనం పెను, 


"రంతిదేవుడు నీరము మాత్రము గోలి తృప్తి పడదలచెను. అంతలో 
నొక్క చండాలుడు “మానవ కులనాథ ! దప్పిగొంటిని. ఆకలిచె నడుగు వేయ 
జాలను. .నీ కడ నున్న పానీయము బోసి నన్ను (బతికింపగ దే”” ఆని. 
(ప్రార్థించెను... ఆతని దీనాలాపములకు ఆ దయామయ హృదయములోని సదా 
శివుడు సంచలించెను. వ్యాసభగవానుని రంతిదేవు డిట్లు |ప్రసంగించెను- 

“'ఆణిమాద్యష్ట సిద్ధులను, తుదకు మోక్షమునై నను అపేక్షింపను. సకలభూత 
_ సుఖార్థము తదీయదుఃఖమునే అనుభవింపగోరుదును.''? ఈ మాటలను బట్టి 

రంతిదేవుని విశుద్ధాశయ మెట్టిదో తేటపడును. కాని పోతనార్యుని రంతిదేవు డిట్టో 
_ యాశయోద్ధాటనమున నాస క్రి గొన్నవాడు కాడు. నిజమున కది సమయమును 

గాదు, పోతన రంతిదేవుడు సానుతాపయోగి. ఆందువలననే ఆరు నితో తాదాత్మ్య 
మొంది యిట్లు పలికినాడు - 

1. ఆంధ్ర మహభాగవతమ 9.645 

2. న కామమేఒహం గతి మీశ్వరాణా 

క మష్టార్థియుక్రా మపునర్భవం చ 
ఆ "9 (ప్రపద్యేఒఖిల దేహభాజా పే 
మంతస్థితో యేన భవం త్యదుః ఖాః. ఖా. ః క్ష 


(సంస్కృత భాగవతము 9-౨1-12) ॥ 


_ భాగవతము-సామాబీక భ క్రి న. 997 


అన్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి [తావుమన్న! రా 
వన్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్‌ 
[గన్నన', దాల్చి, వారికి సుఖంబులు సేయటకంటె నొండు మే. 
లున్నదె? నాకు దిక్కు పురుషో త్రము. డర్కుండు సుమ్ము పుల్క-సా! 1 


ఆం ధులు ఆర్ష 9హృదయ ముతో నాలపీంచు పద్యములలో నిది యొకటి. 
“అన్ని యన్న సంబోధన మా[మేడితమై రంతిదేవుని యనుకంపాత్మక మైన 
హృదయమును స స్పందింపజే సె ను.. స్వకీయ పాణరక్ష్షణము నుల్చ్లంభించి పతిత 
సామాజిక ప్రాణసముద్ధరణమునకు సంసక్తుడై న రంతిదేవుని త్యాగ గరిమ యీ. 
పద్యమున రసమార్గమున నావిష్మ్బృతము. “నేడు నా జలదానమున వీని 
తాపము, ఆయాసము, ఖేదము నశించు గాకొ యని యాత డా హరిజనునకు 
తన వద్దనున్న సలిలము ధారవోసి సంతుష్టు నొనర్చ్బెను. 


ఆనంతరము |బహ్మోది' దేవతలు ముదమొంది రంతిదేవుని ముందు 
సాఇాత్కరించిరి. ధైర్యపరీశ్షార్థము తాము చేసిన వృషలాది రూపములగు విమ్లు 
మాయ నెరిగించి వరము కోరుకొమ్మనిరి. రంతి దేవుడు నిష్కాముడు. వారల 
నత డేమియ నడుగక నారాయణ భక్తి మనమున వెలుగొందగా ధీరుడై పరమ 
_ పదము పొందెను. ఆ రాజర్షిని గొలిచిన వారెల్లరును థ్రీ నారాయణ చింతన్నులె. 
యోగీవలగుచు సిద్ధపదము నొందిరి. | 


“మానవ సేవయే మాధవ సేవ యని సంభావించు వారి కందరకును 
రంతిదేవుడు సమున్నతాదర్శము. ఆతని నిష్కామ సేవాదృష్టి, నారాయణ భ క్రి 
. "పరాయణత్వము సంఘసేవకుల కున్నచో వారి కవళ్యము పరమేశ్వర 
దర్శనము సంపా ప్తించును. సంఘమును నే నుద్ధరించచున్నానను నహం 
భావముతో గాక ఏవంవిధ సేనా భాగ్యము పరమేశ్వర కరుణా సం|పా స్తమను “ 
భావముతో గావించు లోకారాధన మంతయు వి సృత భరి, సముల్రిసీత మే కాని 
అన్యము కాజాలదు. ఆట్రి భక్తి కుదురుటకు మున్ముందుగా పరమేశ్వర సమర్నన 
జ. మాధివు 7 చెద్ద్‌వాడో విదితమైన గదా మానవుసిలోని మాధ 


1. ఆంధ మహాభాగవతము 9.649 


ii 2 ' . భాగవత వై జయంతీక 


వుని నందర్శింపగల్లుట. అందుచే. “సేవ సేవకొరకే' యను వమతభావముత్‌ 
గాక, సేవ సంస్కారార్భ మని, అట్టి సంస్కారము విస్తృత పర మేళ్యర సంద 
రన సంపా ప్తికి దోవాదమని భావింపగలిగ నప్పుడు లోకాలాధనము ఈశ్వరా 
రాధనమే యగును. ఈశ్వరారాధనము పరోక్షముగ టోకారాధనమే. ఏల ననగా= 
ఈశ్యరు డన్న విశ్వరూపుడు. పఠళ్యవసానముగా భక్తుని భావ సమన్వయ 
మిటిదిగా నుండవలెనని భాగవత సందేశము. . ఈశ్వర డనగా వ్మిగహమా తుడు 
ఖై 
కాడు. ఆతడు విశ్చువటనృక్షమునకు బీజమైనవాడు. జగ తనగా భౌ తిక మగు 
విశ్వము కాదు. అది పరమేశ్వరుని దివ్యకళామందిరము. అట్టి దివృకళామందిర 
మును సేవించువాడే పరమేశ్వర |పీతిపాాతుడు, 


(శ్రీ చుదాం(ధో మువోఖాగవత భక్రతతోంన్బీలశ ము) 


“~ 


శ జ శు క్‌ 


కాటుక కంటినీరు ' చనుకట్టుపయింబడ నెల యేడ్చెదో 
. కైటథదై త్య మర్దనుని గాడిలికోడిల ! యోమదంబ ! యో 
హాటకగర్భురాణి ! నీను నాకటికింగొనిపోయి యల్లక 

ర్జాట కిరాట కీచకుల కమ్మ((దిశుద్ధిగ నమ్ముభారతీ ! 


ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి పురంబులు 'వాహనంబులున్‌ 
సౌమ్ములుం గొన్ని పుచ్చుకొని చొక్కి శరీఠము(బాసి కాలుచే 
సమ్మెట వేబులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పెనీ 
బమ్మెరపోతరాజోక (డు భాగ వతంబు జగ ద్ధితంబుగన్‌ మ గా 


స్వస్తి జగ త్రయీ భువనళాసనక్ష ర్రకు హానమా|త్రవి. 

ధ్వ స్త నిలింపభ ర్తికు నుదారపదవ్యవవార్తకున్‌ మునీం _ 
(దస్తుత మంగళాధ్యర విధాన విహర్తకు నిర్దరి గళ - 
న్యస్త సువర్ణ సూత వరిహ రకు దానవలోక భరకున్‌.- 


భాగవత భ క ప్రక్లో హ్లోదుడు 


॥ | “ట్రీ ఖండవిల్లి సూర్యనారాయణ కాత్రి 


“భజ సేవాయాం"” అను ధాతువునుండి భ్‌ క్తి శబ్దము. నివృన్నమైనది. 
విశుద్దమెన తన వాజ్మనః | కియలతో. పరమేశ్వరుని సీవించుటయే భక్తి 
యనబడును, 4 


[బహ్మ్‌ సృష్టి పల ఉపాయము గానక విచారించుచున్న సమయ 
మున ఆతనికి 'తపి అని ఆకాశవాణి వినబడినది. అపుడా బహ్మ తపస్సు చేసి 
(పత్యకమైన పరమేశ్వరుని ' “నా యహంకారమును. బాపి నీ తత్త్వమును 
ఉపదేశింపు'” మని యర్థించెను. అంత పరమేశ్వరుడు హయ) గీవమూ ర్తియె = 
(బ్రహ్మకు ఆత్మత త్వమును నాల్గు కోక ములలో ఉపదేశించెను. ఇట్టి త్రత్రోోప 
దేశము భగవతో కమగుటచే నయ్యదియే భాగవతముగా రూపొందినది. దీనిని = 
. పరాత్పరుడు హయ, గీవరూపములో బహ్మకుపదేశించుటచేత భాగవతమునకు ' 
_“హయ(గీవ [బహ్మవిద్య” అను (పత్యేక 1పళశసి కూడ ప్రాప్తి ప్తించినది. 

భాగవతమును బ్రహ్మ నారదునకు, నారదుడు వ్యాసునకు ఉపదేశించిరి. ప 
శః విధముగ ఆత్మ త త్వ్వవబోధ రూపమైన భగవద్భ కిని స[పపంచముగా. 
సులభసు౭దరరీతులలో లోకమునకు . [ప్రబోధించి తత్ప్రజోధము ద్వారా. 
 నూనవులను మోషభావన్నాపభావితుల్లుగా తీర్చి దిద్దుటకే సంస్కృతములో వ్యాస 
మహర్షి, తెబుగులో పోతన మహాకవి తమతను భాగవతములను వెలయించినారు, 


భ్‌ క్రి సా త్వ (పకాళమునకు (పథమసాధనమైన ఈ అధ్యాత్మ జ్ఞాన ప్రబో ధను Fr 


భాగ వతమురో ప్రకాశించిన అట్‌ ఈ పోతన పద్యము భట 


- శ్రార్యవర్షంబును గా mre pie 
నధికరించి చరించు నాత్మత త్వ 
మధ్యాత్మ మన(బడు నట్టి యధ్యాత్మము( 
డెలియ(జేయ(గ జాలు దీపమగుచు 


నక లవేదములకు సాఠాంశమె యేక 

మె యసాధారణమగు [ప్రభావ . 
రాజకంబై న పురాణమర్మ్శ్మంబును 

గాఢ సంసారాంధకారపటలి. 


దా(ట( గో రెడివారికి దయ దలిర్చ 
నే తపోనిధి వివరించె నేర్పడంగ ' 
నట్టీ కకనామధేయు మహాత్మ గేయ . 
' విమలవిజ్ఞాన రమణీయు వేడ్క గొలుతు.. | (1.56) 
భక్తులు నాల్గు విధములుగా శ్రీకృష్ణపరమాత్మను సేవించుచులదురనియు, 
వాఠీలో ఆత్మజ్ఞానము కలవాడే పరమాత్మకు ముఖ్యుడును లలా 
కాగల్లునని యౌ [కీంది గితా స సూ క్తులు కా 


" చతుర్విధా భజంతే మాం జనాస్సుక ఎతి నోఒర్జున 
ఆరో జిజ్ఞాసు రర్థార్తీ జ్ఞానీ చ భరతర్ష భ "a 
తేషాం జ్ఞానీ ని నిత్యయు క్ర అః ఏక భ క్రిర్విశివ్యతే, స aT 17) 


ఇట్లు అధ్యాత్మ జ జాన జ్యోతీరూపమెన భధ "కిని స విశదీక. 
రింతచున్న భాగవతము అజ్ఞానాంధకారములో చిక్కుకొన్న దీనపజల నుద్ధరిం 
చుటకై ఉద్దేశింపబడుట అందలి (పత్యేకత, దీనివలన ల్లోకోద్దరణ విషయమున 
శగవతమునకు గల పాత ,పకాశితమగుచున్నది. ఈ విశిష్ట విషయమునే 
పోతన భంగ్యంతరముగ తన క కారు నిట్టు. (దకిలింింవ జేసినాడు : 


వినుమీ సంసారం బను 

వననిధిలో మునింగి కర్మవాంఛలచే వే 

దన బొందెడు వానికీ వి 

ముని గుజవర్జనము దేప మ్మ మునీంద్రా ! Eee Fe 181) 


విశేషముగ నీ ప్ర పురాణ లాజములోని భ్‌ క్తి జ్ఞాన ee సంపుటి 
“మానవ (పేమగ రూపొంది. అది భరి రహితుల er నావ ములో 


భాగవత భక్తి - (ప్రహ్లాదుడు 21 
జాతి నో | 


దేవ్యజోోతిని వెలిగించి వారీ జీవితములను రసమయములుగ తీర్చి దిద్దగ లిగి 
యున్నది. “జ్ఞానవై రాగ్య సంయు కభ క్తిః _పేమరసావహా” అని గదా సూ క్రి. 
భరక్తిజ్ఞాన వై రాగ్యములతో గూడిన భాగవత షు పురాణ రత్నము పతిత మానవు 
లకు గూడ సులభ సుందరరీతులలో తరణోపాయము జూపగలిగి యున్నది. 


ఇక భిన్నఖావ దూషితులైన వారి నందరిని. ఈ భాగవతము భక్తి. 
రూపమైన తన యలౌకిక పేమ సూతములతో నొక్క-చోటికి జేర్చి వారిలో 
పరస్పర [పేమ థావమును, మానవత్వములో మాధవత్వమును స్కుపతిస్టితము. 
చేయజాలియున్నది.. ఇట్టి అనితర సాధారణములై న [పత్యేక సన్నివేశములనుః 
బట్టియే భాగవత విషయమున, దేశీయులందరికిని అనిదంపూర్వమైన ఆత్మీయత 
యేర్పడినది, కనుకనే దేశ చర్మితలోను వాజ్మయ: wt ఇది యొక 
షప స్థానము నర్పరచుకిన్న డీ, 


భారత దేశములో వ్యాప్తి చెందిన. వివిధములైన సూరదాస తులసీ" 

దాసాదుల భ కుదకమములకును తక్తిన భ క్ర సం(ప్రదాయములకును సీ భాగవత 

ములోని భవ్య దివ్య నవ్య భక్తి సంప్రదాయమే సర్వ విధములుగా మార్గ 
దర్శక మై యున్నదని నొక్కి వక్కాణింపవలసియున్నది. . 


సర్వబంధవిము క్తి కికి కారణమైన ము క్రికి, గ్రీకృష్ణపరమాత్మకు నాయికా. 
' నాయకభావము నేర్పరచి వర్ణించుటలో మన పోతనదే అ గ్రతాంబూల మనవలసి 
యున్నది. ఈ భావమే మనకు గోపికల మధురభ క్రి ఘట్టములలో గానవచ్చును- 
ఆత్మ పరమాత్మతో 'ఐక్యము చెందినట్లు భాగవతములో “గోపికలు శ్రీకృష్ణునితో 
“పకృతి పురుషునితో. నై క్యము చెందినరీతి”' కాంతాసమ్మితమైన కమనీయ = 
కావ్య పద్ధతిలో వర్టితమైనది. ఈ దివ్యసన్ని వేశముతో సర్య|పాణి సాధారణమైన 


లౌకిక కామము శ్రీకృషభ కి. రూపములో దివ్య ప్రేమగ, విశ్వుపేమగ పరిణ 


మించి ము క్రికాంతామనో మోహనముగ చరితార్థత నందినది. దివ్య_పేమరూప 

మైన యిట్టి భ్‌ క్తియే భాగవతములోని (పథాన వస్తువు. ఇట్టి దివ్యవసు సమా 
యము “చేతనే గోపికలు బంధరహితలై. ముక్తిని. బడయగల్లినారు. గోపికల 
(పేమ ము క్రిగా పరిణమింగుటకు వారి అనన్యభ క్రి క్రియే మూలమైనది. గోప 
కాంతల యీ ము _క్రతను హారి శుకమహర్షి పరీక్ష ద్రాజేందునికో ముందుగానే 
యిట్లు తెలి పెను- 


న ళో 


288 ఖు 21 భాగవత వైజయంతిక్‌ 


తరుణుల్‌ గొందజు మూలగేహముల నుద్దండించి రారాక త 
ద్విరహాగ్ని ౦ బరితాప మొందుచు మవోవీథిన్‌ విభున్‌ మాధవుం 
బరికంభంబులు సేసి జారుండనుచున్‌ భావించీయుం జొక్కి పొం 
దిరి ము క్రిన్‌ గుణదేహమున్‌ విడిచి పీతిన్‌ బంధనీర్ము కలె. (10. 987) 


పరీక్షిన్మ వోరాజు ఈ విషయమును విని ““మూఢలై న స్రీలు తమ గుణ 
దేహము లెట్లు ,నిడువం గలిగిరి?' అని rea పకయోగీం డు మవో 
తకం 
 బాంధవముననై న6 బగనై న వగనై న 
వీతినై న( దాజభీశినై న న 


భ్‌ కినై న హారికి( బరతం[తులై యంతు 
జనులు మోక్షమునకు జనుదు రధిప! . (10. 972) 


అని తెల్పెను. కనక మానవులు, ఉత్కటమైన వ్‌. భావముచేతనై నను తప్పక 


. థ్రీవరిని 'జేరవచ్చునని తెలియుచున్నది. 


'సర్వాంగసుందరమెన 'భాగవత భ క్రికి మోక్షమే చరమలక్ష్యము. తత్సా 
ధన సామ్మగిలో భ క్రియొక్క-టే సర్వాధికము. “మోక్షసాధన సామ్మగ్యాం 
భ 'క్రిరేవ'గరీయసీ అని శాంకరసూ కి. శకముఖసంగసంజాత సుధాసజ్జితమైన 
_భాగవతఫలమును ఆస్వాదించి. పరీక్షిన్మహారాజు సప్రరాతములలోనే ము కుడెన 
(పత్యేక సన్నివేశము భాగ వతమును మోక్షకాస్ర్రముగా రూపొందించినది. ఈ 


“విషయమునే. పోతన. మహాకవి. తన క నిట్లు ws 
జేసినాడు- ' | బు 


: నిగమములు వేయం. జదివిన 
_ సుగమంబులు గావు ము క్రిసుభగత్వంబుల్‌; 
సుగమంభు భాగవత. మను a | 
నిగ మంబు( బరింప, ము _క్రినివసనము కధా, ee Re 140) స్‌ 


నవల? గతమైన ఈ 'వ్రత్యేకవకాజేవే హోతనకు పునర్జన్మము లేకుండ 
జేసిన. 'కన్తుకనే ఈ భ క్రకవి తన ues “తీకై క పదం 6 జేరు ' 


భాగవత భక్తి - _పహ్హాదుడు EE 28 


' టకునై చింతించెదన్‌ ...మహానందాంగనాడింభకున్‌” అను పద్యముతో (పారం 
"'భిలని ప న. మోవకాస్త్ర దూప (పశ సిని చాటినాడు. 


భి, తద్వారమున మోక్షసాధక త్వము కొరకే భాగవతము జనించినది. 
వ్యాసుని వ్యాకులతకు 'కారణము తెలుపుచున్న నారదుని మాటలలో మీది సత్య 
ప ప్రతీవలించినది - - 


అంచిత మైన ధర్మచయ మంతయు( జెప్పితి; వందులోన నిం 
చించుక ? గాని విష్ణుకథ లేర్పడ( జెప్పవు; ధర్మముల్‌ (పపం 
చించిన మెచ్చునే గుజవిశేషము లెన్నినంగాక , నీకు సీ 
"కొంచెము వచ్చుటెల్ల వారి. గోరి నుతింపమి నార్యపూజితా! (1.95) 


ఇట్లు వ్యాసమునీం|దుని యశాంతికి “వారి. గోరి నుతింపమి”' కారణమైనది; 
కనుక క్రీహరిస్మ రణము శాంతికి కారణమగును గదా! 


క పోతన మ హేశ్వరద్యానమ చేయచుండగా నతనికి . శ్రీరామ 
చం|దుడు (పత్యక్షమై ఆ కృతిని తన కంకితమిమ్మని యానతిచ్చుట, పోతన 
తన చితములో శ్రీరామఛందుని సన్నిధానము గల్పించుకొని భాగవతమును 
'శగోపికానివహమందిర యాయికి శేషళాయికి” సమర్పించుట, స్కంధాద్యంత 
ముల యందు “శ్రీపరమేశ్వర కరుణా కలిత కవితావిచ్చితుడైని పోతన 
శ్రీరామునే కీ ర్రించుట అను సన్నివేశములు తన -యిష్టేదై వమున 'సర్వదేవతాత్మ 
కత్వమును సందర్శించ్చుటను స్పష్టము చేయును, అం లేకాద్యు ఆవి భాగవత 
భ_క్రియొక్క విశ్వభావనకును విశిష్టకారణ ములు. ఏవంవిధ |పభావభాసుర మైన 
భక్తిని గూర్చి మరికొన్ని నిర్భచనములను జూపి భాగవతమణిహారమునకు 
నాయక మణియెన ద్రహ్లాదభ డి కికి ఆ నిర్వచనములు “పకన సమన్వ 
యించుదము.. | 


bh MS భ కి క్రి రిత్యభిధీయతే”” అని శంకరుల pre 

చూడామణి. pes నిజస్వరూపమైన ఆత్మతో తాను ఐక్యము చెందుటే భక్తి 
స్‌ యని భావము. ఈ (కింది పద్యము (పహ్జీదుని న్వస్వరూపానుసంధాన "రూప 
మైన భక్తి కిక స నిదఠర్శన పనన గా 


284 కాగి వై జయంతిక 
పానీయంబులు న గుడుచుచున్‌ భాషించుచున్‌ హాసలీ 
లాని|దాదులు సేయుచుం డిరుగుచున్‌ లశ్షీంచుచున్‌ సంతత 
శ్రీనారాయణ పాదపద్మ యుగశీచింతామృతా స్వాదసం 

ధానుండై మజబచెన్‌ సురారిసుతు( డేతద్విశ్వమున్‌ భూవరా ! (7. = 


_ ఇందు సర్వకాల సర్వావస్థలలో. [పహ్హాదుడు. Pre సంధా. 
నమ్మ చెంది, * అనగా తనలోని ఆత్మతో ఐక్యము నొంది విశ్యామును విస్మరిం 
చుట యనున దాతని స్వస్వతూపాను సంధానమును [పకటించుచున్నది. 


2. మధుసూదన సరస్వతి తన భక్రిరసాయన [గలధమున నిట్లు సెలవిచ్చెను- 
[దుతస్య భగవద్ధర్మా ద్ధారా వాహికతాం గతా - 
సర్వేశే మనస్తో వృత్తి తిః థ్‌ లతల 


అనగా సర్వదో సర్వేశ్వరుని సంస్మరించుట చేత (ద్రవించిన చిత్రములో 
ఏకధారగా బయలుదేరిన ఏీకాకారవృ త్రియే భక్రియనబడునని యర్థము. మానవుల 
చిత్రము ఇవ్షవిషయమలను గాఢముగా చింతనజేసి ఆ వినయములతో ఐక్యము 
చెందిననాడు ఏకా[గత యేర్పడును. ఈ వృత్తి [ప్రభావము చేతనే అన్యవి షయ 
విస్మరణమ సంభవించును. |పస్తుతము (పహ్హాదుని చిత్తవృత్తి కూడ్‌ ఇట్టిదేనని 
పోతన యొక్క... యీ స్వతం|త పద్యము Gos 


అడుగఢ్లేనకు మాధవానుచింతన స సుధా 
'. మాధుర్యమున మేను మజచువాన్ని 

నంభోజగర్భాదు లభ్యసింప(గలేని 

హరిభ క్రి పుంభావమెన వాని. 
మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా ( 
..... , 'జీత్తమచ్యుతు మీందం జేర్చువాని వ 
'నంకించి తనలోన నఖిల [పపంఛంబు 

థీ వెష్టుమయమని చెలగు(వాని . (7.160) 


భాగవత భక్తి _ |పహ్హాదుడు _ 286 
ఇంతేకాదు. 


హరిపదాంభో జయుగచింతనామృతమున 

నంతఠంగంబు నిండిన లై న నత(డు 

నిత్యపరిపూర్ణుండగుచు నన్నియును మటచి . ఇ 

జడత లేకయు నుండును జడునిభంగి. (7.122) 


మొదలగు భ క్రివర్ణన చిత్రములు కూడ నిట్టివే.. 


8, “ఆంకోలం నిజబీజసంతతి రయస్కాంతో పలం సూచికా. . 
(పాప్నోతీహ యథా తథా పశుపతేః పాదార విందద్యయం 
చేతోవృ తి తిరుపే పేత్య తిష్టతి. సదాసాఖ క్రి రిత్యుచ్యతే” 


అని శివానందలహరిలో ఆచార్య శంకరుల యభిభావణము. (కిందకు 
రాలిన ఊడుగుగింజలు ఆ[పయత్ననుగా ఆ ఊడుగుచెట్టు మొదటిని చేరుకొన్నట్టు, 
సూది సూదంటురాయిని చేరుకొన్నట్లు, పతివ్రత తన పతి సన్నిధిని చేరుకొన్నట్లు 
సనివ్వని చిత్తము, పరమేశ్వరుని పాదారవిందముల చెంతకు సహజముగా ' చేరి, 
ఆచ్చట స్థ సిరముగా నిలిచి, పరమానందఖభరిత మగుచుండునో అట్టి. చత వృ కి క 
భ్‌ క్రియనబడను, ఇందుకు 


ఇను మయస్కాంత సన్నిధి నెట్టు (్రాంత 
=, మగు హృషే కేశు సన్నిధి నా. విధమున. 
గరంగు చున్నది దై వయోగమునం జేసి హ్‌ స 
[కొన్నాక ఈ తమ జ చి _తంబు (ఖాంతమగుచు. జ (7.149) 


ఇక ఈ ihe నారదఖ డి సూ, తములకు (ప్రహ్లాదుని భ్‌ _కిమయ జీవితమే 
సంపూర్ణ ముగ లక్ష ప్రాయమగుచున్నది. 


నారదస్తు తదర్చితాభిలాచారతా 

తద్విస్మరణే పరమవ్యాకులతేతి. (21 సూ 

యథా |వజగోపికానామ్‌. (25 సూ) 

సాతు కర్మజ్ఞాన యోగేభ్యోఒప్యధికతరా. (58 సూ.) 
సైవ |గాహ్మా, ముముమధిః, (కీర్‌సూ.) 


296 . ... భాగవత వైజయంతిక 


మానవుల పూర్యజన్మసంచిత సుకృత విశేషము చేతనే వారికి “అనన్య 
= భక్ర ఏర్పడును. “మదీయ పూర్వజన్మ సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ . 
'_ కథాపపంచ విరచనాకుతుహలుండనై '” అకు పోతన వాక్యములు మీది విషయ. 
మును. [ధువఫరచుచున్నోవి. ఇక 'మన 'బాల భక్తశేఖరుడై న (పహ్హాదుడు “థీ, 
నారాయణ పాదపద్మయుగళీ చింతామృతా స్యాదసంధానుండై ' * విశ్యమును విస్మ 
రించియన్న నమయమందు అప్పటి ఆ బాలుని భవ్యస్థితిని పోతన తన పద్యములో 

నిట్లు స. 


వై కుంఠ చింతా వివర్ణిత చేష్టుండై. 
యొక్క(డు నేడుచు నొక్కచోట 
న|క్రాంత హరిభావనారూఢ చిత్తు(డై 
_ యుద్ధతు(డై పాడు నొక్క_చోట. 
విష్ణుం డింతియకాని వేతొండు లేదని 
యొ తిలి నగుచుండు _నొక్కచోట ga 
నలినాక్షుడను నిధానము(గంటి నేనని క EE 
యబ్బ గంతులు వైచు నొక్కచోటం. 
బలుకు నొక్కచోటం బర మేశు( గేళవ( 
బణయ వార్ష జనిత వాషృనలిల 
మిళిత పులకు(డ నిమీలితనేళుండై . వ 
_ యొక్కచోట నిలిచి యూర్శకుండు, కశ (7.124) 


మధుసూదన సరస్వతి. తన 'భక్రి రసాయని [గంథములో భ కికి సొంగముగా. 
 గసత్వమును జూపీనాడు.. - విభావానుభావ సాత్విక సంచారిభావములతో పుస్టి 
'చెంది స్వాదుత్వమును గాంచిన స్థాయిభావమే రసమనబడును. ఆలంకారిక మెన 
ఈ రస లక్షణమును బట్టే కై పై పద్యములో పోతన ప్రహ్హోదుని యందు భ కిని 
సలక్షణముగా నిరూపించిన రీతిని తిలకింతము. సీసము మొదటి నాలుగు పాద 
' ములలో వరుసగా 'నిర్వేదము, ధృతి, వాసము, ఆవేగము అను సంభారి భావ 
ములు వర్ణింపబడినవి. ఇక ఆటవెలదిలో (పవ్హాదుని నిర్భరభ కి కిలోని స్టితిభేదము 
“లను దెలుపుచున్న బావ్పపులకాదులు . స్తంభ (పయరోమాంచ్యాశవు లను 
హీర్యుక భావములకు Ss మన! ఈ పద్యముల్లోని' వ. గంతులు 


భాగవత భక్తి -ప్రహ్మాదుడు .. .. 28" 


వైచుటి ఉద్దీ వనవిభావమును సూచించుచున్నది. ఇందలి _పహోదుని భఖ _కిభరిత 
పరిస్థితి భేదము లస్నింటికి పరమేశ్వకుడు క్రేం: దముగా నుండుటవలన .నిట 
“పరమేశ్వరుడు” తను ఆలంబన 'విభావము వర్జితమైనది. డీ కరీతిగా పెపద్యము 
లోని భ క్రిరసము విభావానుభావ సాత్విక సంచారి భావములతో స్వాదుత్వము 
గాంచి “ఒక్కచోట స్‌లిచి యూరకుండుటి (కాంతి) ఆను నేకాకారవృ ి తి రూప 
మైన స్థాయిభావముతో పరిపుష్షమె సంపూర్ణ రసరూపము గాంచినది. ఇంతకు 
. ముందు చెప్పిన నారద భ క్తి 'నిర్వచనాదుళ్‌ కూడ మీది పద్యార్థములో. గ తార్థము 
pr ఇర్తే నవవిధభ కిని దెలిపెడు- '“తనువృద్భాషల సఖ్యమ న్‌” 
. అను పద్యములోను, పిమ్మట గల పద్యవట్క_ములోను ని బాలభ క్రశేఖరుని 
భ కి న క RE నిరూపిత మైనది. ఠః విశిష్ట విషయములన్ని యు “ఫ్ర ర్త 
పోతన = మహాభాగవత .రచని” తనే మదీయ భాగవత విమర్శ [గంథములో 
స పమాణముగ వివృత ములై యున్నవి. : 


ఇక భగవద్గీతలో భ క్రియోగములో అష కోకమునుండి పందొ 

మ్మిదవ శోకము వరకు చెప్పబడిన ఉ త్రమభ కుని లక్షణ ములన్ని య [పవ్హాదుని 

పట్ట సమన్విత ములై బాల (పహ్హాదుని 'దానవత్వములో మాధవత్యమును (ఐవేశ 
పెట్టినవి. భాగవతభ క్రి ఇంతటి (పభావభరి తమైనది. 


లోకములో మమతొహంకారములు వబలి సామాన్య లత 
పీడించి పీల్చి పిప్పి చేయుచున్నవి. ఇవి అర్జునుని వలె పరీక్షిన్మ హారాజును, గూడ 
ఒకప్పుడు ఫివశుని గావించినవి. లౌకికము గా గల్గిన ఆ సరీక్షిడ్విషాద భారమున్లు 
బార దోలి వాసరన పక ములోన్సే ఆ రాజేం[దుని "మావానందభరితుని జేసినదడి-' 
ఒక్క. ఆ భాగనతసుధయే. కలికాలములో బడి నానా క్రేశసమన్వితులై. న డీన 
పజలను , ఉద్ధరింపజాలినది కూడ ' ఈ భాగవతసుధయే. 


భారత సంహితారచనచేత తత తుషాతసి మనస్సంతృ్తి ప్తిని వక 
_భాగవతరచసము చేతనే ఐడయగల్లినాడు. 


“భాగవతము అ సంయుతము. అనగా మోఇానంద రసభరిత 
మెనది. కనుక. | 
. . “*వేదకల్పవృక్ష విగళితమై శుక 
ముఖసుధ్యాద వమున మొనసియున్న 
భాగవత పురాణ వలరసాస్వాదన 
పదవి గను(డు రసికభావవిదులు,” 


పోతన-సూరదాసు 
— శ్రీ అయాచితుల హనుమచ్చాగ్రి 


సూర సాగరము’ న కావ్యమహ తము గల యమూల్యరత్నములు కొల్ల 
లుగా " నున్నవి. పుష్టి మార్గానుసారముగ సూరదాసు వాత్సల్య, సఖ్య, 
మాధుర్య. భావములతో సొంగారుచున్న పదము లనేకములు రచించెను. గ్రీకృష్లుని 
లీలాస్వరూప మాధుర్యమును జూజిగొనవలె ననినచో సూర సాగరమునే చదువ 

వలెను. బాల్యలీలల వర్షించటయందు సూరదాను నెఅపిన పజ్ఞా పాథవములు 
విశ్వసా వాత్యమునందే “మరియొక కవి చూపలేదు." లేడు ఆనిన సత్యమున కెంత 
మాాతము 'దూరము కాజాలదు. శ్రీకృష్ణుని వివిధానుభాన వర్ణనమున నమ్‌ 


యశోదానందుల వాత్సల్య ee చిత్రించుట యందేమి' సూరదాసునికి సాటి 
సూరదాసే, * 


_ వస్తుసామ్యమును బట్టి తెలుగు సాహిత్యము "నందలి మహాభ క్రకవి శిరో 
 మణియైన బమ్మెర పోతరాజుగారి భాగవతమును సూరసాగరముతో తులనాత్మక 
- పరిశీలనము గావింపవచ్చును. వస్తు వొక్క్థాటియే యయ్యును ఇరువురి కవుల 
- దృక్పథములు వేరని మనము గహింపవలెను, పోతన తన యనువాదమును 
(కమబద్ధముగా. నొనరించి మూలానుసరణముగా సాగించెను.. - కావున తన్న 
yes యందలి కథావస్తువునకును తగినంత bs MS 


సూరదాసుని దృక్పథమా వెరు. "వల్లభ సం|పదాయమున ముఖ్యాంశమగు 
శ్రీకృష్ణ లీలావై భవము గానము చేయటయే' యాతని పరమ లక్ష్యము. కావున 
దళమస్కంధమా పూర్వార్థము ఊత్తరార్థములతో. పోల్చినప్పుడు సూరేసాగరము 
నందలి యితర భాగములు పరిమాణమున వెల తెలబోవుచుండును. ' దశ మస్కంధ 
' వర్దనమున సూరదాసునిది' పైచేయి యనవచ్చును. ముఖ్యముగా బాంలీలల 
వర్ణించుట యందును, (భమరగీతలను పెంపొందించి (వాయుటయందును పోతన 
గారిని మించెనని చెప్పవచ్చును. - కందులు కారణము స్పష్టము. పోతనకు 


హేతన . సూరదాసు . ఇ 9 288 | 


సమ్మగ భాగవతమును. సర్వాంగ సుందరముగా నిర్వహింపవలసి యుండెను. 
. అందుచే షన. విషళుముని 'యతివేలముగా (వాయుటకాతని క్రవకాశము 
లేదు. . 


థ్‌ క్రిపద్ధతుల యందును పోతన చలయాటే ఆంతరువు కలదు, 
పోతనగారిది అదై దై సతపరమగు భ క్తి. రామకృష్ణ భేదముగాని, శివకేశవ భేదము. 
'గాని వారియందూహిఠిపరానిది. ఈ ఏషయమును పోతనగారు తమ రచేనమున. 
చక్కగా సూచించియే యున్నారు. చేసినది మ హేశ్వరధ్యానము. (పత్జక్షమె 
భాగవత రచనమునకు | పేరణ కలిగించినది శ్రీరామచం[దమూరి. కవి తానుగా 
షష్ట్యంత ములు పలికినది శ్రీకృష్ణునుద్దేశించి! ఇంతకు నిది నవధా భదక్తియందు 
దాస్యభ క్రి యని చెప్పవచ్చును. సూరదాసునిది యట్లు గాక సఖ్య"”మాధుర్య 
భావములచే పౌంగారు భ క్తి. పోతనగారి గంటము దాస్యభ క్రి క్రి. |పధానములై న 
గజేంద్రమోక్షము, (పహ్హాదచరి_ తము మొదలగు సన్ని వేశ ములయందే పరవళ్లు 
. తొక పఠితృలోకమున కమృతత్యము (పసాదించినదని.. భావింతును. రచనా 
తం తము నాజోచించిన సూరదాసునిడి పద్రకవిత్యము: "పోతన గారిది పద్య 
కవిత్వము, 


గవాందీ సాహీత్యయు _ (పథమ నంఖుటో) 
ఫారం 


ఆదిన్‌ శ్రీసతి కొప్పువైం దనువుపై నంసో త్రరీయంబు పై 
బాదాబ్దంబుల పై( గపోలతటి పె బాలిండ్ల పై పెనూత్న మ 
ర్యాదంజెందు కరంబు క్రిందగుట. మీదె! నాకరంబుంట మై 
ల్గాదే ! రాజ్యము గీజ్యమున్‌ సలల! 'కాయంబు నాపాయమే | 


వసుధాఖండము వే(డితో గజములన్‌ హాంఛింఛితో హాహలన్‌. 
వెస నూహించితొ తోరితో యువతులన్‌ ఏీక్షించి కాంక్షించితో 
పసిబాలుండవు నేర వీవడుగ నిభాగ్యంబు లీపాటి గా 
కసుకేందుండు పదతయు బడుగ నీయల్పంబు సీనేర్చునే 2 


తపః ఫలము 
- శ్రీ కేశవతీర్ధస్వామి 


పకమపవి తమైన వర్షానికి ఆం[ధదేశం 'నర్వవిధాల శోభను 
కూర్చింది. భారతావర్శమైన బవ్మాజ్ఞానశ్రీని పండించటంలో కూడా ఆంధ 
ధాతి తీసిపోలేదు. శ్రీ వల్రభాచార్యులు, త్యాగరాజు, వేమనయోగి, తై లింగ 
స్వామి, బమ్మెర పోతనామాత్యులు, మహాయోగి తుంగదుర్తి బుచ్చయ్య, భా 
చల రావుదాసు, నారాయణతీర్చులు, తూము నరసింహదాను, తగిగొండ వేంక 
మాంది మొదలై న పరమభక్త శిఖామణులు ఆంధ ధ్యాతిలోనే అవతరించారు , 
మహోరా, ష్టాది ఇతర రాష్ట్రాలలో అవతరించిన. భ కోజనసంఖ్యకు పోల్చిన ప్పుడు 
ఆం; ధదేశభ క కజన నసంఖ్య ఆల్బంగానే తోస్తుంది. సంఖ్యలో ఆల్పమైసా ఉద 
యించిన కొలదిమండై నా తమ ఆద్భుతాదర్శ. జీవితాలతో మనకు గౌరవవిశేషా 
లను కలిగించారు. మనకు తగినంత గౌరవ భక్తులు ఆంధధగౌరవ(పతిష్టాతలై న న 
ఆదర్శజీవనులై న ఈ మవాపురుమలందు లేకపోయినా వారు మాతం మనకు 
మాసిపోని మహా శ్రీని ఆర్జించి యిచ్చారు. ఒక్క. పోఠకనవంటి శర్యాదర్శ 
భాగవత శీలుని చూచుకొనియెనా ఆం; ధ వ “ధన్యోస్మి” య / 


ఆంధ మాగాణములను తన గంటమనే నాగలితో దున్ని మధుర కవితా 
జలాలతో ఆర్డరింబేసి భ క్తి ఆనే పంటను పండించి సర్వ (వజాసీకానికి భి కి భథిక్న 
పెట్టిన కర్షక కవి తపస్వియెన పోతన మనకు సర్వదా ఆరాధనీయడు. 
(కామిక్‌. మవాయోగియెన పోతన మహాకవి తన థ్రీమదాం|[ధ ' మహాభాగ 
వత (పదానతో ఆం ధజాతికీ వెలుగు చూపాడు. . ఆ మహాభాగవత కవి 
. శేఖడని మహాభాగవతం తిలింగ (పజల దీర్చ దీర్ష తపః ఫలం! చత 
వ్ర్రిత్వాల య తృప్తిని, ఏ యింద్రలోక 'సౌభ్యాలైనా ఇవ్వలేని 
ఆనందాన్ని, వి ఆయుధాలు జలాలు సమకూర్చలేని థ్‌ క్రిస్‌; భూముఖం. మీద ' 
ఏ వస్తువూ ఇవ్వలేని. ఊఉ తేజాన్ని. పోతనామాత్యుని _ మహాభాగవతం మనకు 


శ 


ఇసున్న ది. భాగవతమే ఆయన es ఆయన న జీవితమే భాగవతం: భాగవత 


తపః ఫలము a 
నీలము యొక్క. సమ్మగత్వం పోతనగారి జీవితంలో మనం సావ్షాత్కరించుకో 
గలం. సత్యభథభ కి కి రూపం, వైరాగ్య గరిమ, ఆత్మ స్వాతం[త్యబలం, విశ్వ 
(పేమ, క్షమా సొశీల్యాదులన్నీ ఫోతనగారి జీవితంలో మనం _పగాఢంగా 
అధ్యయనం చేయవలసిన పాఠాలు. 


(ళ్‌ పోతనామాల్యో ) 


గొడుగో జన్నిదమో. కమండలువొ నాకున్‌ ముంజియో దండమో 
వడుగేనెక్క_డ ! భూములెక్కడ' ! కరుల్‌ వామామీ లశ్వంబు లే. 
క్కడ ? నిత్యోచితకర్మమెక్కడ ! మదాకాంకామితంబై. న మూ 
డడుగుల్‌ మేరయ (తోయ కిచ్చుటయ [బహ్మోండంబు 'నాపాలికిన్‌. 


“విపాయ ప్రకట[వతాయ భవతే విష్ణుస్యరూపాయ వే 
ద|ప్రామాణ్యవిదే [త్రిపాద ధరణీం దాస్యామి” యంచున్‌ |గియా 
క్షీ పుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాచి. పూజించి (ద 

వ్యా పీతంబని ధారవోసె భువనం బాశ్చుర్యముం బొందగన్‌.. 


బలిదె దై త్యే్యద కరద్వయీకృత జల పషాళన వ్యాప్తి పికిన్‌ 

_ జలజాతాయ(డు సా(చె యోగిసుమనస్సం పార్థిత శ్రీదమున్‌ 
గలితాన్నమ రమాలలాట పదవీ క స్తూ రికాళశాదమున్‌ 
నళినామోదము రత్ననూపురితనానావేదముం బాదమున్‌. 
18) య. 


పోతనామాత్యుని అభేద దృష్టి- 
పాఠ పరిశలనము 


థ్రీ" “మిన్నికంటి గురునాథ శర్మ 


సహజ పాండిత్యుడగు బమ్మెర పోతనామాత్యుడు వ్యాసవిరచితమగు 
సంస్కృత భాగవతమును ఆంధీకరించెను, అన్ని పురాణముల వంటిది కాదు 
భాగవతము. దీని శైలి మిక్కిలి (పౌఢమైనది. అదిగాక - 


. అమరుల బాస చిత్రమయి నట్టిది; యొకొ_క యక్షరంబె య 
ర్థ మొస(గు; నుండు నొక్కొాక పదంబున కే వివిధార్థముల్‌ ; పద 
(క్రమమును మార్చ వీలుగ విరాజిలి దాన నొసంస( బెక్కు.. కూ 
వములను; బై మునీం[దు నుడి భాగవతమ్మన నేమి మాటలా? 


అని నా గురుభాగవతమున [వాసితిని, భాగవతమును తెనిగించుట సామాన్య 
కార్యము కాదు. “భాగవతము( దెలిసి పలుకుట చిితంబు” అట్టి దానిని సహజ 
పాండిత్యు డెట్టు తెనిగింపబూనె నందురా? ఆ మహాతపసిికి భగవత్సాహాయ్య 
మున్నది. 


“జక్క. Ne | సోమోపరాగంబు' కం గొని సజ్జనాను _ 
_ మతంబున న్యభంకషవ[భ సముత్తుంగభంగ యగ గంగకుం జని [కుంకలిడి 
వెడలి మవానీయ మంజుల పులినతట మంటప మధ్యంబున మహేశ్వర ధ్యానంబు. 
సేసి కించిదున్మీలితలోచనుండై”' యున్న పోతన్నగారికి శ్రీరాముడు |పత్యక్షమై. 
“నీవు రచింపబూనిన భాగవతమును నా కంకితమి''మ్మన్నాడు. ఇదేమిటి? నేను. 
మహేశ్వరుని. ధ్యానించినచో రామభ|దుడు గోచరించి “నేను రామభ|దుడను 
స్తీ భాగవతము. నా కంకితమిమ్ము'” అనినాడు అని పోతన భావింపలేదా? లేదు. 
అట్లు పోతన భావింపలేదు. గోచరించిన పురమని మొదట చం|ద్రశేఖరు డను. 
కొన్నాడు. అప్పు డా పురుషడు తాను రామభ్యదుడ నన్న పిమ్మట “మ వుంకు 
వేదము లేదు కాన ళంకింపలేదు. .ఎల శంకించును? 


పోతనామాత్యుని అభేద దృష్షి - పాఠ పరిశీలనము బిర 


“చేతులారంగ శివుని బూజింపండేని 
నోరు నొవ్వంగ హరికీ ర్తి 'నుడువ(డేని 
కలుగ నేటికి? దల్దుల కడుపుచేటు' ' 

అని యిరువుర సమదృష్టిం దిలకించునుగా. మరియు- 
“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే 

శివస్య వృాదయం విష్ణు ర్విష్టోశ్చ హృదయం శివః 

యథా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శివః 
'యథాంతరం న పశ్యామి తథామేస స్వస్తి సి రాయుషి”” 


ఆని తాను (పతినిత్యము సంధా్యావందనమున స్మరించుచున్నాడుగా అంటవేతః 
పోతనామాత్యుడు నేను రామభదుడ నని ఆమ్మవోపురుషు డనుట తోడనే 
పరమానంద భరితుడై నాడు. ఖ్‌ 

శీవరూపమును ధ్యానించుచున్న విప్ణరూపమును ద్వేషింసవలెనా? విష్ణు. 
భక్తులు శివుని ద్నేషింపవలెనా? కూడదు. “తన భబించు దైవము కంటె నితర 


దై వమును ద్వేషించువాడు నిందించువాడు, మూర్జుడు. జాపనిషద తత రహస్య 
మెరుగని పండితపాంసనుడు. 


మన పోతరాజు వివేకవంతుడు. విజ్ఞాని. సచ్చిదానంద స్వరూపుడగు, 
పర మేళ్వరుడు లీలావశమున లోక సంరక్షణార్శము ఏ నామరూపగుణ వృత్తుల 
నైన స్వీకరించును. నామభేదమున్నను పరమార్థ వసువాక టే గదా యని హళఠి 
వారాభేదభావమున నుండెను. అంతేకాని, పండితమ్మన్యుల వలె నద్ర ంతిల్‌. 
పడి bu తన్నుకొనుచు నుడ్డు గుడుచుకొనలేదు. 


పోతన వేదవిహి తాచరణ భక్తి పష మ నంతష్మద్ధి గలవాడు. 
యజ్ఞము చేసి సోమపీథియైన కొట్టరువు తిక్కనామాత్యునంతటి వానికిని హరి 
హరనాథస్వామి స్వప్నమందు. సౌఇాత్కరించెనే గాని జాగద్దశయందు గాదు. 
తరువాతి కవుల కెవ్వరికై నను ఇష్టదై వము (పత్యక్షమైనచో అది స్వప్నదళ 
యందే కాని జ్యాగద్దశయందు గాదు. ఒక మన పోతన భాగవతో త్రమునకే యా 
యదృష్టము పట్టినది. పోతన కనులు మూసికౌని ధ్యానమందుండ రామభ(దుడు 


244 భాగవత . వై జయంతిక 


_ కన్చించెంగాని నిద్రపోవుచుండగా గాదు. ఆయన ధ్యాననిష్ట యట్టిది. ఆయన 
తన సౌత్వికాంతఃకరణ వృ త్తిని ధ్యేయపదార్గమునందు నటునిటు చెదరిపోకుండ 
త్రైలధారవలె నెడతెగకుండ స్థిరముగా నిల్పినాడు. బుద్ధి వృ త్రిపాశముచే దృఢ 
ముగా బంధింపబడిన వస్తువింక కన్సింపక తప్పించుకొని యెట్లు ఫోగలదు? 
ఆందువలన జా|గద్దళలో ధ్యాన సమయమందు ఉపవిష్టుడె యున్న పోతనకు 
భగవంతుడు ప్రత్యక్ష మైనాడు. ఆంతేకాని, శయ్య పె పె పరుండి ని డించుచున్న ప్పుడు 
కాదు, కూర్చుండి ని దించుచున్నప్పుడును కాదు. ధ్యానించుచు' 'కించిదున్మీలిత 
లోచనుండై * _ ఎదురుగా నిటలా[గమును జూచుచున్నప్పుడు కన్పించినాడు. 
గట్టిగా "కనులు _మూసికొన్నచో కారకము కదలదు. అపుడు కటికి చీకటి 
కన్పించును. 


విషయ మిట్టుండ పోతనను గూర్చి వాసిన వారందరు ఇతర కవులకు 
వల పోతనకును స్వప్న సాకాత్క్యారమనియ [వాయుట మిక్కిలి యన్యాయము. 
రాముడు “తిరోహితుండై న సమున్మీలితనయనుండనై '” అని పోతన [వాసెను 
గాని నిదురనుండి మేల్కొంంటినని [వాయలేదు. కనులు తెరచితినని మ్మాతమే 
(వాసినాడు. ఇది అననుభూతులకు వింతగా విడ్రూరముగా నుండును. ఏమి 
చేయుదము! 


అయితే, రామభ[దుడు భాగవతమును దన కంకితమిమ్మన పోతన అట్లు 
చేయలేదే. ఏ కవియైన తన రచించు |గంథమున కాడిని దన యిష్టదై నమును 
స్మరించుకొని పిమ్మట తదితరదై వములను స్మరించునుగాని పోతన ఆట్లు చేయ 
లేదు. (శ్రీరామచం|దుని ప[పథమమున స్మరింపక కృష్ణుని స్మరించెను. 


శ్రీకై వల్యపదంబు( జేడటకునై చింతించెదన్‌ లోకర 
శైకారంభకు భ క్రపాలనకళాసంరంభకున్‌ దానవో 
॥ [దేకస్త సంభకు( గేశిలోల విలసద్దృగ్దాల సంభూతనా 
నా కంజిత భవాండకుంభకు మహానందాంగ నాడింథకున్‌.. 
అని 'జోలక్ళోవ్ణని స్మరించెను. పోనీ, యెట్లో సరి పెట్టుకొందమన్న వష్ట్యంతము 
లందును... ““హారికి నందగోకుల 'వీవారికి” అనుచు “గోపికానివహ మందిర 
యాయికీ శేషశాయికిన్‌ అరా నే, నాంధ్రంబున | రచియింపం బూనిన 


| లోప కని ఆభేద దృష్టి - పాఠ పరిశీలనము 245 


శ్రీమవోఖాగవత టే +” అని శ్రీకృష్ణనికే భాగవతమును సమ 
ర్పితము చేసెను, పోతరాజునకు శివ కేశవులందు వఠె రామకృష్ణులందును 
భేదము గోచరింపదు. రామపదమును కృవ్ణపదమును భేదదృష్టితో వాడలేదు. 
కృష్ణవదమును వాడి రామపదమును వాడక పోలేదు. 


పలికెడిది భాగవతమట, 
పలికించెడివా(డు రామభ[దుండ(ట, నేం 
బలికిన భవహరమగున(ట 
పలికెద వేజొండుగాథ పలుక(గ నేలా? 


అనీ రామస్మరణముతోనే [గంథారంభ మొనర్చినాడు. రామాజ్ఞను శిరసా 
వహించి (పతి స్క_ంధాద్యంత ములందు రామస్మరణ “మొనర్చినాడు. “జానకీ 
చితచోరా” అనియు, ‘రాఘవ రామా” అనియు, “దశరథ రామా' ఆనియు, 
'దశాననవిరామా' అనియు, “రఘువీరి ఆనియు, 'కణకంఠకార్ముక విఖండన 
ఖేలని అనియు, 'రామచం[దనృపాలా” అనియు, “రఘుకుల తిలకా' అనియు, 
*“జగదభిరామా" అనియు, ‘రామచంద్ర నరేందా' అనియు అనేక విధముల 
రామపదమును పోతన భఖ క్రి శోద్ధలతో నిలిపినాడు. 


'గంథము మొట్టమొదట'శ్రీ కై నల్యపదంబు జేగుటకునై చింతించెదన్‌. .. 
మహానందాంగనా డింభకున్‌*” అని కృష్ణస్తుతి కలదు గదా అందురా? అందులకు 
(పబల కారణమే కలదు. రామాయణము రాముని జెప్పుచున్నట్లు. భాగవత ము 
కృష్ణుని జెప్పుచున్నది. [పసంగవళమున రామకథ నవమ స్కంధమునం దేక 
దేశమున మాతము కలదు. తక్కిన స్కంధములందు లేదు. (ఫ్రీకృష్ణుని చరిత 
మట్టుగాదు. దశమస్కంధ, ఏకాదశ, ద్వాదశ స్కంధములు (శ్రీక్సష్ణమయ 
షు! .కావున భాగవతము శ్రీకృష్ణుని గురించినదనుటకు పోతన (గంథాదిని 
జౌచిత్యమును పాటించి (గ్రీకృమ్లని (పార్టించి వస్తుసూచనాదు లొనర్చెను. “వస్తు 
నిర్దేశో వాపి 'తన్ముఖమ్‌”” అనునొక కట్టుబాటున్నది గదా. అందుచే పోతన 
యట్లు చేసెను. ఆ పట్టున ఆ గంటముతోనే షష్ట్యంత ములను వాసి ఆ (పక 

రణము ముగించెను. “రామబ్రహ్మము, కృష్ణపరమాత్మ ఒక్కటే. పద భేద 
సీ మున్ననేమి? 


246 భాగవత వై జయంతీక 
భూతేవ్వంతర్యామీ జ్ఞానమయ స్పచ్చిదానంద:ః 
.పకాఠేః పరః పరాత్మా యదుకులతిలక సృఏవాయమ్‌ .. 


ఆని [పబోధసుధాకరము కృష్ణుని సచ్చిదానందు డనుచున్నడి. ఆట్టి పఠాత్మ 
సంస్మరణము |? గంథాదిని పోతన వంటి జాని చేయుట స్తం తల్యు గదా! 


పోతన భాగవత పంచశతి మహోత్సవముల sh కోన పోతనను 
గూర్చి ఆనేకు లనేక వ్యాసములు (వాసిరి. 'ఓక ఆచార్యుల వారు పంచశతి 
(పత్యేక సంచికలో పోతన విశిష్టాద్యెతి యని [వాసిరి. అందుకు వారు [శుతి 
గీతల ఆం| ధీకరణమును | [పమాణీకరించిరి. | శుతిగీతల ఆంధ్రీకరణము పోత్తనది 
కాదు. నారయడి. నారయ[వాతలంబట్టి పోతన మతముం బరిగణించు ేమిటో? 
వారయ ఆం, ధీకరణము సరిగా లేదు. “నత ఇద ముర్టితమ'' అను (శతి 
గీతను మిక్కిలి చెడగొవైను. నారయ వ+ష్టాద్వెతి యైన కావచ్చునేమో కాని 
పోతన మాృాతము కాదు. 


పోతన ఓమ్‌ (పథముననే ““శ్రీకై వల్యపదము”' ను గోరెను. కైవల్య 
మోక్షము అఖండాద్వితీయ సచ్చిదానంద (దివ్మోత్ర్మైక్య స్థితి. విశిష్టాద్వెతులకు 
జీవ బ హమ్మైక్యలక్షణ కైవల్యము క్రి లెదు. వారికి సాలోక్య సారూప్య సామీష్య 
ముక్రులే కలవు. పోతన నోరార కైవల్యముం గోరుచున్నాడు. మరియు ఆయన 
కాను మహేశ్వరధ్యాన పరాయణుడనని చెప్పుకొన్నాడు. విశిష్టాద్వెతులకు 
శివుడు చుక్కెదురు. వారు హరిహరులకు భేదము పాటింతురు. పోతన 
ఆభేదము పాటించును. ఇట్టి పోతన విశిష్టాద్వెతి యని |పపంచమునకు చాటిన 
వచ్చు లాభమేమో? 


పోతన నారాధింపబూనిన (పథుత్వమువారు వేలు లక్షలు ఖర్చు చేయ . 
చున్నారు. అందువలన పోతనకు ఒఠగునది ఏమియు లేదు. ఆ లక్షలతో ఆంధ 
మహాభాగవతమును అందముగా. నిర్దష్టముగా నచ్చువేయించి వేలకొలది (పతులను 
ఉచితముగా" ప్రజలపై పై వెదజల్లినచో పోతన ఆత్మ సంతోషించును. పోతన ఆరాధన 
సవలమగును. నిర్దుష్ష భాగవతమునని పలక వినుడు, 


. పోతనామాత్యుని అభేద దృష్టి - పాఠ పరిశీలనము 247 


ఢ్రీ అ వాయ గవ శాస్తు9ల వారి దగ్గరనుండి నేటిదాక ఎందరో పండితులు 
క పరిశోధించి సవరించిరి. క వేయించిరి. కొందరు వ్యావ 

క భాషావాదులు తమ పిచ్చి నందులో దూర్చిరి.. కొందరు నిర్యతి [పాస 
వాదులు తమగోడు నందునో జొన్చిరి. కొందరు తాళప[త పు స్తకాభిమానులు తమ 
కండూతి దాని కంటించిరి, ఇట్లు భాగవతమునకు బహు నాయకత్వము పట్టినది. 
కాన నిష్పక్షపాతముగా గద్ధ ధగా మూలానుసారముగా భాగవతమును బరిశోధించి 
నిర్జమ్షము చేసి మన భవివ్యత్సంతత్‌కి ఆ యమృతభాండము నందింపవలసి 
యున్నది. ఇంత మంచిపనిని గొప్పపనిని భాగవతాభిమానముగల (ప్రభుత్వము 
తప్ప మరొకరు చేయలేరు. రాజు తలచుకొన్న (దెబ్బలకు) డబ్బులకు కొదవా. ? 


ఆంధ్ర మహాభాగవతమును నూరేంద్దక పెబడిన కాలమునుండి యెందరో 

( పండితులు పరిశీలించుచున్నారు గదా! గ ఎట దృష్టులనుండి కొన్ని దోషములు 

 దొంగలవలె తప్పించుకొని తిరుగుచున్నవి. ఆ దోషపదముల కేదో యొక అర్థ 

 ముంటచే అవి గుణములుగా పెకి గన్పించుచున్నవి. దొంగయు మనుమ్యని 

వంటి వాడేగా! అర్థముండనిచో. వెంటనే ర్తించి సవరించెడివారే.. ఆట్టివానిం 
గొన్నిటి మీ ముందుంచేదను. 


1. ఎవ్వనిచే జనించు జగ, మెవ్వని లోపల నుండు లీనమై, 
యెవ్వనియందు డిందు, బర మేశ్వరు( డెవ్వడు, మూలకారణం 
బెవ్వ్య(, డనాది మధ్యలయు. డెవ్వండు, సర్వము దానయెన వాం 
డెవ్వ(డ, వాని నాత్మభవు, నీళశ్వరు నే శరణంబు వేడెదన్‌. . (8.78) 


గజేందుడు పరమేశ్వరుని ప్రార్థించు సందర్భములోని * దీఫద్యము. 
"ఈ పద్యము రాని కవిగాని పండితుడుగాని భకుడుగాని గాయకుడుగాని 
_ఊండడు, కొందరు సభా పారంభము నందును దైవ పార్థనగా' చదివెదరు. 
ఇంత (పసిద్ధమైన పద్యమునందు దొంగ దాగుకొని యున్నాడు. జగ మెవ్వని 
యందు లీనమై యుండును. ఎవ్వనియందు డిందును. ఈ రెండు వాక్యముల శ 
కర్ణ భేద మున్నదా? లీనమగుట, డిందుట. ఒకటి గాదా? పోతన మహాకవి. 
యిట్లు పునరు క్రిదోవగస్తముగా [వాయునా ? చెప్పుడు, 


శ 


ఎ 


248 భాగవత వై జయంతిక 


కవి యిందు మొదటి మూడు వాక్యములలో జగముల 'సృష్షి స్థితి 
అయములను జెప్పినాడు. మొదటి వాక్యమున సృష్టిని జెప్పి, రెండవ వాక్యమున 
“ఎవ్వని లోపలనుండు లీలమై” అని స్థితిని జెప్పినాడు. అచ్చులో “లీల అను 
పదములోని లి సానమున ని అను అక్షరమును కంపోజర్‌ పెట్టినాడు. 
'లీలమె” అనునది “లీనమై” ఐనది. రజ్జువందు సర్పము వివరముగా నున్నట్లు 
ఈశ్వరునందు జగము లీలగా నున్నది. లీల యను పదము వివర్తముం 
దెల్పును. మూడవది “ఎవ్యనియందు డిందు అను వాక్యము లయము దెల్పును. 
కాన “ఎవ్వనిచే జనించు జగ, మెవ్వని లోపల నుండు లీలమై” ఆను పాఠము 
సాధువు. 


యస్మిన్ని దం Me మేనేదం ౧ య ఇడం: స్వయం , 

యోస్మాత్పర స్మాచ్చ పర స్తం [పపదే స్వయంభువమ్‌. (8.8.8) 
ఆను మూల శ్లోకమునకు జాపనిషద పద్ధతిలో గాక ఆందరకు ను ము 
బోధవతునట్లు పౌరాణిక “పద్ధతిలో ఫోశ్రన తెలుగు పద్యము - "వాసెను, 
ఈ గజేందని సో తములో సగుణ నిర్గణములు మాయతో 'దాగుడుమూత 
లాడుచుండును. సామాన్య కవికి కొరుకుడు పడవు. అందులకే “భాగవతము 
దెలిసి పలుకుట చితంబు' అని పోతన పల్కినది. 


2. సర్వాగ మామ్నాయ .జలధికి (8.81) అను సీసమున “గుణలయో 
| ద్రీపిత గురుమానసునకు” అని గలదు. లయ పదమున కర్థముంటచే . 
దానివై పెవ్యరు చూడలేదు. “గణలయోద్దీపిత' గాదు “గుజణచయో 
ద్రీపిక” అనవలె. 'తక్‌క్షోభ విస్ఫూర్ణిత మానసాయ' (8.8. 16) అని 
_మాలము. సత్వ రజ స్తమోగుణములు సమితిని క. కలత చెంది 
ఉద్దీపించిన గాని ఈశ్వరుడు సృష్టికి గడంగడు. 'సోకామ యత 


బిహుస్యాం [పజాయేయి. ఆని (తి. గుణలయమైన యింశకేమున్నది? 
సర్వహన్యము.. 


త. వచ్చు నవ్షమ వసువు సావర్ణి వాడు. oe (8. 416) 


“అష్టమ వసువు" అని పడినది. కవ్వం. “అష్టమ '' మనువు" అనవలె. 
సావర్థ అష్టమ. నవనవ న 


జి 


4. 


పోతనామాత్యుని అభేద దృష్టి = పాఠ పరిశీలనము . 249 


మహిత రౌదంబున మల్దుర కళనియై (10.1826) అన్ను పద్యమున 
“ఖలులకు విరసంబుగా దండియై' అని కలదు. ఈ పద్యమున నవరస 
ములు చెప్పబడినవి. “ఖలులకు విరసంబుగా' అని కాదు. “ఖలులకు 
వీరంబుగా' ఆనవలె. వీర రసము లేకున్న నాక రసము తగ్గును. 


చంపె రక్కసిం వట్టి చృకవాకుని గూల్చె _ (10.1882) 
చ్మకవాకుని గాదు. “'చకవాతుని గూల్చె' అనవలె. “చ కవాతశ్చ 
దానవః' అని మూలము. “ఆలో( జ్యకసమీరదై తు అని (10. 271) 


/ పద్యము. 


విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుండు (10,ఉ తర. 985) 


a విజ్ఞానము. లేనివాడు కాడు. "విజ్ఞాని; రాగాది విరహితస్వాం 
తుండు” అనవలె. 


అహ నిదపోయెడి అను (7.58) పద్యమున “ప్రాణి దేవాము 
లకు వేజై తాను ముఖ్యు(డై' అని కలదు. “పాణ రేహములకు' అని 
వలె. 'సచాన్యః ప్రాణదేవాయోః' అని మూలము. 


మునీం|దులు నిజవిము కకాములై. (7.£66) 
“నిజవిముకి కాములై ' అనవలెను. 


'ఆడదు భర్తమాట 'కెదురాడదు వచ్చినవారి వీడయా 


నాడదు పెక్కుభాష లెడనాడదు వాకిలి వెళ్ళి కల మా 
టాడదు మిన్నకేని సుగుణావళి కిందిర గాక సాటి యే 
చేడియ. లేదు చూరికులశేఖరు కస్వయముమ్మడమ్మకున్‌. (6.27) 


ఇందు “ఇంబిరగాక.యే చేడియ లేదు. ఇంతవర కర్ణము సరియే. 


_ఆటుపె 'చూరి కులశేఖరు' అని కలదే ? చూరి కర్ణమేమి ? ఆదిగాదు, 
గాక సాటీ యే చేడియ ' లేరుచూరి కుల శేఖరు - కస్వయముమ్మడమ్మకున్‌' ఆ 

యుండవలెను. ఏ చేడియలు-ఏరుచూరి కులశేఖరు' అని విభజనము, 'ఎజ్జన 
యింటి పేరు “ఏర్చూరు.' అదియే యిచట గణానుకూలముగా “ఏరుచూరు” ఐనది, అ 


మాది ఏర్చూర్జు. మేమును పద్యములలో. ఏరుచూరు అన్ని వాగుదుము, 


250 భాగవత వై జయంతిక 


id. ఆ సజయాంక సాశ్షీ మ్మాతంబగు కరీరంబు వేని యొవ్వ డలుంగ 
శోష: (6, 417) 
శరీరము పాంచభొౌతికము. జడము. అది సాక్షిగా నుండలేదు. శరీరము 
గాదు. అచట “శారీర అని యుండవలె. కారీరి [పత్యగాత్మ సాచి. 


11. స్వప్నంబు నందుల సౌఖ్య మాకొారంబు నందుల నిత్యమై “యంతభలేని 
యట్టి చందంబున (5. 1. 158) 
“ ఆకారంబు" గాదు “ఆ కాలంబు అనవలె. స్వప్న సుఖము ఆ కాలమున 
నుండును. శరువాత నుండదు. 


12, ఆచ్చట వి|పసూను(డు భయం టొక యించుక లేక, చంప(గా 
వచ్చినవారి యందు గరవాలము నందును గాళి యందు. దా 
నచ్చుత భావముంచి హృదయంబున, ఐద్ముదళాక్షు నెంతయున్‌ 
మచ్చికతోడ నిల్సి యనుమానము నొందక యుండె నెంతయున్‌. 

| (5.1. 186) 


# 


ఇచట మూడవ పాదముం గూర్చి అకాడమీ భాగవతమున నిట్టున్నది. 
“అచ్చట వ్మిపసూను(డు అను పద్యమున. “అచ్యుత భావము' ఆని అన్ని అచ్చు 
(ప్రతులలో నున్నది. అచ్చుతభావము వ్యాకరణ సమ్మతము కాకపోయినను 
పోతన రచనతో నిట్టి సమాసములు తరచు కనబడుచుండుటను బట్టియు, 
పాసము ననుసరించియ “అచ్చుతుడు' ఆనుట వాడుకలో నుండుట వలనను 
ఇటే కవి పాఠముగా (గహింపబడినది.”. 


ఈ [వాతతో నాకు పనిలేదు. ఈ పద్యమును పోతన గాదు, బొప్పరాజు 
గంగన (వాసెను, "'ఆచ్చుత భావము"గాదు. 'ఆచ్యూత భావము” గాదు. *అచ్చితి = 
శావము. అని గంగన కవి [వాసియుండును. చితి” అన పర[బహ్మము. ౪-7 
చితి = = అచ్చితి. భరతుడు మవాోజ్ఞాని. “సరం ఖల్విదం (బహ్మీ అను కుతి 
వెరిగిన భరతుడు నామరూపాత్మకమెన ( యీ సర్వ జగ మును (బహ్మముగా 
'చాచుచున్నాడు. కాననే ఆయన చంపబడి అవమాన మొందలేదు. పద్యములో 
“అనుమానము” Ss Rees .గానమానమ్ల' అని యుండవళథె, 


పోతనామాత్యుని అభేద దృవ్షి - పాఠ పరిశీలనము. 251 


“అచ్చితి భావముంచి హృదయంబున( బద్మదశళాతు నెంతయున్‌ 
మచ్చికతోడ నిల్చి యవమానము నొందక యుండె నెంతయున్‌.” 
“అని పద్య ముండవలెను, 


18. ఈశ్వరుని వలనం జేటు లేని కాయంబులు గలిగి, (5.2. 105) 
ఈళ్యరుడు నశింపని దేహముల నీయడు. పుట్టిన దేహములు కాశ్యత 
ముగా నుండవు. అచట ళకాయంబులు గాదు 'కామంబులు' అని యుండవలె. 
“ఈళ్వరాద ప్యపతివత కామాః' (5.౨4.6) అని మూలము. 
14. _ అట్టి నిన్ను. బరమాణుకారణవాదులై న కణ్వ గౌతమాదులును (10 
ఉత్తర 1990) ఖ్‌ 
ఇట 'కణ్యి తప్పు. “కణాది అని యుండవలె. 
య ఇట్టి దోషములు ఖాగవతమున నింకను గలవు. మాదిరికి కొన్ని చూపి 
తిని. ఆ దుష్టపదము టొక యర్థముం గల్లియుంటచే వాని నెవ్వరును బరికించి 
చూడమి వలన్‌ నవి తప్పించుకొని తిరుగుచున్నవి. బహుళ (పచారమందున్న 
[గ్రంథము గాన ఆనోట నానోట్నఖడి కొన్ని పాఠాంతరముల గూర్చుకొన్నది. 
తప్పులు లేకున్న చిక్కులేదు ళ్‌ తప్పు లున్నచో నెట్టు ? చూడుడు- కర్ర 
కమలాక్ష ! [ వరద 1” (8, 92) ఆని గజేందుడు "మొర పెట్టుచున్నాడు, 
ఇచట అకాడమీ |పతిలో “ఓ కమలాత్మ!'” అని గలదు. వావిళ్ళ పత్రిలో 
SE కమలా ప్ర !'' అని గలదు, వాడుకలో “ఓ కమలాక్ష 1!’ అని గలదు. 
ఇంకొకటి, “పలికెడిది భాగవతమ(ట పల్తికించెడి వా(డు రామభ దుం 
డంట'” అని వాడుకలో గలదు. అకాడమీ (పతిలోను, వావిళ్ళ పతిలోను 
“పలికించు విభుండు” అని గలదు, పూర్వము కత శాస్తులవారి పాఠము 
““పలికిందెడి వా(డు” అనియే. 

(ర్య. వత్సార్భకుఅన్‌ భుజంగపతీ తా హింసింప” Ww 487) అని 
కవి [వాసిన దానిని కవి గాని పత్యంత రము [వాయువాడు ' తో ఎందుకనియో, 
ఫొరపాటుననో “ఈ పత్సార్భకులన్‌ భుజంగపతి హింసింపంగ'' అని (వాసి 
నాడు, ఇచట యతి తప్పినది. అధవా సందిగ్ధములో పడినది. 

అందువలన నిర్దుష్ట భాగవతామృతమును సిద్ధము చేసికొనుట యందు 
doe లేదని నా యర ప్రాయము. 
L సళ 


భాగవతము రసపోషణవు 


శీ సేపూరి లమ్మీనరనయ్య 


ఆంధ్రదేశమున బేరెన్నిక వడస్థిన పవి|తగంథ రాజములలో భారత 
భాగవతములు ముఖ్యములు. అవి ర